Friday, July 17, 2026

 *సద్గురువు - శిష్యుల న్యాయాలు:-*
❤️🕉️❤️

 *✨1. విహంగ న్యాయం:-*

 *పక్షి గుడ్లను పెట్టి పొదిగి తన రెక్కల స్పర్శ చేత గుడ్లను పిల్లలుగా చేస్తుంది.*

 *అలాగే సద్గురువు తన 'స్పర్శ' చేత శిష్యునికి ఆత్మజ్ఞానాన్ని అందిస్తాడు.( స్పర్శ ప్రేమ మయంగా ఉండవచ్చు లేదా కొట్టవచ్చు కూడా)*

✨⚡✨⚡✨⚡

*✨2. భ్రమర కీటక న్యాయం:-*

 *భ్రమరం ఒక కీటకాన్ని తెచ్చి దాని చుట్టూ తిరుగుతూ 'ఝుంకార' శబ్దం చేస్తుంది. అప్పుడు ఆ కీటకము ఝుంకారము వల్ల భ్రమరంగా మారిపోతుంది.అలాగే సద్గురువు శిష్యునకు 'వాక్కు' ద్వారా బోధ చేస్తూ తన వలే తయారు చేస్తాడు.( వాక్కు మధురం గా ఉండవచ్చు లేదా తిట్టవచ్చు )*

✨⚡✨⚡✨⚡

*✨3. మీన న్యాయం :-*

*చేప గుడ్లను పెట్టి వెనకకు తిరిగి వాటిని తీక్షణం గా చూస్తుంది.  తల్లి చేప దృష్టి సోకగానే గుడ్లు పిల్లలు గా మారుతాయి.*

 *ఇదేవిధంగా సద్గురువు కరుణామృత 'దృష్టి' ప్రసరించడం వల్ల శిష్యుడు జ్ఞాన పరిపుష్టి పొందుతాడు.*

✨⚡✨⚡✨⚡

*✨4. తాబేటి తలపు న్యాయము :-*

 *తాబేలు ఒకచోట గుడ్లు పెట్టి ఆహారానికి వెళుతుంది.  ఆ గుడ్లు పిల్లలు కావాలని 'సంకల్పిస్తుంది '. ఆ సంకల్పబలంతో ఆ గుడ్లు పిల్లల గా తయారవుతాయి.*

 *అలాగే శిష్యుడు ఎక్కడ ఉన్నా అతను పర బ్రహ్మ జ్ఞానాన్ని పొందాలి, పరమార్థ జ్ఞానాన్ని చేరాలి అని 'సంకల్పిస్తారు'. ఆ దివ్య సంకల్పంతో శిష్యుడు అభివృద్ధి పొంది పరమార్ధం పొందుతారు.*
*ఆధ్యాత్మిక కుటుంబం*                        

No comments:

Post a Comment