*🙏🛕వినాయకుడు!!!*
*🌹వినాయకుడి కన్నా అధికులు కానీ, వినాయకుణ్ణి ఆదేశించేవారు కానీ ఎవరూ లేరు. తన పైన మరొక నాయకుడు లేనివాడు వినాయకుడు. ప్రపంచంలో ప్రతీ ఒక్కరికీ వారి కన్నా అధికులు (వారిని శాసించేవారు) ఉంటూనే ఉంటారు. కానీ వినాయకుడు సర్వస్వతంత్రుడు. అందువల్ల భారతీయులు ముందు వినాయకుణ్ణి పూజిస్తారు.*
*🍃భారతదేశంలో సనాతనకాలం నుండీ వినాయకుడి ఆరాధన ఉంది. బుగ్వేదంలోనూ, నారాయణోపనిషత్తులోనూ, తైత్తిరీయ ఉపనిషత్తులోనూ వినాయకుణ్ణి స్తుతిస్తూ ఎన్నో స్తోత్రాలున్నాయి*.
*🌹ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్*
*🍃వినాయకుడి మహిమను చెప్పే ఈ మంత్రం గణపతి అథర్వ శీర్నోపనిషత్తు లోనిది*.
*🌹ఆయన విఘ్నాలకు నాయకుడు; అవసరమైనప్పుడు విఘ్నాలను కలిగించేదీ ఆయనే. తనను భక్తితో తలచుకున్న వారి విఘ్నాలను అధిగమించడంలో తోడ్పడేదీ ఆయనే!*
*🍃బుద్ధి, సిద్ధి మూర్తీభవించిన రూపం వినాయకుడిది. వేదవ్యాసుడు తాను మహాభారతాన్ని చెబుతుంటే వ్రాయాల్సిందిగా వినాయకుణ్ణి ప్రార్థించాడు. అందుకు సమ్మతించి వినాయకుడు వెంటనే తన దంతాన్ని విరిచి మహాభారతం వ్రాయడానికి కూర్చున్నాడు.*
No comments:
Post a Comment