Friday, July 17, 2026

ధ్యానం ఎలా చేయాలి? ప్రాణాయామం & మెడిటేషన్ తెలుగులో | Sanmaarg Thoughts

ధ్యానం ఎలా చేయాలి? ప్రాణాయామం & మెడిటేషన్ తెలుగులో | Sanmaarg Thoughts

Author Name:Sanmaarg Thoughts

Youtube Channel Url:https://www.youtube.com/@sanmaargthoughts18

Youtube Video URL:https://www.youtube.com/watch?v=MUkck3KvENo



Transcript:
(00:00) మీ దగ్గర ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటర్ ఉంది. అదే మీ శరీరం. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే దానికి పవర్ ఎలా సప్లై చేయాలో తెలియక చాలా మంది లో బ్యాటరీ మోడ్ లోనే బ్రతికేస్తున్నారు. ప్రతిరోజు మనం 18 నుంచి 20 వేల సార్లు గాలి పిలుస్తున్నాం. కానీ ఆ గాలిలో దాగి ఉన్న ప్రాణశక్తి అనే డేటాని మీ బాడీ ఎలా ప్రాసెస్ చేయాలో మీకు తెలుసా? ప్రాణాయామం అంటే కేవలం ఒక వ్యాయామం కాదు.
(00:27) అది మీ హ్యూమన్ ఆపరేటింగ్ సిస్టం ని హై పర్ఫార్మెన్స్ మోడ్ లోకి మార్చే ఒక అల్టిమేట్ బయో హాక్. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే మీ శ్వాస అనేది ఒక రిమోట్ కంట్రోల్. మీ కోపాన్ని, మీ ఒత్తిడిని, మీ అనారోగ్యాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే మీ పూర్తి లైఫ్ నే కంట్రోల్ చేసే రిమోట్ అది. మీ బ్రెయిన్ ఫాస్ట్ గా పని చేయాలన్నా, మీ బాడీ రోజంతా యాక్టివ్ గా ఉండాలన్నా మీకు కావాల్సింది కేవలం ఆక్సిజన్ మాత్రమే కాదు.
(00:50) దాన్ని మించిన హై క్వాలిటీ ప్రాణశక్తి. ప్రాణాయామం అనేది మీ బాడీకి చేసే ఒక సిస్టం ఆప్టిమైజేషన్. మీ మనసులో ఉన్న చెత్త ఆలోచనలన్నింటిని క్లియర్ క్యాచ్ చేసి మీ ఏకాగ్రతను 10 [సంగీతం] ఎక్స్ పెంచే అద్భుతమైన టెక్నిక్ ఇది. చాలామంది ధ్యానం చేయడానికి కూర్చుంటారు. కానీ తర్వాత మనసు కుదరడం లేదు అంటారు. ఎందుకు కుదరదంటే మీ సిస్టం లో తగినంత పవర్ సప్లై లేదు.
(01:16) అందుకే ధ్యానానికి ముందు ప్రాణాయామం అనేది ఒక పవర్ బూస్టర్ లాంటిది. ఈరోజు నేను మీకు ఈ వీడియో లో ఎంతో సరళంగా ఒక బిగినర్ గా ప్రాణాయామాన్ని ఎలా మొదలుపెట్టాలో దాని వల్ల మీ జీవితం ఎలా మారుతుందో వివరంగా తెలియజేయబోతున్నాను కాబట్టి ఈ వీడియో ని ఎక్కడా మిస్ అవ్వకుండా చివరి వరకు చూసేయండి. హాయ్ హలో ఫ్రెండ్స్ థిస్ ఇస్ నాని వెల్కమ్ టు సన్మార్గ థాట్స్. ప్రాణాయామం అంటే కేవలం గాలిని పీల్చుకుని వదలడం అనుకుంటే పొరపాటే.
(01:42) నిజానికి ఇది మీలో నిద్రపోతున్న అపారమైన శక్తిని మేలుకొలిపే ప్రక్రియ. ప్రాణ అంటే జీవశక్తి ఆయామ అంటే దాన్ని సరైన దిశలో నడిపించడం. మనం పీల్చే గాలిలో ఆక్సిజన్ ఉంటుంది. అది మన రక్తానికి కావాలి. కానీ ఆ గాలితో పాటు వచ్చే ఒక అదృశ్య శక్తి మన మనసుకి మన ప్రాణానికి కావాలి. దీన్ని సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే ఆక్సిజన్ అనేది బ్యాటరీలో ఉండే కెమికల్ అయితే ప్రాణశక్తి ఆ బ్యాటరీ నుండి వచ్చే పవర్ బ్యాటరీ ఉన్నంత మాత్రాన సరిపోదు కదా దాని నుంచి పవర్ సక్రమంగా వచ్చినప్పుడే ఏదైనా పని చేస్తుంది.
(02:18) మన శరీరంలో 72వ000 నాడులు ఉన్నాయని మన శాస్త్రాలు చెప్పాయి. ఇవి మన బాడీలో శక్తి ప్రవహించే చిన్న చిన్న దారులు వంటివి. ఎప్పుడైతే ఈ దారుల్లో అడ్డంకులు ఏర్పడతాయో అప్పుడే మనకు కోపం, ఒత్తిడి, నీరసం వంటి సమస్యలు వస్తుంటాయి. ప్రాణాయామం చేయడం వల్ల ఈ నాడులన్నీ శుద్ధి చేయబడి మీలో శక్తి ప్రవాహం అడ్డు లేకుండా సాగుతుంది.
(02:39) ఎప్పుడైతే మీలో శక్తి ప్రవాహం సాఫీగా ఉంటుందో అప్పుడు మీ మనసు ప్రశాంతంగా మీ శరీరం ఉత్సాహంగా మారుతుంది. అప్పుడు మీరు చేసే ప్రతి పనిలో కూడా ఒక అద్భుతమైన స్పష్టత మీకు కనిపిస్తుంది. ఈ ప్రాణాయామం ప్రాక్టీస్ చేయడానికి ముందు మనం కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకోవాలి. దీన్ని మీరు ఒక సిద్ధతల భావించి సరైన పద్ధతిలో చేస్తేనే మీకు పూర్తి ఫలితం అందుతుంది.
(03:03) దీనికి ముందుగా కావాల్సింది మంచి స్థలం. ప్రాణాయామం చేయడానికి ఒక ప్రశాంతమైన చోటుని ఎంచుకోండి. గాలి వెలుతురు ధారాళంగా వచ్చే ప్రదేశం అయితే ఇంకా మంచిది. ఎందుకంటే మనం పీల్చే గాలి ఎంత స్వచ్ఛంగా ఉంటే మనక అందే ప్రాణశక్తి కూడా అంత ఎక్కువగా ఉంటుంది. తర్వాత కూర్చునే పద్ధతి. నేలపై ఒక చాప లేదా ఒక యోగా మ్యాట్ వేసుకొని సుఖసనంలో కూర్చోండి.
(03:28) ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ మీ వెన్నుముక నిటారుగా ఉండాలి. మన వెన్నుముక అనేది శక్తి ప్రవహించే ప్రధాన మార్గం అది వంగి ఉంటే శక్తి ప్రవాహానికి ఆటంకం కలుగుతుంది. కాబట్టి వెన్నుముకను నిటారుగా ఉంచి శరీరాన్ని రిలాక్స్ గా ఉంచండి. మూడవది మానసిక స్థితి. ప్రాణాయామం చేసేటప్పుడు మీ ముఖం మీద ఒక చిన్న చిరునవ్వు ఉండాలి. ఏదో మొక్కుబడిగా కాకుండా ఇష్టంతో చేయండి.
(03:51) మనసులో ఒత్తిడి లేదా ఆందోళన ఉంటే మనం చేసే ప్రక్రియ సరైన ఫలితాన్ని ఇవ్వదు. అందుకే ప్రశాంతమైన మనసుతో మొదలు పెట్టండి. నాలుగవది మంచి టైం మంచి ఆహారం ఈ ప్రాణాయామం చేయడానికి ఉదయం పూట అత్యంత అనువైన సమయం అలాగే ఇది చేసేటప్పుడు కడుపు ఖాళీగా ఉండడం చాలా ఇంపార్టెంట్ ఆహారం తీసుకున్న వెంటనే ప్రాణాయామం చేయకూడదు కనీసం మూడు నుంచి నాలుగు గంటలు గ్యాప్ ఉండాలి.
(04:15) ఇప్పుడు మీకు చెప్పేది అతి ముఖ్యమైన జాగ్రత్త. ఈ ప్రాణాయామం అందరికీ మంచిదే కానీ కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో జాగ్రత్తలు చాలా అవసరం. ముఖ్యంగా గర్భిణి స్త్రీలు అలాగే ఎక్కువగా గుండె సమస్యలు లేదా వెన్ను నొప్పి ఉన్నవారు ఈ ప్రాణాయామాన్ని మొదలుపెట్టే ముందు ఖచ్చితంగా మీ డాక్టర్ ని సంప్రదించి వారి సలహా తీసుకొని చేయడం చాలా ఉత్తమం.
(04:37) అన్నింటికన్నా ముందు ఆరోగ్యం ఇంపార్టెంట్ కాబట్టి నిపుణుల పరివేక్షణలో చేయడం చాలా సురక్షితం. కాబట్టి మీకు ఎవరికైనా అలాంటి సమస్యలు ఉంటే మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ ని సంప్రదించి చేయండి. ఇప్పుడు మనం మొదటి అడుగు వేద్దాం. అదే అనులోమ విలోమ ప్రాణాయామం. దీన్నే నాడి శోధన అని కూడా అంటారు. మన శరీరంలో ఎడమవైపు చంద్ర నాడి కుడి వైపు సూర్య నాడి ఉంటాయి. అలాగే మన మెదడులో కూడా రెండు భాగాలు ఉంటాయి.
(05:05) ఒకటి మన ఆలోచనలను తర్కాన్ని నియంత్రిస్తే రెండోది మన సృజనాత్మకతను చూసుకుంటుంది. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ లేకపోతేనే మనం గంధ్రగోళానికి గురవుతుంటాం. ఈ అనులోమా విలోమ ప్రక్రియ ఈ రెండు భాగాలను బ్యాలెన్స్ చేసి మీ మనసుని ఒక ప్రశాంతమైన స్థితికి చేరుస్తుంది. ఇది చేసే పద్ధతి చాలా సులభం మీ కుడి చేతి బొటన వేలుతో కుడి ముక్కు రంధ్రాన్ని సున్నితంగా మూసివేయండి.
(05:26) ఇప్పుడు ఎడమ ముక్కు రంద్రం ద్వారా నెమ్మదిగా లోతుగా గాలిని పీల్చుకోండి. గాలిని పీల్చుకోవడం పూర్తయ్యాక ఎడమ ముక్కు రంద్రాన్ని మూసివేసి కుడి ముక్కు రంద్రం ద్వారా గాలిని నెమ్మదిగా వదలండి. ఇప్పుడు మళ్ళీ కుడి వైపు నుండి గాలి పీల్చి ఎడమవైపు ద్వారా వదలండి. అంతే ఇలా కొన్ని నిమిషాలు చేయండి. మీరు ప్రతిరోజు ధ్యాన సాధన చేసేవారైతే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి.
(05:49) చాలా మంది ధ్యానం చేయడానికి కూర్చుంటారు కానీ మనసు ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. అప్పుడు మీరు బలవంతంగా మనసుని నిలపడానికి ప్రయత్నించకండి. మీరు ధ్యానాన్ని మొదలు పెట్టే ముందు కేవలం కొన్ని నిమిషాలు ఈ అనులోమ విలోమ ప్రాణాయామాన్ని ప్రేమతో ప్రాక్టీస్ చేయండి. ఆ ఊపిరి ఇచ్చే లయతో మీ మనసు నెమ్మదిస్తుంది. ఆ తర్వాత మెల్లిగా ప్రశాంతంగా ధ్యానంలోకి జారుకోండి.
(06:10) అప్పుడు మీరు అనుభవించే ఆ ధ్యానం చాలా అంటే చాలా అద్భుతంగా కుదురుతుంది. మీ అంతరంగంలో మీరు ఒక నిశబ్దాన్ని అనుభవిస్తారు. ప్రతిరోజు కనీసం ఐదు నుండి 10 నిమిషాలు ఇది ప్రాక్టీస్ చేస్తే మీ ఏకాగ్రత అద్భుతంగా పెరుగుతుంది. ఈ ప్రాణాయామం అనేది ధ్యానానికి ఒక పవర్ఫుల్ పునాది లాంటిది. పునాది ఎంత బలంగా ఉంటే దానిపై మనం చేసే ధ్యానం అంత లోతుగా అంత నిశ్చలంగా ఉంటుంది.
(06:35) చాలామందికి ధ్యానం ఎందుకు కుదరదు అంటే వారు నేరుగా కళ్ళు మూసుకుని మనసుని కట్టడి చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ ప్రాణాయామం చేసిన తర్వాత మీ మనసు ఒక ప్రశాంతమైన సరస్సులా మారుతుంది. అనవసరమైన ఆలోచనలు అనే అలలు తగ్గిపోతాయి. అప్పుడు మీరు ధ్యానంలో కూర్చుంటే మీ మనసు అటు ఇటు తిరగకుండా చాలా సహజంగా ఆ నిశశబ్దంలోకి జారుకుంటుంది.
(06:59) ఇదే ప్రాణాయామం మనకి ఇచ్చే అసలైన ఫలితం. మీరు ప్రతిరోజు కేవలం 20 లేదా 30 నిమిషాలు ఈ ప్రాణాయామం చేసి ధ్యాన సాధన చేస్తే మీ జీవితంలో మూడు ప్రధాన మార్పులు వస్తాయి. మొదటిది మానసిక స్పష్టత. మీ మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండడం వల్ల మీరు సరైన నిర్ణయాలు చాలా వేగంగా తీసుకోగలుగుతారు. రెండవది స్థిరత్వం మీరు ఒక బలమైన శక్తితో కనెక్ట్ అయి ఉన్నట్లు అనవసరమైన భయాలు లేదా ఒత్తిడికి లోను కాకుండా ఎప్పుడూ ఆత్మవిశ్వాసంతో ఉంటారు.
(07:27) మూడవది శారీరక శక్తి. ప్రాణశక్తి మీ శరీరంలోని ప్రతి కణాన్ని ఉత్తేజితం చేసి మిమ్మల్ని రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది. గుర్తుంచుకోండి ఇది ఒకే రోజులో జరిగే మ్యాజిక్ కాదు ఇది ఒక నిరంతర ప్రయాణం. మీరు ప్రతి రోజు క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తుంటే మీ మాటలో మీ పనిలో మరియు మీ వ్యక్తిత్వంలో వచ్చే ఆ స్పష్టమైన మార్పుని మీ చుట్టూ ఉన్నవారు కూడా గమనించి ఆశ్చర్యపోతారు.
(07:51) సో మీ శరీరం మరియు మీ మనసు ఎప్పుడు పూర్తి శక్తితో ఉండాలంటే ఈ కొన్ని నిమిషాల సాధనను మీ జీవనశైలిలో ఒక భాగంగా మార్చుకోండి. అప్పుడే మీరు మీలో దాగి ఉన్న పూర్తి సామర్థ్యాన్ని బయటకు తీయగలరు. మరి మీరు ఈ రోజు నుండి ఈ ప్రాణాయామ సాధనను ధ్యానానికి ముందు చేయడం ప్రారంభిస్తారా అయితే ఎస్ ఐ యామ్ రెడీ అని ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.
(08:13) అలాగే మీరు ఈ ప్రాణాయామ సాధనతో ఆల్రెడీ ధ్యాన సాధన చేస్తున్న వారే అయితే ఈ సాధన వల్ల మీకు వచ్చిన అనుభవాలను కామెంట్ లో తప్పకుండా పంచుకోండి. మీ అనుభవాలను కామెంట్ లో పంచుకోవడం వల్ల మీలానే ఈ మార్గం కోసం వెతుకుతున్న మరెంతో మంది మీ మాటలు చూసి ధైర్యం తెచ్చుకుని ధ్యాన మార్గంలోకి అడుగుపెడతారు. మీరు చేసే ఒక్క కామెంట్ ఇంకొకరి జీవితంలో మార్పుకి నాంది కావచ్చు.
(08:38) అలాగే మీకు ఏవైనా సందేహాలు ఉంటే అడగండి. నేను మీకు సమాధానం ఇస్తాను. ఈ సమాచారం గనుక మీకు ఉపయోగపడిందని అనిపిస్తే మీరు ఇప్పటివరకు ఈ వీడియోకి ఒక లైక్ చేయకపోతే ఇప్పుడే ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. మన సనాతన ధర్మం అందించిన ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక రహస్యాల కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హరే కృష్ణ.

No comments:

Post a Comment