శాఖాహారం vs మాంసాహారం: సృష్టి ధర్మం మరియు ఆహార రహస్యం: వెనుక ఉన్న అసలైన విజ్ఞానం.
Author Name:Dr_Pasupathi_Raj_Gurejala
Youtube Channel Url:https://www.youtube.com/@Dr_Pasupathi_Raj_Gurejala
Youtube Video URL:https://www.youtube.com/watch?v=qrdrBmfIex0
Transcript:
(00:00) మీరు ఇప్పుడు చూస్తున్నది మన సిరీస్ లోని రెండవ భాగం ఒకవేళ మీరు మొదటి భాగం చూడకపోతే దయచేసి ముందుగా వెళ్లి ఆ వీడియోని చూడండి. అప్పుడే మనం ప్రయాణిస్తున్న ఈ విజ్ఞాన ప్రయాణంలో మీరు సరైన మార్గంలో ఉండగలరు. మొదటి భాగంలో బిగ్ బ్యాంగ్ థియరీ నుండి ఈ సృష్టి ఎలా మొదలైందో, థర్మోడైనమిక్స్ నియమాల ద్వారా శక్తి మార్పిడి ఎలా జరుగుతుందో అలాగే జీవో జీవస్య జీవనం అనే సృష్టి ధర్మం గురించి మనం ఎంత లోతుగా విశ్లేషించామో మీరు ఇప్పటికే చూశారు.
(00:30) ఈ రెండు వీడియోలను పూర్తిగా చూడకుండానే దయచేసి నన్ను జడ్జ్ చేయకండి. ముందుగా నేను చెప్పేది శ్రద్ధగా వినండి. నేను వివరిస్తున్న ఈ లోతైన కాన్సెప్ట్ వెనుక ఉన్న అసలైన భావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను ఇక్కడ ఉన్నది కేవలం నా విశ్లేషణ ద్వారా మీ కళ్ళు తెరిపించడానికి మాత్రమే నా అంతరంగిక ఆలోచనలను పంచుకుంటూ ఈ సృష్టిని నడిపిస్తున్న జీవితం మరియు శక్తి యొక్క విశ్వ నియమాలను మీకు అత్యంత స్పష్టంగా వివరించడానికే నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను.
(01:00) ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ రెండవ భాగాన్ని మొదలుపెడదాం. మరి ఇంకెందుకు ఆలస్యం లేడీస్ అండ్ జెంటిల్మెన్ యువర్ అటెన్షన్ ప్లీజ్ దిస్ ఇస్ డాక్టర్ పశుపతి రాజ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజుల్లో సమాజంలో ఒక పెద్ద చర్చ నిరంతరం నడుస్తోంది. శాఖహారం మంచిది మరియు మాంసాహారం చెడ్డది అని కొందరు పదే పదే వాదిస్తున్నారు. ఈ వాదనలు వింటున్నప్పుడు ఒక డాక్టర్ గా ఉంటూ వైద్యం చేసే నాబోటి పరిశోధకుడికి ఈ విభజనలో ఎలాంటి అర్థం లేదు అనిపిస్తుంది.
(01:32) ఎందుకంటే సృష్టిలో ప్రతి అణువులోనూ జీవం ఉంది. ముందుగా మన పురాణాలు మరియు శాస్త్రాలు ఏం చెబుతున్నాయో చాలా లోతుగా విశ్లేషించి చూద్దాం. మన వేదాలు, ఉపనిషత్తులు మరియు భగవద్గీతలో శాకాహారాన్ని సమర్థిస్తూ కొన్ని శ్లోకాలు ఉన్నాయన్నది నిజమే. మొదటి భాగంలో మనం భగవద్గీతలోని 15వ అధ్యాయం. 14వ శ్లోకం ద్వారా భగవానుడు స్వయంగా జఠరాగ్ని రూపంలో ఉండి నాలుగు రకాల ఆహారాలను అరిగిస్తానని ఎలా చెప్పాడో ఆధారాలతో మాట్లాడుకున్నాం.
(02:00) దానికి కొనసాగింపుగా ఈ రోజుల్లో కొందరు చూపిస్తున్న ఇంకో శ్లోకాన్ని పరిశీలిద్దాం. భగవద్గీతలోని 17వ అధ్యాయం ఎనిమిదవ శ్లోకంలో ఆయుహు సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనః రస్యాహ స్నిగ్ధాః స్థిర హృద్య ఆహారాః సాత్విక ప్రియాః అని శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పాడు. దీని అర్థం ఆయువును బుద్ధిని బలాన్ని ఆరోగ్యమును సుఖమును సంతోషమును పెంచేవి మరియు శరీరంలో ఎక్కువ కాలం శక్తిని ఇచ్చేవి మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చే ఆహారాలు సాత్విక గుణం కలవారికి ఇష్టమైనవి అని ఇవి కేవలం శాఖాహార లక్షణాలు అని కొందరు పండితులు విశ్లేషిస్తారు.
(02:44) అలాగే మహాభారతం అనుశాసన పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు చెబుతూ అహింసా పరమో ధర్మః తథా హింసా పరోతపః అహింసా పరమం సత్యం యతో ధర్మః ప్రవర్తతే అని చాలా వివరంగా వివరించాడు. అంటే అహింసే పరమ ధర్మం, అహింసే పరమ తపస్సు అని దీని అంతరార్థం. ప్రాణిని చంపి తినడం వల్ల కలిగే పాపం గురించి ఇక్కడ హెచ్చరించబడింది అని వాళ్ళు చెబుతారు. అలాగే మనుస్మృతి ఐదవ అధ్యాయం 55వ శ్లోకంలో మాం భక్షత్యముత్ర యస్య మాంసమిహాద్్యహం ఏతన్మాంసస్య మాంసత్వం ప్రవదంతి మనీషిణః అని ఖచ్చితంగా రాయబడి ఉంది.
(03:24) అంటే నేను ఇప్పుడు ఎవరి మాంసాన్నైతే తింటున్నానో రేపు పరలోకంలో వాడు నన్ను తింటాడు అని దీని భావం. ఈ శ్లోకాలను ఈ ప్రమాణాలను చూపిస్తూ మాంసాహారులు పాపాత్ములు వారు క్రూరులు రాక్షస తత్వం ఉన్నవాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా నరకానికి వెళ్తారు అని కొందరు శాఖాహారులు సమాజంలో ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. మాంసాహారులను కించపరుస్తూ వారి అస్తిత్వాన్ని ప్రశ్నిస్తూ మాట్లాడుతున్నారు.
(03:48) ఇది ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతున్నాను. ఇక్కడ విషయం కేవలం ఆహారం గురించి కాదు. మనిషి ఎదుటి మనిషిని చూసే ఆ వివక్ష గురించి. ఒక ఆహారాన్ని తినేవాడు గొప్పవాడు ఇంకో ఆహారాన్ని తినేవాడు తక్కువవాడు అనే ఈ అసమానతలను నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. కానీ ఇక్కడ ఒక అత్యంత అద్భుతమైన వైజ్ఞానిక మరియు చారిత్రక లాజిక్ వాళ్ళు కావాలనే మిస్ అవుతున్నారు.
(04:11) మన ధర్మశాస్త్రాలలో మరియు పురాణాలలో మాంసాహారాన్ని అంగీకరించిన మరియు ప్రకృతి ధర్మంగా చెప్పిన సందర్భాలు శ్లోకాలు కూడా చాలానే ఉన్నాయి. మొదటి భాగంలో శ్రీమద్భాగవతం ద్వారా ఒక జీవి మరొక జీవికి ఆహారంగా మారడమే సృష్టి ధర్మం అని ఎలా తెలుసుకున్నామో అచ్చం అదే విషయాన్ని అదే మనుస్మృతి ఐదవ అధ్యాయం 30వ శ్లోకంలో ప్రాణస్యాన్నమిదం సర్వం ప్రజాపతిరకల్పయత్ స్థావరం జంగమం చైవ సర్వం ప్రాణస్య భోజనం అని అత్యంత స్పష్టంగా చెప్పబడింది.
(04:41) దీని అర్థం సృష్టికర్త ప్రాణులన్నింటికీ ఆహారంగా ఈ జగత్తును సృష్టించాడు. కదిలేవి మరియు కదలనివి అన్నీ ప్రాణులకు ఆహారమే అని ఈ శ్లోకం యొక్క అంతరార్థం. ప్రాచీన వేదకాలంలో ఋగ్వేద సమయంలో మధుపర్కం అనే ఒక గొప్ప ఆచారం ఉండేది. ఇంటికి వచ్చిన గౌరవనీయమైన అతిథులకు మాంసంతో కూడిన ఆహారం నైవేద్యంగా పెట్టడం ఆ రోజుల్లో అత్యున్నతమైన గౌరవంగా భావించేవారు.
(05:07) పవిత్రమైన వేదకాలంలో యజ్ఞ యాగాదులలో జంతు బలులు చాలా సహజంగా జరిగేవి. అశ్వమేధ యాగం గోమేధ యాగం లాంటి మహా క్రతువులలో జంతువులను బలి ఇచ్చి ఆ మాంసాన్ని యజ్ఞ ప్రసాదంగా స్వీకరించే ఆచారం వేదాల్లో ఎంతో స్పష్టంగా ఉంది. ఆ యజ్ఞాలు చేసిన మహాఋషులు మరియు చక్రవర్తులు అందరూ నరకానికి వెళ్లారా? సృష్టి ధర్మం ప్రకారం యజ్ఞంలో అర్పించబడిన జంతువుకు నేరుగా మోక్షం లభిస్తుంది అని వేదాలు ఘోషిస్తున్నాయి.
(05:35) గత భాగంలో మనం యజ్ఞాల గురించి ప్రస్తావించినట్లుగా ఒక ప్రాణి మరొక ప్రాణికి ఆహారంగా మారడం సృష్టిలో ఒక పవిత్రమైన క్రతువు వేదాలలో ఎక్కడ మాంసాహారం తినడం మహాపాపం అని తిన్నవాడు నేరుగా నరకానికి పోతాడు అని ఖచ్చితంగా ఎక్కడా రాయలేదు అలాగే రామాయణంలో వనవాస సమయంలో శ్రీరాముడు క్షత్రియ ధర్మాన్ని పాటిస్తూ మాంసం స్వీకరించిన ఆధారాలు కూడా మన ప్రాచీన గ్రంథాలలో చాలా స్పష్టంగా ఉన్నాయి.
(06:05) వాల్మీకి రామాయణం అయోధ్యకాండ సర్గ 52 శ్లోకం 102 లో వారు అడవి పందులను మరియు జింకలను వేటాడి ఆకలి తీర్చుకున్నట్లుగా స్పష్టమైన శ్లోకాలు ఉన్నాయి. అలాగే సర్గ 56 లోనూ వనవాస సమయంలో వారు మాంసాన్ని కాల్చుకొని తిన్నట్లు వర్ణనలు కనిపిస్తాయి. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు కూడా ఎన్నో ఏళ్ల పాటు వేటాడి ఆ జంతు మాంసాన్ని జీర్ణించుకొని జీవించారు.
(06:30) మరి ఈ అజ్ఞానపు శాఖాహారులు చెప్పే ఈ కుతర్కం ప్రకారం ఆ శ్రీరాముడు పాపాత్ముడా ఆ ధర్మరాజు నరకానికి వెళ్ళాడా? ఎంత అహంకారంతో కూడిన అజ్ఞానమైన వాదన ఇది. ఇక్కడ మనం ఇంకో ముఖ్యమైన కోణంలో ఆలోచించాలి. మహాభారతంలో ధర్మరాజు చెప్పిన అహింస పరమోధర్మః లాంటి శ్లోకాలలో వాడిన హింస లేదా జీవహింస అనే పదాలకు మన మహర్షులు చెప్పిన అసలైన అర్థం వేరు కావచ్చు.
(06:55) ఒకరి రాజ్యాన్ని మరొకరు దోచుకోవడం. ఆధిపత్యం కోసం తోటి మనుషులపై దండయాత్రలు చేయడం. మనుషులు మనుషులు కొట్టుకుని చంపుకోవడం లాంటి రక్తపాతాన్ని నివారించడానికే ఈ అహింస అనే పదాన్ని వారు ప్రయోగించి ఉండవచ్చు. కానీ కాలక్రమేణ కొందరు తమ స్వార్థం కోసం ఈ పదాలను వక్రీకరించి శాఖాహారం మాంసాహారం అనే వివాదంలోకి లాగి కేవలం జంతువులను తినడమే జీవహింస అని కొత్త అర్థాలు సృష్టించారు.
(07:20) ఎంతో నీతిమంతుడు ఆదర్శ పురుషుడు సాక్షాత్తు ఆ భగవంతుని అవతారమైన శ్రీరాముడే వనవాసంలో మాంసాహారం స్వీకరించినప్పుడు. ఇక మనుషులు మాంసం తినకూడదు. తింటే అది జీవహింస అవుతుంది అనే వాదనకు అసలు అర్థం ఎక్కడుంది? దేవుడే ఆచరించినప్పుడు ఆ వాదన అక్కడే కుప్పకూలిపోతుంది కదా కానీ ఈ శ్లోకాలను హిందూ పండితులు మరియు వైష్ణవ సంప్రదాయాలకు చెందిన కొందరు వ్యాఖ్యాతలు తీవ్రంగా వ్యతిరేకిస్తారు.
(07:49) వాళ్ళు సంస్కృతంలో మాంసం అనే పదానికి జంతు మాంసం మాత్రమే కాకుండా పండ్లలోని గుజ్జు అని అర్థం మార్చి చెబుతారు. వారు కందమూలాలు పండ్ల గుజ్జులనే ఆహారంగా తీసుకున్నారని నమ్మించే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ అది పండ్ల గుజ్జే అయితే దానికి వేట అనే పదాన్ని వాల్మీకి ఎందుకు వాడతారు? అడవి పందులను మరియు జింకలను చంపడం అంటే అది కచ్చితంగా ఆహారం కోసమే కదా. ఇది కేవలం దొంగ వైఖరి.
(08:15) వేల సంవత్సరాల చరిత్ర ఉన్న రామాయణంలోకి మరియు ఇతర వేద పురాణాల్లోకి కాలక్రమేణ వేరే వ్యక్తులు కొన్ని శ్లోకాలను తమ సొంతంగా చేర్చారు. వీటినే ప్రక్షిప్తాలు అంటారు. చరిత్రలో ఒక మతం లేదా ఒక వర్గం తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి అప్పటికే ఉన్న గ్రంథాలలో ఇలాంటి మార్పులు చేయడం ఒక చేదు నిజం. ఒక కాలంలో క్షత్రియ ధర్మం ప్రకారం మాంసాహారం సహజం అని వాల్మీకి రాస్తే తర్వాతి కాలంలో అహింస అనే సిద్ధాంతాన్ని బలపరచాలనుకున్న వర్గాలు అదే రామాయణంలో రాముడు మాంసం ముట్టడు అని సుందరకాండలో హనుమంతుడి ద్వారా చెప్పించిన శ్లోకాలను చేర్చి ఉండవచ్చు. నా లోతైన పరిశోధనలో నేను
(08:53) విశ్లేషించిన వాస్తవం ఏమిటంటే మన ధర్మశాస్త్రాలలో చరిత్రలో ఎన్నో రాజకీయాలు జరిగాయి. ఒక వర్గం వారిని సమాజంలో తక్కువ చేసి ఆధిపత్యం చెలాయించడానికి మాంసాహారాన్ని నిరసిస్తూ మరికొన్ని శ్లోకాలు మధ్యలో ఉద్దేశపూర్వకంగా చేర్చబడ్డాయి. కాలక్రమేణ కొందరు తమ సొంత ప్రయోజనాల కోసం ఈ అహింసా వాదాన్ని హిందూ ధర్మంలోకి బలవంతంగా చొప్పించారు.
(09:16) వేద ధర్మాన్ని పూర్తిగా వక్రీకరించి తమకు నచ్చినట్లు కొత్త రూల్స్ రాసుకున్నారు. ఒకే గ్రంథం రెండు రకాలుగా మాట్లాడుతోంది అంటేనే అక్కడ మనుషుల స్వార్థం ప్రవేశించిందని అర్థం. ధర్మం అనేది ఒక మనిషి ఆచరించే విధి నిర్వహణలో మరియు ఇతరులకు చేసే నిస్వార్ధమైన మేలులో ఉంటుంది. కానీ కడుపులోకి వెళ్లే ఆహారంలో అస్సలు ఉండదు.
(09:38) చరిత్ర తెలియని వాళ్ళే ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చేస్తారు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఆహారాన్ని మూడు రకాలుగా గుణాల ఆధారంగా విభజించాడు. అంతేగాని శాఖాహారం తింటే నేరుగా స్వర్గానికి పంపిస్తాను. మాంసాహారం తింటే పట్టుకెళ్లి నరకంలో వేస్తాను అని ఎక్కడా చెప్పలేదు. శ్రీరాముడి ఆహారం మీద కూడా రాజకీయాలు చేసి తమకు నచ్చినట్టు శ్లోకాలను మార్చుకున్న ఈ సమాజం సామాన్యులను ఆహారం పేరుతో విడదీయడంలో ఆశ్చర్యం లేదు.
(10:04) రాముడు మాంసం తింటే ఆయన దేవుడు కాకుండా పోతాడా ఆయలోని ధర్మం జ్ఞానం తగ్గిపోతుందా అస్సలు తగ్గదు. భక్తికి ఆహారానికి ఎటువంటి సంబంధం లేదని నిరూపించడానికి మన పురాణాలే మనకొక పెద్ద సాక్ష్యంగా నిలుస్తాయి. భక్తికి మించిన పవిత్రత ఈ సృష్టిలో ఏముంది? వేటగాళ్ళ కుటుంబంలో పుట్టి అణువణువున మాంసాహార వాతావరణంలో పెరిగిన శవరి కంటే గొప్ప మహా భక్తురాలు ఈ సృష్టిలో ఎవరు ఉన్నారు.
(10:30) ఆమె శ్రీరాముడికి ఎంగిలి పండు పెట్టినప్పుడు ఆ రాముడు ఆమె కులాన్ని గాని ఆమె తినే ఆహారాన్ని గాని చూడలేదు. అలాగే సాక్షాత్తు ఆ పరమశివుడికి తాను స్వయంగా వేటాడిన మాంసాన్ని నైవేద్యంగా పెట్టి తన కళ్ళను అర్పించిన మహాభక్తుడు భక్త కన్నప్ప కథ మనందరికీ తెలుసు. ఆ పరమేశ్వరుడే స్వయంగా కన్నప్ప భక్తిని లోకానికి చాటడానికి ఒక భయంకరమైన మాయను సృష్టించాడు. లింగాకారం నుండి కంటి వెంట రక్తం కారేలా చేసి తన కనుగుడ్డును కత్తితో పెకిలించి తనకు అర్పించేలా ప్రేరేపించాడు.
(11:00) సాక్షాత్తు ఆ భగవంతుడే తన భక్తుడి పరీక్ష కోసం అత్యంత దారుణమైన హింసను ఒక మార్గంగా ఎంచుకున్నాడు. అప్పటిదాకా నోటితో పచ్చి మాంసాన్ని నమిలి ఆ మాంసపు ముక్కలను శివుడికి నైవేద్యంగా పెట్టిన కన్నప్పను చూసి ఈ లోకం అపవిత్రుడు అని ఈసడించుకుంది. కానీ అదే పరమశివుడు ఆ కన్నప్పను ప్రేమగా కౌగిలించుకుని ముక్తిని ప్రసాదించాడు. కన్నప్ప పెట్టిన ఆ పచ్చి మాంసాన్ని ఆ పరమశివుడు ఎంతో ప్రేమగా ఎందుకు స్వీకరించాడు.
(11:28) పవిత్రత అనేది తినే ఆహారంలో ఉండదు. చేసే పని వెనుక ఉన్న స్వచ్ఛమైన భావనలో ఉంటుందని చెప్పడానికి కన్నప్ప మాంసపు నైవేద్యమే ఒక మహా నిదర్శనం. ఒక వేటగాడు జంతువును చంపి మాంసం పెట్టడం సృష్టి విరుద్ధమైతే సాక్షాత్తు ఆ లయకారుడు ఆ మాంసాన్ని ఎందుకు స్వీకరించాడు. దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది. ఆహారం పేరుతో మనం పెట్టుకున్న పవిత్రత అపవిత్రత అనే గీతలు కేవలం మన అజ్ఞానపు మాయ మాత్రమే అని ఎందుకంటే భగవంతుడు చూసేది నీ కంషంలో ఏముంది అని కాదు.
(11:59) భగవంతుడు చూసేది నీ కళ్ళలో ఎంత భక్తి ఉంది నీ మనసులో ఎంత కరుణ ఉంది అని మాత్రమే నోటితో పవిత్రమైన శాఖహారం తీసుకుంటున్న మనసులో తోటి మనుషుల పట్ల అసూయ ద్వేషం అహంకారం పెంచుకొని మోసాలకు పాల్పడే వాడే అసలైన పాపాత్ముడు మరియు హింసావాది వాడి ఆహారపు అలవాట్లు వాడిని ఏమాత్రం రక్షించవు. అదే మాంసాహారం తింటున్నప్పటికీ ఎలాంటి స్వార్థం లేకుండా తోటి జీవుల పట్ల అంతులేని ప్రేమ నిజాయితి సాయం చేసే గుణం ఉన్నవాడే ఆ భగవంతుడికి అత్యంత ప్రీతి పాత్రుడు మనిషి పరమాత్మకు చేరువయ్యేది తాను తినే ఆహారాన్ని బట్టి కాదు తన మనసులోని స్వచ్ఛతను బట్టి ఇది నగ్న సత్యం. కొన్ని వేదాలు ఉపనిషత్తులు
(12:37) భగవద్గీతలోని శ్లోకాలు ఆయా యుగాల ధర్మాల ప్రకారం మరియు ఆనాటి సామాజిక భౌగోళిక పరిస్థితుల ప్రకారం చెప్పబడినవి. కాలానుగుణంగా యుగాలు మారుతూ ఉంటాయి. మొదటి భాగంలో ఆదిమానవుడు ఉడికించిన మాంసం తినడం వల్లే అతని మెదడు అపూర్వంగా వికసించిందని మనం జీవ శాస్త్రం మరియు పరిణామ క్రమం ఆధారంగా మాట్లాడుకున్నాం. ఆ పరిణామ క్రమానికి కొనసాగింపుగా చూస్తే మనిషి పరిణామ క్రమంలో ఏక కణ జీవి నుండి ఉద్భవించి కోతి లాంటి జీవి నుండి ఆదిమానవుడిగా మారి ఆ తరువాత ఒక అత్యున్నతమైన చైతన్యం ఉన్న ఆధునిక మానవుడిగా ఎదిగాడు.
(13:14) ఈ సుదీర్ఘమైన జీవ పరిణామ క్రమంలో ఒకప్పుడు వేటగాడిగా ఉన్న మనిషి ఆ తర్వాత నెమ్మదిగా వ్యవసాయం నేర్చుకున్నాడు. వేదాలలో ఉన్న శ్లోకాలన్నీ ఆయా కాల పరిస్థితులకు ఆనాటి సామాజిక వర్గాలకు అనుగుణంగా రాయబడినవి ఎవరో తమ స్వార్థం కోసం ఒక వర్గాన్ని అణచివేయడం కోసం ఒక శ్లోకం రాశారు కదా అని కోట్లాది సంవత్సరాల మన శరీర పరిణామ క్రమాన్ని మనం ఎలా కాదంటాం మానవ దవడ నిర్మాణం గురించి ఒకసారి ఆలోచించండి.
(13:40) మనిషి దవడ మాంసాన్ని చీల్చడానికి కావలసిన పదునైన కూర పళ్ళను మరియు శాఖాహారాన్ని నమలడానికి కావలసిన దవడ పళ్ళను రెండింటిని అరిగించుకోవడానికి అనుకూలంగా ప్రకృతిచే అద్భుతంగా నిర్మించబడింది. ప్రకృతి మనకు రెండు ఎంపికలు ఇచ్చింది. అంతేకాకుండా మనిషి కడుపులోని గ్యాస్ట్రిక్ యాసిడ్ ఒక సింహం లేదా తోడేలు కడుపులోని యాసిడ్ తో సమానమైన పిహెచ్ స్థాయిని కలిగి ఉంటుందని గత భాగంలో విశ్లేషించుకున్నాం.
(14:05) ఆ సామర్ధ్యం ఉండి కూడా రెండు తినగలిగినప్పుడు ఒకటే తినాలి అని రూల్ పెట్టడం ఎలా ధర్మం అవుతుంది. మనిషి ఉభయహారి అని సైన్స్ ఎప్పుడో నిరూపించింది. మానవ శరీరం మాంసాహారాన్ని కూడా అరిగించుకోగల శక్తిని కలిగి ఉంది కాబట్టి ఇది ప్రకృతి సిద్ధమే. నేను ఈ పవిత్రమైన శాఖహారులను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. భూకంపం లాంటిదో విపత్తో వచ్చినప్పుడు మీరు ఎక్కడో చిక్కుకుపోయారు.
(14:28) తినడానికి చుట్టుపక్కల కేవలం మాంసం మాత్రమే ఉన్న ఒక అత్యంత దయనీయమైన పరిస్థితి మీకు వచ్చింది. అప్పుడు మీరు ఏం చేస్తారు? నేను అహింసావాదిని నేను ప్రాణం వదులుకుంటాను కానీ ఆ మాంసం ముట్టను అని ఏ ఒక్కరైనా ధైర్యంగా అంటారా ప్రాణం తీపి ముందు ఏ శ్లోకాలు ఏ ఉపనిషత్తులు ఏ నియమాలు అస్సలు నిలబడవు. అప్పుడు ఆకలి అనే ప్రకృతి ధర్మం ముందు మీరు కచ్చితంగా తలవంచి ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ మాంసం తిని తీరుతారు.
(14:57) ప్రాణం అనేది అన్నింటికంటే విలువైనది. ఆకలి అనేది ప్రకృతి మనకు ఇచ్చిన అతి పెద్ద ప్రేరణ. ఆకలి వేసినప్పుడు ధర్మాలు, శ్లోకాలు గుర్తుకు రావు. కేవలం మనుగడ మాత్రమే గుర్తుకు వస్తుంది. ప్రాణాన్ని కాపాడుకోవడానికి మాంసం తింటే అది పాపం ఎలా అవుతుంది? ఒకవేళ అది పాపం అయితే ఆకలిని సృష్టించిన ప్రకృతిని లేదా భగవంతుడిని పాపాత్ముడు అనాల్సి ఉంటుంది.
(15:20) మరి అప్పుడు ఆ మాంసం తింటే అది నరకానికి ఎలా దారి తీస్తుంది. ఆకలిని సృష్టించిన ఆ ప్రకృతికి బాగా తెలుసు. ఏది ధర్మమో ఏది అధర్మమో స్వర్గ నరకాలు అనేవి మనిషి తినే ఆహారం మీద అస్సలు ఆధారపడి ఉండవు. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ బుద్ధి, వాళ్ళ గుణం, వాళ్ళ చైతన్యం, వాళ్ళ జ్ఞానం, వాళ్ళ కామన్ సెన్స్ మరియు ఎమోషన్స్ మీద మాత్రమే అవి ఆధారపడి ఉంటాయి. సృష్టిలో జీవం లేని ఆహారం లేదు.
(15:44) ఒక మనిషి కోమాలో ఉన్నప్పుడు కదలలేకపోయినా అతనిలో గుండె నిరంతరం కొట్టుకుంటూ ఉంటుంది. అతను నెమ్మదిగా ఊపిరి తీసుకుంటూ ఉంటాడు. అతని తల వెంట్రుకలు, గడ్డం, గోర్లు నిరంతరం పెరుగుతూనే ఉంటాయి. ఆ నెర్వస్ సిస్టం అత్యంత బలహీనంగా ఉన్న అతనికి ప్రాణం ఉన్నట్టే. అలాగే కదలలేని మొక్కలకు కూడా ప్రాణం బాధ ఉంటాయి రక్తం అరుపు ఉంటేనే హింస అనుకోవడం మానవ మాత్రుల మేధోపరమైన అజ్ఞానం చెట్ల నిశశబ్ద రోదనను అహింసగా భావించలేము మొక్కల్లో కూడా నాడి వ్యవస్థ ఉందని జగదీష్ చంద్రబోస్ క్రెస్కో గ్రాఫ్ ద్వారా నిరూపించారు.
(16:18) ఆధునిక సైన్స్ కూడా దీనిని ప్లాంట్ న్యూరోబయాలజీ అని పిలుస్తోంది. మొక్కలకు మెదడు లేకపోయినా, గ్లూటమేట్ అనే రసాయనం మరియు విద్యుత్ సంకేతాల ద్వారా అవి ప్రమాదాన్ని, బాధను ఖచ్చితంగా గ్రహిస్తాయి. కాబట్టి సైన్స్ పరంగా మొక్కలకు కూడా నొప్పి. స్పందన ఉంటాయనేది వాస్తవం. అదే లాజిక్ తో ఇప్పుడు ఇంకొక వాస్తవాన్ని చూద్దాం. మీరు తినే పచ్చని ఆకుకూరలు పండే ఆ సారవంతమైన మట్టి ఎక్కడి నుండి వచ్చిందో ఎప్పుడైనా ఆలోచించారా? ఆ మట్టిలో కొన్ని కోట్లాది సంవత్సరాలుగా చనిపోయిన మహా డైనోసార్ల నుండి నిన్న చనిపోయిన చిన్న కీటకాల వరకు ఎన్నో లక్షల ప్రాణుల కళేబరాలు కుళ్లిపోయి
(16:53) కలిసిపోయాయి. ఆ మృతదేహాలలోని కార్బన్ నైట్రోజన్ సారాన్ని పీల్చుకునే మీరు పండించే పవిత్రమైన వరి మొక్క లేదా కూరగాయల మొక్క ఏపుగా పెరుగుతుంది. ఇది న్యూట్రియంట్ సైక్లింగ్ అనే అబ్సల్యూట్ బయాలాజికల్ సైన్స్ అంటే మీరు పరోక్షంగా ఒకప్పుడు మాంసంగా ప్రాణంగా ఉన్న పదార్థాన్నే ప్రతిరోజూ ఇష్టంగా తింటున్నారు.
(17:14) ఆకుపచ్చని చెట్టును కోసి తింటే పుణ్యం ఎలా వస్తుంది? భూమిని దారుణంగా దున్ని వ్యవసాయం చేసేటప్పుడు లక్షలాది వానపాములు కీటకాలు ఎలుకలు ఖచ్చితంగా ముక్కలు ముక్కలై చనిపోతాయి. మరి ఆ హింసాత్మక వ్యవసాయం ద్వారా పండిన బియ్యాన్ని తినే ప్రతి శాఖాహారి ఆ జీవహింసలు పరోక్షంగా భాగస్వామి అయినట్లే కదా మరి వాళ్ళు నరకానికి వెళ్ళకుండా ఎలా తప్పించుకుంటారు? పంటలపై చల్లే విషపూరితమైన రసాయనాల వల్ల రోజు కోట్లాది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.
(17:43) ఇదంతా హింస కాదా? విశ్వంలో ఏదీ స్వచ్ఛమైన శాఖాహారం కాదు ప్రతిదీ ఒక ఇండైరెక్ట్ మాంసాహారమే మనం బ్రతకడం అంటేనే ఈ సృష్టిలోని ఎన్నో కంటికి కనిపించని జీవరాశుల ప్రాణాలను హరించడం మన ఉనికి కోసమే ఇన్ని జీవాలు అంతమవుతున్నప్పుడు కేవలం కంచంలో ఉన్న కండరాన్ని చూసి మాత్రమే నేను హింస చేయట్లేదు అని నమ్మడం ఎంతవరకు కరెక్ట్ పోనీ మీరు ఎంతో ఇష్టంగా తాగే పాలు పెరుగు స్వీట్ లా సంగతి లోతుగా చూద్దాం.
(18:10) ఆవు పాలు తన బిడ్డకు దూడకు చెందినవి. ఆవు పాలు అనేవి నేరుగా గడ్డి నుండి ఎప్పుడూ రావు. ఆవు గడ్డి తిన్న తర్వాత అది రక్తంలో కలిసి ఆ ఆవు శరీరంలోని రక్త ప్రసరణ వ్యవస్థ ద్వారా క్షీర గ్రంధుల గుండా ఫిల్టర్ అవ్వగా వచ్చిన పోషకాలే మీరు తాగే పాలు. మరి రక్తం నుండి వేరు చేయబడిన ఆ పాలను తాగేటప్పుడు అది శాఖహారం ఎలా అవుతుంది? అది కూడా ఆ జంతువు శరీరం నుండి వచ్చిన ప్రోడక్ట్ కదా.
(18:36) తన బిడ్డకు దూడకు చెందాల్సిన ఆ అమృతమైన పాలను మీరు మీ స్వార్థం కోసం లాక్కుంటున్నట్టు కాదా? ఒక ప్రాణి నోటికాడ కూడును లాక్కోవడం పచ్చి హింస కాదా పాలు తాగుతూ మీరు శాఖహారులం అని ఎలా గొప్పలు చెప్పుకుంటారు ఒక ఆవు అడవిలోనో పొలంలోనో గడ్డి తినేటప్పుడు కంటికి కనిపించని ఎన్నో వేల క్రిమి కీటకాలను బ్యాక్టీరియాలను అమాంతం ఆ గడ్డితో పాటు మింగేస్తుంది.
(18:59) ఏ శాఖహార జంతువు కూడా 100% మాంస రహితంగా తినలేదు. ఆ జీవుల సారం అంతా పాల రూపంలో మీకు నేరుగా వస్తుంది. మీరు తినే ఐస్ క్రీమ్ లో గాని కోవాలో గాని పాలతో చేసిన స్వీట్లలో గాని జున్నులో గాని ఇవన్నీ ఉంటాయి. ఇక పెరుగు విషయానికి వస్తే పెరుగు అనేది లక్షలాది లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియాలతో నిండి ఉంటుంది. ఆ జీవాలను ఆ బ్యాక్టీరియాలను మీరు బ్రతికుండగానే చంపి ఆస్వాదిస్తూ తినేస్తున్నారు.
(19:26) ఆ పెరుగు ఫర్మెంటేషన్ అయ్యే ప్రక్రియలో పుట్టే ఆ కోట్ల జీవులను తినడం హింస కాదా? మీకు నచ్చినప్పుడు దానికి గుడ్ బ్యాక్టీరియా అని ముద్దుగా పేరు పెట్టి వాటి ప్రాణాలు తీసి తింటే తప్పు లేదు. కానీ ఇంకొక జంతువును మాంసాహారి తన ఆకలి కోసం తింటే మాత్రం వాళ్లను రాక్షసులు అని ముద్ర వేస్తారా? విత్తనంలో ప్రాణం ఉంది. కొంతమంది గుడ్డు నుండి కోడిపిల్ల వస్తుంది కాబట్టి గుడ్డు తినడం పాపమని దానిని మాంసాహారంగా పరిగణిస్తూ వాదిస్తుంటారు.
(19:52) మరి అదే లాజిక్ ప్రకారం చూస్తే ఒక విత్తనం నుండి కూడా ప్రాణం ఉన్న చెట్టు పుడుతుంది కదా మీరు ఒక గింజను వండుకొని తింటున్నారంటే ఒక చెట్టు అయ్యే అవకాశాన్ని మీరు తుంచేస్తున్నట్లే అది కూడా ఒక రకమైన గర్భ విచ్చిత్తి లాంటిదే. ఇది కేవలం మీ అహంకారం మరియు పచ్చి అజ్ఞానం. మీరు పీల్చే గాలిలో మీరు తాగే నీటిలో మీరు తినే ప్రతి ముద్దలో ఖచ్చితంగా ప్రాణం ఉంది.
(20:13) మీరు నడిచే నేల మీద వేలాది సూక్ష్మ జీవులు ప్రతిక్షణం చనిపోతూ ఉంటాయి. హింస లేని అంగుళం ఈ సృష్టిలో ఎక్కడా లేదు. ప్రాణం తీయని క్షణం ఈ విశ్వంలో ఎక్కడా లేదు. అలాంటప్పుడు మేము మాత్రమే పవిత్రులం. అహింసావాదులం అని గర్వంగా చెప్పుకుంటూ తోటి మనుషులను విమర్శించడం వెంటనే ఆపండి. సృష్టి ముందు ఏ మనిషి గొప్ప కాదు ఏ మనిషి తక్కువ కాదు ప్రతి ఒక్కరు తమ తమ మనుగడ సాధిస్తున్నారు.
(20:40) ఇందులో ఎవరి ధర్మం వారిది ఎవరి ఆహారం వారిది మనిషి ద్వంద్వ వైఖరి ఎలా ఉంటుందంటే వ్యవసాయం ద్వారా మొక్కలను సాగు చేస్తూ ఎంతో మంది ఉపాధి పొందుతుంటే అదేవిధంగా కోడి, మేక రొయ్య చేపలను ఫామ్స్ లో పెంచుతూ లక్షలాది కుటుంబాలు తమ సంసార జీవితాలను గడుపుతున్నాయి. ఇదొక అంతులేని జీవన చక్రం మరో వాస్తవిక కోణంలో శాస్త్రీయంగా చూస్తే మనం వాడే ఎన్నో ప్రాణాధారమైన మందులలో జంతువుల నుండి సేకరించిన పదార్థాలే కీలకమని ప్రతి ఒక్కరు గ్రహించాలి.
(21:10) గత భాగంలో శాఖహారులకు పుష్కలంగా బి 12 లేదా హీం ఐరన్ నేరుగా అందవని జంతు మాంసం ద్వారానే సంపూర్ణ ప్రోటీన్లు అందుతాయని శరీర ధర్మశాస్త్రం ప్రకారం ఒక వైద్యుడిగా మీకు వివరించాను. అదే వైద్యశాస్త్రంలో మన ప్రాణాలను కాపాడే మందుల విషయానికి వస్తే ఉదాహరణకు డయాబెటిస్ రోగుల ప్రాణాలు కాపాడే ఇన్సులిన్ మొదట్లో పందులు మరియు ఆవుల నుండి సేకరించబడింది.
(21:32) మనం వాడే క్యాప్సూల్స్ పై ఉండే పలచని పొర అనగా జెలటిన్ జంతువుల ఎముకల నుండి తయారవుతుంది. రక్తం గడ్డకట్టకుండా వాడే హెపరిన్ వంటి మందులు జంతువుల పేగుల నుండి సేకరిస్తారు. ప్రాణాలను రక్షించే వ్యాక్సిన్ల తయారీలో జంతువుల కణజాలం అత్యంత కీలకం మరియు ఆ వ్యాక్సిన్లు మొట్టమొదటిగా జంతువుల మీదే ప్రయోగం చేసి అవి సక్సెస్ అయిన తర్వాతే మార్కెట్లో మనుషులకు వినియోగిస్తారు.
(21:56) ఆ వ్యాక్సిన్ సక్సెస్ రేట్ వచ్చే వరకు ఎన్నో కొన్ని వందల మూగజీవాలను మనం హింసించి వాటి ప్రాణాలను తీసినట్లే కదా అంటే ప్రాణం కాపాడుకోవడానికి జంతువుల నుండి వచ్చే మందులు వాడటం హింస అనిపించదు. కానీ ఆకలి తీర్చుకోవడానికి మాంసం తినడం మాత్రం వీరికి మహా పాపంగా కనిపిస్తుంది. కేవలం జంతువులే కాదు మన ప్రాణాలను కాపాడే వైద్యశాస్త్రంలో మొక్కల పాత్ర కూడా అనన్య సామాన్యం.
(22:20) అడవిలోని మూలికల నుండి సేకరించిన రసాయనాలే. నేడు అత్యుత్తమ మందులుగా మారి కోట్లాది మంది ప్రాణాలను నిలబెడుతున్నాయి. అటు జంతువుల నుండి వచ్చే పదార్థాలైన ఇటు వృక్షాల నుండి వచ్చే లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అయినా ఇవన్నీ జీవం నుండి జీవం కోసం పుట్టినవే. రక్షణ కోసం వాటిని వాడుకున్నప్పుడు లేని హింస కేవలం ఆహారం విషయంలోనే ఎందుకు చర్చకు వస్తుంది ఇలాంటి లాజిక్లు ఒకటి కాదు వందల వేల లాజిక్లు నేను మాట్లాడగలను కానీ ఇక్కడ నా మేధస్సును ప్రదర్శించాలనో నేనేదో గొప్ప జ్ఞానిని అని నిరూపించుకోవాలనో నా ఉద్దేశ్యం ఏమాత్రం కాదు నిజానికి ఈ అనంతమైన విశ్వం ముందు నేను ఒక సాధారణమైన వాడినే ఒక అజ్ఞానినే
(22:58) మనిషి మెదడులో పుట్టుకొచ్చిన ఈ నైతికతలు సంబంధాలు భావాలు పాప పుణ్యాలు కేవలం మన పరిధిలోనివి మాత్రమే. ఆ విశాలమైన విశ్వానికి ఇవేవి పట్టవు. విశ్వం దృష్టిలో ఉన్నదల్లా ఒకటే అది నిరంతర శక్తి మార్పిడి మరియు ప్రకృతి సమతుల్యత. నా సిద్ధాంతం మరియు నా సుదీర్ఘ రీసెర్చ్ ప్రకారం ఈ సృష్టి మొత్తం ఒక అద్భుతమైన మహాశక్తి క్షేత్రం.
(23:23) మొదటి భాగంలో మనం మాట్లాడుకున్న ఆధునిక భౌతిక శాస్త్రంలోని లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ సిద్ధాంతం ఇక్కడ కూడా ఖచ్చితంగా వర్తిస్తుంది. ఆ సైన్స్ చెప్పే సిద్ధాంతం ప్రకారం ఈ విశ్వంలో శక్తిని మనం సృష్టించలేము అలాగే నాశనం చేయలేము. శక్తి కేవలం ఒక రూపం నుండి మరొక రూపానికి నిరంతరం మారుతుంది. ప్రాణం అనేది ఎక్కడున్నా అది శక్తికి ఒక రూపం మాత్రమే. ఒక రూపం నుండి మరో రూపానికి ఒక చైతన్యం నుండి మరో చైతన్యానికి నిరంతరం సాగే ఈ శక్తి మార్పిడి సత్యాన్ని గ్రహించడమే అసలైన విజ్ఞానం.
(23:55) ఆ మహా విశ్వ నియమానికి మనిషి కట్టుబడి ఉండాల్సిందే కానీ తన అల్పమైన జ్ఞానంతో విశ్వ నియమాలను మార్చలేడు. అనంతమైన అంతరిక్షంలో స్పేస్ లో ఎన్నో మహా నక్షత్రాలు విస్ఫోటనం చెందుతాయి. ఎన్నో గెలాక్సీలు ఒకదానికొకటి వేగంగా డీకొంటాయి. అవి అలా డీకొని అంతరించిపోయి మళ్ళీ కొత్త గెలాక్సీలుగా కొత్త గ్రహ సకాలుగా పుడతాయి. అదంతా సృష్టి పరిణామ క్రమం విశ్వ సమతుల్యత ఒక జీవి మరొక జీవిని ఆహారంగా తీసుకున్నప్పుడు ఆ జీవిలోని శక్తి ఎక్కడికి పోదు అది అదృశ్యం అవ్వదు జింక గడ్డిని తింటుంది.
(24:27) పులి జింకను తింటుంది. పులి చనిపోయినప్పుడు అది మట్టిలో కలిసిపోతుంది. ఆ మట్టిలో నుండి మళ్ళీ గడ్డి మొలుస్తుంది. ఇప్పుడు ఆ గడ్డిలో పులి యొక్క శరీర భాగాలు మోలిక్యూల్స్ ఉన్నాయి. ఆ గడ్డిని తిన్న శాఖాహారికి పులి యొక్క శక్తి అందుతోంది. అంటే ఇక్కడ శాఖాహారానికి మాంసాహారానికి మధ్య ఉన్న గీత ఎప్పుడో చెరిగిపోయింది. సృష్టిలో దేన్ని తిన్నా అది వాస్తవానికి హింసే.
(24:52) ఆ ప్రాణశక్తిని గ్రహించడమే ప్రకృతి ధర్మం. అది తినేవాడి శరీరంలోకి వెళ్లి బలంగా, శక్తిగా, చైతన్యంగా మరియు ఉన్నతమైన జ్ఞానంగా రూపాంతరం చెందుతుంది. బ్రతకడం అంటేనే ఒక శక్తిని మరొక శక్తిగా మార్చుకోవడం. గాలికి చలనం ఉంది. చెట్టుకు జీవం ఉంది. జంతువుకు ప్రాణం ఉంది. కానీ వీటన్నింటికీ మించిన చైతన్యం లేదా జ్ఞానం అనేది సృష్టిని ప్రశ్నించగలిగే మనిషికి మాత్రమే ఉన్న ఒక అత్యున్నత స్థితి.
(25:17) చీమలోనూ జీవం ఉంది. మనిషిలోనూ జీవం ఉంది. ప్రాణం ఉన్న ప్రతి జీవికి ఆకలి, భయం, నిద్ర, ప్రేమానురాగాలు సహజమే. కానీ మొక్కల్లో క్రిముల్లో జంతువుల్లో ఈ చైతన్యం కేవలం సూక్త చేతన స్థితిలో డార్మెంట్ స్టేట్ ఉంటుంది. మనిషిలో మాత్రం అది జాగృత చేతన స్థితిలో అవేకంట్ స్టేట్ ఉంటుంది. సృష్టిని ప్రశ్నించగలిగే విశ్లేషించగలిగే శక్తి కేవలం మనిషికే ఉంది.
(25:45) అయితే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ ఈ అత్యున్నత చైతన్య స్థాయిలో లేరు. చాలా మంది పుట్టడం, పెరగడం, పెళ్లి, పిల్లలు, ఆస్తులు కూడబెట్టడం అలాగే కులమతాలు, వర్గ రాజకీయాలు ప్రాంతీయ భేదాలు అనే ఈ మాయ ప్రపంచంలోనే చిక్కుకుపోయారు. భగవద్గీతలో బహునాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితిసా మహాత్మ సుదుర్లభ అని చెప్పినట్లు అనేక జన్మల తర్వాత జ్ఞానం పొందినవాడు ఈ సృష్టి అంతా పరమాత్మ తత్వమే అని గ్రహించి నన్ను శరణు పొందుతాడు.
(26:15) ఈ మాయను దాటి ఆ చైతన్యాన్ని చేరుకున్న అలాంటి మహాత్ముడు దొరకడం చాలా అరుదు. అలాగే కఠోపనిషత్తులో యస్తో విజ్ఞాన వాన్భవత్య మనస్కః సదాల్ శుచిహ్న స తత్పద మాప్నోతి సంసారం చాదిగచ్ఛతి అని హెచ్చరించిన విధంగా ఎవడైతే మాయలో చిక్కుకొని తన చైతన్యాన్ని మేలుకొలుపుకోలేడో వాడు ఆ పరమ పదాన్ని చేరలేక ఈ సంసార చక్రంలోనే మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ ఉంటాడు.
(26:42) ఆ విశ్వ రహస్యాన్ని పసిగట్టే వరకు మనిషి ఈ భూమి మీద సకల జీవరాశుల్లో ఏదో ఒక రూపంలో మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తుతూనే ఉంటాడు. నిజానికి మానవ జీవితం ఈ భూమి మీద ఒక కఠినమైన పరీక్ష. డబ్బు, పదవి, వ్యామోహం, కష్టం, సుఖం లాంటివన్నీ ఆ పరీక్షలో భాగమే. వీటన్నింటిని లెక్క చేయకుండా అసలైన విశ్వ రహస్యం మీద దృష్టి పెట్టి తన మేధో బలానికి పదును పెట్టినవాడే తన మానవ జన్మకు సార్ధకత చేకూర్చుకొని ఈ జనన మరణ చక్రం నుంచి ముక్తికి అర్హుడు అవుతాడు.
(27:15) అలా చేయనివాడు ఈ భూమి మీద ఉన్న కోట్లాది సాధారణ జీవరాశుల్లో ఒకరిగానే బతికి మళ్ళీ మళ్ళీ జన్మిస్తూనే ఉంటాడు. అత్యున్నత చైతన్య స్థితిలో ఉంటూ సత్య అన్వేషణ చేస్తున్న ఇలాంటి ఒక జ్ఞానజీవికి తక్కువ స్థాయి చైతన్యం ఉన్న ఒక జీవం ఆహారంగా మారడం అనేది ఈ విశ్వం తనను తాను ఉద్ధరించుకునే ఒక స్వయం పరిణామ ప్రక్రియ ఒకరు మనస్ఫూర్తిగా పాలకూర తినాలనుకున్న ఇష్టంగా కోడిని మేకను చేపను తినాలనుకున్న ఆ జ్ఞానాన్వేషిలో భాగమైన ఆ జీవం తన సృష్టి లక్ష్యాన్ని నెరవేర్చుకొని దాని జన్మను ఖచ్చితంగా ధన్యం చేసుకుంటుంది.
(27:49) ఆ భావనలో ఆ ఆస్వాదనలో ఎటువంటి తేడా లేదు. ప్రకృతి ఇద్దరికీ సమానమైన ఆకలిని ఇచ్చింది. సమానమైన తృప్తిని ఇచ్చింది. మీరు పవిత్రులు మేము పాపాత్ములం అనే భావనే ఒక దారుణమైన కుసంస్కారం. జ్ఞానం చైతన్యం అనేవి ఎప్పుడూ కులానికి లేదా తినే ఆహారానికి బానిసలు కావు. శాఖహారులు మాంసాహారులు అనేది కేవలం మనుషులు తమ స్వార్థం కోసం తమ మూర్ఖపు నమ్మకాలను వాదాలను గెలిపించుకోవడానికి సృష్టించుకున్న కృత్రిమ వర్గాలు మాత్రమే.
(28:16) జీవహింస అనేది నిజంగా సృష్టికి విరుద్ధమైతే ఈ సమస్త సృష్టిని నడిపించే ఆ దేవుడు అందరిని కేవలం శాఖహారులుగానే పుట్టించవచ్చు కదా. ఎందుకు పులిని సింహాన్ని గ్రద్దను మాంసాహారులుగా పుట్టించాడు. ఎందుకంటే బాలెన్స్ ఆఫ్ లైఫ్ కాపాడటం కోసం ఒక జీవి ఇంకో జీవిని తినక తప్పదు. పులి గడ్డి తింటే అడవి ఉండదు. జింకల సంఖ్య విపరీతంగా పెరిగిపోయి ప్రకృతి సమతుల్యత పూర్తిగా దెబ్బ తింటుంది.
(28:41) మీ గుడ్డి వాదనల కోసం మరియు మీ స్వార్ధపూరిత విభజనల కోసం ఆ ఉన్నతమైన సృష్టి నియమాలను వక్రీకరించకండి. హింస అనేది జంతువును చంపడంలో లేదు. అది మీ ఆలోచనలో తోటి మనిషిని తన ఆహారపు అలవాట్లను బట్టి చూసే మీ అసహ్యంలో ఉంది. మాంసాహారం తినేవాడు క్రూరుడు కాదు రాక్షసుడు కాదు. వాడు కూడా ప్రకృతి ధర్మాన్ని పాటించే ఒక చైతన్య జీవి.
(29:06) ఇక్కడ ఇంకొక లోతైన లాజిక్ ఆలోచించండి. మనం టీవీల్లో నేషనల్ జియోగ్రఫీ లాంటి ఛానల్స్ చూస్తున్నప్పుడు ఒక సింహం లేదా పులి ఒక జింకను వేటాడుతూ ఉంటుంది. ఆ క్రూర జంతువుకు మాంసమే ఆహారం అని. అది గడ్డి తిని బతకలేదని మాంసాహారులతో పాటు ఈ పవిత్రమైన శాఖహారులకు కూడా స్పష్టంగా తెలుసు. ఒక ప్రాణి ఇంకో ప్రాణికి ఆహారం అవ్వడం సృష్టి నియమమని తెలిసినా సరే.
(29:30) ఆ వేటను చూస్తున్నప్పుడు ఆ జింక ఆ పులికి చిక్కకూడదు అనే వీడియో చూసే ప్రతి ఒక్కరు దాదాపు తమ మనసులో బలంగా కోరుకుంటారు. కానీ ఇక్కడ మీరు మిస్ అవుతున్న అసలైన పాయింట్ ఏమిటంటే ఆకలితో అలమటిస్తున్న ఒక జీవికి దాని ఆహారం దొరకకూడదు అని మీరు మనసులో కోరుకోవడం కూడా ఒక భయంకరమైన హింస కిందకే వస్తుంది. ప్రకృతి ధర్మం ప్రకారం తన కడుపు నింపుకోవడానికి వేటాడుతున్న ఒక జంతువు నోటికాడ కూడును లాగేయాలి అనుకునే మీ ఆలోచన కూడా ఒక దారుణమైన పాపమే కదా ఒక ప్రాణి బతకకూడదు అని కోరుకోవడం ఎంత హింసో ఆకలితో ఉన్న ఇంకో ప్రాణికి ఆహారం దొరకకూడదు అని అనుకోవడం కూడా అంతే పెద్ద హింస ఇదే మనిషి
(30:05) ఆలోచనలో ఉన్న పచ్చి ద్వంద్వ వైఖరి ఒక ప్రాణాన్ని సృష్టించే శక్తి నీలో లేనప్పుడు ఆ జీవాన్ని ప్రాణం తీసి తినే హక్కు నీకు లేదు అని అంటారు కొందరు మరి శాఖహారులు చెట్లు పండ్లు కాయల్ని వాళ్ళు సృష్టించారు ప్రకృతి సృష్టించింది. శాఖహారమైన మాంసాహారమైన రెండు అరువు తెచ్చుకున్న ప్రాణాలే. సృష్టిలో దేన్ని మనిషి సృష్టించలేదు గాలిని కూడా సృష్టించలేదు అలా అని గాలి పీల్చకుండా బతకలేము కదా ఇక్కడే కొందరు అతి తెలివితో ఒక వితండ వాదన చేస్తారు.
(30:36) మరి ఒక సింహమో పులో జనావాసాల్లోకి వచ్చి మనిషిని వేటాడితే దానికి ఆకలి వేస్తోంది కదా అని మనం ప్రాణత్యాగం చేసి దానికి ఆహారంగా మారాలా అని అడుగుతారు. దీనికి సమాధానం మనం ఇందాక మాట్లాడుకున్న చైతన్య స్థాయిలలోనే ఉంది. తక్కువ స్థాయి చైతన్యం ఉన్న జీవం. పై స్థాయి చైతన్యానికి ఆహారం కావడం సృష్టి ధర్మం అంటే మొక్కలు జంతువులు మనిషికి ఆహారం కావడం పరిణామ క్రమం కానీ ఒక తక్కువ స్థాయి చైతన్యం ఒక అత్యున్నత చైతన్యమైన మనిషిని చంపడం అనేది సృష్టి పరిణామ క్రమానికే విరుద్ధం రెండవది ప్రాణరక్షణ అనేది ప్రతి జీవి యొక్క ప్రాథమిక హక్కు జింక సింహం నుంచి తప్పించుకోవడానికి
(31:12) ఎలాగైతే తన శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తుందో మనిషి కూడా తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పోరాడటం ప్రకృతి ధర్మమే జింక ఇంకను సింహానికి లొంగిపొమ్మని ప్రకృతి ఎప్పుడూ చెప్పలేదు. అలాగే మనిషి కూడా క్రూర జంతువుకు లొంగిపోవాల్సిన అవసరం లేదు. మనిషి తనకున్న అత్యున్నత చైతన్యంతో తన మేధస్సుతో ఆ జంతువును నిలువరించడం ఏమాత్రం తప్పు కాదు.
(31:36) ఒక జీవికి మనం ఇచ్చే విలువ దాని భౌతిక పరిమాణాన్ని బట్టి కాకుండా దాని చైతన్యాన్ని బట్టి ఉండాలి. ఏనుగు లేదా తిమింగలం మనిషి కంటే ఎంతో పెద్దవి అయినా అవి కేవలం ఆకలి. నిద్ర భయం అనే ప్రాథమిక ప్రవృత్తులకే పరిమితమయ్యాయి. సకల జీవరాశులలో మనిషి అత్యంత ఉన్నతమైన చైతన్యం కలిగినవాడు అన్నది ముమ్మాటికి సత్యం. అలాగని ఈ ఉన్నత చైతన్యం పేరుతో ప్రకృతి ధర్మానికి వ్యతిరేకంగా ఆలోచిస్తూ తోటి జీవరాశుల పట్ల విచ్చలవిడిగా అహంకారంతో మరియు కృతజ్ఞతా భావం లేకుండా ప్రవర్తించడం ఒక మహా అపరాధం.
(32:08) నేనే అందరికంటే గొప్ప చైతన్యవంతుడిని నాకే ఎక్కువ తెలివి ఉంది. ఈ సృష్టిలోని ప్రతి జీవిని నేనే శాసిస్తాను అనే గుడ్డి అహంకారం మనిషికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. ఉన్నతమైన చైతన్యం అంటే విచక్షణ రహితంగా వ్యవహరించడం కాదు అది సృష్టి పట్ల మనిషికి ఉండాల్సిన ఒక పవిత్రమైన బాధ్యత. మనం ప్రకృతిలోని ప్రతి జీవితోనూ ఒక ధర్మబద్ధమైన సంబంధాన్ని మాత్రమే కలిగి ఉండాలి.
(32:34) మనం మనుగడకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సాయపడుతున్న ప్రతి ప్రాణి పట్ల అంతులేని కృతజ్ఞతా భావం కలిగి ఉండటమే అసలైన జ్ఞానానికి నిదర్శనం. అధర్మంగా విర్రవీగుతూ పశు పక్షాదులపై అహంకారం ప్రదర్శిస్తే ఆ మహా సృష్టి నియమాల ముందు మనిషి ఉనికి ఏమాత్రం నిలబడదు. ఆగండి ఇక్కడితో అంతా అయిపోయింది అనుకుంటున్నారా? లేదు. అసలు కథ ఇంకా మిగిలే ఉంది.
(33:01) నా తదుపరి భాగంలో పార్ట్త్ర మీ బుర్రకు పదును పెట్టే మరెన్నో ఆసక్తికరమైన విషయాలు మీ మదిలో మెదిలే ఎన్నో ప్రశ్నలు వాటన్నిటికీ పక్కా లాజికల్ మరియు సైంటిఫిక్ ప్రూఫ్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటివరకు ఎక్కడికి వెళ్ళకండి. స్టే ట్యూన్ టు మై ఛానల్. మీకు నా వీడియో అండ్ నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయతే ప్లీజ్ లైక్ అండ్ షేర్ రెగ్యులర్ గా నా వీడియో అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.
(33:34) ఈ టాపిక్ మీద మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి. మీకు నా వీడియో అండ్ నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. రెగ్యులర్ గా నా వీడియో అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా నా YouTube ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కన కనిపిస్తున్న గంట సింబల్ ని నొక్కినట్లయితే నేను ఎప్పుడు నా కొత్త వీడియోని అప్లోడ్ చేసినా అది మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్ కి వస్తుంది.
(34:02) థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థాంక్యూ ఆల్.
No comments:
Post a Comment