Friday, July 17, 2026

Nothing Exists Alone — Nagarjuna #subscribe #like #shorts #status #life #philosophy #

Nothing Exists Alone — Nagarjuna #subscribe #like #shorts #status #life #philosophy #

Author Name:PhiloVi

Youtube Channel Url:https://www.youtube.com/@PhiloVi

Youtube Video URL:https://www.youtube.com/watch?v=mpWnc33RIjs



Transcript:
(00:07) నాగార్జునుడు పుట్టినప్పుడు ఒక జ్యోతిష్కుడు ఒక మాట చెప్పాడు. ఈ బిడ్డ ఏడు సంవత్సరాలు మాత్రమే బతుకుతాడు. [సంగీతం] ఆ మాట విన్న తల్లిదండ్రులు ఒక్కసారిగా కంగారుపడ్డారు. కానీ ఆ జ్యోతిష్కుడు ఇంకో మాట కూడా చెప్పాడు. ఈ బిడ్డను [సంగీతం] బౌద్ధ సన్యాసిగా చేస్తే ఆ గండం తప్పుతుంది అని తల్లిదండ్రులు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు.
(00:26) [సంగీతం] చిన్న నాగార్జునుని బౌద్ధ సన్యాసుల దగ్గరకు పంపించారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించండి నాగార్జునుడు జ్ఞానం కోసం సన్యాసి కాలేదు చావు భయంతో సన్యాసి అయ్యాడు కానీ అదే భయం అతన్ని గొప్ప జ్ఞానం వైపు నడిపించింది [సంగీతం] జీవితంలో కూడా ఇలాంటివే జరుగుతుంటాయి. మనల్ని భయపెట్టిన ఒక సంఘటన లేదా మనల్ని బాధ పెట్టిన ఒక సమస్య [సంగీతం] మనకు తెలియకుండానే కొత్త దారిని చూపిస్తుంది.
(00:50) ఆ దారే కొన్నిసార్లు మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. నాగార్జునుడి జీవితము అలాగే మొదలయింది. చావు నుండి తప్పించుకోవాలని మొదలైన ప్రయాణం [సంగీతం] చివరికి చావు అంటే ఏమిటో తెలుసుకునే జ్ఞానంగా మారిపోయింది. నాగార్జునుడు యవ్వనంలో ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. అతనికి ముగ్గురు స్నేహితులు ఉండేవారు. ఒక రోజు వాళ్ళు ఒక మాంత్రికుడు దగ్గర నుండి అదృశ్యమయ్యే మందు సంపాదించారు.
(01:13) [సంగీతం] ఆ మందు వేసుకుంటే కంటికి కనిపించరు ఆ ధైర్యంతో వాళ్ళు రాజభవనంలోకి ప్రవేశించారు. రాజ కన్యలను వేధించడం మొదలుపెట్టారు. కొన్ని రోజుల్లోనే కాపలాదారులకు అనుమానం వచ్చింది. [సంగీతం] ఎవరూ కనిపించకపోయినా వాళ్ళు గదులంతా కత్తులు ఊపడం మొదలుపెట్టారు. [సంగీతం] ఆ దాడిలో నాగార్జునుడి ముగ్గురు స్నేహితులు అక్కడికక్కడే చనిపోయారు. నాగార్జునుడు మాత్రం రాజు వెనుక నిలబడి ఉండటంతో ప్రాణాలతో బయటపడ్డాడు.
(01:36) ఆ సంఘటన అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది ఆ రోజు అతనికి ఒక గొప్ప సత్యం అర్థమైంది మనిషిని నాశనం చేసేది శరీరం కాదు అతని కోరికలే అని శరీరాన్ని కంటికి కనిపించకుండా దాచుకోవచ్చు కానీ కోరికను ఎప్పటికీ దాచలేం చివరికి అదే కోరిక మనిషిని ప్రమాదంలోకి నెడుతుంది. ఆ రోజు నుండి నాగార్జునుడి జీవితం మరో దిశలో సాగింది. అదృశ్యంగా ఉండడం కాదు లోపల కోరికలు ఖాళీ కావడమే నిజమైన [సంగీతం] స్వేచ్ఛ అని అతను గ్రహించాడు.
(02:04) అక్కడి నుంచే శూన్యత గురించి అతని లోతైన ఆలోచన మొదలైంది. శూన్యత [సంగీతం] అంటే ఏమీ లేదు అని కాదు శూన్యత అంటే ఏది తనంతట తాను ఉనికిలో లేదు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుర్చీని తీసుకోండి కుర్చీ అంటే కర్ర, మేకులు, [సంగీతం] రంగు, ఆకారం ఇవన్నీ కలిసి ఏర్పడిన ఒక వస్తువు. ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా విడదీయండి. కర్రలో కుర్చీ లేదు మేకుల్లో కుర్చీ లేదు.
(02:29) [సంగీతం] రంగులో కూడా కుర్చీ లేదు. అవి అన్నీ కలిసినప్పుడు మాత్రమే దానికి కుర్చీ అనే పేరు వస్తుంది. అంటే కుర్చీకి తనంతట తాను ఒక ప్రత్యేకమైన ఉనికి లేదు. అది ఎన్నో కారణాల మీద ఆధారపడి ఉంది. [సంగీతం] దీన్నే నాగార్జునుడు శూన్యత అని చెప్పాడు. ఇప్పుడు ఇదే విషయాన్ని మన మీద ఆలోచించండి. మీరెవరు [సంగీతం] మీ శరీరమా? మీ పేరా, మీ ఆలోచనలా? మీ జ్ఞాపకాలా? [సంగీతం] ఇవన్నీ ఒక్కొక్కటిగా తీసేస్తే మీరు ఎక్కడున్నారు? మీ శరీరం మారుతోంది. మీ ఆలోచనలు మారుతున్నాయి.
(02:56) మీ నమ్మకాలు మారుతున్నాయి. అందుకే నాగార్జునుడు చెప్పాడు మారకుండా ఉండే ఒక శాశ్వత ఆత్మ అనే భావన నిజం కాదు అని నిన్నటి మీరు ఈ రోజు మీరు కాదు ఈరోజు [సంగీతం] మీరు రేపటి మీరు కాదు స్థిరంగా ఉండే ఒక ఆత్మ అనే భావన నిజం కాదు అని నాగార్జునుడు చెప్పాడు. నాగార్జునుడు గురించి ఒక ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది.
(03:17) బుద్ధుడు బోధించిన కొన్ని అత్యంత లోతైన సత్యాలను అందరికీ చెప్పలేదని అంటారు. ఆ కాలంలోని మనుషులు వాటిని అర్థం చేసుకోలేరు అని భావించి [సంగీతం] ఆ బోధలను నాగలోకంలో భద్రపరిచాడు అని ఆ కథ చెబుతుంది. చాలా సంవత్సరాల తర్వాత నాగార్జునుడు సముద్రపు లోతుల్లోకి వెళ్లి నాగరాజుల వద్ద నుంచి ఆ జ్ఞానాన్ని [సంగీతం] తీసుకొచ్చాడు అని చెబుతారు. ఈ కథ నిజంగా జరిగిందా లేదా అనేది ముఖ్యమైన [సంగీతం] విషయం కాదు.
(03:41) ఈ కథ చెప్పాలనుకునే సందేశమే ఏమిటంటే కొన్ని సత్యాలు పై పైగా చూసే వారికి కనిపించవు. [సంగీతం] వాటిని తెలుసుకోవాలంటే లోతుగా వెతకాలి ప్రశ్నించాలి సందేహించాలి [సంగీతం] ఆలోచించాలి అందరూ నడిచే దారిలో నడిస్తే అందరికీ తెలిసినదే తెలుస్తుంది. [సంగీతం] కానీ లోతుల్లోకి వెళ్లే ధైర్యం ఉన్న వారికే కొత్త సత్యాలు కనిపిస్తాయి. నాగార్జునుడు అలాంటి మనిషి అందరూ నమ్మిన దానిని అతను ప్రశ్నించాడు.
(04:03) అందరూ నిజం అనుకున్న దానిని [సంగీతం] మరింత లోతుగా పరిశీలించాడు. అందుకే అతని ఆలోచనలు ఇప్పటికీ ప్రపంచాన్ని ఆలోచింపజేస్తూనే [సంగీతం] ఉన్నాయి. నాగార్జునుడు ప్రపంచం ఖాళీ అని చెప్పలేదు. ఈ ప్రపంచంలో దేనికి శాశ్వతమైన మారని స్వరూపం లేదు అని చెప్పాడు. అందుకే [సంగీతం] మీరు ఈరోజు ఎలా ఉన్నారో రేపు అలాగే ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతిదీ మారుతోంది.
(04:25) [సంగీతం] ప్రతిదీ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంది. ఈ ఒక్క విషయాన్ని నిజంగా అర్థం చేసుకున్న రోజు మీ జీవితం మారడం మొదలవుతుంది అని. ఓం

No comments:

Post a Comment