నాగులు ఎందుకు లొంగుతాయి? యదార్ధ సంఘటనల ఆధారంగా!
Author Name:Vastavam Channel
Youtube Channel Url:https://www.youtube.com/@vastavam
Youtube Video URL:https://www.youtube.com/watch?v=6bcsUkjUr1Y
Transcript:
(00:04) తంత్రశాస్త్రంలో నిజంగానే సర్ప వశీకరణ [గురకలు] అనే ఒక గూఢ విద్య ఉందా కొన్ని యధార్థ సంఘటనల ఆధారంగా అందులో వాస్తవాలని లేదా కల్పితాలని తెలుసుకుందాం ఈ వీడియోలో ఓం శ్రీ మాతింగన్యాయ నమః తంత్ర సంప్రదాయాల్లో కొన్ని కొన్ని గ్రంథాల్లో ప్రత్యేకించి గరుడ తంత్రం గారుడ తంత్రం అని కూడా అంటారు దాన్ని ఈ తంత్రం లో సర్ప వశీకరణ అనే ఒక రహస్య విద్య చాలా నిఘూడమైనటువంటి కొన్ని రహస్యాలు అందులో ఉన్నాయి.
(00:39) ఒక సిద్ధుడు అడవిలో జపం చేసుకుంటూ ఉన్నాడు. ఒక సర్పం ఒక నాగుపామె అనుకుందాం అతని దగ్గరికి వచ్చింది. అంటే యాక్సిడెంటల్ గా అది వెళ్తూ వెళ్తూ అతని దగ్గరికి వచ్చిందన్నమాట. కానీ అతని మీద దాడి చేయలేదు. కొద్ది సమయం పాటు అక్కడే అతని దగ్గరే గడిపింది తర్వాత తన దారిన అది వెళ్ళిపోయింది. అతనికి ఎలాంటి హాని చేయలేదు సైలెంట్ గా దాని పని దాని మార్గం అది వెళ్ళిపోయింది.
(01:05) అదే సిద్ధుడు ఒకసారి తన జపాన్ని పూర్తి చేసుకొని అటవీ మార్గంలో వెళ్తూ ఉన్నాడు. అతనికి కాలిబాటలో మరో నాగుపాము తారసపడింది. కానీ అది అతన్ని చూడగానే తల ఉంచుకొని పక్కక వెళ్ళిపోయి అతనికి దారి ఇచ్చేసింది. అతనికి ఎలాంటి హాని తలపెట్టాలని ప్రయత్నం చేయలేదు అతని మీద దాడి చేయలేదు. ఆ పామును చూడంగానే అతను ఓ చిరునవ్వు నవ్వాడు.
(01:36) వెళ్ళిపోయింది పక్కకి ఇలాంటి సంఘటనలు మనం పురాణాల్లో కథల్లో చదువుతూ ఉంటాం. ఇవన్నీ వాస్తవాలేనా లేక కేవలం కల్పితాలా ఈ మధ్యకాలంలో కొద్ది రోజుల క్రితం నాకు ఇలాంటి సంఘటనలు రెండు అనుభవంలోకి వచ్చాయి. అవి వచ్చిన తర్వాత కొంచెం నాకు ఈ పాముల మీద ప్రత్యేకించి నాగుపాముల మీద ఆసక్తి ఇంకా అధికమైంది. వాటి ప్రవర్తన అవి ఆధ్యాత్మిక దారిలో నడుస్తున్న వ్యక్తులని ఎలా గుర్తిస్తాయి? ఒక సాధనలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఏ విధంగా వాళ్ళ యొక్క శక్తిని గ్రహించి వాటి దారిన వెళ్ళిపోతాయి అనే విషయాల మీద కొంచెం ఆ స్టడీ చేయాలనిపించింది.
(02:19) ఆ అనుభవాలు మీతో ఈరోజు పంచుకోవాలి. తంత్రంలో సర్పం అంటే కేవలం ఒక పాము కాదు అది కుండలిని శక్తికి ప్రతీక. మన శరీరంలో నిద్రాణంగా ఉన్న ఆధ్యాత్మిక శక్తిని సర్ప రూపంలో వర్ణిస్తారు. అందుకే కొందరు ఆచార్యులు సర్ప వశీకరణ అంటే బయట ఉన్న నాగుని వశం చేసుకోవడం కాదు మనలోని భయము కోపము అహంకారము ఇలాంటి వాటి మీద అంటే ఇంద్రియ వికారాల మీద పూర్తిగా పట్టు సాధించడం వాటి మీద విజయాన్ని సాధించడం అని వివరిస్తారు.
(02:56) అదే తంత్రం చెప్పిన లోతైన అర్థంఅని అనేక సాంప్రదాయాలు కూడా భావిస్తున్నాయి. మరో ఆశ్చర్యకర విషయం ఏంటంటే భారతదేశంలోని అనేక నాగక్షేత్రాల్లో ఈరోజు కూడా నాగారాధన జరుగుతూ ఉంది. కానీ అక్కడ ఎక్కడా కూడా పాములను పట్టుకోండి మంత్రంతో వశం చేసుకోండి అని చెప్పరు. దైవంగా భావిస్తారు దైవంగా పూజిస్తారు. మనం దేవుని ఏ విధంగా అయితే గౌరవించి భక్తితో పూజిస్తామో అలాగే నాగుల్ని కూడా అలాగే పూజించాలని మన సాంప్రదాయం చెప్తుంది.
(03:32) ప్రకృతిలో భాగమైనటువంటి నాగులని కూడా రక్షించాలి. హాని చేయకూడదని మాత్రమే మనకు బోధిస్తారు. ఇది ఆలోచించాల్సిన విషయం. అయితే సర్ప వశీకరణ మంత్రం నిజమా కల్పితమా ముందుగా ఈ రోజుల్లో గనక మీరు చూస్తే సర్ప వశీకరణ మంత్రాన్ని నేర్చుకోండి మీకు ఒక్క రోజులో ఆ మంత్రాన్ని నేర్పిస్తాం మరసటి రోజే మీరు పాముల్ని నియంత్రించవచ్చు పాముల్ని స్తంభింప చేయవచ్చు అని చాలా ప్రకటనలు మనకు కనపడుతూ ఉంటాయి.
(04:09) పొరపాటును కూడా అలాంటి వాటిని నమ్మొద్దు వాటికి ఎలాంటి విశ్వసనీయమైన ఆధారాలు లేవు. సరైన గురువు దగ్గర సరైన పద్ధతిలో ఆ తంత్రాన్ని నేర్చుకుంటేనే తప్ప చాలా ప్రమాదకరం సగం సగం తెలిసి కొంచెం కొంచెం నేర్చుకొని పాములతోటి సర్పాలతోటి ఆటలాడటం చాలా ప్రమాదం దాని గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అసలు రహస్యం ఏంటి? దాని గురించి పక్కన పెడదాం.
(04:35) ఆ వ్యాపారం చేసేవాళ్ళు ఆ కల్పితాలు ఆ మోసాలు గురించి పక్కన పెడితే అసలు వాస్తవం ఏంటి సర్పవశీకరణ మంత్రం ఉంది. ఆ మంత్రాన్ని సాధించి సాధన చేసి సిద్ధి పొందిన వాళ్ళు సర్పాల్ని పాముల్ని పెద్ద పెద్ద నాగుపాములని కూడా వశపరుచుకొని వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకోవడం నా కళ్ళారా నేను చూశాను. పుస్తకాల్లో చదివినాటికి పక్కన పెట్టేద్దాం స్వయంగా నేను కూడా చూశాను వాళ్ళ శక్తిని అది ఒక్కటే కాదు సర్ప వశీకరణ ప్రత్యేకించి ఆ మంత్ర సాధన చేసి సర్పాలని వశం చేసుకోవడం అది ఒక విద్య గరుడ తంత్రంలో అది ఉంది దాని మీద ఇంకా చాలా రహస్యాలు ఉన్నాయి వాటి గురించి మరోసారి చూద్దాం అయితే ఇప్పుడు
(05:20) మంత్ర సాధన చేసేవాళ్ళు దేవతా ఉపాసకులకి ఒక్కసారి ఆ దేవతా అనుగ్రహం కలిగితే ప్రకృతి నుంచి ఇలాంటి విష సర్పాలు కానీ లేదంటే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ కూడా ఏమి చేయలేవు ఎలాంటి హాని తలపెట్ట లేవు ఒకవేళ అలాంటి నెగిటివ్ ఎనర్జీస్ ఏవైనా తారస పడినా పక్కకు తప్పుకొని వెళ్ళిపోతాయే గానీ ఆ సాధకునికి ఎలాంటి హాని కలిగించవు. ఇది నూటికి నూరు పాళ్ళు నిరూపితమైనటువంటి వాస్తవం.
(05:52) నాకు జరిగిన రెండు సంఘటనలు ఇప్పుడు చెప్తాను మీకు గతంలో శ్యామలా నవరాత్రులు జరుగుతున్న రోజుల్లో కూడా ఒక వీడియో చేశాను. నకుల మాతంగి గురించి నకుల మాతంగి విశిష్టత ఆమె శక్తి ఆమె తత్వం గురించి మీకు ఒక వీడియోలో చెప్పాను. విష సర్పాలు విషదోషాలు విషపు పురుగులు ఏదైనా నెగిటివ్ ఎనర్జీ గురించి కాపాడే తత్వమే నకుల మాతంగి ఆ రోజు నకుల మాతంగి దేవతకి పూజ చేసి ఆ రోజు అక్కడ జపం తపము అవన్నీ చేసుకొని నేను తిరిగి ఇంటికి వస్తూ ఉంటే ఒక సంఘటన జరిగింది.
(06:34) అది నేను ఇంతవరకు మీకు చెప్పలేదు. వస్తూ ఉండగా మా ఆ తోటలో ఉన్న ఫార్మ్ హౌస్ లో అడుగు పెట్టాను ముందు నేను వెళ్తున్నాను వెనకల నా భార్య మరొక అమ్మాయి నడిచి వస్తున్నారు. నేను ఫార్మ్ హౌస్ లోపల అడుగు పెట్టి కిచెన్ లోకి వెళ్ళాను కిచెన్ లోకి వెళ్ళంగానే నాకు అక్కడ కనపడిన దృశ్యం ఏంటంటే ఒక పెద్ద పాము అది కట్లపాము కట్లపాము కిచెన్ లో నుంచి బెడ్రూమ్ లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంది.
(07:02) నాకు స్వత స్వతహగా పాములు అంటే చాలా భయం నేను ఎప్పుడు విలేజ్ వాతావరణంలో పెరగలేదు. సో సిటీ వాతావరణంలో పెరిగినవాడిని కాబట్టి నాకు పాములు అంటే చాలా కొత్త చాలా భయం కూడా ఆ రోజు నకుల మాతంగి పూజ చేసుకొని నేను అక్కడికి రావడం అక్కడ విష సర్పం కనిపించడం విచిత్రమైన విషయం ఏంటంటే వెనకాల వాళ్ళు వస్తున్నారు వాళ్ళు గాని చూసారంటే మళ్ళీ ఫార్మ్ హౌస్ లో అడుగు పెట్టరు.
(07:25) దానివల్ల ఆ పక్కనే ఉన్న ఒక కర్ర లాంటిది దాన్ని తీసుకొని ఆ పాము నా చేతులతో నేను చంపాను జీవితంలో మొట్టమొదటిసారి పాముని చంపడం అనేది జరిగింది నేను అసలు పాముని చంపనివ్వను కానీ అది కట్లపాము చాలా ప్రమాదకరమైంది. చంపక తప్పదు దాన్ని చూసినా కూడా మళ్ళ వీళ్ళఎవరు అడుగు పెట్టరు అక్కడ ఫామ్ హౌస్ లోకి సో నేను ఎంత ధైర్యం వచ్చింది నాకు అసలు భయమే అనిపించలేదు ముందు నాకఏంటంటే ఆ వాళ్ళు ఎక్కడ చూస్తారో అన్న టెన్షన్ వచ్చింది వాళ్ళు చూడకూడదు అని వాళ్ళు కాసేపు అక్కడే ఉండమని చెప్పి ఏదో ఏదో కారణం తోటి వాళ్ళని బయట నిలబెట్టి దాన్ని చంపి జాగ్రత్తగా దాన్ని ఒక కవర్లో వేసి
(08:06) వాళ్ళకి తెలియకుండా దాన్ని తీసుకెళ్లి బయట పారేసిన తర్వాత వాళ్ళని లోపలికి రానిచ్చారు. ఈ విషయం ఇంతవరకు వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఈ వీడియో చూస్తే తెలుసుకుంటది నా వైఫ్ కూడా అక్కడ చూసారా నకుల మాతంగిని పూజ చేసి రాంగాన నా జరిగిన సంఘటన ఎంత పూరి లేట్ అవుతుందో అదొకటి సరే ఒకరోజు తోటలోనే ఫార్మ్ హౌస్ లో ఆ బయట కాంపౌండ్ లో కూర్చొని పారిజాతం ఆకులతో పెట్టిన గ్రీన్ టీ తాగుతూ కూర్చొని ఉన్నాం. ఇంకా కాసేపు జపాన్ కి వెళ్ళాలి.
(08:36) చాలా పెద్ద నాగపం అది చాలా స్పీడ్ గా సర సర సరసర అటు పోతూ పోతూ లోపల కాంపౌండ్ లోకి గేట్లోనుంచి ఎంటర్ అవుతూ ఉంది. నేను దాన్ని చూడంగానే లేచి నిలబడ్డాను. లేచి నిలబడి దాని వంక అలాగే చూసాను నాకు భయం అనిపించలేదు. నాకు భయం అనిపించలే ఆ పాము ఎంత అందంగా ఎంత అద్భుతంగా ఉంది ఆ పాము అంత పెద్ద నాగుపాము దాన్ని అలా చూశాను అలా చూసి అది నన్ను చూసింది నాకు దానికి ఒక ఆరు ఏడు అడుగులు దూరం మాత్రమే గ్యాప్ ఉంది.
(09:05) నేనేం భయపడలేను అలా నిలబడే ఉన్నా అలా ఒక సెకండ్ పార్ట్ నన్ను అలా చూసి తన డైరెక్షన్ మార్చుకొని పక్కననుంచి వెళ్ళిపోయింది. చెట్టలోకి తోటలోకి వెళ్ళపోయింది ఇది కూడా చాలా ఆలోచింప చేసే సంఘటన నా జీవితంలో అంటే అది నాకు హాని చేయాలనుకుంటే దానికి ఒక సెకండ్ కూడా పట్టదు దాని కాటు దూరంలోనే ఉన్నా నేను నాగుపాములు అందులో అంత పెద్ద పాములు మనల్ని కాటేయాలంటే పడగ విప్పి దానికి ఎంత దూరం ఐదారు అడుగులు 10 అడుగులు కూడా పెద్ద లెక్క కాదు అది కామగా తల తిప్పుకొని డైరెక్షన్ మార్చుకొని వెళ్ళిపోయింది.
(09:39) సో ఈ సంఘటన నాకు అప్పుడు ప్రూవ్ అయింది. ఒక్కసారి ఆ మాతంగి దేవత అనుగ్రహాన్ని సాధించగలిగితే ఆ దేవత మనలో మన చుట్టూ ప్రకృతి రూపంలోనే ఉండి మనల్ని సదా రక్షిస్తూనే ఉంటుంది. ఇది నా అనుభవం అయితే గరుడతంత్రంలో ఈ సర్పాల గురించిన రహస్యాలు చాలా ఉన్నాయి. మరిన్ని వివరాలు మరిన్ని రహస్యాలు ఇంకొంచెం విపులంగా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం.
(10:06) ఓం శ్రీ మాతింగిన్య నమః
No comments:
Post a Comment