Friday, July 17, 2026

"ఇంకా కావాలి" అనే అంతులేని పరుగు. నిజమైన సంపద ఏమిటో తెలుసుకునే జీవన సత్యం.

"ఇంకా కావాలి" అనే అంతులేని పరుగు. నిజమైన సంపద ఏమిటో తెలుసుకునే జీవన సత్యం.

Author Name:Dr_Pasupathi_Raj_Gurejala

Youtube Channel Url:https://www.youtube.com/@Dr_Pasupathi_Raj_Gurejala

Youtube Video URL:https://www.youtube.com/watch?v=fTvuNluC6-4



Transcript:
(00:00) మీరు ఎప్పుడైనా గమనించారా మనం ప్రతిరోజు ఒక ప్రమాదకరమైన ఆట ఆడుతున్నామని అది క్రికెట్ కాదు చెస్ కాదు జూదం కాదు ఆ ఆట పేరు ఇంకా కావాలి. చిన్నప్పటి నుంచే మనల్ని ఈ ఆటలోకి నెమ్మదిగా నెట్టేస్తారు. మార్కుల్లో ఇంకా కావాలి. ఉద్యోగంలో ఇంకా కావాలి. జీతంలో ఇంకా కావాలి. ఇంట్లో ఇంకా కావాలి. కారులో ఇంకా కావాలి. గుర్తింపులో ఇంకా కావాలి.
(00:26) ఈ పరుగు ఎప్పుడు మొదలైందో కూడా మనకు తెలియదు. కానీ ఒకరోజు అద్దంలో మన ముఖాన్ని మనం చూసుకున్నప్పుడు మన కళ్ళలో అలసట కనిపిస్తుంది. మనసులో ఒక ఖాళీ కనిపిస్తుంది. అప్పుడు మనల్ని మనమే ఒక ప్రశ్న అడగాల్సి వస్తుంది. అసలు ఈ పరుగులో మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఎవరి కోసం పరిగెడుతున్నాం? మనం నిజంగా జీవిస్తున్నామా లేక బతకడం మర్చిపోయి పరిగెడుతున్నామా? ఈ ప్రశ్నలు ఎప్పుడైనా మిమ్మల్ని వేధించి ఉంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి.
(00:50) ఎందుకంటే ఈరోజు మనం మాట్లాడుకోబోయేది డబ్బు మంచిదా చెడ్డదా అనే విషయం కాదు. సంపాదించాలా వద్దా అనే విషయం కాదు నిజమైన ఎదుగుదల అంటే ఏమిటి? కంఫర్ట్ జోన్ అంటే అసలు ఏమిటి మనశశాంతిని కోల్పోకుండా ఎలా జీవించాలి అనే విషయాల గురించి. మరి ఇంకెందుకు ఆలస్యం లేడీస్ అండ్ జెంటిల్మెన్ యువర్ అటెన్షన్ ప్లీజ్ దిస్ ఇస్ డాక్టర్ పశుపతి రాజ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్.
(01:18) ఒక వ్యక్తి తనకు ఉన్నదానితో సంతోషంగా జీవిస్తుంటే అతన్ని చూసి ఈ సమాజం ప్రశాంతంగా ఉండలేకపోతుంది. మీరు ఇక్కడితో ఆగిపోయారు. మీకు ఆశయాలు లేవు. మీరు కంఫర్ట్ జోన్ లో పడిపోయారు అని తీర్పులు ఇస్తారు. మీరు ప్రశాంతంగా ఉంటే వారికి అది సోమరితనంగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ మనం ఒక నగ్న సత్యాన్ని అర్థం చేసుకోవాలి. అసలు కంఫర్ట్ జోన్ అంటే ఉన్నదానితో సంతృప్తిగా జీవించడం కాదు.
(01:40) ఇంకా కావాలి అనే అంతులేని అత్యాస ఊబిలో కూరుకుపోయి. దాని నుండి బయటకు రాలేకపోవడమే అసలైన కంఫర్ట్ జోన్. ఎందుకంటే అక్కడ మనిషి తన కోరికలకు బానిస అవుతాడు. అవే అతని జీవితానికి యజమానులుగా మారిపోతాయి. రిస్క్ చేసి సంపాదించడం తప్పు కాదు. కష్టపడి ఎదగడం తప్పు కాదు. కానీ దేనికోసం సంపాదిస్తున్నామో తెలియకుండా పిచ్చివారిలా పరిగెత్తడమే అసలైన చేతకానితనం.
(02:03) మీ లక్ష్యాలు మిమ్మల్ని నడిపిస్తున్నాయా లేక ఇతరుల చూపులు మిమ్మల్ని నడిపిస్తున్నాయా? ఈ ఒక్క ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెప్పగలిగితే జీవితంలోని సగం సమస్యలు ముగిసిపోతాయి. మనిషికి ఎంత ఉన్నా సరే ఇంకా ఏదో కావాలనే భావన ఎందుకు వస్తుంది తెలుసా ఎందుకంటే మనం అవసరాలను కోరికలతో కలిపేసుకున్నాం. ఆకలి తీర్చుకోవడం అవసరం, రుచిని వెంబడించడం కోరిక, రక్షణ అవసరం, ప్రదర్శన కోరిక, ప్రయాణం అవసరం, హోదా ప్రదర్శన కోరిక.
(02:30) ఒక మనిషి ఎంత సంపాదించినా తన కడుపుకు సరిపడా మాత్రమే తినగలడు. మీరు వేల రూపాయలు పెట్టి ఫైవ్ స్టార్ హోటల్లో తిన్నా. ఇంట్లో సద్దన్నం తిన్నా చివరికి అడగాల్సిన ప్రశ్న మీ ఆకలి తీరిందా లేదా అన్నదే నాకు ఆ ఫైవ్ స్టార్ బిర్యానీ మాత్రమే కావాలి అనుకోవడం ఒక రోగం ఎందుకంటే ఆ ఆనందం కోసం మీరు సంపాదించిన డబ్బుకు యజమానిగా కాకుండా డబ్బు కోసం బ్రతికే యంత్రంగా మారిపోతారు.
(02:53) ఇల్లు అనే ఉదాహరణ తీసుకుందాం. సామాన్యుడు తన కుటుంబానికి ఒక నీడ ఇవ్వాలని చిన్న సొంత ఇల్లు కోరుకోవడం బాధ్యత. అదే ఇంకొక వ్యక్తి సమాజంలో తన హోదాను నిరూపించుకోవడానికి 10 కోట్లు పెట్టి భవంతులు కడతాడు. ఇక్కడ ఇల్లు ఎందుకు అనేదే ప్రశ్న. ఎండ వానల నుండి రక్షణ ఆ చిన్న ఇంట్లో దొరుకుతుంది. ఆ 10 కోట్ల భవంతిలో కూడా దొరుకుతుంది. మీ కుటుంబానికి ఒక నీడ ఇవ్వడానికి కష్టపడడం బాధ్యత.
(03:18) కానీ ఇతరులకు చూపించుకోవడానికి జీవితాన్ని యంత్రంలా మార్చేయడం అప్పుల ఊబిలో పడిపోవడం, ఆరోగ్యాన్ని పణంగా పెట్టడాన్ని డెవలప్మెంట్ అని పిలవలేం. లక్ష రూపాయల మంచం కొనగలరు. కానీ నిద్రను కొనలేరు. అత్యంత ఖరీదైన గడియారం కొనగలరు. కానీ ఒక్క నిమిషం అదనపు జీవితాన్ని కొనలేరు. అసలు ప్రశ్న మీరు ఏమి ఎక్కారు అన్నది కాదు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు అన్నది.
(03:39) ఈ ప్రపంచంలో మనం అత్యంత ప్రమాదకరంగా కోల్పోతున్న సంపద సమయం. ఒకసారి జారిపోయిన డబ్బు తిరిగి సంపాదించవచ్చు. కానీ పిల్లల బాల్యం, తల్లిదండ్రులతో గడపని క్షణాలు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసిన సంవత్సరాలు తిరిగి రావు. ఒకే బంధుగణంలో ఉన్న రెండు కుటుంబాలను ఊహించుకోండి. ఒక కుటుంబం ఎన్నో కోట్లు సంపాదించింది. కానీ ఆ కుటుంబ పెద్ద తన జీవితంంతా ఆస్తులు కూడబెట్టడానికే ధరబోసాడు.
(04:02) ఆ భవనం ఫైవ్ స్టార్ హోటల్ లా ఉంటుంది. కానీ ప్రేమను పంచే ఇల్లులా ఉండదు. అదే మరో చిన్న కుటుంబం బ్యాంక్ బాలెన్స్ పెద్దగా ఉండకపోవచ్చు. కానీ వారి అవసరాలు తీరిన తర్వాత పరుగు ఆగిపోతుంది. రాత్రి అందరూ కలిసి భోజనం చేస్తారు. కష్టకాలంలో ఒకరికి ఒకరు అండగా నిలుస్తారు. బయటి వారికి అది సాధారణ జీవితం కావచ్చు. కానీ నిజమైన ఆస్తి అంటే అదే ఎక్కువ వస్తువులు ఉండటం సంపద కాదు ఎక్కువ ప్రశాంతత ఉండటం సంపద నిజంగా మనల్ని ప్రేమించే మనుషులు ఉండటం సంపద నేను ఆశయాలను తప్పు పట్టడం లేదు ఒక శాస్త్రవేత్త రైతు విద్యార్థి తపన వెనుక కూడా ఇంకా కావాలి అనే కోరికే ఉంటుంది.
(04:36) కానీ ఆ కోరిక వెనుక ఉద్దేశం ఏమిటి అనేదే అసలు ప్రశ్న. అది సృష్టించడానికా సేవ చేయడానికా లేక ఇతరుల కంటే గొప్పవారిగా కనిపించడానికా ఇక్కడే ఆశయం మరియు అత్యాస మధ్య ఉన్న సూక్ష్మమైన గీత కనిపిస్తుంది. ఎదుగుదల అంటే ఎక్కువ సంపాదించడం కాదు నిన్నటి కంటే ఈరోజు మెరుగైన మనిషిగా మారడం. మీ మనసును కోల్పోకుండా మీ లక్ష్యాల వైపు నడవడం అదే నిజమైన ఎదుగుదల.
(05:01) దాహంతో ఉన్నవారు సముద్రపు నీళ్లు తాగితే ఏమవుతుంది? దాహం తీరదు. అత్యాస కూడా అలాంటిదే. ఒక కోరిక తీరగానే మరో కోరిక పుడుతుంది. మరి ఎందుకు ఇలా జరుగుతోంది ఎందుకు మనిషి ఎంత సాధించినా ప్రశాంతంగా ఉండలేకపోతున్నాడు. ఈ ప్రశ్నకు ఆధునిక సైకాలజీ హెడోనిక్ ట్రెడ్మిల్ అనే ఒక సిద్ధాంతం ద్వారా అద్భుతమైన సమాధానం చెబుతోంది.
(05:21) దీని ప్రకారం మనిషి జీవితంలో ఎంత గొప్ప విజయం సాధించినా, ఆ ఆనందం చాలా తక్కువ కాలం మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఆ కొత్త ధనం మామూలుగా మారిపోయి మళ్ళీ ఇంకేదో కావాలి అనిపిస్తుంది. క్రెడ్ మీద పరిగెత్తే వ్యక్తి ఎంత శ్రమించినా చివరికి అదే చోట ఉంటాడు. మన ఆశల పరుగు కూడా ఇలాగే ఉంటుంది. ఈ ఉద్యోగం వస్తే చాలు అనుకుంటాం. ఆ తర్వాత సొంత ఇల్లు ఉంటే చాలు అంటాం.
(05:41) ఈ చాలు అనే గీత ప్రతిసారి కొంచెం ముందుకు జారిపోతూ ఉంటుంది. సమస్య డబ్బులో లేదు. అవగాహన లేకపోవడంలో ఉంది. ఏం వెంబడిస్తున్నామో తెలియకుండా పరిగెత్తడమే మనిషిని అలసటకు గురి చేస్తుంది. మన మెదడులోని డోపమైన్ వ్యవస్థ మనల్ని ఇంకా సాధించండి అని ప్రోత్సహిస్తుంది. ఈ వ్యవస్థ లేకపోతే నాగరికత ఈ స్థాయికి చేరుకునేది కాదు.
(06:03) కానీ మన జీవితం మొత్తం ఈ ప్రేరణ వ్యవస్థకు బానిసగా మారిపోయినప్పుడు ప్రతి అసంతృప్తికి కొత్త వస్తువును మందులా ఉపయోగించడం మొదలు పెట్టినప్పుడే అసలు సమస్య వస్తుంది. కృతజ్ఞత ప్రేమ అనుబంధాలు ఇవి మనలో దీర్ఘకాలిక ప్రశాంతతను పెంచుతాయి. ఒకప్పుడు మీరు కలగా చూసిన కొన్ని విషయాలు ఈరోజు మీ జీవితంలో భాగమైపోయాయి. కానీ మీ మనసు ఆగిందా లేదు అది తదుపరి కోరికను వెతుకుతోంది.
(06:25) అందుకే అసలు ప్రశ్న ఎలా ఇంకా ఎక్కువ సంపాదించాలి అనేది కాదు. ఎప్పుడు నాకు ఉన్నది సరిపోతుంది అని చెప్పగలను అనేదే ఈ తత్వం గురించే ఈశావాస్య ఉపనిషత్తు తేన త్యక్తేన భుంజీత అని చెప్పింది. ఈ సృష్టిలో ఉన్నదంతా భగవంతునిదే మీకు ఎంత అవసరమో అంతే స్వీకరించండి అని దీని అర్థం. ఇది పేదరికాన్ని కాదు స్వీయ నియంత్రణను బోధిస్తుంది.
(06:49) మన సమస్య ఇది కూడా నాదే కావాలి అనే అంతులేని స్వాధీన భావంలో ఉంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా ఈ ధనం నాది. ఇంకా ఎక్కువ సంపాదిస్తాను అనే మనస్తత్వాన్ని అసుర స్వభావంగా వర్ణించాడు. తన విలువను సంపదతో కొలిచే మనస్తత్వమే అసుర ప్రవృత్తి. మనం సంపాదిస్తున్నది జీవితం కోసమా లేక జీవితం మొత్తాన్ని సంపాదన కోసం త్యాగం చేస్తున్నామా పదుల కోట్లు సంపాదించి అత్యంత ప్రియమైన వారితో గడపాల్సిన సమయాన్ని కోల్పోతే ఆ లాభం నిజంగా లాభమేనా? ఈ ప్రపంచంలో విజయవంతంగా కనిపించే ప్రతి వ్యక్తి ప్రశాంతంగా ఉండడు.
(07:18) ఎందుకంటే సంతృప్తి అనేది సంపదకు వచ్చే బోనస్ కాదు. అది ఒక నిర్ణయం. భర్తృహరి చెప్పినట్లు తృష్ణాన జీర్ణ వయమేవ జీర్ణః కోరికలు ఎప్పటికీ ముసలివి కావు కానీ వాటిని తీర్చుకునే క్రమంలో మనమే ముసలి వాళ్ళమైపోతాం. మన జుట్టు తెల్లబడి నడక నెమ్మదించినా మనసు మాత్రం ఇంకా కొంచెం సంపాదిస్తే బాగుండేది అని చెబుతూనే ఉంటుంది.
(07:39) అప్పుడు ఒక్కసారి ఆగి నేను నిజంగా జీవించానా లేక ఏదో అందని గమ్యాన్ని వెంబడిస్తూ గడిపేసానా అని మనల్ని మనం అడగాలి. మనం ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదు. వెళ్తున్నప్పుడు కూడా ఏమి తీసుకుపోలేము. ఒకవేళ మీ జీవితంలో చివరి రోజు వచ్చిందని తెలిస్తే మీరు ఇంకో ఆస్తి పత్రం మీద సంతకం చేస్తారా లేక ప్రాణం లాంటి మనుషులతో కూర్చుని మాట్లాడాలని అనుకుంటారా జీవితానికి చివరలో మనుషులు పశ్చాత్తాప పడేది సంపాదించలేకపోయిన డబ్బు గురించి కాదు జీవించలేకపోయిన జీవితం గురించి మనం ఇంకొంచెం సంపాదించిన తర్వాత జీవిస్తాను అనే భ్రమలో జీవిస్తున్నాం.
(08:12) కానీ జీవితం ఎవరి కోసం ఆగదు. వందల కోట్లు సంపాదించి ఎవరి జీవితానికైనా వెలుగు నింపకుండా చనిపోతే అతను సంపదను కూడబెట్టాడు గానీ జీవితాన్ని జీవించలేదు. ఆఖరి శ్వాస విడిచే ముందు నా మనశశాంతిని డబ్బు కోసం తాకట్టు పెట్టకూడదు అనే బాధ కలిగితే అదే మనిషి అనుభవించే అతి పెద్ద నరకం. తండ్రి ఎప్పుడూ డబ్బు వెనుక పరిగెడితే పిల్లలు కూడా అనుబంధాలను కాకుండా లాభ నష్టాలను నేర్చుకుంటారు.
(08:37) ఎవరో వచ్చి మీకు 100 కోట్లు బహుమతిగా ఇస్తే మనసు శాశ్వతంగా ప్రశాంతంగా మారిపోతుందా? ఖచ్చితంగా కాదు అది కొత్త సమస్యలను సృష్టిస్తుంది. డబ్బు వచ్చినంత మాత్రాన అత్యాస ఆగిపోతుంది అనుకోవడం అతి పెద్ద అపోహ. కోరికలు అగ్ని లాంటివి నెయ్యి పోసే కొద్దీ మరింత మండుతాయి. అలాగని కలలు కనకూడదా ఎదగకూడదా? ఖచ్చితంగా ఎదగాలి. కలలు కనండి, సంపాదించండి, సృష్టించండి.
(09:00) కానీ ఈ ప్రయాణంలో మీ మనశశాంతిని విజయానికి బలి ఇవ్వవద్దు. మీ ఆరోగ్యాన్ని హోదాకు బలిగా ఇవ్వవద్దు. మీ పిల్లల బాల్యాన్ని, సంపదకు బలిగా ఇవ్వవద్దు. నిజమైన ఎదుగుదల అంటే ఒక మనిషిగా పరిపక్వత సాధించడం. ఈ సృష్టిలో ఎంత డబ్బు ఇచ్చినా కొనలేనిది ఒకటే ఉంది. అది మనశశాంతి ఎక్కడ ఆగాలో తెలుసుకొని నాకున్నది చాలు అని చెప్పగల ధైర్యాన్ని పెంచుకున్న వ్యక్తులే అసలైన మహారాజులు ఎక్కువ సంపాదించిన వ్యక్తి ధనవంతుడు కావచ్చు కానీ చాలు అనగలిగిన వ్యక్తే నిజమైన సంపన్నుడు.
(09:30) ప్రపంచాన్ని జయించిన వ్యక్తి విజేత కావచ్చు కానీ తన మనసును జయించిన వ్యక్తే నిజమైన విజేత. చివరిగా నేను మీకు ఒక ప్రశ్న వదిలి వెళ్తాను. మీరు ఈరోజు చేస్తున్న పరుగు నిజంగా మీ ఆత్మ కోరుకున్న జీవితానికి దారి తీస్తుందా లేక ఇతరుల ప్రశంసల కోసం మీరు నిర్మించుకున్న ఒక బంగారు పంజరానిక ఒకరోజు ఈ జీవితం ముగుస్తుంది. అప్పుడు మీతో పాటు వచ్చేది మీ బ్యాంక్ బ్యాలెన్స్ కాదు మీరు పంచిన ప్రేమ మీరు చేసిన మంచి మాత్రమే అందుకే జీవించండి. కానీ జాగ్రత్తగా జీవించండి.
(09:56) సంపాదించండి కానీ బానిసలు కాకండి ఎదగండి కానీ మనుషులను తొక్కుకుంటూ కాదు ప్రశాంతంగా నిద్రపోగలగడం సంతృప్తిగా నవ్వగలగడం మనస్ఫూర్తిగా ప్రేమించగలగడం మరియు అద్దంలో మీ కళ్ళలోకి మీరు చూసుకుంటూ నేను నిజంగా జీవించాను అని గర్వంగా చెప్పగలగడమే జీవితపు గొప్ప విజయానికి ఏకైక నిర్వచనం. మీకు నా వీడియో అండ్ నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయతే ప్లీజ్ లైక్ అండ్ షేర్ రెగ్యులర్ గా నా వీడియో అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.
(10:32) ఈ టాపిక్ మీద మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి. మీకు నా వీడియో అండ్ నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ రెగ్యులర్ గా నా వీడియో అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా నా YouTube ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కన కనిపిస్తున్న గంట సింబల్ ని నొక్కినట్లయితే నేను ఎప్పుడు నా కొత్త వీడియోని అప్లోడ్ చేసినా అది మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్ కి వస్తుంది.
(10:56) థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థాంక్యూ ఆల్.

No comments:

Post a Comment