*దుఃఖానికి అసలు కారణం సంతోషానికి ఎక్కువ విలువ నివ్వడమే!*
*మనం సంతోషంగా ఉన్న మనసును, దుఃఖంగా ఉన్న మనసును మాత్రమే చూడటానికి అలవాటు పడ్డాం. అవి రెండూలేని మనసు, రోజులో అధికసమయం ఉంటున్నా దానికి విలువనివ్వడం లేదు.
*సంతోషం కూడా మన సహజస్వరూపంలో లేదని తెలిస్తే సంతోషంగా ఉండాలనే కాంక్ష పోతుంది.
*విచారణ మార్గంలో మనసును గమనించడం ద్వారా మనసు ఏ అనుభవాన్ని తనతో అంటిపెట్టుకుని ఉండటం లేదని తెలుస్తుంది.
*మనసు దేన్నైనా జ్ఞాపకంగా తప్ప ఎంత గొప్ప అనుభవమైనా తనలో నిల్వ చేసుకోలేదు...
*సామాన్యుడికైనా, మాన్యుడికైనా సంతోషం, దుఃఖం సహజం, కానీ అవి అశాశ్వతమైనవని తెలియడమే ఆనందానికి మార్గం
🔵🔴🟢🟡🙏🟡🟢🔴🔵
No comments:
Post a Comment