సృష్టి ధర్మం ముందు పాపం పుణ్యం మాయేనా? | ఆహారం, జీవహింస & అద్వైత సత్యం | Part-3
Author Name:Dr_Pasupathi_Raj_Gurejala
Youtube Channel Url:https://www.youtube.com/@Dr_Pasupathi_Raj_Gurejala
Youtube Video URL:https://www.youtube.com/watch?v=0QdBR-fJwZg
Transcript:
(00:00) సృష్టి ఒక అంతు చిక్కని మహా రహస్యం మనం తినే ఆహారం వెనుక దాగిన జీవహింస. పాపపు పుణ్యాల గురించి జరుగుతున్న ఈ మేధోమధనంలో ఇది మూడవ మరియు ఆఖరి భాగం మీకు ముఖ్యమైన విన్నపం ఒకవేళ మీరు ఈ సిరీస్ లోని మొదటి రెండు భాగాలు చూడకపోతే దయచేసి వెంటనే వెళ్లి ముందుగా ఆ వీడియోలను చూడండి. సృష్టి పుట్టుక ఆధునిక భౌతిక శాస్త్రం జీవ పరిణామ క్రమం మరియు మన ప్రాచీన పురాణాలు వేదాలు చెబుతున్న అద్భుతమైన సత్యాలను ఆ రెండు భాగాలలో మనం ఎంతో లోతుగా విశ్లేషించాము.
(00:34) ఆ వైజ్ఞానిక మరియు ఆధ్యాత్మిక పునాది లేకుండా నేరుగా ఈ మూడవ భాగాన్ని చూస్తే మీరు నేను చెప్పే అసలైన సత్యాన్ని పూర్తిగా గ్రహించలేరు. దయచేసి వాటిని చూసిన తర్వాతే ఈ వీడియోను కొనసాగించండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అద్భుతమైన సత్యాన్వేషణలో మన ఆఖరి అంకాన్ని మొదలు పెడదాం. మరి ఇంకెందుకు ఆలస్యం లేడీస్ అండ్ జెంటిల్మెన్ యువర్ అటెన్షన్ ప్లీజ్ దిస్ ఇస్ డాక్టర్ పశుపతి రాజ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్.
(01:06) మనం మొదటి భాగంలో సవివరంగా చర్చించుకున్నట్లుగా కానిబెలిజం లేదా మనిషిని మనిషి తినడం అనేది మానవజాతి మనుగడకే కాకుండా జీనశాస్త్రపరంగా కురు లాంటి వ్యాధుల ద్వారా ఎంత ప్రమాదకరమో క్లియర్ గా తెలుసుకుందాం. అయితే అదే సృష్టి ధర్మం కోణంలో ఇక్కడ ఇంకొక విషయాన్ని పరిశీలిద్దాం. కాశీ లాంటి పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో అఘోరాలు కాలుతున్న శవాల నుండి సగం కాలిన మాంసాన్ని తింటారు కదా.
(01:32) మరి దీన్ని సృష్టి ధర్మం కోణంలో ఎలా అర్థం చేసుకోవాలి అఘోరాలు శవాల మాంసాన్ని తినడం అనేది వారి ఆకలిని తీర్చుకోవడానికి లేదా ప్రోటీన్లు పొందడానికి చేసే దైనందిన ఆహార ప్రక్రియ ఏమాత్రం కాదు అది కేవలం ఒక అత్యంత తీవ్రమైన ఆధ్యాత్మిక సాధనలో భాగం మాత్రమే సృష్టిలో ఉన్న ప్రధానమైన పాశాలను అనగా భయం అసహ్యం సిగ్గు మోహం లాంటి వాటన్నింటిని పూర్తిగా జయించడానికి ఈ కఠినమైన మార్గాన్ని ఎంచుకుంటారు.
(01:59) ఆ రుచికరమైన పరమాన్నం మరియు ఈ కుళ్లిపోయిన శవం రెండు ఆ పరమ శివుని ప్రతిరూపాలే అని వారు బలంగా నమ్ముతారు సృష్టిలో దేనిపైన ఏమాత్రం అసహ్యం లేకుండా సంపూర్ణమైన సమదృష్టిని సాధించడమే వారి అసలైన లక్ష్యం అఘోరాలు ఎవరిని బతికుండగా వేటాడి చంపరు వారు కేవలం చనిపోయి వదిలేసిన మరియు కాలుతున్న శవాల భాగాలను మాత్రమే స్వీకరిస్తారు. దీనివల్ల మానవజాతి మనుగడకు ఎలాంటి ముప్పు రాదు.
(02:24) వారు మానవ సమాజం అనే గొలుసులో నుండి ఎప్పుడో బయటకు వెళ్ళిపోయారు. అఘోరాలు తినేది పచ్చి మాంసం కాదు. వారు ఎంతో వేడి ఉన్న చితి మంటల్లో సగం కాలిన శరీర భాగాలను స్వీకరిస్తారు. ఆ భయంకరమైన మంటల వేడికి అందులో ఉన్న చాలా వరకు వైరస్లు మరియు బ్యాక్టీరియాలు నశించిపోతాయి. అయినప్పటికీ వారు ఏమి రోగాలు రాని అమరులు కారు. కాకపోతే వారు తమ భౌతిక శరీరం గురించి మరియు తమ ఆయుష్యు గురించి ఏమాత్రం ఆలోచించరు.
(02:52) శరీరం అనేది ఎప్పుడో ఒకప్పుడు మట్టిలో కలిసిపోయే ఒక పనికి రాని వాహనం అని వారు బలంగా నమ్ముతారు. అందువల్ల అఘోరాలు శవాలను తినడం అనేది నరమాంస భక్షణ కిందకు రాదు. అది కేవలం దేహంపై ఉన్న మమకారాన్ని చంపుకోవడానికి వారు చేసే ఒక తాంత్రిక ప్రక్రియ మాత్రమే. మనం రెండో భాగంలో మాట్లాడుకున్నట్లుగా కేవలం శాఖహారం తిన్నంత మాత్రాన ఎవరు అమరులు కారు.
(03:17) శాఖహారం తినేవాడికి ఏమైనా బీపి షుగర్ క్యాన్సర్ రాకుండా ఉంటున్నాయా లేకపోతే మాంసం తినేవాడికి మాత్రమే అవి వస్తున్నాయా అలా ఏం లేదు కదా ఆధునిక వైద్యశాస్త్రం మరియు హాస్పిటల్స్ లోని రికార్డులను తీసి చూస్తే శాఖహారులు నమ్ముతున్న ఈ పిచ్చి నమ్మకం ఎంత పెద్ద అబద్ధమో స్పష్టంగా బయటపడుతుంది. కేవలం శాఖహారం మాత్రమే తినే లక్షలాది మంది ప్రజలకు ఈ రోజు చిన్న వయసులోనే భయంకరమైన గుండె జబ్బులు వస్తున్నాయి.
(03:42) కేవలం ఆకుకూరలు మరియు పండ్లు తినేవారికి కూడా ప్రాణాంతకమైన కాన్సర్ వ్యాధులు వస్తున్నాయి. మరోవైపు రోజు మాంసాహారం తినే ఎంతో మంది వ్యక్తులు ఎలాంటి గుండె జబ్బులు లేకుండా 80 ఏళ్ళు ఎంతో ఆరోగ్యంగా జీవిస్తున్నారు. ఒక మనిషి యొక్క ఆయుష్యు లేదా అతనికి వచ్చే రోగాలు కేవలం అతను తినే శాకాహారం లేదా మాంసాహారం మీద ఏమాత్రం ఆధారపడి లేవు.
(04:06) అసలైన కారణాలు అతని జన్యువులు, మానసిక ఒత్తిడి. అతను పీల్చే కలుషితమైన గాలి మరియు శారీరక శ్రమ లేకపోవడం. చావు ఎవరిని వదిలిపెట్టదు. కాబట్టి ఈ శాఖహారం తినేవాళ్ళు తామేదో పవిత్రులమని భావించడం వారి అజ్ఞానానికి నిదర్శనం. ఆహారం అనేది కేవలం ఈ భౌతిక దేహాన్ని నడపడానికి ఉపయోగపడే ఇంధనం మాత్రమే. రోగం అనేది రావాలి అని రాసిపెట్టి ఉంటే నువ్వు ప్రతిరోజు క్యారెట్లు తిన్నా వస్తుంది.
(04:32) లేదా మేకకాలు తిన్నా వస్తుంది. ఎందుకంటే సృష్టిలో వ్యాధి మరియు మరణం అనేవి పక్షపాతం లేనివి. దానికి శాఖహారులు అనే స్పెషల్ రిజర్వేషన్ ఏమీ ఎక్కడా లేదు. ఇది ప్రతి ఒక్కరు కళ్ళు తెరిచి గ్రహించాల్సిన మహా సత్యం. ఇక్కడ మీకందరికీ ఒక అత్యంత సహజమైన మరియు బలమైన సందేహం రావచ్చు. శాకాహారం తిన్నా లేదా మాంసాహారం తిన్నా ఒకే రకమైన జబ్బులు ఎందుకు వస్తున్నాయి.
(04:57) పవిత్రంగా ఆకులు కూరగాయలు తినేవాళ్ళు ఎక్కువ కాలం బ్రతకడం. మాంసం తినేవాళ్ళు త్వరగా చనిపోవడం లాంటివి ఏమీ జరగట్లేదు కదా. మరి ఆహారంతో సంబంధం లేకుండా ఈ రోగాలు ఎలా వస్తున్నాయి? అని మీరు ఖచ్చితంగా ప్రశ్నించవచ్చు. ఇదొక్కటే కాదు అన్యం పుణ్యం ఎరుగని పసిపిల్లలకు కూడా భయంకరమైన క్యాన్సర్లు వైద్యశాస్త్రానికి సైతం అంతుచిక్కని రోగాలు ఎందుకు వస్తున్నాయి అసలు ఏ పాపం చేయని ఆ పసివాళ్ళకు సృష్టి ఎందుకు అంత కఠినమైన శిక్ష వేస్తోంది దీనికి మీ వద్ద ఉన్న సమాధానం ఏమిటి అని కూడా మీరు అడగవచ్చు ఈ ప్రశ్నలన్నింటికీ సృష్టి దగ్గర ఉన్న ఏకైక సమాధానం కర్మ సిద్ధాంతం మనిషి ఈ
(05:34) జన్మలో అనుభవించే సుఖ దుఃఖాలు మరియు రోగాలు గత జన్మల తాలూకు కర్మఫలాలుగా ఎలా వెంటాడు డతాయి అనేది ఆ కర్మ సిద్ధాంతం అత్యంత లోతుగా వివరిస్తుంది. అయితే ఈ వీడియో సిరీస్ లో ఆ కర్మ సిద్ధాంతాన్ని నేను ఏమాత్రం ఇన్వాల్వ్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే అది ఒక మహాసముద్రం లాంటి సెపరేట్ కాన్సెప్ట్ ఒక సపరేట్ సిద్ధాంతం. దాని గురించి ఇక్కడ చర్చిస్తే సృష్టి మరియు ఆహార నియమాల గురించిన మన అసలైన టాపిక్ దారి మళ్ళుతుంది.
(06:04) కాబట్టి ఆ కర్మ సిద్ధాంతం అనే మహా రహస్యం గురించి మరొక ప్రత్యేకమైన వీడియోలో మనం ఖచ్చితంగా మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి మన ఫోకస్ అంతా సృష్టి ధర్మం మరియు దాని లోతైన వాస్తవాల మీదే ఉంచుదాం. శాఖాహారులు చేసేది జీవహింసే మరియు మాంసాహారులు చేసేది కూడా కచ్చితంగా జీవహింసే. ఎవరిని హింసించకుండా ఈ భూమి మీద ఏ ఒక్క మనిషి ఒక్క రోజు కూడా బతకలేడు.
(06:28) కాబట్టి మేమే గొప్ప పుణ్యాత్ములమనే ఈ కపట నైతికతను పక్కన పెట్టి అసలైన బ్రహ్మ సత్యాన్ని చూడాలి. ఇక్కడే మనం ఒక నగ్న సత్యాన్ని మాట్లాడుకోవాలి. కంచంలో మాంసం లేనంత మాత్రాన మీ చేతులకు రక్తం అంటనట్టేనా ఆకలితో ఆహారం కోసం చేసే వేటను హింస అంటున్న మీరు మీ అహాన్ని సంతృప్తి పరుచుకునే విలాసాల గురించి ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా కొందరు ప్రముఖులు ఒకప్పుడు మాంసాహారం తినేవాళ్ళం కానీ ఇప్పుడు మూగజీవుల మీద ప్రేమతో పూర్తిగా శాఖాహారులుగా మారిపోయామని చాలా గర్వంగా చెబుతుంటారు.
(07:00) ప్రాణుల పట్ల వాళ్ళు చూపిస్తున్న ఈ ప్రేమ నిజంగా చూడడానికి గొప్పగానే ఉంటుంది. కానీ భౌతిక దేహాన్ని నిలబెట్టే ఆహారానికి కాకుండా కేవలం దర్పం కోసం నీలోని వికృతమైన సాడిజం కోసం వేలు లక్షలు పోసి కొనే ఖరీదైన లెదర్ బట్టల కోసం బ్యాగుల కోసం షూస్ బెల్టులు పరుసులు వంటి ఎన్నో వస్తువుల కోసం ఎన్నో మూగజీవుల చర్మాన్ని అత్యంత కిరాతకంగా వలుస్తున్నారు అనే కనీస స్పృహ ఈ మేధావులకు లేదా ఏనుగు దంతాల కోసం ఆ మహాగజాలను చంపడం ఖడ్గ మృగాల కొమ్ముల కోసం పులుల చర్మాల కోసం ఆయా జాతులు పూర్తిగా గా అంతరించిపోవడానికి కారణమయ్యే క్రూరమైన మనుషులు ఉన్నారు చూడండి. వాళ్ళు పాల్పడేది అసలైన జీవహింస.
(07:40) ఆధునిక కన్జర్వేషన్ బయాలజీ ప్రకారం ఆకలి కోసం ఇంకో జీవిని చంపితే అది ఫుడ్ వెబ్ లో ఒక భాగం. ప్రకృతిలో నిరంతరం జరిగే ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఇది. కానీ ఇలా విలాసాల కోసం అల్ప సంతోషం కోసం వేటాడితే అది పర్యావరణ వ్యవస్థల సమూల నాశనానికి అనగా ఎకలాజికల్ కొలాప్స్ కి దారి తీస్తుంది. తినడానికి ఒక ప్రాణిని చంపడం మహా పాపంని భావిస్తూనే తమ స్టేటస్ కోసం ఇంకో ప్రాణి చర్మాన్ని వస్తువులుగా వాడుకోవడం మనసుకు చాలా బాధ కలిగించే ద్వంద్వ వైఖరి.
(08:12) ఈ విషయమై పవిత్రమైన భగవద్గీత 16వ అధ్యాయం దైవాసుర సంపద్ విభాగ యోగంలో శ్రీకృష్ణ పరమాత్మ రాక్షస ప్రవృత్తి ఉన్నవారి గురించి అద్భుతంగా వివరించాడు. అహంకారం బలం దర్పం కామం, క్రోధం చ సంశ్రితః మామాత్మ పరదేహేషు ప్రద్విషంతోభ్యసూయకాహ అని భగవానుడు స్పష్టంగా పలికాడు. అహంకారం దర్పం తీరని కోరికలు మరియు కోపంతో నిండిన వారు తమ శరీరంలోనూ మరియు ఇతర ప్రాణుల శరీరాల్లోనూ ఉన్న పరమాత్మను ద్వేషిస్తూ ఉంటారని దీని అర్థం.
(08:46) తమ ఆడంబరం కోసం దర్పాన్ని ప్రపంచం ముందు చాటి చెప్పాలనే అహంకారంతో మూగజీవుల ప్రాణాలు తీసే ఆ విలాసవంతమైన మనుషులది రాక్షస ప్రవృత్తి అని గీత ఘోషిస్తోంది. ఇది మాత్రమే కాదు ఒక మనిషి భౌగోళిక సరిహద్దుల కోసం రాజకీయ అధికార దాహం కోసం ఇంకొక దేశం మీద పైచేయి సంపాదించడానికి సైనికుల ప్రాణాలను పణంగా పెట్టి దేశాల మధ్య భయంకరమైన యుద్ధాలు చేస్తాడు. ఇది అసలైన జీవహింస.
(09:11) ఇది అత్యంత కిరాతకమైన మానవ తప్పిదం. ఆకలి కోసం జరిగే వేట ప్రకృతి ధర్మం అయితే అహంకారం కోసం జరిగే యుద్ధం ప్రకృతి వినాశనం సామాన్యుడు కూడా తనకు సులభంగా జీర్ణమై తనకు బలాన్ని మరియు శక్తినిచ్చే ఆహారాన్ని ఇతరులపై ద్వేషం లేకుండా తనపై అహంకారం లేకుండా స్వీకరించి ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పడమే వాస్తవమైన ప్రాథమిక ధర్మం ముస్లింలు మేము ఆవును తింటాము అప్పుడు ఆవులు తింటే తప్పేంటి అని అంటారు.
(09:40) సృష్టి దృష్టిలో ఆవు రక్తమైన మరియు మేక రక్తమైన ఒకటే కానీ మనిషి సమాజం అనేది కృతజ్ఞత మరియు సంస్కృతి అనే పునాదుల మీద అత్యంత పవిత్రంగా నిర్మించబడింది. భారతదేశంలో ఆవు వేలాది సంవత్సరాలుగా భారతీయ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు మరియు మానవ మనుగడకు అతి పెద్ద వెన్నెముక. తల్లి పాలు తాగిన తర్వాత మనిషికి మళ్ళీ జీవితాంతం పాలు ఇచ్చి ఒక తల్లిలాగా పోషించే ఏకైక ప్రాణి ఈ భూమి మీద ఆవు మాత్రమే.
(10:09) తన రక్తాన్ని పాలుగా మార్చి ఒక విశాలమైన మానవజాతిని ఎన్నో యుగాలుగా పోషించిన ఒక ప్రాణిని కేవలం ఒక పూట కడుపులోని ఆకలి కోసం చంపి తినడం అనేది కృతజ్ఞత లేని మహా మృగత్వం అవుతుంది అని మన ప్రాచీన ఋషులు భావించారు. ఆ కృతజ్ఞత భావంతోటే దానిని గోమాతగా మరియు దేవతగా పూజించారు. ముస్లిం సోదరులు అరబ్ ఎడారుల నుండి వచ్చారు కాబట్టి అక్కడ వారికి ఆవులు లేవు.
(10:35) కానీ వ్యవసాయం మీద ఆధారపడిన భారత దేశంలో ఆవు ప్రాముఖ్యత అత్యంత ఉన్నతమైనది కాబట్టి ఆవుని తినడం అనేది కేవలం ఫుడ్ చైన్ కాదు అది మనల్ని బ్రతికించిన ఒక వ్యవస్థను నాశనం చేయడమే అని వారికి లాజికల్ గా వివరించాలి మనం మొదటి భాగంలో సవివరంగా మాట్లాడుకున్నట్లుగా శరీర పరిమాణం మరియు నాడీ వ్యవస్థ అభివృద్ధిని బట్టి ప్రాణాల విలువలు నిర్ణయించబడతాయి. ఆ విధంగా చూస్తే ఆవుకు అద్భుతమైన జ్ఞాపక శక్తి ఉంటుంది.
(11:02) తన బిడ్డ పట్ల అత్యంత లోతైన మాతృత్వపు భావనలు ఉంటాయి. అత్యున్నతమైన చైతన్యం ఉన్న జంతువును హింసించడం వల్ల ప్రకృతిలో అత్యంత నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా విడుదల అవుతుంది. ఒక సమాజంలో బతుకుతున్నప్పుడు తోటి మనుషుల అత్యంత సున్నితమైన నమ్మకాలను గౌరవించడం అనేది కనీస మానవ ధర్మం. ఒక ఆవును తినకపోవడం వెనుక ఉన్న కృతజ్ఞతా భావం ఉన్నతమైనది.
(11:23) కానీ మనిషి తన దేహానికి అవసరమైన పోషకాల కోసం కోడి లేదా మేక లాంటి జంతువులను ఆహారంగా స్వీకరించడం అనేది ఒక జీవశాస్త్రపరమైన ప్రాథమిక హక్కు. హిందూ ధర్మం ఈ జంతువులను పూజించడం వెనుక ఉన్న అసలైన పరమార్థం ఆ జంతువులను వధించకూడదు అని కాదు ఈ అనంతమైన మహా విశ్వంలో ఉన్న ప్రతి చిన్న అణువులోనూ ఆ భగవంతుని వనికి ఉంది అని లోకానికి చాటి చెప్పడమే దాని అసలైన ఉద్దేశ్యం.
(11:51) మనం రెండవ భాగంలో లోతుగా విశ్లేషించిన అద్వైత సిద్ధాంతం ప్రకారం గుడిలో ఉన్నది దేవుడే మురికి గుంటలో పడి ఉన్న పందిలో ఉన్నది ఆ పరమాత్మే భయంకరమైన విషం కక్కే పాములో ఉన్నది కూడా ఆ దేవుడే అని నిరూపించడానికే ఈ అవతారాలు సృష్టించబడ్డాయి కానీ దేవుడు అన్నింటిలో ఉన్నాడు కదా అని ప్రకృతి తన భౌతిక నియమాలను ఏమాత్రం మార్చుకోదు. ఆకాశంలో ఎగిరే గరుత్మంతుడు నేల మీద ప్రాకే పామును అత్యంత క్రూరంగా వేటాడి తింటుంది.
(12:17) మరి రెండు పవిత్రమైన దేవుడి స్వరూపాలే అయినప్పుడు ఒక దేవుడి వాహనం ఇంకొక దేవుడి ఆభరణాన్ని ఎందుకు అంత క్రూరంగా చంపి తింటుంది ఎందుకంటే శ్రీమద్భాగవతం మొదటి స్కంధంలో చెప్పినట్లుగా అహస్తాని సహస్త్రా నామపదాని చతుష్పదాం ఫల్గూని తత్రమహతాం జీవో జీవస్య జీవనం చేతులు లేని ప్రాణులు చేతులు ఉన్నవాటికి కాళ్ళు లేనివి నాలుగు కాళ్ళు ఉన్నవాటికి ఆహారం అవుతాయి.
(12:43) ఒక జీవి మరొక జీవికి ఆహారం అవ్వడమే ఈ సృష్టి చక్రం పూజించడం అనేది ఒక మనిషి యొక్క సంస్కృతి కానీ ఆకలి కోసం వేటాడటం అనేది సృష్టి యొక్క ఎవరు మార్చలేని నియమం సృష్టిలో భూగోళం అంతా ఒకే రకమైన వాతావరణం అస్సలు లేదు కాబట్టి భూమి మీద నివసించే మనుషులందరికీ ఒకే రకమైన ఆహార నియమాలు ఎన్నటికీ వర్తించవు. మంచు ఖండాలలో బతికే ఎస్కీమోలు ఎప్పుడూ పచ్చని ఆకులు పండించుకొని తినలేరు.
(13:13) వారు సీల్ చేపలను మరియు ఇతర సముద్ర జీవులను చంపి తింటేనే వారికి ఆ భయంకరమైన చలిలో ప్రాణాలు నిలబెట్టుకోవడానికి అవసరమైన క్యాలరీలు దొరుకుతాయి వాళ్ళకు వెళ్లి మీరు ఇలా మాంసం తినడం ఘోరమైన పాపం అని చెప్పడం ఎంత పెద్ద మూర్ఖత్వం అవుతుంది మన సంస్కృతిలో పంది అనేది వరాహ అవతారం కావచ్చు కానీ ఒక చైనా వాడికి అది కేవలం తన కడుపు నింపే ఒక ప్రోటీన్ ముక్క మాత్రమే మన సంస్కృతిలో కుక్క అనేది భైరవుడు కావచ్చు కానీ కొరియా దేశంలో అది వారికి దొరికే ఒక సహజమైన ఆహారం పరిణామ క్రమంలో కొన్ని తెగలు తమ ప్రత్యేకమైన ఆహారపు అలవాట్ల వల్లే మనుగడ సాగించగలిగాయి. ఆహారం అనేది కేవలం
(13:49) బతకడానికి మాత్రమే కాదు ఒక మనిషి యొక్క సంస్కృతికి మరియు ఆచారాలకు నిదర్శనం. ఒకరు తినే ఆహారాన్ని మన నమ్మకాలతో పోల్చి వాళ్ళు దారుణమైన పాపాలు చేస్తున్నారు అనుకోవడం ఒక భ్రమ. సృష్టి దృష్టిలో అంటార్కిటికాలో సీల్ చేపను చంపిన, చైనాలో కుక్కను చంపిన, ఇండియాలో కోడిని చంపిన, అదంతా కేవలం శక్తి మార్పిడి ప్రక్రియే. దేవుడు నేను కేవలం భారతదేశంలో పండే సాత్విక ఆహారాన్ని మాత్రమే అరిగిస్తాను అని ఎక్కడా చెప్పలేదు కదా భగవద్గీత 15వ అధ్యాయంలో భగవానుడు అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం అని అన్నాడు. నేనే
(14:30) సమస్త జీవుల దేహాల్లో జటరాగ్ని రూపంలో ఉండి మీరు తినే నాలుగు విధాలైన ఆహారాన్ని అరిగిస్తున్నాను అని సాక్షాత్తు ఆ కృష్ణుడే స్పష్టం చేశాడు. ఇక్కడ ఇంకొక అద్భుతమైన లాజిక్ మనం మాట్లాడుకోవాలి. మన పురాణాలలో లేదా మనుస్మృతి లాంటి ధర్మశాస్త్రాలలో కొన్ని ప్రత్యేకమైన జంతువుల పేర్లు చెప్పి వాటిని మాత్రమే ఎందుకు తినకూడదు అని ఖచ్చితంగా నిషేధించాయో ఆలోచించండి.
(14:56) కుక్కను పందిని లేదా కొన్ని రకాల పక్షులను తినకూడదు అని గ్రంథాలలో ఎందుకు రాశారు దీని వెనుక ఏదో మతపరమైన పట్టింపు అస్సలు లేదు. దీని వెనుక ఒక గొప్ప మెడికల్ సైన్స్ దాగి ఉంది. ప్రాచీన కాలంలోనే మన మహర్షులు పబ్లిక్ హెల్త్ లేదా ప్రజారోగ్యం గురించి ఎంతో లోతుగా ఆలోచించారు. కుక్కలు, పందులు, గ్రద్దలు, కాకులు లాంటివి స్కావెంజర్స్ అంటే సమాజంలో ఉన్న చెత్తను కుళ్లిపోయిన పదార్థాలను మలినాలను తిని ప్రకృతిని శుభ్రం చేసేవి.
(15:26) వాటి మాంసం తింటే మనుషులకు భయంకరమైన రోగాలు వస్తాయి. ప్రాణాంతకమైన పారాసైట్స్ అత్యంత సులభంగా మనుషులకు వ్యాపిస్తాయి. అదే మేక గొర్రె లేదా చేప లాంటివి సురక్షితమైనవి. వాటి మాంసం మనుషుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వైద్యశాస్త్రంలో ఆరోగ్యపరంగా ప్రాణాలను రక్షించే మందుల తయారీలో ఒక జీవి ప్రాణం ఉపయోగపడి ఇంకొక జీవి ప్రాణాన్ని నిలబెట్టడంలో ఎప్పుడూ జీవహింస జరగదు.
(15:50) ప్రాచీన ఆయుర్వేదంలో కూడా మహర్షులు, సుశృతుడు మరియు చరకుడు ఎన్నో భయంకరమైన వ్యాధులకు జంతు సంబంధిత ఔషధాలను అనగా మాంస రసాలను ప్రాణ రక్షణ కోసం సూచించారు. ప్రాణం నిలబెట్టేది అమృతం అవుతుంది. కానీ పాపం ఎలా అవుతుంది? అందుకే ఏ జంతువును పడితే ఆ జంతువును తినకుండా మనిషిని నిరోధించడానికి ఏవి తింటే ఆరోగ్యానికి ప్రమాదమో వాటి పేర్లు ఖచ్చితంగా గ్రంథాలలో మెన్షన్ చేసి వాటిని తినడం పాపం అని ఒక కఠినమైన రూల్ పాస్ చేశారు అంటే ఇక్కడ పాపం మరియు పుణ్యం అనేది కేవలం మనిషి ఆరోగ్యాన్ని రక్షించడానికి మన పెద్దలు సృష్టించిన ఒక భయం మాత్రమే అంతేకానీ ఒక
(16:27) ప్రాణి గొప్పది ఇంకో ప్రాణి తక్కువది దీన్ని చంపితేనే హింస ఇంకోదాన్ని చంపితే అహింస అని సృష్టి ఎప్పుడు ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదు. సృష్టిలోని ఈ విశ్వ సత్యాన్ని అర్థం చేసుకున్న ఏ చైతన్య పురుషుడైనా ఏ జ్ఞాని అయినా ఈ అసంబద్ధమైన మరియు అర్థం లేని ఆహార విభజనలను ఎన్నటికీ అంగీకరించడు. ఈషావాస్య ఉపనిషత్తు మొదటి మంత్రంలో కదిలే మేకలో కదలని చెట్టులో ఉన్నది ఆ భగవంతుడే అని మనం తెలుసుకోవాలి అని ఘోషిస్తోంది.
(16:56) దీనికి తోడుగా మన తైత్రీయ ఉపనిషత్తు భృగువల్లిలోని ఒక మహా వాక్యాన్ని మనం ఇక్కడ ఖచ్చితంగా స్మరించుకోవాలి. భృగు మహర్షి ఎంతో కఠోరమైన తపస్సు చేసి తెలుసుకున్న మొట్టమొదటి సత్యం అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అనగా అన్నమే బ్రహ్మము అదే ఉపనిషత్తులో అహమన్నం అహమన్నాదో అని సృష్టి ఘోషిస్తోంది. అనగా నేనే ఆహారాన్ని నేనే ఆహారాన్ని తినేవాడిని అని అర్థం.
(17:21) తినేవాడిలో ఉన్నది. తినబడే ప్రాణిలో ఉన్నది ఒకే చైతన్యం అయినప్పుడు అక్కడ పాప పుణ్యాలకు తావు ఎక్కడుంది? ఉన్నతమైన సృష్టి నియమాలకు లోబడి బ్రతికే వారికి జ్ఞాన జ్యోతి వెలిగినప్పుడు ఆహారం అనేది కేవలం ఒక శక్తి రూపాంతరం మాత్రమే అని అత్యంత స్పష్టంగా తెలుస్తుంది. ఏది తిన్నా మన శరీరంలో అది రక్తంగా మాంసంగా జ్ఞానంగా విజ్ఞానంగా ఆలోచనగా ప్రశ్నించే తత్వంగా మారుతుంది.
(17:46) ఆ మారిన తత్వాన్ని సమాజం కోసం ప్రపంచ మేలు కోసం ఉపయోగించడమే మానవ జన్మకు సార్ధకత మూర్ఖంగా మనుగడ కోసం కడుపులోని జఠరాగ్ని చల్లార్చడం కోసం ఆహారాన్ని స్వీకరించడంలో ఎటువంటి జీవహింస ఏ కోసాన లేదు దేవుడు ఆకలిని ఇచ్చాడు. దానిని తీర్చుకునే ఆహారాన్ని ఈ ప్రకృతిలోనే పెట్టాడు. ఆకలిగా మారి ఒక శక్తి నుండి మరో శక్తిగా రూపాంతరం చెంది ఆహారం దగ్గరికి వచ్చే సహజమైన ప్రక్రియను తప్పుబడుతూ మీరు మాట్లాడే నీతులు ఎటువంటి అర్థం లేనటువంటివి సృష్టిలో ప్రాణం లేని ఆహారమే లేదు గాలిలో ప్రాణం ఉంది నీటిలో ప్రాణం ఉంది. మట్టిలో ప్రాణం ఉంది.
(18:22) ప్రతి విత్తనంలో ఒక రేపటి వృక్షం తాలూకు ప్రాణం దాగి ఉంది. ఈ పరమ సత్యాన్ని గ్రహించి సమస్త జీవరాశుల పట్ల ఒకే రకమైన ఎరుకతో జీవించండి. నీ కంచంలో ఉన్న మాంసాన్ని చూసి ముక్కు మూసుకోకు ఆ మాంసాన్ని అరిగించుకునే అద్భుతమైన శక్తిని నీకు ఆ ప్రకృతి ఎప్పుడో ఇచ్చిందని గుర్తించు. జ్ఞాను అనేది నీ ఆత్మకు నీ అంతరాత్మకు సంబంధించింది.
(18:43) అది నీ ఆహారానికి సంబంధించినది అస్సలు కాదు. సకల జీవరాశులలో మనిషి అత్యంత ఉన్నతమైన మేధస్సు మరియు చైతన్యం కలిగిన ఒక గొప్ప ప్రాణి కాబట్టి తోటి మనుషులతో కలిసి శాంతియుతంగా ఒక క్రమశిక్షణతో బతకడానికి సమాజం జంతువుల ప్రపంచంలా మారకుండా ఉండడానికి మనిషి తన విచక్షణతో మంచి చెడు ధర్మం అధర్మం పాపం పుణ్యం అనే కొన్ని కఠినమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్వయంగా ఏర్పాటు చేసుకున్నాడు కానీ ఇక్కడ మనం గ్రహించాల్సిన అసలైన సత్యం ఒకటి ఉంది.
(19:15) ఈ సామాజిక నియమాలు కేవలం మానవ మనుగడ కోసం మరియు మన పరిణామ క్రమం కోసం మాత్రమే పనికొస్తాయి. భగవద్గీత మూడవ అధ్యాయం 27వ శ్లోకంలో శ్రీకృష్ణుడు ప్రకృతేహ క్రియమాణాని గుణైహ కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే అని అత్యంత స్పష్టంగా చెప్పాడు. అనగా సృష్టిలోని ప్రతి పని ప్రకృతి యొక్క నియమాల ద్వారా మాత్రమే నిరంతరం జరుగుతుంది.
(19:41) కానీ అహంకారంతో నిండిన మనిషి మాత్రమే నేనే ఇదంతా చేస్తున్నాను.ఈ ఈ రూల్స్ నేనే పెట్టాను అని భ్రమపడతాడు. మనిషి సృష్టించిన ఈ రూల్స్ కి ఆ విశ్వ శక్తికి ఎలాంటి సంబంధం లేదు. దీన్ని మోడరన్ సైన్స్ మరియు ఆస్ట్రోఫిజిక్స్ కూడా నిర్ద్వంద్వంగా అంగీకరిస్తాయి. లా ఆఫ్ యూనివర్స్ ప్రకారం ఈ విశ్వం కేవలం శక్తి మరియు పదార్థాల మార్పిడి ద్వారా మాత్రమే నడుస్తుంది.
(20:05) అనంతమైన అంతరిక్షంలో ఒక మహా నక్షత్రం పేలిపోయి బ్లాక్ హోల్ గా మారినప్పుడు అక్కడ మనిషి సృష్టించిన ఏ చట్టాలు ఏ రూల్స్ ఏమాత్రం పనికి రావు. విశ్వం దృష్టిలో లా ఆఫ్ ఎనర్జీకి మనిషి తన సౌలభ్యం కోసం పెట్టుకున్న ఈ శాఖహారం, మాంసాహారం, పాపం, పుణ్యం అనే కట్టుబాట్లతో అస్సలు సంబంధం లేదు. ఇదంతా కేవలం ఒక మహాశక్తి యొక్క ఆట మాత్రమే. నేను ఈ విశ్లేషణ చేసింది అజ్ఞానం అనే మాయలో బతుకుతున్న ఒక సగటు మనిషి కోణంలో కాదు.
(20:36) గత భాగాలలో మనం సృష్టి అంతా కేవలం ఒక మహామాయ అని చెప్పుకున్నాం కదా. ఇదంతా ఒక మహామాయ అని తెలుసుకుని ఆ మాయా పొరలను దాటి ఒక ఉన్నతమైన విచక్షణతో కూడిన జ్ఞానంతో చేసిన సత్యాన్వేషణ ఇది. సాధారణమైన మనుషులకి నా విశ్లేషణ కాస్త విరుద్ధంగా లేదా కఠినంగా అనిపించవచ్చు. నేను ఇక్కడ మాంసాహారులను గాని శాఖాహారులను గాని ఎవరిని వ్యక్తిగతంగా సమర్ధించడం లేదు.
(21:00) కేవలం సమాజంలో ఉన్న హిపోక్రసీని ప్రశ్నిస్తున్నాను. సృష్టి అంతా కేవలం ఒక నిరంతర శక్తి మార్పిడి మరియు ఒక గొప్ప అంతిమ సమతుల్యత. ఇదే దైవికమైన అద్వైతం మానవ జన్మ యొక్క అసలైన పరమార్థం కేవలం డబ్బు పదవి వ్యామోహం అనే శాశ్వతమైన సంసార మాయలో చిక్కుకోవడం కాదు ఈ అనంతమైన విశ్వం యొక్క పుట్టుక దాని వెనుక ఉన్న మూల నియమాలు మరియు చైతన్యం అనే గొప్ప రహస్యాన్ని అన్వేషించడమే చూసేది నువ్వే ఆడేది నువ్వే ఆడించేది నువ్వే అనే అద్వైత సత్యాన్ని నువ్వు చేదించనంతవరకు ఈ మాయలో బ్రతుకుతున్నంతవరకు నీకు జన్మ జన్మలు వస్తూనే ఉంటాయి.
(21:36) ఈ శాశ్వతమైన ఆత్మ సత్యాన్ని భగవద్గీత రెండవ అధ్యాయంలో నజాయతే మ్రియతే కదా అజో నిత్యః శాశ్వతోజయం పురాణో అని చెబుతూ ఆత్మకు పుట్టుక మరణం లేవని స్పష్టం చేసింది. దీన్నే మోడరన్ సైన్స్ లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ద్వారా శక్తికి నాశనం లేదని క్వాంటం ఫిజిక్స్ అబ్సర్వర్ ఎఫెక్ట్ ద్వారా భౌతిక పదార్థం కంటే ఈ చైతన్యమే మూలమని నిర్ధారిస్తోంది.
(22:02) ఎప్పుడైతే నీ జ్ఞాన నేత్రంతో ఆ విశ్వ రహస్యాలను గ్రహించి వాటిలో మమేకం అవుతావో అప్పుడే నీకు జన్మ రాహిత్యం సిద్ధిస్తుంది. ఈ అనంతమైన సత్యాన్ని గ్రహించి ఆ పరమాత్మను లేదా విశ్వశక్తిని చేరుకున్న వారికి మళ్ళీ ఈ దుఃఖపూరితమైన సంసారంలో పునర్జన్మ ఉండదని భగవద్గీత ఎనిమిదవ అధ్యాయంలో మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమా శాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాంగతాః అని శ్రీకృష్ణ పరమాత్మ అత్యంత స్పష్టంగా వివరించాడు.
(22:33) ఈ విశ్వ చైతన్యాన్ని అర్థం చేసుకుని అందులో ఏకం కావడమే మానవ జన్మకున్న ఏకైక సార్ధకత సమాజంలో ఎంతో మంది ఎన్నో రకాల ఉచిత సలహాలు ఇస్తుంటారు. ఫలానా గ్రంథాలు మాత్రమే చదవండి అని ఫలానా గురువును మాత్రమే గుడ్డిగా అనుసరించండి అని వారి వ్యక్తిగత అభిప్రాయాలను మన మీద రుద్దే ప్రయత్నం చేస్తారు. నా ఈ విశ్లేషణ కూడా చాలా మందికి అయిష్టంగా ఉండొచ్చు.
(22:57) లేదా వారు దీనిని తీవ్రంగా వ్యతిరేకించవచ్చు. అబద్ధం ఎప్పుడూ తీయగానే ఉంటుంది. కానీ అంతిమ సత్యం అనేది ఎల్లప్పుడూ అత్యంత కఠోరంగా చేదుగా ఉంటుంది. దయచేసి ఒక్కసారి మీ గుడ్డి నమ్మకాలను మూఢ విశ్వాసాలను పక్కన పెట్టి మీ మానవ మేధస్సుకు పదును పెట్టండి. సైన్స్ మరియు ఆధ్యాత్మికత అయిన వేద ఉపనిషత్తుల కలయకలో నా అంతరాత్మ ప్రబోధించిన ఈ లోతైన సత్యాన్ని మీరు గ్రహించిన నాడు మనుషుల మధ్య జరిగే ఈ అర్థం లేని పోరాటాలు పూర్తిగా సమసిపోతాయి.
(23:25) సృష్టిలో జ్ఞానులు ఎంచుకున్న మార్గాలు ఎన్ని వేరైనా వారు చేరే అంతిమ గమ్యం మాత్రం ఒక్కటే మాయా పొరలతో కమ్మబడిన ఈ భౌతిక ప్రపంచపు చీకట్లను చీల్చుకుంటూ ఆ అగ్నికీల లాంటి మహా చైతన్యాన్ని అనగా విశ్వశక్తిని చేరుకోవడమే ప్రతి జీవి లక్ష్యం ఏకం సత్విప్రా బహుదా వదంతి అని మన ప్రాచీన వేదాలు ఘోషించిన పరమ సత్యం ఇదే మీరు ఎంచుకున్న మార్గమే సరైనది అని వేరొకరిది తప్పు అని వాదించడం కేవలం అజ్ఞానానికి నిదర్శనం మాత్రమే ఏ యథా మాం ప్రప ప్రపద్యంతే తాంస్త దైవ భజామ్యహం అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో స్పష్టం చేశాడు.
(24:02) మనుషులు ఏ మార్గం గుండా ప్రయాణించినా చివరికి చేరుకునేది ఆ భగవానుడినే ఇదే సత్యాన్ని ఆధునిక సైన్స్ కూడా వేరొక రూపంలో నిరూపిస్తోంది. మోడరన్ ఆప్టిక్స్ ప్రకారం ఒక పట్టకం గుండా ప్రయాణించిన తెల్లటి కాంతి ఏడు రంగులుగా విడిపోయినా వాటి వెనుక ఉన్న మూలమైన కాంతి ఒక్కటే అలాగే క్వాంటం ఫిజిక్స్ ప్రకారం ఈ విశ్వమంతా నిండి ఉన్నది ఒకే ఒక్క మహాశక్తి మీరు ఏ దారిలో వెళ్ళినా అంతిమంగా ఆ విశ్వ శక్తిలోనే కలవాలి.
(24:29) ఈ సృష్టిని అందరూ మీరు చూసే కోణంలోనే చూడకపోవచ్చు. ఎవరి జీవిత ప్రయాణం వారిది ఎవరి దారిలో వారికి మాత్రమే ఎదురయ్యే అనుకూలాలు ప్రతికూలాలు మరియు వారి ఆత్మఘోష ఏమిటో వారికి మాత్రమే తెలుసు కాబట్టి మీ దారిలో మీరు నడవండి. దయచేసి నన్ను నా దారిలో నడవనివ్వండి. నా అన్వేషణను నన్ను స్వేచ్ఛగా చేసుకోనివ్వండి. మన మార్గాలు వేరైనా మన అభిప్రాయాలు వేరైనా మనందరం చిట్టచివరకు ఆ అనంతమైన విశ్వ సత్యం అనే మహా జ్ఞాన జ్యోతి దగ్గరే కలుసుకుందాం.
(24:58) ఇదొక్కటే ఈ సృష్టిలో శాశ్వతమైన తిరుగులేని అంతిమ సత్యం. ఇక ముగింపుగా నేను చెప్పేది ఒక్కటే సృష్టి, జీవహింస. ఆహార నియమాలు మరియు ప్రకృతి సమతుల్యత అనేవి ఎంత మాట్లాడుకున్న ఎంత లోతుగా తవ్వినా తరగని అనంతమైన మహా విషయాలు. ఒక విశ్వ రహస్యం గురించి చేస్తున్న ఈ మేధో మధనానికి మరియు చర్చకు ఎప్పటికీ ఒక ముగింపు అంటూ ఉండదు కానీ ఈ సత్యం పట్ల సామాన్యులకు ఒక లోతైన అవగాహనను ఒక సరికొత్త వైజ్ఞానిక ఆధ్యాత్మిక దృక్పథాన్ని మీ ముందు ఉంచాలన్న లక్ష్యంతో ఈ సిరీస్ ను ఇంతటితో ముగిస్తున్నాను.
(25:32) సత్యం వైపు సాగే మీ ప్రయాణం నిరంతరం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. మీకు నా వీడియో అండ్ నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయతే ప్లీజ్ లైక్ అండ్ షేర్ రెగ్యులర్ గా నా వీడియో అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ టాపిక్ మీద మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి.
(25:56) మీకు నా వీడియో అండ్ నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ రెగ్యులర్ గా నా వీడియో అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా నా YouTube ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కన కనిపిస్తున్న గంట సింబల్ ని నొక్కినట్లయితే నేను ఎప్పుడు నా కొత్త వీడియోని అప్లోడ్ చేసినా అది మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్ కి వస్తుంది.
(26:18) థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థాంక్యూ ఆల్. ఓం
No comments:
Post a Comment