*మహాభారతంలో భగవద్గీత కాకుండా ఇంకా గీతలు ఉన్నాయంటారు. నిజమేనా? అవి ఏమిటి ?*
...................
అవును నిజమే మహాభారతంలో చాలానే గీతలు ఉన్నాయి. భగవద్గీతతో కలిపి 16 గీతలున్నాయి. అవి వరుసగా:
ఉతధ్య గీత
వామదేవ గీత
ఋషభ గీత
షడ్జ గీత
శంపాక గీత
మంకి గీత
జనక గీత
విచఘ్న గీత
రెండో జనక గీత
హారీత గీత
వృత్ర గీత
పరాశర గీత
హంస గీత
పురా బ్రహ్మ గీత
అను గీత
బ్రాహ్మణ గీత
ఈ గీతలు ఎక్కువ శాతం శాంతి పర్వంలో ఉన్నాయి. ఈ గీతలలో ప్రకీర్ణ ధర్మం, రాజధర్మం, సుఖ దుఃఖములు,ఆశా స్వరూపం, ధనాశా పీడితుల కర్తవ్యాలు, అహింసా ధర్మం, పరమపద సాధన మార్గాలు, మోక్ష ధర్మాలు వంటివన్నీ వివరించారు. భగవద్గీత కాకుండా కృష్ణుడు అర్జనుడికి అను గీత అనే మరో గీతని అశ్వమేథ పర్వంలో వివరించాడు. నిజానికి మహాభారతంలోనే కాదు మిగిలిన పురాణాల్లో కూడా చాలా గీతలు ఉన్నాయని పెద్దలు అంటారు. అవన్నీ భగవద్గీత అంత ప్రాచుర్యం కాలేదు అంతే. *ఆధ్యాత్మిక కుటుంబం*
No comments:
Post a Comment