*కర్మను ఎలా తగ్గించుకోవాలి ?*
*"ప్రారబ్ధాన్ని అనుభవించక తప్పదు" అన్నాం కదా. మరి కొత్త కర్మలు కూడబెట్టకుండా, ఉన్న కర్మ బరువు తగ్గించే మార్గం ఉందా? ఉంది.*
*సనాతన ధర్మం 3 మార్గాలు చూపించింది :*
**1. జ్ఞాన మార్గం*
*"నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఆత్మను" అనే జ్ఞానం కలిగినప్పుడు కర్మబంధం* *వదులుతుంది .*
*ఒక నటుడు సినిమాలో రాజు వేషం వేసినా, తాను నటుడినే అని తెలుసు కాబట్టి ఆ పాత్రకు అతుక్కోడు. అలాగే ఈ జీవితాన్ని "నేను చేస్తున్నాను" అనే అహంకారం లేకుండా, "ఇది నా డ్యూటీ" అని చేస్తే కర్మ అంటదు.*
*2. భక్తిమార్గం*
*చేసే ప్రతి పనినీ భగవంతుడికి అర్పించడం.*
*"కృష్ణార్పణం" అని వంట చేసినా, ఆఫీస్ పని చేసినా, చదువుకున్నా - ఫలితాన్ని* *ఆయనకే వదిలేయడం.*
*అప్పుడు పుణ్యమైనా, పాపమైనా మన అకౌంట్‌లో* *పడవు. ఇదే భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన సులువైన మార్గం.*
*3. నిష్కామ కర్మ*
*ఇదే అతి ముఖ్యం. ఫలితం మీద ఆశ లేకుండా కర్మ చేయడం.*
*ఉదా: నేను ఒకరికి సాయం చేస్తున్నా. "వాడు నాకు థాంక్స్ చెప్పాలి, రేపు నాకు తిరిగి సాయం చేయాలి" అని ఆశిస్తే అది ఆగామి కర్మ అవుతుంది.*
*కాని, "మనిషిగా నా బాధ్యత" అని చేస్తే, ఆ కర్మ నన్ను బంధించదు.*
_*కర్మను కాల్చే అగ్ని ఏది?*_
*శాస్త్రాలు చెబుతాయి - *జ్ఞానాగ్ని అన్ని కర్మలనూ కాల్చేస్తుంది.*
*నిజమైన జ్ఞానం, నిజమైన భక్తి వచ్చిన క్షణంలోనే సంచిత కర్మలో పెద్ద భాగం నాశనం అవుతుంది. ప్రారబ్ధం మాత్రం అనుభవించాల్సిందే.*
*అందుకే ఋషులు చెప్పారు :*
*"మంచి ఆలోచన - మంచి మాట - మంచి పని"*
*దీన్ని రోజూ ప్రాక్టీస్ చేస్తే కొత్తగా పాప కర్మలు చేరవు. ఉన్న పుణ్య కర్మలు పెరుగుతాయి.*
*సారాంశం_: కర్మ నుంచి* *తప్పించుకోవడం కాదు, కర్మకు అతుక్కోకుండా ఉండడమే పరిష్కారం.*
No comments:
Post a Comment