Friday, July 17, 2026

 పితృకార్యములు !!

తద్దినాలు పెట్టడము మానేస్తున్నారు ఈ మధ్యన చాలా మంది. బ్రాహ్మణులు దొరకడము లేదు అని, ఎక్కువ దక్షిణ అడుగుతున్నారు అని, సమయము లేదు అని, మడి తో చేసే వాళ్ళు లేరు అని, వంట వాళ్ళు దొరకడము లేదు అని, ఖర్చు ఎక్కువ అవుతుందని…. ఇలా రకరకాల కారణములతో తద్దినములు పెట్టడము మానేస్తున్నారు...

 ఇది తప్పు. 

వంశాభివృద్ధి జరగదు. 

ఇది నిజము. పిల్లలు పుట్టరు, ఇది నిజము. నిజము. నిజము. నిజము. నమ్మండి. అందరికీ చెప్పండి. వంశములను కాపాడండి.పితృ దేవతలు సంతోష పడక పోతే వంశాభివృద్ధి జరగదు.  అందరు తెలుసుకొని, జాగ్రత్తగా, పద్ధతిగా, శాస్త్ర ప్రకారముగా విధిగా ఆచరించాలి. దీని మడి వేరు. తడి బట్ట తోనే వంట చేసి, బ్రాహ్మణులకు భోజనము వడ్డించాలి. పొడి బట్ట పనికి రాదు. ముందు రోజు రాత్రి, ఆ రోజు రాత్రి భోజనము చేయకూడదు, బ్రహ్మ చర్యము పాటించి నేల మీద భార్యా భర్తలు పరుండాలి, భక్తితో, శ్రద్ధతో శ్రాద్ధము పెట్టాలి. ఇంటి కోడలు వంట చేస్తే పితృ దేవతలు శ్రీఘ్రముగా అనుగ్రహిస్తారు.

పితృ దేవతలకు తద్దినాలుపెట్టండి, మానకండి, మన వంశాన్ని కాపాడేది వాళ్ళే. వాయనము ఇస్తాము, కూరలు ఇస్తాము, బియ్యము ఇస్తాము అని అంటే కుదరదు. మీరు వుండే ఇంట్లో పెడితేనే చాలా మంచిది.

దేవతలకు చేసే కార్యము కాని, పితృ దేవతలకు చేసే కార్యము కాని రెండూ మీరు వున్న ఇంట్లోనే చేయాలి, అలా చేస్తే అది మీకు మీ ఇంటికి మంచిది.

కర్మ క్షయం కాని జీవుడు మరణించిన వెంటనే ఎక్కడో ఒక చోట పుడతాడు అన్నది నిజమేనా ?? అలాగయితే మనం చేసే పితృకర్మలు వారికి ఎలా చెందుతాయి ?? జీవుడు శరీరాన్ని విడిచిపెట్టేక ఇక ఆ జన్మతో బంధం ఉండదు కదా.. మరి పితృదేవతగా ఎలా తర్పణాదులు స్వీకరిస్తాడు? పెళ్ళి/పిల్లలు సరిగా లేకపోతే పితరులకు హాని కలుగుతుంది అంటారు కదా..వ్యక్తిగతంగా చేసిన పాప పుణ్యాల వల్ల కర్మలు ఏర్పడినపుడు ఇలా వంశం చేసిన పాపాల వల్ల ఎలా హాని కలుగుతుంది? పిల్లలు లేకపోతే పున్నామ నరక బాధలు తప్పవా?ఈ ప్రశ్నలకు సమాధానాలు చాలా వివరంగా చెప్పవలసి ఉంది. కానీ ఒక అవగాహన ఏర్పడినా చాలు అనే ఉద్దేశంతో, కొందరు స్నేహితులు అడిగినదానికి ఇక్కడ సమాధానం ఇస్తున్నాను.

పితృదేవతలు అంటే గతించిన మన పితరులు కాదు. మనందరి (జీవుల) రాకపోకలను, వారి గతులను సమర్థవంతంగా నిర్వహించే దేవతా వ్యవస్థ పితృదేవతా వ్యవస్థ. వసువులు, రుద్రులు, ఆదిత్యులు.. మొదలుగా గల దేవతలను పితృదేవతలు అంటారు.
కర్మ క్షయం కాని జీవుడు మరణించిన తరువాత పుడతాడు అనేది నిజం. కానీ వెంటనే అని ఖచ్చితంగా చెప్పలేము. ఒక లెక్క ప్రకారం పునర్జన్మకు 300 సంవత్సరాలు పడుతుంది. వెంటనే పుట్టిన సందర్భాలు కూడా లేకపొలేదు. అది ఆ జీవుని యొక్క సంకల్ప బలం, తనకి గల ప్రారబ్ధ, ఆగామి, సంచితం అనే కర్మలపైన ఆధార పడి ఉంటుంది.
ఒకవేళ వెంటనే పుట్టినా సరే మనం చేసే పితృకర్మల ఫలితం వారికి అందుతుంది. వారు ఏ రూపంలో పుట్టినా సరే మనం పెట్టినది వారికి ఏది ఆహారమో ఆ రూపంలో అందుతుంది. ఇలా చేయడానికి ఒక వ్యవస్థని పితృదేవతలు ఏర్పాటు చేసేరు. ఉదాహరణకు..ఆ జీవుడు ఆవుగా పుడితే గడ్డి మొదలైన రూపంగా మారి మనం పెట్టిన ఆహారం అందుతుంది. వారిని ఉద్దేశించి అలా చేసినందుకు పితృదేవతలు కూడా సంతోషించి మనకి మంచి కలుగజేస్తారు. ఒకవేళ గతించిన వారు ముక్తిని పొంది లేదా ఉత్తమ గతులలో ఉండి మనం చేసినవి అవసరం లేని స్థితిలో ఉంటే మనం చేసిన పితృకర్మల ఫలితం మనకే మన కోరికలు తీరే విధంగా వస్తుంది. ఉదాహరణకు మనం మనీఆర్డరు చేసిన అడ్రసులో ఎవరూ లేకపొతే మనకే తిరిగి వస్తుంది కదా. కానీ గతించిన వారి స్థితి మనకు తెలియదు కనుక మనం జీవించి ఉన్నంత కాలం పితృకర్మలు చేయవలసినదే.పితృ కార్యమప్పుడు ఒక భోక్తను పితృ స్థానంలో ఇంకొక భోక్తను విష్ణు స్థానంలో కూర్చో పెడతాం .పితృ స్థానంలో కూర్చోపెట్టిన భోక్తకు వాసు రుద్రా ఆదిత్య రూపంలో ఉన్న తండ్రి తథా ముత్తాత మూడు తరాల వారిని ఆవాహన చేస్తాం కదా .అందుకనే భోక్తలను సంతృప్తిగా భోజనం చేయమని తొందర పెట్టకుండా అడిగేది .పూర్వపు రోజులలో భోక్తగా ఉండేవారు ఇప్పుడు నలువురు తినే భోజనం తినేవారు .అరచేతి మన్దమ్ గారెలు బెల్లపు పరవాన్నంలో నెయ్యిపోసుకొని నంచుకు తినేవారు దగ్గరగా పది పన్నెడు గారెలు అవలీలగా తినేవారు భోజనంతో పాటుగా వారు నిజమైన భోక్తలు .ఇప్పుడు అసలు వారు భోజనం చేయటం చాలా తక్కువ షుగర్ అని బీపీ అని .భోక్తగా ఉండాల్సినవారు నియమ నిష్ఠ అంగవైకల్యం లేకుండా ఇంకా చాలా ఉన్నాయ్ .ఈ రోజులలో దొరుకుతున్నారా . ఇంతకుముందు తద్దినం అంటే అపరాహ్నం వచ్చిన తరువాత యింటివారి భోజనం సుమారు నాలుగు గంటల తర్వాతే .ఇప్పుడు తొమ్మిదికి ప్రారంభం పదిన్నరకు పూర్తి కార్యాలయమునకు వెళ్లడం .ఆ ఒక్కరోజు సెలవు పెట్టె వ్యవధి ఉండదు అర్జెంట్ పనులు.

No comments:

Post a Comment