శివపార్వతుల అసలు రహస్యం:క్వాంటం ఫిజిక్స్, న్యూరోసైన్స్ మరియు సనాతన ధర్మం వెనుక దాగిన బ్రహ్మాండ సత్యం
Author Name:Dr_Pasupathi_Raj_Gurejala
Youtube Channel Url:https://www.youtube.com/@Dr_Pasupathi_Raj_Gurejala
Youtube Video URL:https://www.youtube.com/watch?v=3u0NhY5Ytr4
Transcript:
(00:00) మన ఇళ్లల్లో దేవుడి పూజ గదిలో లేదా గుడిలో శివపార్వతుల పరివారం ఫోటో లేదా విగ్రహాలను చూసినప్పుడు మీకు ఎప్పుడైనా ఇలాంటి సందేహం కలగలేదా అసలు శివపార్వతులు అనేవాళ్ళు నిజంగా ఆకారం దేహం కలిగిన దేవతలా లేకపోతే ఈ అనంతమైన సృష్టి ఆ శూన్యం మరియు ఆ శూన్యంలో ఉండే శక్తికి ప్రతిరూపాలుగా మన మహర్షులు వాళ్ళని ఒక ఆకారాన్ని ఇచ్చి సృష్టించారా శివపార్వతులు అంటే మామూలు మనుషులాగా దేవతలు కూడా పెళ్ పెళ్లిళ్లుు చేసుకొని సంసారం చేసి గణపతి అలాగే కార్తికేయ వాళ్ళని కన్నారా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా దేవుళ్ళకు కూడా అత్త మామ బావ బావ మరిది కోపాలు ఆవేశాలు పగలు
(00:43) ప్రతీకారాలు ఎందుకు ఉంటాయి వాళ్ళు కూడా మనలాగే సంసార జీవితంలో కష్టాలు పడ్డారు కదా మరి వాళ్ళకి మనకి తేడా ఏంటి దక్ష యజ్ఞంలో శివుడిని పిలవకపోవడం సతీదేవి అగ్నిలో దూకడం ఇదంతా ఒక ఫ్యామిలీ డ్రామా లాగా కనిపిస్తుంది కదా ఇదంతా నిజంగా జరిగిందా లేక ఒక కల్పితమా గత కొంత కాలంగా ఇలాంటి ఎన్నో ప్రశ్నలు నా మదిలో ఒక అగ్ని పర్వతంలా రగులుతూనే ఉన్నాయి.
(01:07) ఈ సృష్టి రహస్యం వెనుక ఉన్న అసలైన సత్యం ఏమిటి అన్న అన్వేషణలో నేను వెతకని చోటంటూ లేదు. గడపని నిద్రలేని రాత్రులు లేవు కళ్ళు మూసుకున్న తెరిచిన ఆ ప్రశ్నలు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వలేదు. నా లోపల ఉన్న ఆత్మజ్ఞానంతో నాకున్న ప్రతి శక్తిని కూడగట్టుకొని ఎన్నో గ్రంథాలను శోధించి ఎన్నో విశ్లేషణలు మరియు లోతైన పరిశోధనలు చేసిన తర్వాత నేను ఒక బ్రహ్మాండమైన సత్యాన్ని తెలుసుకున్నాను.
(01:31) ఇన్ని రోజులుగా మనం నమ్ముతున్న భ్రమలను పటాపంచలు చేసే ఆ విశ్వ రహస్యాన్ని ఆ అల్టిమేట్ సైన్స్ ని ఈ వీడియోలో నేను మీకు తెలియజేయబోతున్నాను. కావున ఈ వీడియోలో ఈ శివ పరివారం వెనుక ఉన్న అత్యంత గూఢమైన క్వాంటం ఫిజిక్స్ కాస్మాలజీ మరియు హ్యూమన్ న్యూరో సైన్స్ కి సంబంధించిన రహస్యాలను నా విశ్లేషణలలో మీకు పూర్తిగా తెలియజేయడానికి ప్రయత్నిస్తాను.
(01:54) ముఖ్యంగా వాళ్ళు ధరించే అలంకరణ, ఆయుధాలు, వారు నివసించే కైలాసం మరియు పురాణాలలో చెప్పబడిన వారి కుటుంబ కలహాల వెనుక ఉన్న పరమార్థం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో పూర్తయ్యేసరికి సత్య అన్వేషణ కోసం మీకు నిద్రపట్టకుండా చేస్తున్న ప్రశ్నలన్నింటికీ ఖచ్చితమైన మరియు ట్రాన్స్పరెంట్ అయిన సమాధానం దొరుకుతుంది.
(02:15) అప్పుడే ఈ బ్రహ్మాండానికి మరియు మీ శరీరానికి మధ్య ఉన్న ఆశ్చర్యకరమైన లింక్ మీకు అర్థమవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం లేడీస్ అండ్ జెంటిల్మెన్ యువర్ అటెన్షన్ ప్లీజ్ దిస్ ఇస్ డాక్టర్ పసుపతి రాజ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సృష్టి రహస్యం శివపార్వతుల కలయికతో మొదలవుతుంది అని పురాణాలు చెబుతాయి. ముందుగా శివుడు అంటే ఒక ఆకారం కాదు శివుడు అంటే ప్యూర్ కాన్షియస్నెస్ అనగా శుద్ధ చైతన్యం.
(02:46) క్వాంటం ఫిజిక్స్ పరిభాషలో చెప్పాలంటే ఈ విశ్వం ఆవిర్భవించడానికి ముందు ఉన్న అనంతమైన శూన్యం లేదా క్వాంటం వాక్యూమ్ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ లాంటి ఆధునిక పరికరాలు ఈ విశ్వం అంచులను చూస్తున్నప్పుడు అక్కడ వాళ్ళకు కనిపించేది అనంతమైన చీకటి. ఆ డార్క్ మ్యాటర్ మరియు డార్క్ ఎనర్జీతో నిండిన ఖాళీ ప్రదేశమే పరమశివుడు.
(03:09) ఈ విషయాన్ని మన వేదాలు కొన్ని వేల సంవత్సరాల క్రితమే అద్భుతంగా వివరించాయి. 1400 కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన బిగ్ బ్యాంగ్ కన్నా ముందు ఏముంది అనేదానికి ఋగ్వేదంలోని నాసదీయ సూక్తం చాలా స్పష్టమైన సమాధానం ఇస్తుంది. నాసదాసిన్నో సదాసీతదానిం నాసిద్రజో నోవ్యోమ పరోయత్ కిమావరీవః కుహ తస్య శర్మన్ అంభః కిమాసిీద్ గహనం గభీరం దీని అర్థం ఏమిటంటే సృష్టికి ముందు అసత్తు లేదు సత్తు లేదు అంతరిక్షం లేదు ఆకాశం లేదు ఎవరికీ వారు లేరు కప్పబడినది [సంగీతం] ఏమీ లేదు అంతా నిండి ఉన్న ఒక అద్భుతమైన నిశ్చలత్వమే ఉంది.
(03:45) ఆ ఏమీ లేని నిశ్చలమైన [సంగీతం] శూన్యమే శివుడు. కానీ కేవలం చైతన్యం లేదా శూన్యం మాత్రమే ఉంటే సృష్టి జరగదు. దానికి శక్తి కావాలి. ఆ శూన్యంలో ఎప్పుడైతే ఒక ప్రకంపన లేదా కదలిక వస్తుందో అదే శక్తి లేదా పార్వతీ దేవి. ఆధునిక స్ట్రింగ్ థియరీ ప్రకారం ఈ విశ్వమంతా సూక్ష్మమైన ఎనర్జీ తీగల ప్రకంపనల వల్లే సృష్టించబడింది. ఆ ప్రకంపనయే శక్తి. పార్వతి ప్రకృతికి.
(04:10) చలనానికి అనగా కైనెటిక్ ఎనర్జీకి ప్రతీక. శివుడు మరియు పార్వతి వివాహం చేసుకున్నారు అంటే దానికి అర్థం ఒక పురుషుడు ఒక స్త్రీ పెళ్లి చేసుకోవడం కాదు ఈ విశ్వంలో స్థిరత్వం మరియు చలనం అనగా స్పేస్ మరియు ఎనర్జీ ఒకే బిందువు వద్ద ఏకం అవ్వడం ఈ కలయిక యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది నిశ్చలత్వం మరియు గతిశీలత యొక్క పరిపూర్ణమైన ఏకీకరణ ఆదిశంకరాచార్యులు సౌందర్య లహరిలోని మొదటి శ్లోకంలో ఈ విశ్వ సృష్టి రహస్యాన్ని ఎలా చెప్పారు చెప్పారో చూడండి శివః శక్త్యాయుక్తో యదిభవతి శక్తః ప్రభవితం నా చేదేవం దేవో నా కలుకుశలః స్పందితుమపి దీని అర్థం శివుడు శక్తితో కలిసినప్పుడు మాత్రమే సృష్టించడానికి లేదా
(04:56) స్పందించడానికి సమర్థుడు అవుతాడు. శక్తి లేనిదే ఆ పరమ శివుడు కనీసం కదలలేడు. ఒక మనిషి మెదడులోని ఎడమ భాగం లాజిక్ మరియు స్థిరత్వానికి అనగా శివ తత్వానికి ప్రతీక. కుడి భాగం క్రియేటివిటీ మరియు ఎమోషన్ కి అనగా శక్తి తత్వానికి ప్రతీక. ఈ రెండు ఎప్పుడైతే ఒక సింక్ లో పని చేస్తాయో అప్పుడే మనిషి అత్యుత్తమ స్థితికి చేరుకుంటాడు.
(05:21) ఇదే అర్ధనారీశ్వర తత్వం వెనుక ఉన్న అసలైన న్యూరోసైన్స్. మెదడులోని స్థిరమైన ఆలోచన నాడ వ్యవస్థ ద్వారా శక్తిగా మారినప్పుడే ఒక మనిషి ఏ పనైనా చేయగలుగుతాడు. మీ జీవితంలో శివుడు మీ సాక్షిభూతమైన ఆలోచన అయితే పార్వతి ఆ ఆలోచనను అమలు చేసే మీ సంకల్ప బలం చాలామందికి శివపార్వతులకు ఇద్దరు కుమారులు మాత్రమే ఉన్నారని తెలుసు కానీ పురాణాల ప్రకారం వారికి ఒక కుమార్తె కూడా ఉంది.
(05:46) ఆమె పేరు అశోక సుందరి. పద్మ పురాణంలో ఈమె ప్రస్తావన మనకు స్పష్టంగా కనిపిస్తుంది. శివుడు మరియు పార్వతి యొక్క మానసిక సంకల్పం నుండి ఆ కల్పవృక్షం నీడలో ఆమె ఉద్భవించింది. అశోక సుందరి అనగా శోకం లేని అందం అనగా బాధ లేని స్వచ్ఛమైన ఆనందం. సైకలాజికల్ గా చూస్తే ఒక మనిషిలో కాన్షస్నెస్ మరియు ఎనర్జీ కలిసినప్పుడు ముందుగా పుట్టేది ఇమాజినేషన్ [సంగీతం] మరియు క్రియేటివిటీ.
(06:14) ఒక మనిషి ఏదైనా గొప్ప పని చేయాలి అంటే ముందుగా అతని లోపల ఒక అందమైన ఆలోచన పుట్టాలి. ఎలాంటి భయం ఎలాంటి బాధ లేని ఒక స్వచ్ఛమైన ఆలోచనా శ్రవంతి అశోక సుందరి మెడికల్ పరిభాషలో చెబితే ఇది మన మెదడులోని డోపమైన్ మరియు సెరటోనిన్లు స్రవించినప్పుడు కలిగే ఒక అద్భుతమైన బాలెన్స్డ్ ఆనందం లాంటిది. ఒక క్రియేటివ్ ప్రాసెస్ మొదలయ్యే ముందు మెదడులో ఉండే ప్రశాంతమైన స్థితే ఈ తత్వం.
(06:36) ఆ క్రియేటివ్ ఆలోచనను ఆచరణలో పెట్టడానికి ఒక ఖచ్చితమైన బుద్ధి కావాలి. అదే వినాయకుడు చైతన్యం మరియు శక్తి కలిసినప్పుడు పుట్టే అద్భుతమైన ఫలితాలలో ఒకరు గణేశుడు గణేష్ బుద్ధికి వివేకానికి ప్రతీక ఒక సమస్యను భౌతికంగా ఎదుర్కోకముందే మానసికంగా పరిష్కరించే తత్వం ఆయనది వినాయకుడికి ఏనుగు తల ఎందుకు ఉంటుంది అంటే ఏనుగు తల విశాలమైన ఆలోచనకు అపారమైన [సంగీతం] జ్ఞాపక శక్తికి మరియు మ్యాక్రో విజన్ కి ప్రతీక మన మెదడులోని ఫ్రంటల్ లోబ్ ఎలాగైతే మన నిర్ణయాలను లాజిక్ ను ఎనలిటికల్ థింకింగ్ ను కంట్రోల్ చేస్తుందో వినాయకుడు ఆ వివేకానికి ప్రతిరూపం. ఆయన చిన్న కళ్ళు
(07:14) ఒక సమస్యను సూక్ష్మంగా విశ్లేషించే మైక్రో ఫోకస్ కు సూచిక. పెద్ద చెవులు మాట్లాడే కంటే ముందు విశ్వం చెప్పేది వినగలిగే యాక్టివ్ లిజనింగ్ కి ప్రతీక. చేతిలో ఉండే పాసం మరియు అంకుశం మన చంచలమైన మనసును మరియు అనవసరమైన కోరికలను బంధించి సరైన దారిలో నడిపించడానికి సంకేతాలు. వినాయకుడికి ఒక దంతం విరిగిపోయి ఉంటుంది. దీనిని ఏకదంతం అంటారు.
(07:37) ఇది మనిషిలోని ద్వంద్వ భావాలను అనగా మంచి చెడు. సుఖం దుఃఖం లాంటి డ్యూయాలిటీని దాటి ఒకే అద్వితీయమైన సత్యం వైపు ప్రయాణించడానికి ప్రతీక వినాయకుడు అడ్డంకులను అవి కార్యరూపం దాల్చక ముందే తన బుద్ధితో తొలగిస్తాడు. ఇదొక ఇంటర్నల్ విక్టరీ ఆ తర్వాత మనసులో సమస్య పరిష్కారం అయ్యాక దానిని బయటి ప్రపంచంలో జయించడానికి బలం మరియు ఆచరణ కావాలి.
(08:02) ఆ బలమే కార్తికేయుడు స్కందుడు అని కూడా పిలువబడే కార్తికేయుడు దేవతల సేనాధిపతి. ఆయన బయట ప్రపంచాన్ని చూసే శక్తి ఆయన క్రమశిక్షణ బలం మరియు బాహ్య ప్రపంచం పై ప్రయోగించే లేజర్ లాంటి ఫోకస్ కు ప్రతీక. ఆయన ఆరు ముఖాలు మన ఐదు జ్ఞానేంద్రియాలు మరియు ఒక మనసును ఒకే లక్ష్యం వైపు నడిపించే క్రియకు సూచిక. వినాయకుడు సమస్యను మనసుతో పరిష్కరిస్తే కార్తికేయుడు తన వేలు అనగా ఈటతో దానిని భౌతికంగా జయిస్తాడు.
(08:31) కార్తికేయుని చేతిలోని ఈటే ఒకవైపు వెడల్పుగా మధ్యలో పొడవుగా చివర అత్యంత పదునుగా ఉంటుంది. మన నాలెడ్జ్ కూడా అలాగే ఉండాలి. మన ఆలోచన విస్తృతంగా ఉండాలి. మన ప్రయాణం లోతుగా ఉండాలి. మరియు మన ఫోకస్ లేజర్ లాగా అత్యంత పదునుగా ఉండాలి. మన మెదడులోని మోటార్ కార్టెక్స్ ఇచ్చే అత్యున్నతమైన మరియు ఖచ్చితమైన ఆచరణకు ఈ ఆయుధం ప్రతీక. మీరు జీవితంలో విజయం సాధించాలంటే ఈ రెండు కావాలి.
(08:58) బలం లేని బుద్ధి ఉంటే మీరు కేవలం పగటి కలలు కనే ఒక వ్యక్తిగా మిగిలిపోతారు. బుద్ధి లేని బలం ఉంటే మీరు ఒక విపత్తుగా మారుతారు. భగవద్గీతలో రెండవ అధ్యాయంలో 50వ శ్లోకంలో శ్రీకృష్ణుడు బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం అని చెప్పాడు. అనగా పనులలో నైపుణ్యమే యోగము. ఇక ఈ శివ పరివారంలో అత్యంత లోతైన సైకలాజికల్ లేయర్ వారి వాహనాలలో కనిపిస్తుంది.
(09:26) శివునికి నంది పార్వతికి సింహం వినాయకుడికి ఎలుక. కార్తికేయునికి నెమలి వాహనాలుగా ఉన్నాయి. అలాగే శివుని మెడలో వాసుకి అనే పాము ఉంటుంది. ఇక్కడ ఎవల్యూషనరీ బయాలజీని మనం ఖచ్చితంగా అన్వయించి చూడాలి. సింహం సహజంగా ఎద్దును వేటాడుతుంది. నెమలి పామును చంపి తింటుంది. పాము ఎలుకను మింగేస్తుంది. ఇవన్నీ ఒకదానికొకటి సహజ శత్రువులు జీవశాస్త్రం ప్రకారం మన మెదడులోని లింబిక్ సిస్టం మరియు అమిగ్డాలా మనలో భయాన్ని, కోపాన్ని సర్వైవల్ ఇన్స్టింట్స్ ని పుట్టిస్తాయి.
(09:59) ఒక మనిషి లోపల కూడా ఒక సింహం లాంటి క్రోధం, ఎలుక లాంటి భయం, పాము లాంటి ద్వేషం, ఎద్దు లాంటి మూర్ఖత్వం నిరంతరం పోరాడుతూనే ఉంటాయి. కానీ కైలాసంలో ఈ శివ పరివారంలో ఈ సహజ శత్రువులు అత్యంత ప్రశాంతంగా పరస్పర విరోధం లేకుండా ఒకే చోట కూర్చుంటాయి. సనాతన ధర్మంలో ఆధ్యాత్మికత యొక్క అంతిమ లక్ష్యం ఇదే. దీన్నే సమన్వయం లేదా హార్మోనిీ ఆఫ్ ఆపోజిట్స్ అంటారు.
(10:22) మీరు ఉన్నతమైన చైతన్య స్థితికి చేరుకున్నప్పుడు మీ అంతర్గత విభేదాలు మిమ్మల్ని నియంత్రించలేవు. మీరు మీ సహజ లక్షణాలను చంపేయలేదు. మీరు వాటిని జయించారు. భగవద్గీతలోని ఆరవ అధ్యాయంలో ఐదవ శ్లోకం ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతుంది. ఉద్ధరేదత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మైవ హాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః అంటే తనను తాను ఉద్ధరించుకోవాలి.
(10:47) తనను తాను దిగజార్చుకోకూడదు. ఎందుకంటే మనిషికి తన మనసే బంధువు తన మనసే శత్రువు. ఇప్పుడు మనం కైలాసం గురించి మాట్లాడుకుందాం. శివ పరివారం ఎప్పుడూ మంచు కొండల్లోనే ఎందుకు ఉంటారు. నీరు అనేది ఎల్లప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది. మానవ మనసులోని ఆలోచనలు. భావోద్వేగాలు కూడా నీరు లాంటివే. అవి ఎప్పుడు ఒక చోట ఆగకుండా ప్రవహిస్తూనే ఉంటాయి.
(11:11) కానీ ఆ నీరు గడ్డకట్టి మంచుగా మారినప్పుడు అందులో ఎలాంటి కదలిక ఉండదు. మనసులోని ఆలోచనలన్నీ పూర్తిగా ఆగిపోయి ఒక అద్భుతమైన శూన్య స్థితికి చేరుకోవడమే ఈ మంచు పర్వతం యొక్క సంకేతం. మన శరీరంలోని ఏడు చక్రాలలో అత్యున్నతమైనది సహస్రార చక్రం ఒక యోగి తన కుండలిని శక్తిని సహస్రారానికి చేర్చినప్పుడు అతనికి బాహ్య ప్రపంచంతో సంబంధం తెగిపోయి ఒక పరమానంద స్థితిలో ఉండిపోతాడు.
(11:35) ఆ సహస్రార చక్రమే కైలాసం ఆ అత్యున్నత శిఖరం మీద కూర్చునే శుద్ధ చైతన్యమే పరమశివుడు. ఇప్పుడు పరమశివుని భౌతిక ఆకారం మరియు అలంకరణ వెనుక ఉన్న బ్రహ్మాండమైన రహస్యాలను డీకోడ్ చేద్దాం. యజుర్వేదంలోని శ్రీ రుద్రం శివుని ఆకారాన్ని వర్ణిస్తూ కర్పూర గౌరం కరుణావతారం అని చెబుతుంది. కర్పూరానికి ఒక లక్షణం ఉంది. అది మండినప్పుడు ఎలాంటి అవశేషాలను మిగల్చకుండా పూర్తిగా గాలిలో కలిసిపోతుంది.
(12:03) అలాగే ఒక మనిషి తన అహంకారాన్ని పూర్తిగా కాల్చివేసినప్పుడు మిగిలే ఆ స్వచ్ఛమైన చైతన్యమే పరమశివుడు. శివుడు పులి చర్మాన్ని ఎందుకు ధరిస్తాడు? పులి అనేది ఒక క్రూర జంతువు. అది అంతులేని కోరికలకు మరియు అదుపులేని జంతు స్వభావానికి ప్రతీక ఒక మనిషి తనలోని ఆ క్రూరమైన జంతు స్వభావాన్ని పూర్తిగా చంపి వాటిని తన ఆధీనంలో ఉంచుకున్నాడు అని చెప్పడానికే శివుడు ఆ పులి చర్మాన్ని ఒక ఆసనంగా వేసుకుని దాని మీద కూర్చుంటాడు.
(12:29) శివుని తలపై ఉండే జటలు అనగా జటాజూటం దీనికి సంకేతం. ఈ విశ్వమంతా కంటికి కనిపించని అనంతమైన ఎనర్జీ తీగలతో అల్లబడి ఉంది. శివుని జటలు ఆ కాస్మిక్ నెట్వర్క్ కి ప్రతీక. అలాగే మానవ శరీరంలో ఉండే లక్షలాది నాడులకు కూడా ఆ జటలు ప్రతిరూపం. శివుని నుదుటి మీద ఉండే మూడు అడ్డనామాలు లేదా విభూతి రేఖలను త్రిపుండ్రాలు అంటారు. మనిషి జీవితంలో ప్రధానంగా ఎదుర్కొనే మూడు మాయల నుండి విముక్తి పొందడమే ఈ మూడు రేఖల అర్థం.
(13:03) అవి ఒకటి అహంకారం రెండు కర్మ, మూడు మాయ. ఈ మూడింటిని భస్మం చేసి నుదుటి మీద పెట్టుకోవడం ద్వారా ఈ ప్రపంచంలో జేది శాశ్వతం కాదు అనే సత్యాన్ని శివుడు మనకు గుర్తు చేస్తాడు. శివుని మెడలో ఉండే పాము గురించి విశ్లేషిద్దాం. వాసుకి అనే ఈ పాము మన వెన్నెముక అడుగున మూలాధార చక్రంలో నిద్రపోతున్న కుండలిని శక్తికి ప్రతీక. యోగ సాధన ద్వారా ఆ కుండలిని శక్తి జాగృతం అయినప్పుడు అది వెన్నెముక గుండా పైకి ప్రయాణించి మెడదాకా చేరుకుంటుంది.
(13:32) పాము తన కుబుసాన్ని వదిలేసి కొత్త చర్మాన్ని ధరించినట్లుగా ఒక యోగి తన పాత భౌతిక బ్రమలను వదిలేసి ఒక కొత్త ఆధ్యాత్మిక జన్మను పొందుతాడు అని దీని అర్థం అలాగే శివుని చేతిలో డమరుకం ఉంటుంది. ఈ విశ్వం పుట్టినప్పుడు వచ్చిన మొట్టమొదటి శబ్దం ఓంకారం. డమరుకం నుండి వచ్చే నాదమే ఆ కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్ గ్రౌండ్ రేడియేషన్ కు మరియు స్థల కాలాల పుట్టుకకు ప్రతీక.
(13:56) ఇక ఆయుధం త్రిశూలం గురించి చూస్తే దానికి మూడు పదునైన అంచులు ఉంటాయి. భగవద్గీతలో 14వ అధ్యాయంలో చెప్పినట్లుగా మనిషిలో సత్వగుణం, రజోగుణం, తమోగుణం అనే మూడు గుణాలు ఉంటాయి. ఈ మూడు గుణాలను ఎవరు బ్యాలెన్స్ చేయగలరు, వారే సృష్టిని జయించగలరు. శివుడు త్రిశూలాన్ని పట్టుకున్నాడు. అంటే అతను ఈ మూడు గుణాలకు అతీతుడు అయ్యాడు అని అర్థం శివుని తలపై ఉండే గంగా నది ఉప్పెనలా వచ్చే అపారమైన జ్ఞానానికి మరియు అదుపులేని ఆలోచనల ప్రవాహానికి ప్రతీక శివుని తలపై ఉండే చంద్రవంక కాలానికి మరియు భావోద్వేగాల సమతుల్యతకు ప్రతీక.
(14:31) మెడలో ఉండే రుద్రాక్షలు అనంతమైన కరుణకు ప్రతిరూపాలు. జగన్మాత అయిన పార్వతీ దేవి అలంకరణ గురించి విశ్లేషిస్తే ఆమె ఎరుపు రంగు వస్త్రాలు ధరించి ఉంటుంది. ఎరుపు రంగు అనేది యాక్టివిటీ మరియు కైనెటిక్ ఎనర్జీకి ప్రతీక. చైతన్యం శూన్యంగా ఉన్నప్పుడు దానికి రంగు ఉండదు. కానీ ఆ చైతన్యం నుండి శక్తి ఉద్భవించినప్పుడు అందులో ఒక అపారమైన డైనమిజం ఉంటుంది.
(14:56) అందుకే ఆ దేవి ఎరుపు రంగులో దర్శనం ఇస్తుంది. దుర్గాదేవి రూపంలో ఉన్నప్పుడు ఆ తల్లి చేతిలో ఎన్నో ఆయుధాలు ఉంటాయి. ఖడ్గం చక్రం బాణాలు ఇవన్నీ భౌతికంగా మనుషులను చంపే ఆయుధాలు కావు మనిషిలోని అజ్ఞానాన్ని బద్ధకాన్ని మరియు అహంకారాన్ని నిర్మూలించే సైకలాజికల్ వెపన్స్ అవి ఇప్పుడు మీరు అడిగిన దక్ష యజ్ఞం కథ వెనుక ఉన్న అసలైన సైన్స్ ని మరియు సైకాలజీని డీకోడ్ చేద్దాం మన మహర్షులు సృష్టించిన ఈ పురాణాలు ఏవో పనిపాట లేఖ రాసిన కల్పిత కథలు కావు అలాగని ఒక కుటుంబంలో జరిగిన గొడవలను చరిత్రగా రాసినవి అంతకంటే కావు మన మెదడుకి కి ఒక పరిమితి ఉంది. అది ఎప్పుడూ తనకి తెలిసిన
(15:34) విషయాలతోనే తెలియని విషయాలను పోల్చుకొని అర్థం చేసుకుంటుంది. ఒక సామాన్య మానవుడికి ఈ అనంతమైన బ్రహ్మాండం ఎలా పని చేస్తుందో చెప్పాలి అంటే క్వాంటం ఫిజిక్స్, థర్మోడైనమిక్స్ లేదా ఆస్ట్రో ఫిజిక్స్ భాషలో చెబితే అతనికి ఏమీ అర్థం కాదు. అందుకే మన ఋషులు ఒక అద్భుతమైన టెక్నిక్ వాడారు. అదే పర్సోనిఫికేషన్ అంటే ప్రాణం లేని ఆకారం లేని అనంతమైన కాస్మిక్ శక్తులకు మానవ సంబంధాలను ఆపాదించడం.
(15:59) ఈ సృష్టి అంతా ఒక మహా నాటకం అయితే ఆ నాటకాన్ని సామాన్యుడికి అర్థమయ్యేలా చేయడానికి మన పురాణాలు ఒక సినిమా లాంటి స్క్రీన్ ప్లే ను తయారు చేశాయి. దేవుళ్ళకు బంధుత్వాలు ఎందుకు పెట్టారు అంటే సృష్టిలోని వివిధ శక్తుల మధ్య ఉన్న ఇంటర్ కనెక్షన్ ని వాటి మధ్య ఉన్న మ్యూచువల్ డిపెండెన్సీని వివరించడానికి పురాణాల ప్రకారం దక్షుడు సతీదేవికి తండ్రి మరియు శివుడికి మామగారు దక్షుడు ఒక మహా యజ్ఞం చేస్తూ అందరిని పిలిచి శివుడిని మాత్రం పిలవడు.
(16:29) ఇది చూసి అవమానం తట్టుకోలేక సతీదేవి అగ్నిలో దూకి ఆత్మహుతి చేసుకుంటుంది. ఇది పైకి కనిపించే ఒక అత్త మామల ఫ్యామిలీ డ్రామా కానీ దీని వెనుక ఉన్న అసలైన అర్థం తెలిస్తే మీ రోమాలు నిక్కబడుచుకుంటాయి. సంస్కృతంలో దక్షుడు అంటే అత్యంత నైపుణ్యం కలవాడు. స్కిల్ ఫుల్ అని అర్థం. దక్షుడు అనేది మనలోని భౌతికమైన బుద్ధికి అహంకారానికి ప్రతీక. మనం సాధించిన విజయాలు.
(16:52) మన ఆస్తులు, మన హోదా ఇవన్నీ దక్షుడి లక్షణాలు. సతీదేవి అంటే సత్యం అనగా స్వచ్ఛమైన ప్రాణశక్తి లేదా ఎనర్జీ ఇక శివుడు అంటే మనం ముందే చెప్పుకున్నట్లు ప్యూర్ కాన్షియస్నెస్ అనగా శుద్ధ చైతన్యం లేదా నిశ్చలత్వం దక్షుడు చేసే యజ్ఞం అనేది ఈ భౌతిక ప్రపంచంలో ఒక మనిషి తన అహంకారంతో చేసే కర్మలకు అనగా మెటీరియలిస్టిక్ యాక్షన్స్ కి ప్రతీక ఒక వైద్యుడిగా ఒక క్లినికల్ ప్రాక్టీషనర్ గా మీరు మనిషి శరీరాన్ని గమనిస్తే అందులో ఒక అద్భుతమైన ఫ్యామిలీ సిస్టం కనిపిస్తుంది.
(17:24) మన శరీరంలోని అవయవాలన్నీ ఒక కుటుంబం లాంటివి. వాటి మధ్య కూడా ఎప్పుడూ ఒక సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. మన మెదడు, గుండె కాలేయం అన్నీ కలిసి పని చేస్తేనే ఆరోగ్యం. ఎప్పుడైతే ఒక కణంలో తనను తాను మర్చిపోయిన అహంకారం అనగా క్యాన్సర్ సెల్స్ లేదా ఆటో ఇమ్యూన్ డిసార్డర్ పెరుగుతుందో ఆ కణం మిగతా శరీరాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది.
(17:47) దక్షుడు అనే అహంకారం కూడా సరిగ్గా ఇలాంటిదే. ఎప్పుడైతే ఒక మనిషిలో అహంకారం తారా స్థాయికి చేరుకుంటుందో అప్పుడు ఆ అహంకారం తన మూలమైన చైతన్యాన్ని అనగా శివుడిని మర్చిపోతుంది. శివుడిని యజ్ఞానికి పిలవకపోవడం అంటే మనిషి తన జీవితంలో చేసే పనులలో చైతన్యాన్ని నిశ్చలత్వాన్ని పూర్తిగా వదిలేయడం. కేవలం అహంకారంతో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించడం. ఇక సతీదేవి అగ్నిలో దూకడం అంటే ఒక సామాన్యమైన ఆడకూతురు మామగారింట్లో జరిగిన అవమానానికి ఆత్మహత్య చేసుకోవడం కాదు.
(18:18) సతీదేవి ఎనర్జీకి అనగా ప్రాణశక్తికి ప్రతీక. ఎప్పుడైతే అహంకారం అనే దక్షిణి శరీరంలో పుట్టిన ఆ శక్తి తన గమ్యమైన శివుడితో అనగా చైతన్యంతో కలవలేకపోతుందో అప్పుడు ఆ ప్రాణశక్తి తన భౌతిక శరీరాన్ని అనగా అహంకారం ఇచ్చిన ఆ దేహాన్ని నాశనం చేసుకుంటుంది. ఇది ఖచ్చితమైన థెర్మోడైనమిక్స్ మరియు బయాలజీ. ఒక కణంలో DNA దెబ్బ తిన్నప్పుడు ఆ కణం తనను తాను నాశనం చేసుకుంటుంది.
(18:46) దీన్నే మెడికల్ పరిభాషలో అపప్టోసిస్ అంటారు. సతీదేవి ఆత్మహుతి కూడా ఒక కాస్మిక్ అపోప్టోసిస్ అహంకారం అనే విషంతో నిండిన దేహం నుండి ఆ ప్యూర్ ఎనర్జీ బయటకు వచ్చేసి తన మూలంలో కలిసిపోవడమే ఆ అగ్ని ప్రవేశం వెనుక ఉన్న భయంకరమైన సత్యం సతీదేవి దేహాన్ని వదిలేసిన తర్వాత పార్వతీ దేవిగా మళ్ళీ ఎందుకు పుట్టాలి పార్వతీ హిమవంతుడికి అనగా మంచు కొండకు కూతురిగా పుడుతుంది మంచుకొండ అంటే అత్యంత స్థిరమైనది కదలనిది ఎప్పుడైతే ప్రాణశక్తి అహంకారం అనగా దక్షుడు నుండి కాకుండా స్థిరత్వం అనగా హిమవంతుడు నుండి ఉద్భవిస్తుందో అప్పుడు మాత్రమే ఆ శక్తి వెళ్లి శివుడితో అనగా నిశ్చలమైన చైతన్యంతో
(19:26) శాశ్వతంగా ఏకం అవ్వగలదు. ఇది ప్రాణశక్తి యొక్క పరిణామ క్రమం. ఒక మనిషి తనలోని అహంకారాన్ని చంపి ధ్యానంలో కొండలాగా స్థిరంగా కూర్చున్నప్పుడు మాత్రమే అతనిలోని కుండలిని శక్తి జాగృతమై సహస్రార చక్రంలోని శివుడితో కలుస్తుంది అని చెప్పడానికే మన ఋషులు ఈ దక్ష యజ్ఞం మరియు పార్వతీ కళ్యాణం అనే కథను సృష్టించారు. ఇక మీకు వచ్చే మరో సందేహం దేవుళ్లకు కూడా కోపాలు ఆవేశాలు కష్టాలు ఎందుకు ఉంటాయి అని దక్ష యజ్ఞం పాడవగానే శివుడికి విపరీతమైన కోపం వచ్చి వీరభద్రుడిని సృష్టించి దక్షుడి తల నరికేస్తాడు.
(20:03) శివుడికి కోపం రావడం ఏంటి? ఆయన ప్యూర్ కాన్షియస్నెస్ కదా అని మీకు సందేహం రావచ్చు. ఇక్కడ కోపం అంటే మనం ట్రాఫిక్ లోనో, ఆఫీస్ లోనో పడే అసహనం లాంటి కోపం కాదు. ఈ ప్రకృతికి ఒక బ్యాలెన్స్ ఉంటుంది. ఎప్పుడైతే అహంకారం హద్దులు దాటి ఆ బ్యాలెన్స్ ని దెబ్బతీస్తుందో అప్పుడు ప్రకృతి ఒక విధ్వంసకరమైన శక్తిని విడుదల చేసి ఆ అహంకారాన్ని నాశనం చేస్తుంది.
(20:25) శివుని కోపం అనేది కాస్మిక్ కరెక్షన్. ఒక స్టార్ సూపర్ నోవా లాగా పేలిపోవడం ఒక సునామి రావడం ఒక భూకంపం రావడం ప్రకృతి తనను తాను బాలెన్స్ చేసుకునే విధానాలు ఆ కాస్మిక్ ఎనర్జీ యొక్క ఉగ్ర రూపాన్నే మన మహర్షులు శివుని కోపంగా వీరభద్రుని ఆవిర్భావంగా కథల్లో రాశారు. ఆవేశం అనేది ఎనర్జీ యొక్క కైనెటిక్ ఫామ్ ఒక పెద్ద సముద్రం ప్రశాంతంగా ఉన్నప్పుడు అది శివుడు.
(20:49) అదే సముద్రంలో సునామి వచ్చినప్పుడు అది వీరభద్రుడు. ఆ సునామికి కోపం ఉన్నట్లా కాదు అది కేవలం శక్తి యొక్క ప్రవాహం మాత్రమే మరి ఈ అనంతమైన సృష్టి రహస్యాలకు ఒక కథ రూపంలో ఒక సినిమా రూపంలో జనాలకు అర్థమయ్యేలాగా దృశ్య రూపంలో కావ్య రూపంలో ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఎందుకంటే మనిషి మనస్సు ఎల్లప్పుడూ ఒక కథతోనే కనెక్ట్ అవుతుంది.
(21:13) మీరు ఎంఆర్ఐ స్కాన్ తీసి చూస్తే ఒక మనిషికి సైంటిఫిక్ ఫార్ములాలు చెప్పినప్పుడు యాక్టివేట్ అయ్యే మెదడు భాగాల కంటే ఒక ఎమోషనల్ కథ చెప్పినప్పుడు యాక్టివేట్ అయ్యే మెదడు భాగాలు చాలా ఎక్కువ ఒక సామాన్యుడిని ధర్మ మార్గంలో నడిపించాలంటే అహంకారం పనికి రాదు అని చెప్పాలంటే దక్షుడు లాగా అహంకరిస్తే తలకాయ పోతుందిరా బాబు అని కథగా చెబితేనే వాడికి అర్థమవుతుంది.
(21:36) వాడి భయం వాడిని ధర్మం వైపు నడిపిస్తుంది. మన వేదాలు అనేవి ఓపెన్ సోర్స్ కోడ్ లాంటివి. అందులో అత్యున్నతమైన ఆస్ట్రోఫిజిక్స్ ఉంటుంది. కానీ దాన్ని చదివి అర్థం చేసుకునే బ్రెయిన్ కెపాసిటీ అందరికీ ఉండదు. అందుకే పురాణాలు అనేవి యూసర్ ఇంటర్ఫేస్ ఒక కంప్యూటర్ లోని బైనరీ కోడ్ మీకు అర్థం కాదు కాబట్టి స్క్రీన్ మీద మీకు ఒక ఫోల్డర్ ఐకాన్ ఒక వీడియో ప్లేయర్ ఐకాన్ ఎలా కనబడతాయో ఈ కాస్మిక్ శక్తులన్నీ దేవుళ్లుగా వాళ్ళ కుటుంబాలుగా మీకు పురాణాలలో కనిపిస్తాయి.
(22:04) ఫోల్డర్ ని క్లిక్ చేస్తే ఫైల్ ఓపెన్ అయినట్లు ఈ దేవుళ్ళ కథలను లోతుగా ధ్యానం చేస్తే అసలైన సృష్టి రహస్యం ఓపెన్ అవుతుంది. భూమి మీద వారు తిరిగారు అని చెప్పడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటంటే ఈ బ్రహ్మాండంలో జరిగే ప్రతిదీ ఈ భూమి మీద జరిగే ప్రకృతిలోనూ ఉంది అని చెప్పడం యత్పిండే తద్ బ్రహ్మాండే అని మన వేదాలు చెబుతాయి. అంటే ఈ పిండాండంలో అనగా శరీరంలో ఉన్నదే ఆ బ్రహ్మాండంలో అనగా విశ్వంలో ఉంది అని అర్థం.
(22:32) అంతేకాదు మన దేశంలో ఉన్న జ్యోతిర్లింగాలు మరియు శక్తి పీఠాలు కేవలం రాళ్లుు కాదు మన మహర్షులు మానవ శరీరంలోని నాడులను చక్రాలను ఈ భూమండలం యొక్క భౌగోళిక రేఖలతో అనగా జియోగ్రాఫికల్ గ్రిడ్ తో అనుసంధానం చేసి ఆయా ప్రదేశాలలో ప్రాణ ప్రతిష్ట చేశారు. పురాణాలలో శివుడు ఇక్కడ నడిచాడు. పార్వతి అక్కడ తపస్సు చేసింది అని చెప్పడం వెనుక ఉన్న అసలైన సైన్స్ ఏంటంటే ఆయా ప్రదేశాలలో ఉన్న ఎలక్ట్రో మాగ్నెటిక్ ఫీల్డ్స్ మరియు కాస్మిక్ ఎనర్జీ కేంద్రాలను గుర్తించడమే మనిషి ఆ పురాణ కథలను చదివి వాటిని నమ్మి ఆయా ప్రదేశాలకు వెళ్లి ధ్యానం చేసినప్పుడు అతని శరీరంలోని చక్రాలు ఆటోమేటిక్ గా ఆ
(23:10) కాస్మిక్ ఎనర్జీకి సింక్ అవుతాయి. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన మరియు మీ ఆలోచనలను పూర్తిగా మార్చేసే ఒక అద్భుతమైన సత్యాన్ని మీకు చెప్పబోతున్నాను. చాలా మంది భక్తులు శివపార్వతులు వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళందరూ నిజంగానే శరీరం ధరించిన దేవతలు అని నమ్ముతారు. నిజంగానే వీళ్ళు ఆకాశంలో ఉన్నారని మనం పూజించే గుడిలో ఉన్నారని మనం పూజించే ఫోటోల్లో ఉన్నారని అత్యంత అమాయకమైన నమ్మకాలతో బ్రతుకుతున్నారు.
(23:39) కానీ దయచేసి ఒక విషయం అర్థం చేసుకోండి. మన ఋషులు మరియు వేద పండితులు ఏ రూపం లేని ఎటువంటి ఆకారం లేని ఎటువంటి మన ఇంద్రియాలతో మనం గ్రహించలేనటువంటి ఆ బ్రహ్మాండమైన కాస్మిక్ శక్తి రూపాలకు కేవలం ఒక ఆకారాన్ని ఇచ్చారు. ఒక పసిబిడ్డకు పాఠాలు నేర్పించడానికి మనం అ ఈ అనే ఓనమాలు ఎలా నేర్పిస్తామో ఇది కూడా అంతే. ఆ ఓనమాలు కేవలం జ్ఞానాన్ని గ్రహించడానికి ఒక సాధనాలు మాత్రమే.
(24:05) అలాగే ఆ నిరాకారమైన అనంతమైన విశ్వశక్తిని సామాన్య మానవుడికి పరిచయం చేయడానికి ఆ శక్తికి ఒక ఆకారాన్ని ఇచ్చి ఒక కథగా మార్చి మన ముందు ఉంచారు. అంతేగాని ఆ ఆకారాలను పట్టుకొని విగ్రహాలను చూసి వాళ్లే నిజమైన రూపాలు అని అనుకోవడం మాత్రం మీ అమాయకత్వం. మీరు మీ బేసిక్ మరియు ప్రథమ ఓనమాలు స్థాయి నుండి బయటకు రావాలి.
(24:29) ఆ అక్షరాల వెనకాల ఉన్న ఆ విగ్రహాల వెనకాలో ఉన్న అసలైన పరమార్థం తెలుసుకోవాలని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సనాతన ధర్మం అనేది విగ్రహాల దగ్గర ఆగిపోయేది కాదు అది విగ్రహం నుండి మొదలై మీ లోపల ఉన్న బ్రహ్మాండాన్ని వెతికే ప్రయాణం. యోగ వాశిష్టంలో వశిష్ట మహాముని శ్రీరాముడికి ఇదే విషయం చెబుతాడు. భౌతికమైన రూపాల కంటే నీ లోపల ఉన్న చైతన్యాన్ని తెలుసుకోవడమే అసలైన జ్ఞానం అని వివరిస్తాడు.
(24:54) రూపం అనేది ఒక పడవ లాంటిది దాన్ని వాడి నదిని దాటాలి కానీ ఆ పడవనే పట్టుకొని నదిలోనే ఉండిపోకూడదు. మీరు ఒక అద్భుతమైన యంత్రం లాంటివారు మీ మెదడులోని శివుడిని మీ నరాల్లో ప్రవహించే పార్వతిని మీ బుద్ధిలోని వినాయకుడిని మీ ఆచరణలోని కార్తికేయుడిని మేలుకొల్పండి. సనాతన ధర్మం అంటే మూఢ నమ్మకాలు కాదు. అది అడ్వాన్స్డ్ క్వాంటం సైన్స్ మరియు పర్ఫెక్ట్ సైకాలజీ.
(25:18) యాంటీ హిందూయిజం లేదా యాంటీ సనాతన ధర్మం ప్రచారం చేసేవారు. మన దేవుళ్ళను హేళన చేసేవారు ముందు ఈ సైన్స్ ని అర్థం చేసుకోవాలి. మీరందరూ ఈ అనంతమైన జ్ఞానాన్ని గ్రహించి ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సత్యం ఎప్పుడూ కఠినంగానే ఉంటుంది. కానీ అది మిమ్మల్ని స్వతంత్రులను చేస్తుంది. ఇలాంటి మరింత లోతైన సైంటిఫిక్ విశ్లేషణల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
(25:44) మరియు ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేసి సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పండి. ధన్యవాదాలు. మీకు నా వీడియో అండ్ నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ రెగ్యులర్ గా నా వీడియో అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ టాపిక్ మీద మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి.
(26:11) మీకు నా వీడియో అండ్ నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లైతే ప్లీజ్ లైక్ అండ్ షేర్. రెగ్యులర్ గా నా వీడియో అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా నా YouTube ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కన కనిపిస్తున్న గంట సింబల్ ని నొక్కినట్లయితే నేను ఎప్పుడు నా కొత్త వీడియోని అప్లోడ్ చేసినా అది మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్ కి వస్తుంది.
(26:33) థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థాంక్యూ ఆల్.
No comments:
Post a Comment