Friday, July 17, 2026

"గుడ్డి నమ్మకాలా? సత్యాన్వేషణా? | ప్రశ్నించడం నేర్చుకోండి, మేల్కొనండి!" #drpasupathirajgurejala

"గుడ్డి నమ్మకాలా? సత్యాన్వేషణా? | ప్రశ్నించడం నేర్చుకోండి, మేల్కొనండి!" #drpasupathirajgurejala

Author Name:Dr_Pasupathi_Raj_Gurejala

Youtube Channel Url:https://www.youtube.com/@Dr_Pasupathi_Raj_Gurejala

Youtube Video URL:https://www.youtube.com/watch?v=KDZregHRKBA



Transcript:
(00:00) మీరు ఎప్పుడైనా ఏకాంతంగా ప్రశాంతంగా ఒక్క నిమిషం కూర్చుని ఆలోచించారా మనం ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి తిరిగి మంచం మీద వాలే వరకు మన జీవితంలో జరిగే ఎన్నో పనులను మనం తీసుకునే ఎన్నో నిర్ణయాలను కేవలం ఒక గుడ్డి నమ్మకంతో ఎలా చేస్తున్నామో ఒకసారి గమనించారా గుడికి ఎందుకు వెళ్తున్నామ అంటే మనకు అలా అలవాటు చేశారు కాబట్టి పూజ ఎందుకు చేస్తున్నామంటే మన పెద్దలు చెప్పారు కాబట్టి అసలు దేవుడు ఉన్నాడా అంటే ఎక్కడో ఆకాశంలో ఉన్నాడు అని మనం బలంగా నమ్ముతున్నాం కాబట్టి ఉదయం లేచిన దగ్గర రాత్రి పడుకునే వరకు ప్రతి అడుగులోనూ ప్రతి ఆలోచనలోనూ ఎవరో మన
(00:34) మెదడులో నాటిన ఒక నమ్మకమే మనల్ని నడిపిస్తోంది. కానీ ఎప్పుడైనా నేను దీన్ని ఎందుకు నమ్ముతున్నాను అని మిమ్మల్ని మీరు గట్టిగా ప్రశ్నించుకున్నారా ఎవరో ఏదో పుస్తకంలో రాశరని లేదా వేల సంవత్సరాలుగా ఒక ఆచారం వస్తోందని దాన్ని గుడ్డిగా నమ్మేయడం నిజంగా కరెక్టేనా ఈ వీడియోని చివరివరకు ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూడండి.
(00:56) ఎందుకంటే నమ్మకం నిజం అన్వేషణ అనే ఈ మూడు పదాల వెనుక దాగి ఉన్న అసలైన అత్యంత లోతైన అర్థం ఏమిటో ఈరోజు మీకు పూర్తిగా తెలుస్తుంది. ఈ వీడియో పూర్తయ్యేసరికి మీరు ఈ ప్రపంచాన్ని, మీ జీవితాన్ని మీ చుట్టూ ఉన్న మనుషులను చూసే కోణమే 100% మారిపోతుంది. మీ మెదడులో ఇన్నేళ్లుుగా మూసుకుపోయిన ఎన్నో తలుపులు ఇనుప సంకెళ్లతో బిగించబడిన ఎన్నో ఆలోచనలు ఈరోజు బ్రద్దలవుతాయి.
(01:21) మరి ఇంకెందుకు ఆలస్యం లేడీస్ అండ్ జెంటిల్మెన్ యువర్ అటెన్షన్ ప్లీజ్ దిస్ ఇస్ డాక్టర్ పసుపతి రాజ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అసలు నమ్మకం అంటే ఏమిటి? నమ్మకం అనేది ఒక మనిషిని బలోపేతం చేస్తుందా లేక బలహీనుడిని చేస్తుందా? ప్రముఖ ఆధ్యాత్మిక తత్వవేత్త ఓషో తన వ్యక్తిగత తత్వశాస్త్రంలో ఎంతో లోతుగా చెప్పినట్లుగా నమ్మకం అనేది మనుషుల తెలివితేటలను నాశనం చేసే అత్యంత విషపూరితమైన విషయం.
(01:47) నేను దేనిని గుడ్డిగా నమ్మను. నా పద్ధతి ఏదైనా సరే స్వయంగా తెలుసుకోవడం అంటారు. ఓషో ఇది ఆయన వ్యక్తిగత తత్వం అయినప్పటికీ ఇందులో దాగి ఉన్న వాస్తవాన్ని మనం గమనించాలి. తెలుసుకోవడం [సంగీతం] అనేది పూర్తిగా ఒక సరికొత్త డైమెన్షన్ అది ఎప్పుడూ ఒక సందేహంతోనే మొదలవుతుంది. మీరు ఏదైనా ఒక విషయాన్ని ఏమాత్రం ప్రశ్నించకుండా గుడ్డిగా నమ్మేశారు అంటే కచ్చితంగా అక్కడితో మీ ఆలోచనా శక్తి ఆగిపోయినట్లే మీ అన్వేషణ పూర్తిగా చచ్చిపోయినట్లే చాలా సందర్భాల్లో మతబోధనలు అన్వేషణ కంటే గుడ్డి అనుసరణగా మారిపోయాయి.
(02:16) మతం లేదా వ్యవస్థ గురించి అత్యంత ప్రమాదకరమైన విషయం ఏమిటంటే అది మనుషులు సొంతంగా ఆలోచించడాన్ని ఆపేయడానికి ఒక అద్భుతమైన సాకుని ఇస్తుంది. నా మతం లేదా నా గ్రంథం ఇది తప్పు అది ఒప్పు అని ఖచ్చితంగా చెప్పింది కాబట్టి నేను ఇక దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని చాలా మంది తమ మెదడుకు తాళం వేసుకుంటారు. ఇదంతా కేవలం వారి వ్యక్తిగత నమ్మకం అని చాలా మంది అనుకుంటారు.
(02:40) మనం కూడా అలాంటి గుడ్డి విశ్వాసాలను ఎంతో గొప్పగా గౌరవిస్తాం. ఓహో ఇది వారి విశ్వాసానికి సంబంధించిన విషయంని మనం సున్నితంగా వదిలేస్తాం. కానీ అలా ఆలోచించడాన్ని పూర్తిగా ఆపేసిన మనుషులను గుడ్డిగా గౌరవించడం మనం వెంటనే ఆపేయాలి. దీన్ని మన రోజువారి జీవితంలో జరిగే ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. మీకు ఎడారిలో దారి తప్పినప్పుడు బాగా దాహం వేసింది అనుకోండి.
(03:01) అప్పుడు నీళ్లు తాగితే దాహం తీరుతుంది అని పక్క వాళ్ళు చెప్తే. లేదా ఏదో పుస్తకంలో చదివితే అది కేవలం ఒక నమ్మకం మాత్రమే. మీరు ఆ మాటను నమ్మి అక్కడే కూర్చుంటే మీ దాహం ఎప్పటికీ తీరదు. మీ ప్రాణాలు దక్కవు. కానీ మీరు స్వయంగా నీళ్ళ కోసం వెతికి. ఆ నీళ్ళను మీ చేతులతో తాకి. స్వయంగా తాగినప్పుడు మాత్రమే ఆ దాహం నిజంగా తీరుతుంది.
(03:24) అంటే ఇక్కడ ముఖ్యం నమ్మడం కాదు స్వయంగా తెలుసుకోవడం. నమ్మకం అనేది ఇతరుల నుండి అరువు తెచ్చుకున్న జ్ఞానం కానీ తెలుసుకోవడం అనేది మీ సొంత అనుభవం. ఆ అనుభవమే సత్యం. ఇక్కడ మీకు ఒక చాలా లాజికల్ ప్రశ్న రావచ్చు. అదేంటి భయ్యా ప్రతిదీ నేనే స్వయంగా అన్వేషించి తెలుసుకోవాలి అంటే ఎలా ఇప్పుడు ఎవరైనా ఒక అద్భుతమైన మ్యాప్ గీస్తే ఆ మ్యాప్ చూసి మనం ప్రయాణం చేస్తాం కదా ఎవరో కరెంట్ కనిపెడితే దాన్ని మనం వాడుకుంటాం కదా భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని సైంటిస్టులు చెప్తే మనం మళ్ళీ వెళ్లి ల్యాబ్ లో చెక్ చేయకుండా నమ్ముతున్నాం కదా ప్రతిదాన్ని ఇలా పిచ్చి పట్టినట్లు అనుమానించుకుంటూ పోతే ఇక జీవితంలో
(03:57) ప్రశాంతత ఎక్కడ ఉంటుంది అని మీరు అడగవచ్చు. మీరు అడిగిందినూటికి 100 శాతం కరెక్ట్ కానీ మీరు ఇక్కడ ఒక అద్భుతమైన లాజిక్ అర్థం చేసుకోవాలి. కరెంటు టెక్నాలజీ గురుత్వాకర్షణ శక్తి లాంటి భౌతిక విషయాలను మనం నమ్మవచ్చు. ఎందుకంటే వాటిని ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా సైంటిఫిక్ గా నిరూపించవచ్చు. అది గుడ్డి నమ్మకం కాదు. అది నిరూపితమైన వాస్తవం.
(04:20) సనాతన ధర్మంలోని న్యాయ దర్శనం కూడా దీనినే శబ్ద ప్రమాణం లేదా ఆప్త వాక్యం అని చెప్పింది. అంటే ఒక నిపుణుడు లేదా ఒక అనుభవజ్ఞుడు చెప్పిన భౌతిక సత్యాన్ని ప్రామాణికంగా తీసుకోవచ్చు కానీ ఆకలి, ప్రేమ, ప్రశాంతత, భక్తి, దేవుడు అనేవి భౌతిక వస్తువులు కావు. అవి సెల్ ఫోన్ల లాగా ఒకరు కనిపెడితే ఇంకొకరు వాడుకునేవి కావు. అవి కేవలం మీ ఆంతరంగిక అనుభవాలు.
(04:45) ఎక్కడో ఒకతను కడుపునిండా బిర్యానీ తింటే మీ ఆకలి ఎలాగైతే తీరదో ఇంకెవరో గురువుకి దేవుడు కనిపించాడు అనో లేదా ఏవో పుస్తకాల్లో రాసి ఉందనో మీరొక గుడ్డి నమ్మకాన్ని పట్టుకొని కూర్చుంటే మీ మనసుకి ఆ అసలైన జ్ఞానం ఆ ప్రశాంతత ఎప్పటికీ దక్కవు. ఆ దారిలో నడిచిన వారు మీకు కేవలం మ్యాప్ మాత్రమే ఇవ్వగలరు. కానీ ఆ ప్రయాణం చేయాల్సింది మాత్రం మీరే.
(05:09) అందుకే సనాతన ధర్మం గుడ్డి నమ్మకాలను మాత్రమే కాదు పిచ్చి అనుమానాలను కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అద్భుతమైన బాలెన్స్ ఇస్తూ అజ్ఞశ్రద్ధ ధానశ్య సంశయాత్మ వినశ్యతి అన్నాడు. అంటే గుడ్డి నమ్మకం ఎంత ప్రమాదకరమో ఏ ఆధారాలు చూపించినా వినకుండా ప్రతి చిన్నదాన్ని అనవసరంగా అనుమానించే ఆ పిచ్చి సందేహ వ్యాధి కూడా అంతే ప్రమాదకరం.
(05:31) అలాంటి సంశయాత్ముడికి ఈ లోకంలోనూ పరలోకంలోనూ ఎక్కడా ప్రశాంతత ఉండదు అని కృష్ణుడు హెచ్చరించాడు. సందేహం లేదా అనుమానం అనేది ఒక మూసిన తలుపును తెరవడానికి ఉపయోగపడే తాళం చెవి లాంటిది. తలుపు తెరిచాక ఆ తాళం చెవిని జేబులో పెట్టుకొని మనం లోపలికి వెళ్ళాలి. అంతే కానీ జీవితాంతం ఆ తాళం చెవిని పట్టుకొని అక్కడే నిలబడిపోతే జీవితం నాశనం అవుతుంది.
(05:54) అనుమానం అనేది సత్యాన్వేషణకు మొదటి మెట్టులా ఉండాలి కానీ మీ జీవితాన్ని నాశనం చేసే ఒక వ్యాధిలా మారకూడదు. సనాతన ధర్మం అనేది కేవలం ఒక గుడ్డి నమ్మకాల వ్యవస్థ కాదు అది అన్వేషణకు ప్రశ్నించడానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన ఒక గొప్ప విధానం. ఈ శ్లోకాలను మనం లోతుగా విశ్లేషిస్తే గుడ్డిగా అనుసరించమని మన ధర్మం ఎక్కడా చెప్పలేదని స్పష్టంగా అర్థమవుతుంది.
(06:16) తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ్య అని శ్రీకృష్ణుడు అర్జునుడికి స్పష్టంగా చెప్పాడు. దీని అర్థం ఏమిటంటే ఓ అర్జున జ్ఞానాన్ని పొందాలంటే కేవలం గురువు చెప్పింది వినడం సరిపోదు. వినయంతో సేవా భావంతో పాటు ఆ గురువును లాజికల్ గా అత్యంత లోతుగా ప్రశ్నిస్తూ సత్యాన్ని తెలుసుకోవాలి అని ఒక విచారణాత్మక దృక్పదాన్ని మనకు అందించాడు.
(06:38) అంటే ప్రతిదీ ప్రశ్నించి సందేహాలు తీర్చుకోవాలి. అప్పుడే అది జ్ఞానం అవుతుంది అని కృష్ణుడు బోధించాడు. అంతే కాదు భగవద్గీత మొత్తం బోధించిన తర్వాత చివరిలో కృష్ణుడు ఒక మైండ్ బ్లోయింగ్ మాట చెబుతాడు. విమృశ్యైత దశేషేన యతేసి తథా కురు అంటాడు. అంటే అర్జున నేను చెప్పిన దాన్ని నీ బుద్ధితో పూర్తిగా విశ్లేషించు ఆలోచించు. ఆ తర్వాత నీకు ఏది సరైనది అనిపిస్తే అదే చేయి అని నిర్ణయం తీసుకునే పూర్తి స్వేచ్ఛను అర్జునుడికే ఇచ్చాడు.
(07:06) అన్వేషించమని చెప్పడం ఆలోచించి నిర్ణయం తీసుకోమని సూచించడం మన ధర్మం యొక్క అత్యున్నత శిఖరం మన ఉపనిషత్తులు తీసుకుంటే అసలు ఉపనిషత్తు అంటేనే శిష్యుడు గురువు దగ్గర కూర్చుని ప్రశ్నిస్తూ జ్ఞానాన్ని పొందడం ఉదాహరణకు కటోపనిషత్తులో నచికేతుడు అనే ఒక చిన్న పిల్లాడు ఏకంగా మృత్యుదేవత అయిన యముడినే ఎదురించి నిలబడతాడు. మనిషి చనిపోయిన తర్వాత ఉంటాడని కొందరు అంటారు.
(07:29) ఉండడని మరికొందరు అంటారు. అసలు చావు తర్వాత ఏమవుతుంది? అసలు సత్యం ఏమిటి అని ఎన్నో కష్టమైన ప్రశ్నలు అడుగుతాడు. బృహదారణ్యక ఉపనిషత్తులో నేతి నేతి అంటే ఇది కాదు ఇది కాదు అనే ఒక అద్భుతమైన పద్ధతి ద్వారా సత్యాన్ని అన్వేషిస్తారు. అంటే ఏ భావనకు అతుక్కుపోకుండా ఉన్నది ఉన్నట్టు నమ్మేయకుండా ఇది దేవుడా కాదు ఇది దేవుడా కాదు [సంగీతం] అని ప్రతిదాన్ని లాజికల్ గా ఫిల్టర్ చేస్తూ అసలైన నిజాన్ని తెలుసుకోవడం అన్నమాట.
(07:54) ఇకపోతే మన పురాతన గ్రంథమైన ఋగ్వేదంలోని నాసాదీయ సూక్తం సృష్టి రహస్యంపై అద్భుతమైన వినయపూర్వకమైన సందేహాన్ని వ్యక్తపరుస్తుంది. సృష్టి ఎలా మొదలైందో అసలు దేవుడే ఈ సృష్టిని చేశాడో లేదో అత్యున్నత ఆకాశంలో ఉండే ఆ పరమాత్మకు మాత్రమే తెలుసు లేదా బహుశా ఆయనకు కూడా తెలియదేమో అని సృష్టి అంతిమ రహస్యంపై తన వినయపూర్వక అనిశ్చితిని అత్యున్నత స్థాయిలో వ్యక్తపరిచింది మన ధర్మం.
(08:18) కానీ ఎంతో విచారకరమైన విషయం ఏమిటంటే కాలక్రమంలో మనం ఆ సైన్స్ ని ఆ అన్వేషణ తత్వాన్ని పూర్తిగా మర్చిపోయి ఆచారాన్ని మాత్రమే గుడ్డి నమ్మకంగా మార్చుకున్నాం. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మన ఆచారాల వెనుక ఉన్న సైన్స్ గురించి మాట్లాడేటప్పుడు మనం వాస్తవాలకు దగ్గరగా ఉండాలి తప్ప WhatsAppట్ ఫేక్ మెసేజ్లను సైన్స్ అనుకొని సూడో సైన్స్ ను నమ్మి మోసపోకూడదు.
(08:40) ఉదాహరణకు మనం దేవుడికి ఇష్టం అని ఉపవాసం ఉంటాం. మోడరన్ సైన్స్ ప్రకారం ఉపవాసం చేయడం వల్ల శరీరంలో ఆటోఫాగి అనే అద్భుతమైన ప్రక్రియ జరగడానికి ఆస్కారం ఉంది. మన జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి దొరుకుతుంది. మెటబాలిజం సెట్ అవుతుంది. జపాన్ కు చెందిన యోషినోరి ఓస్మి అనే శాస్త్రవేత్తకు ఈ ఆటోఫాగీ మీద రీసెర్చ్ చేసినందుకే నోబెల్ బహుమతి కూడా వచ్చింది.
(09:04) కానీ ఉపవాసం వల్ల క్యాన్సర్ లాంటి భయంకరమైన రోగాలు రాకుండా ఉంటాయి. లేదా తగ్గిపోతాయి అని నిర్ధారిత వైద్య సత్యంగా చెప్పడానికి మెడికల్ సైన్స్ ప్రకారం ఇంకా ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లేవు. దాన్ని ఒక గొప్ప ఆరోగ్య సూత్రంగా చూడాలి తప్ప మ్యాజిక్ లాగా గుడ్డిగా నమ్మకూడదు. అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం. దీని వెనుక ఉన్న వాస్తవం ఏమిటంటే రావి చెట్టు లాంటి పెద్ద వృక్షాల చుట్టూ గడపడం వల్ల మనకు స్వచ్ఛమైన గాలి అందుతుంది.
(09:30) మానసిక ప్రశాంతతకు సహాయపడుతుంది. కానీ ఆ చెట్టు మిగతా చెట్ల కంటే అత్యధిక ఆక్సిజన్ ఇస్తుందని లేదా ఆడవారిలో హార్మోన్స్ బ్యాలెన్స్ చేస్తుందని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనం దేవుడికి నమస్కారం చేసేటప్పుడు రెండు చేతులు జోడిస్తాం. యోగ సంప్రదాయం ప్రకారం నమస్కారం అనేది ఏకాగ్రతను, వినయాన్ని. మానసిక కేంద్రీకరణను పెంచి ఒక అద్భుతమైన ముద్ర అంతేకానీ దాని వెనుక కుడి ఎడమనాడులు కలవడం లాంటి మోడరన్ ఫిజిక్స్ దాగిలేదు ఇలా మన ఆచారాల్లో ఉన్న గొప్పతనాన్ని విజ్ఞానాన్ని యధాతథంగా అర్థం చేసుకోవాలి కానీ లేని సుడో సైన్స్ ను బలవంతంగా రుద్ది మన గొప్ప
(10:06) ధర్మాన్ని పలుచన చేసుకోకూడదు. అసలు మనం దేనినైనా ఎందుకు గుడ్డిగా నమ్ముతాం. ఎవరైనా దేన్నైనా నమ్మమని చెబితే మన మెదడు ఎందుకు వెంటనే దానికి తలగ్గుతుంది. దాని వెనుక ఉన్న ఒకే ఒక బలమైన కారణం భయం చిన్నప్పటి నుండి మన మెదడులో నాటబడిన భయం దేవుడిని నమ్మకపోతే పాపం వస్తుందేమో అనే భయం ఒక పద్ధతిని పాటించకపోతే సమాజం మనల్ని ఎక్కడ వెలివేస్తుందేమో అనే భయం.
(10:29) దేవుడు మనల్ని ఘోరంగా శిక్షిస్తాడేమో అనే అకారణ భయం. కానీ మీరు ఒక్క విషయం మీ మనసులో లోతుగా ముద్రించుకోవాలి. నిజమైన జ్ఞానం ఎప్పుడూ భయంతో రాదు. అది కేవలం ధైర్యంతో కూడిన సందేహంతోనే వస్తుంది. ఈరోజు మనం అనుభవిస్తున్న సైన్స్ అంతా టెక్నాలజీ అంతా ఎవరో ఒకరు ఆ రోజుల్లో ఎందుకు అని ప్రశ్నించడం వల్లే పుట్టింది. ఒకవేళ వాళ్ళు కూడా భయపడి ఇది దేవుడి సృష్టి మనం ప్రశ్నించకూడదు అని నమ్మి ఊరుకొని ఉంటే ఈరోజు మనం ఆకులు అలములు తింటూ అడవుల్లోనే ఉండేవాళ్ళం.
(11:00) మీరు ఎప్పుడైనా పిల్లలను గమనించారా ప్రతి చిన్న విషయాన్ని ఎందుకు ఏమిటి? ఎలా అని విసిగించేలా అడుగుతారు. ఎందుకంటే వాళ్ళ మనసులో ఎలాంటి నమ్మకాలు లేవు. వాళ్ళ బ్రెయిన్ ఒక ఖాళీ పలక లాంటిది. వాళ్ళు కేవలం నిజాన్ని తెలుసుకోవాలి అనుకుంటారు. కానీ మనం పెద్దయ్యే కొద్దీ ఆ సహజమైన కుతూహలాన్ని చంపేసి మన బుర్రని పనికి రాని నమ్మకాలతో నింపేసుకుంటున్నాం.
(11:20) నమ్మకం అనేది మనిషి ఆలోచనలకు వేసే ఒక పెద్ద తాళం. మీరు ఒక విషయాన్ని నమ్మిన మరుక్షణమే మీ మెదడు ఆలోచించడం ఆపేస్తుంది. కొత్త విషయాలను అంగీకరించడం మానేస్తుంది. ఎవరైనా మీ నమ్మకానికి వ్యతిరేకంగా లాజికల్ గా మాట్లాడితే మీకు విపరీతమైన కోపం వస్తుంది. ఎందుకు అలా కోపం వస్తుందో ఎప్పుడైనా గమనించారా సైకాలజీలో దీన్ని బ్యాక్ ఫేర్ ఎఫెక్ట్ అంటారు.
(11:42) ఇది ప్రతి సందర్భంలోనూ ప్రతి వ్యక్తిలోనూ ఒకేలా పని చేయకపోయినా ఇది మనుషుల్లో కనిపించే ఒక సాధారణ ధోరణి. మీ నమ్మకాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే మీ మెదడు దానిని కేవలం మాటల దాడిలా కాకుండా మీ శరీరంపై జరిగిన ఒక భౌతిక దాడిలా ఫీల్ అవుతుంది. మీ నమ్మకం పునాది చాలా బలహీనమైనది అని మీ సబ్కాన్షియస్ మైండ్ కి తెలుసు కాబట్టే అది అలా రియాక్ట్ అవుతుంది.
(12:03) ఒక సత్యాన్ని ఎవరైనా విమర్శిస్తే సత్యం ఎన్నటికీ భయపడదు. కానీ ఒక నమ్మకాన్ని విమర్శిస్తే ఆ నమ్మకాన్ని పట్టుకున్న మనిషి విపరీతంగా భయపడతాడు. కోపపడతాడు దాడులకు దిగుతాడు. అందుకే ఈ నమ్మకాలు మనుషుల మధ్య చిచ్చుపెడతాయి. ప్రపంచంలో ఎన్నో యుద్ధాలకు కారణం అవుతాయి. కానీ సత్యం ఆ సత్యం అందరినీ ఏకం చేస్తుంది. మన భారతీయ తత్వవేత్తలు మరియు ప్రపంచ స్థాయి మేధావులు ఈ నమ్మకం అనే కాన్సెప్ట్ గురించి చాలా లోతైన విశ్లేషణలు చేశారు.
(12:33) ముఖ్యంగా జిడ్డు కృష్ణమూర్తి గారి ఆలోచనా విధానం అయితే మీ బుర్రను ఒక కుదుపు కుదుపుతుంది. ఆయన ఉద్దేశ్యంలో నమ్మకం అనేది మనుషుల మధ్య అదృశ్యమైన గోడలు కడుతుంది. ఇది నా నమ్మకం అది నీ నమ్మకం అని మనుషులు విడిపోవడానికి ఒకరినొకరు చంపుకోవడానికి ఈ నమ్మకాలే కారణం అని ఆయన అంటారు.ఆయన ఆయన చాలా ఫేమస్ గా చెప్పిన మాట. సత్యానికి ఎలాంటి నిర్దిష్టమైన దారి లేదు.
(12:55) ఏ మతమో, ఏ నమ్మకమో, ఏ గురువో మిమ్మల్ని సత్యం దగ్గరకు చేర్చలేరు. మీరు కళ్ళకు ఎర్ర రంగు అద్దాలు పెట్టుకొని ప్రపంచాన్ని చూస్తే అంతా ఎర్రగానే కనిపిస్తుంది. పచ్చ రంగు అద్దాలు పెట్టుకుంటే పచ్చగానే కనిపిస్తుంది. నమ్మకం కూడా అలాంటి ఒక రంగు అద్దం లాంటిదే. మీ మైండ్ లో ఒక నమ్మకాన్ని పెట్టుకొని మీరు దేనిని చూసినా అది మీకు ఆ నమ్మకానికి తగ్గట్టుగానే కనిపిస్తుంది తప్ప అందులో ఉన్న అసలు నిజం మీకు ఎప్పటికీ కనిపించదు.
(13:20) అందుకే ఎలాంటి నమ్మకాలు లేని ఫ్రీ మైండ్ తోనే మనం దేనినైనా చూడాలి. మన దేశానికి చెందిన ఇంకొక గొప్ప తత్వవేత్త గౌతమ బుద్ధుడు కలామసూతలో చాలా స్పష్టంగా ఒక మాట చెప్పాడు. ఎవరో చెప్పారని వదంతులు వస్తున్నాయని సంప్రదాయం కాబట్టి గ్రంథాలలో ఉందని గుడ్డిగా నమ్మకండి. చివరికి నేనే స్వయంగా చెప్పినా కూడా మీరు దేనిని గుడ్డిగా నమ్మకండి.
(13:40) మీ సొంత అనుభవంతో మీ బుద్ధితో ఆలోచించి పరిశీలించి అది శ్రేయస్కరమని తెలుసుకున్నప్పుడు మాత్రమే ఆచరించండి అన్నాడు. అలాగే స్వామి వివేకానంద ఎంతో ధైర్యంగా ఒక మాట చెప్పారు. మతం అంటే గుడ్డిగా నమ్మడం కాదు గుడ్డిగా నమ్మే కపట భక్తుడిగా ఉండటం కంటే నిజాయితీగా ప్రశ్నించే నాస్తికుడిగా ఉండటం వంద రెట్లు మేలు. విదేశీ తత్వవేత్తలు కూడా ఇదే పాయింట్ మీద గట్టిగా నిలబడ్డారు.
(14:01) గ్రీకు తత్వవేత్త సోక్రటీస్ ప్రశ్నించుకొని జీవితం అసలు ఒక జీవితమే కాదు అన్నాడు. ప్రతి విషయాన్ని ఎందుకు ఏమిటి? అని ప్రశ్నించడమే ఆయన పద్ధతి. అలాగే రెనీ డెస్కార్టెస్ అనే ప్రఖ్యాత తత్వవేత్త నేను సందేహిస్తున్నాను కాబట్టి నేను ఉన్నాను అని చెప్పాడు. ఆయన ప్రతి విషయాన్ని అనుమానించడం ద్వారానే అసలైన నిజం తెలుస్తుంది అనే సైంటిఫిక్ పద్ధతిని వాడాడు.
(14:25) ఇక రమణ మహర్షి లాంటి గొప్ప యోగులు కూడా ఇలాంటి విషయాలనే ప్రస్తావించారు. ఎవరైనా ఆయన దగ్గరకు వచ్చి దేవుడు ఉన్నాడా? స్వర్గం ఉందా? నరకం ఉందా? అని అడిగితే ఆయన. ముందు నువ్వు ఎవరో తెలుసుకో. నీ గురించి నీకు తెలియనప్పుడు ఈ నమ్మకాలు ఎందుకు అని తిరిగి ప్రశ్నించేవారు. ఆధునిక సైన్స్ విషయానికి వస్తే ప్రసిద్ధ శాస్త్రవేత్త కాల్ సేగన్ అసాధారణమైన వాదనలకు అసాధారణమైన ఆధారాలు అవసరం అని చెప్పాడు.
(14:49) నోబెల్ బహుమతి గ్రహీత రిచర్డ్ ఫెయిన్మాన్ అయితే మనల్ని మనం మోసం చేసుకోకూడదు. [సంగీతం] ఎందుకంటే మనల్ని మనమే చాలా సులభంగా మోసం చేసుకోగలం అని నమ్మకాల వల్ల కలిగే బ్రమల గురించి హెచ్చరించాడు. సద్గురు లాంటి వారు కూడా ఇదే విషయాన్ని చాలా సింపుల్ గా చెప్తారు. నాకు తెలియదు అనే మానసిక వినయాన్ని ఆయన ప్రోత్సహిస్తారు. నాకు తెలియదు అని ఒప్పుకోవడం చాలా గొప్ప విషయం అని ఆయన అంటారు.
(15:13) మీరు ఒక విషయాన్ని నమ్మినా లేదా నమ్మకపోయినా మీరు ఆ విషయాన్ని గురించి తెలుసుకునే అవకాశాన్ని మీరే మీ చేతులతో మూసుకున్నట్లు అవుతుంది. నాకు తెలియదు అని మీరు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా అనుకుంటారో అప్పుడు మాత్రమే మీలో తెలుసుకోవాలి అనే అంతులేని తప్పన మొదలవుతుంది. ఇప్పుడు మీరు ఈ వీడియో చూసిన తర్వాత మిమ్మల్ని మీరు ఒక బలమైన ప్రశ్న అడగండి.
(15:31) ఒక కఠినమైన ప్రశ్న అడగండి. మీరు ఇప్పటివరకు మీ ప్రాణంగా నమ్ముతున్న విషయాలు, ఆచారాలు సిద్ధాంతాలు నిజంగా మీరే స్వయంగా కష్టపడి తెలుసుకున్నవా లేక ఈ సమాజం, ఈ పుస్తకాలు ఈ వ్యవస్థలు మీ మెదడులో బలవంతంగా రుద్దినవా? ఒకసారి నిజాయితీగా మీ గుండెల మీద చెయ్యి వేసుకొని ఆలోచించండి. గుడ్డిగా నమ్మేవాడు ఎప్పటికీ ఒక గొర్రెలాగే గొర్రెల గుంపులో కలిసిపోతాడు.
(15:55) వాడికంటూ ఒక ప్రత్యేకమైన అస్తిత్వం ఉండదు. ప్రశ్నించేవాడు అన్వేషించేవాడు మాత్రమే సత్యాన్ని తెలుసుకుని తన సొంత దారిని తాను నిర్మించుకుంటాడు. నమ్మకం మీ కళ్ళకు గంతలు కడుతుంది. కానీ సందేహం ఆ గంతలను విప్పుతుంది. గుడ్డిగా నమ్మొద్దు అంటే నా ఉద్దేశ్యం దేన్ని నమ్మొద్దు. నాస్తికుడిలా మారిపోండి అని కాదు నమ్మినా సరే ప్రశ్నించడం, పరిశీలించడం, ఆలోచించడం ఆపొద్దు అని మాత్రమే.
(16:19) ఈ ప్రసంగంలోని అత్యంత విలువైన సత్యాన్ని మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. శ్రద్ధ ఉండాలి. విచారణ కూడా ఉండాలి. శ్రద్ధ లేకపోతే దారి కనిపించదు. విచారణ లేకపోతే సత్యం కనిపించదు. అదే సమతుల్యం మనిషిని గుడ్డి విశ్వాసం నుండి కూడా కాపాడుతుంది. నిరర్థక సంశయం నుండి కూడా కాపాడుతుంది. ఇతరులు చెప్పింది గుడ్డిగా నమ్మడం ఆపేయండి. స్వయంగా తెలుసుకోవడం మొదలు పెట్టండి.
(16:40) దైవత్వాన్ని ఫీల్ అవ్వండి. ప్రకృతిని సైంటిఫిక్ గా అర్థం చేసుకోండి. మీ అనుభవమే మీకు అసలైన గురువు కావాలి. ఎవరో వేల సంవత్సరాల క్రితం రాసిన పుస్తకాలు కాదు ఎవరో పని కట్టుకొని చెప్పిన మాటలు కాదు మీ సొంత ప్రయాణం మీరు మొదలు పెట్టాలి. మరి మీరు ఇప్పటికైనా ఈ గుడ్డిగా నమ్మడం ఆపేసి లాజికల్ గా ప్రశ్నించడం మీ సొంత సత్యాన్వేషణ ప్రయాణం మొదలు పెడతారా లేక అదే గొర్రెల గుంపులో ఒకరిగా మిగిలిపోయి మీ జీవితాన్ని ముగిస్తారా? ఈ నిర్ణయాన్ని మీకే మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను.
(17:07) ఈ వీడియో మీలో ఒక చిన్న కదలిక తీసుకువచ్చిన నిద్రపోతున్న మీ ఆలోచనను ఒక్క అడుగు ముందుకు వేయించినా నా ప్రయత్నం నెరవేరినట్లే ఆలోచించండి ప్రశ్నించండి మేల్కొనండి మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. మీ ఆలోచనల్లోనే ఉంది. సత్యం వైపు నడవండి. గుడ్డి నమ్మకాల వైపు కాదు. మీకు నా వీడియో అండ్ నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్.
(17:31) రెగ్యులర్ గా నా వీడియో అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ టాపిక్ మీద మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి. మీకు నా వీడియో అండ్ నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ రెగ్యులర్ గా నా వీడియో అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా నా YouTube ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.
(17:53) అలాగే పక్కన కనిపిస్తున్న గంట సింబల్ ని నొక్కినట్లయితే నేను ఎప్పుడు నా కొత్త వీడియోని అప్లోడ్ చేసినా అది మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్ కి వస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థాంక్యూ ఆల్.

No comments:

Post a Comment