Friday, July 17, 2026

How To Stop Being Emotionally Dependent On Someone | Nagna Satyam

How To Stop Being Emotionally Dependent On Someone | Nagna Satyam

Author Name:Nagna Satyam

Youtube Channel Url:https://www.youtube.com/@Nagnasatyam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=NT11ywWj83A



Transcript:
(00:03) మిమ్మల్ని ఒక చీకటి గదిలో బంధించి మీ చేతులు కాళ్ళు కట్టేసిన్నాయి. మీ కళ్ళ ముందే ఒక రిమోట్ కంట్రోల్ ఉంది. ఆ రిమోట్ బటన్ నొక్కితే మీకు అన్నం వస్తుంది. ఇంకో బటన్ నొక్కితే మీకు గాలాడుతుంది. మరో బటన్ నొక్కితే మీకు కరెంట్ షాక్ కొడుతుంది. కానీ భయంకరమైన విషయం ఏంటంటే ఆ రిమోట్ మీ చేతిలో లేదు. అది ఎక్కడో ఎవరో మీకు తెలియని వ్యక్తి చేతిలో ఉంది.
(00:30) ఆ వ్యక్తి మూడ్ బాగుంటే మీకు అన్నం పెడతాడు. వాడు కోపంలో ఉంటే కరెంట్ షాక్ ఇస్తాడు. మీరు బతకాలా చావాలా నవ్వాలా ఏడవాలా అనేది పూర్తిగా ఆ అవతలి వాడి వేలి కదలికల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు చెప్పు ఇలాంటి జీవితాన్ని మీరు ఏమంటారు? నరకం అంటారా బానిసత్వం అంటారా లేక చావు కంటే ఘోరమైన బతుకు అంటారా? హ ఇక్కడ విచిత్రం ఏంటంటే మీలో నాలో ఈ సమాజంలో ఉన్న ప్రతి 100 మందిలో 90 మంది సరిగ్గా ఇలాంటి నరకాన్నే అనుభవిస్తున్నారు.
(01:07) కాకపోతే దీన్ని వాళ్ళు బానిసత్వం అనరు. చాలా అందమైన పేరు పెట్టుకున్నారు. అదే ప్రేమ. వీళ్ళు నమ్మేది ఏంటో తెలుసా? ఎవరో ఒకరు వస్తారు నా జీవితాన్ని మార్చేస్తారు, నన్ను పరిపూర్ణం చేస్తారు అని. బట్ మీరు దీన్ని ప్రేమ అని పిలిస్తే నేను మాత్రం మానసిక రోగం అనే పిలుస్తా ఎందుకంటే నీ సంతోషానికి సంబంధించిన రిమోట్ కంట్రోల్ ను తీసుకువెళ్లి ఇంకొకరి చేతిలో పెట్టేసి వాళ్ళు బటన్ నొక్కినప్పుడు నువ్వు నవ్వాలి వాళ్ళు ఆపేసినప్పుడు నువ్వు ఏడవాలి అనుకోవడం కంటే దౌర్భాగ్యం పరమ బానిసత్వం ఈ భూమి మీద ఇంకోటి ఉండదు.
(01:44) కనీసం జైల్లో ఖీదీకైనా కాస్తో కూస్తో సొంత ఆలోచనలు ఉంటాయి. కానీ ఈ మానసిక బానిసత్వంలో ఉన్న వాడికి తన ఉనికి కూడా గుర్తుండదు. నీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సిమోన్ డి బబోవా అనే గొప్ప ఫిలాసఫర్ ఆమె ఆ కాలంలోనే ప్రపంచాన్ని వణకించిన ఒక పవర్ఫుల్ మేధావి ఎగ్జిస్టెన్షియలిస్ట్ ఫిలాసఫర్ అయిన జీన్ పాల్ సార్త్రేతో పరిచయం ఏర్పడింది.
(02:09) ఇద్దరి ఆలోచనలు కలిసాయి ప్రేమ పుట్టింది. కానీ ఆ రిలేషన్ మొదలైన కొత్తలో సిమోన్ ఒక భయంకరమైన మానసిక నరకాన్ని చూసింది. సార్త్రే అనే ఆ మహా మేధావి మేధస్సు ముందు అతని వ్యక్తిత్వం ముందు తనను తాను తక్కువ చేసుకోవడం మొదలపెట్టింది. ఇక్కడ ప్రేమ అనే మోజులో పడి సిమోన్ తనని తానే మర్చిపోవడం తనని అణచి వేసుకోవడం మొదలెట్టింది. అతని ఇష్టాల చుట్టూ తన జీవితాన్ని తిప్పడం అతను పక్కన లేకపోతే తను శూన్యం అని ఏడవడం అతని మూడ్ బాగుంటేనే తను నవ్వడం ఇలా పూర్తిగా అతని నీడల అతని ప్రతిబింబంలా మారిపోయింది.
(02:46) అంటే ఆమె ఒక రిలేషన్ లో ఉంది కానీ ఆ రిలేషన్ ఆమెకు ఊపిరాడకుండా చేస్తుంది. దీన్ని గమనించిన ఆమె నేను అతనితో ప్రేమలో పడ్డాను సరే కానీ ఈ రిలేషన్ లో అసలు నేనెక్కడ నా సొంత ఆలోచన ఏది నాకంటూ ఒక స్పేస్ ఉందా లేక నేను కేవలం అతని మేధర్సుకు ఒక దాసిగా మారిపోయానా అని తనకు తాను గట్టిగా ఒక చెంప దెబ్బ కొట్టుకున్నట్టు ప్రశ్నించుకుంది.
(03:12) అంతే ఆ క్షణమే ఆ పాత తరహా బతుకును ఆపేసి ఆ తర్వాత వాళ్ళు జీవితాంతం కలిసి ఉన్నారు. కానీ ఒకరిపై ఒకరు పడి ఏడ్చే నిబ్బీ నిబ్బా ప్రేమికుల్లా కాదు ఎవరి ఇల్లు వాళ్ళది ఎవరి డబ్బు వాళ్ళది ఎవరి ఆలోచనలు వాళ్ళవి ఇద్దరు సమానంగా స్వేచ్ఛగా బతికారు. రెండు వేరు వేరు నదులు ఒకే సముద్రంలో కలిసినట్టు బతికారు తప్ప ఒక నది ఇంకో నదిలో కలిసి తన రంగును కోల్పోలేదు.
(03:40) ఈ అనుభవం నుంచే సిమోన్ డి బబోవా చెప్పాలనుకున్నది ఏంటంటే మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ ఎలాంటిది అంటే 10 మందికి ఉన్నది మనకు లేకపోతే నీలో సత్తా లేదనో లోపమనో నిన్ను వింతగా చులకనగా చూస్తారు. బట్ మనక అది అవసరం కదా అందుకే పిచ్చి కుక్కల్లా వెనకపడుతూనే ఉంటాం. ఈ మాటలు నమ్మి నువ్వేం చేస్తావంటే నీ జీవితంలోకి వచ్చిన వ్యక్తిని ఒక దేవుడి స్థానంలోనో ఒక దేవత స్థానంలోనో కూర్చోబెడతావు.
(04:09) ఆ తర్వాత ఏమవుతుంది వాడి మూడ్ నీకు వాతావరణం అయిపోతుంది. వాడు బయట ఎక్కడో ఎవరితోనో గొడవపడి మొహం మార్చుకుంటే ఇక్కడ నీ గుండె ఆగిపోతుంది. వాడు నిన్ను పొగిడితే గాలిలో తేలుతావు వాడు కాస్త పట్టించుకోకపోతే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతావు. నీకు సొంతంగా ఒక అద్భుతమైన బ్రెయిన్ ఒక సజీవమైన శరీరం ఆలోచించే శక్తి ఉన్నప్పుడు నీ సంతోషం కోసం నీ మనశశాంతి కోసం ఇంకొకడి ప్రవర్తన మీద ఆధారపడడం ఎంతవరకు న్యాయం? ఇది నిన్ను నీవు నిలువునా చంపుకోవడం కాదా నువ్వు మొదట గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఒంటరితనాన్ని భరించే శక్తి నీకు లేనప్పుడు నీతో నువ్వు గడపడం నీకు చేత కానప్పుడు ఇంకొక మనిషి నీ జీవితంలోకి
(04:48) వస్తే నీ సమస్యలన్నీ తీరిపోతాయి అనుకోవడం కేవలం ఒక పారిపోయే తత్వం మాత్రమే నువ్వు నీ లోపల ఉన్న ఎంటీనెస్ ను వేరే వాళ్ళను తెచ్చి పూర్చాలని చూస్తున్నావు. కానీ నిజం ఏంటంటే నీ లోపల ఉన్న రంధ్రం ఎంత పెద్దదో అవతలివాడు ఇచ్చే ప్రేమ కూడా అంతే వేగంగా అందులోంచి వెళ్ళిపోతుంది. నీ లోపల ఉన్న ఖాళీని నువ్వే పూడుచుకోవాలి.
(05:11) తోడు అనేది నీ ప్రయాణాన్ని సులభతరం చేయడానికి [సంగీతం] నీ జీవితంలో ఆనందాన్ని పంచుకోవడానికి మాత్రమే అంతే తప్ప నీ ప్రయాణాన్నే ఆపేసి నీ కాళ్ళు విరగగొట్టుకొని అవతలి వాడి భుజాల మీద ఎక్కడానికి కాదు ఈవెన్ బంధాలు అనేవి మనుషులను బంధించడానికి వాళ్ళ రెక్కలు కత్తిరించడానికి కాదు వాళ్ళను మరింత స్వేచ్ఛగా మరింత ఎత్తుకు ఎగరనివ్వడానికి ఇక్కడే ఇమాన్యల్ కాంట్ చెప్పినట్టు మన ఆలోచనలకి మన నమ్మకాలకి కొన్ని సరిహద్దులు గీసుకోవాలి [సంగీతం] నీకంటూ ఒక సొంత వ్యక్తిత్వం లేనప్పుడు నువ్వు చేసేది ప్రేమ కాదు అవతలి వాడికి మానసిక బానిస అవ్వడం మాత్రమే నిన్ను నువ్వు పూర్తిగా నమ్ముకోనంత కాలం నీ
(05:50) ఉనికిని నువ్వు గౌరవించుకోనంత కాలం నువ్వు ఏ లగ్జరీ రిలేషన్ లో ఉన్నా ఎంతటి అందమైన వ్యక్తితో ఉన్నా అది నీకు జైలు లాగే ఉంటుంది. వేరే ఏ మనిషి నిన్ను సంపూర్ణం చేయలేడు చేయకూడదు కూడా నువ్వు పుట్టింది ఒంటరిగా చచ్చేది ఒంటరిగా మధ్యలో సాగే ఈ నాటకంలో నీ రిమోట్ కంట్రోల్ ఎవ్వరికీ ఇవ్వకు సో ఫైనల్ గా చెప్పాలనుకున్నది ఏంటంటే తెలివైనవాడు ప్రతిదాన్ని అనుమానిస్తూ బంధాలకు దూరమై నష్టపోతే మూర్ఖుడు ప్రతిదాన్ని నమ్ముతూ బానిసగా మారి మోసపోతాడు.
(06:22) జీవితంలో జ్ఞానం ఎక్కువైతే కాస్త అజ్ఞానంలోకి అంటే నమ్మకంలోకి దూకాలి. అజ్ఞానం ఎక్కువైతే కాస్త జ్ఞానంలోకి అంటే ప్రాక్టికాలిటీ లోకి దూకాలి. కానీ ఈ రెండింటి మధ్య బతకాలంటే నీకు ఈత అనే సెల్ఫ్ లవ్ అండ్ అవేర్నెస్ వచ్చి ఉండాలి. లేదంటే అవతలి వాడి మూడ్ అనే స్వచ్ఛమైన నరకం కంటే ఘోరంగా ప్రతిక్షణం చస్తూ బతుకుతావు. నీ జీవితం నీది దాని రిమోట్ కంట్రోల్ నీది.
(06:48) బాధ్యత కూడా నీదే. ఇక ఎలా చేస్తావో బతుకుతావో కూడా నీదే.

No comments:

Post a Comment