*కొందరు హోమానికి కూర్చుని...*
*సరైన సమయం లో ఆహుతి సమర్పణ చేయరు.*
*సకారో సూతకం విద్యాత్వకారే రిపువర్ధనం |*
*హకారే వ్యాధి పీడా చ ఆహుతిః కుత్ర దీయతే ||*
"స్వాహా" అనే శబ్దంలో 'స' కారం ఉచ్చరించే సమయంలో హోమం చేస్తే సూతక దోషం కలుగుతుంది.... 'వ' కారం చెప్పే టప్పుడు హోమం చేస్తే శత్రువు వృద్ధి చెందుతుంది...
'హా' కారం చెప్పే టప్పుడు హోమం చేస్తే వ్యాధి వస్తుంది...
అయితే,
ఎప్పుడు ఆహుతి ఇవ్వాలి అంటే, "స్వాహా"
అని పూర్తిగా ఉచ్చరించిన తర్వాతనే అగ్నిజ్వాల వద్ద హోమం చేస్తే అత్యంత శ్రేష్ఠ మైనది అవుతుంది.
*_-----హోమ లక్షణమ్-----_*
శ్లో॥ *సకారే చ వకారే చ హకారే చ పరిత్యజేత్|*
*స్వాహాస్తే జుహుయా ద్రవ్యం నసన్దేహః కపది౯నా॥*
*కిన్తు॥*
*సకారే పత్నీహాని స్స్యా ద్వకారే ధన నాశనమ్।*
*హ కారే భ్రాతృనాశ స్స్యా దేత దాహుతి లక్షణమ్॥*
*స్వాహాకారే~ ప్యసంపూర్ణే యో జుహోతి హవిర్నరః*
*భార్యాం పుత్రం ధనం ధాన్యం క్షిప్రం స పరిహీయతే|*
*సంపూర్ణే స్వాహాకారే తు హుత్వా విప్రో యథావిధి*
*లభతే సర్వకామాంశ్చ దీర్ఘమాయుశ్చ విన్దతి||*
*_-----తాత్పర్యము-----_*
1. ఎవడైతే "స్వాహాకార" పదం పూర్తిగా ఉచ్చరించకుండానే అగ్నిలో హవిస్సు వేస్తాడో → వాడు త్వరలోనే భార్యను, పుత్రుని, ధనాన్ని, ధాన్యాన్ని పోగొట్టుకుంటాడు....
2. ఎవడైతే "స్వాహా" అని సంపూర్ణంగా పలికి, యథావిధిగా హోమం చేస్తాడో వాడు సర్వ కోరికలు పొందుతాడు, దీర్ఘాయువు కలుగుతుంది...
*ఓం ఓం ఓం ఓం*
No comments:
Post a Comment