Friday, July 17, 2026

 *_శ్రీరమణీయం_*

🕉🌞🌎🌙🌟🚩

*_విశ్వాసం కలిగి ఉంటే దైవదర్శనం అవుతుందని అని అంటుంటారు.. అందులో వాస్తవం ఎంత ఉంది !?"_*

*_మనకంటే ఉన్నతమైన వస్తువుపట్ల విశ్వాసం వుండటం మంచిదే. దేనిపై విశ్వాసం ఉంచుతున్నామనేది కాదు, అసలు విశ్వాసమే గొప్పది.*

*విశ్వాసం వల్ల వినయం అలవడుతుంది. వినయం నుండి  మనసుకు ప్రతిస్పందనలు తగ్గుతాయి. అప్పుడు మనసు సత్యాన్ని సులభంగా అర్థం చేసుకుంటుంది.*

*దైవం అంటే ఏమిటో తెలుసుకోవాలంటే మనసుకు ప్రతిస్పందనలు తగ్గటం చాలా అవసరం. అందుకు విశ్వాసం కొంత సహకరిస్తుంది. దైవాన్ని నమ్మినా నమ్మకపోయినా పెద్దలు సూచించిన ధర్మజీవన విధానం మనకు మేలు చేస్తుందనే విశ్వాసం వల్ల దాన్ని అనుసరించి ఫలాలను పొందే అవకాశం ఉంటుంది.*

*మనం మన మనసును గమనిస్తూ సరిచేసుకుంటే ఎలాంటి ఫలితం ఉంటుందో, ధర్మాన్ని ఆశ్రయించి దాన్ని అనుసరిస్తూ జీవిస్తే అదే ఫలితం ఉంటుంది.*

*మన మనస్తత్వ సామర్ధ్యాన్ని బట్టి ఏ విధానమైనా ఇచ్చే ఫలితం ఇదే ! తాత్కాలిక సుఖశాంతుల కోసం శాశ్వత శాంతిని ఫణంగా పెట్టకుండా చూసుకుంటే చాలు !_*

*_{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం}"_*
*_"సృష్టి నీ ఉనికిని తెలుపుతుంది.. నీవు నీ స్వరూపం తెలుసుకో..!"_* *_[అధ్యాయం -102]*

🕉🌞🌎🌙🌟🚩

No comments:

Post a Comment