Friday, July 17, 2026

🔥 శివోహం: ఈ వీడియో చూసిన తర్వాత మీరు మునుపటి వ్యక్తిలా ఉండరు! #drpasupathirajgurejala

🔥 శివోహం: ఈ వీడియో చూసిన తర్వాత మీరు మునుపటి వ్యక్తిలా ఉండరు! #drpasupathirajgurejala

Author Name:Dr_Pasupathi_Raj_Gurejala

Youtube Channel Url:https://www.youtube.com/@Dr_Pasupathi_Raj_Gurejala

Youtube Video URL:https://www.youtube.com/watch?v=RdH044eBIQg



Transcript:
(00:00) ఈ వీడియో మీ కళ్ళ ముందు వచ్చింది అంటే అది కేవలం ఒక యాదృచ్చికం మాత్రమే కాకపోవచ్చు. మీలో ఎప్పుడో ఒకసారి ఈ విశ్వం ఎక్కడి నుంచి వచ్చింది నేను ఎవరు? సృష్టికి ముందు ఏమి ఉంది అనే ప్రశ్నలు మెదిలి ఉండొచ్చు. బహుశా మీలో ఉన్న అన్వేషణ. మీ ఆలోచన విధానం. సత్యాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాసే మిమ్మల్ని ఈ వీడియో వరకు తీసుకువచ్చి ఉండొచ్చు.
(00:23) ఇది వినోదం కోసం చేసిన సాధారణ వీడియో కాదు. అలాగే ఏ మతాన్ని నిరూపించడానికి లేదా ఏ నమ్మకాన్ని మీపై రుద్దడానికి చేసిన ప్రయత్నం కూడా కాదు వేల సంవత్సరాలుగా ఋషులు అడిగిన ప్రశ్నలను ఈరోజు ఆధునిక శాస్త్రం అన్వేషిస్తున్న ప్రశ్నలను ఒకే ప్రయాణంలో ప్రశాంతంగా పరిశీలించే ప్రయత్నం అందుకే ఈ వీడియోను మిగతా వీడియోల సాధారణంగా చూడకండి ప్రతి మాట వెనుక ఉన్న భావాన్ని గమనించండి.
(00:45) ప్రతి ప్రశ్నను మీలో మీరు ఆలోచించండి. ఎందుకంటే ఈ ప్రయాణం ముగిసే సమయానికి బహుశా విశ్వం గురించి మాత్రమే కాదు మీ గురించి మీకు ఉన్న అవగాహన కూడా మారిపోవచ్చు. ఇప్పుడు ఒక్కసారి ఊహించండి కాలం లేదు, స్థలం లేదు, వెలుగు లేదు, చీకటి లేదు, శబ్దం లేదు, నిశశబ్దం కూడా లేదు, శక్తి లేదు, పదార్థం లేదు, పరమాణువులు లేవు, నక్షత్రాలు లేవు, గెలాక్సీలు లేవు, జీవం లేదు, మరణం లేదు, ఖాళీ కూడా లేదు.
(01:12) ఎందుకంటే ఖాళీ ఉండాలంటే దాని చుట్టూ ఏదో ఒకటి ఉండాలి. కానీ అక్కడ బయట లోపల ముందు తరువాత అనే భావాలే లేవు. దిక్కులు లేవు. దూరం లేదు. కొలత లేదు. కాలమే లేనప్పుడు మార్పు కూడా ఉండదు. కాబట్టి అప్పుడు ఏమి జరిగింది అనే ప్రశ్నకు కూడా అక్కడ అర్థమే ఉండదు. ఈ స్థితిని మన భాషతో పూర్తిగా వర్ణించడం అసాధ్యం. ఎందుకంటే మనం ఉపయోగించే ప్రతి పదం ఈ విశ్వంలో పుట్టింది.
(01:37) ప్రతి ఆలోచన ఈ ప్రపంచ అనుభవాల మీదే నిర్మించబడింది. వెలుగు చీకటితో తెలుస్తుంది. వేడి చలితో తెలుస్తుంది. జీవితం మరణంతో తెలుస్తుంది. చిన్నది పెద్దదితో తెలుస్తుంది. ముందు తరువాతతో తెలుస్తుంది. కానీ రెండోది లేని స్థితిని మన బుద్ధి ఎలా అర్థం చేసుకుంటుంది. పోలిక లేని చోట ఆలోచనకు ఆధారం ఉండదు. అందుకే ఆ స్థితిని నిర్వచించడం కాదు.
(01:58) దాని వైపు చూపించడం మాత్రమే సాధ్యం. వేదాంతం దానిని బ్రహ్మమని పిలిచింది. కాశ్మీర్ శైవం పరమశివుడు అని పిలిచింది. మరికొందరు పరమ చైతన్యం అన్నారు. ఇంకొందరు పరమ సత్యం అన్నారు. ఆధునిక తాత్విక చర్చల్లో కొందరు దానిని ప్యూర్ అవేర్నెస్ లేదా ప్యూర్ కాన్షయస్నెస్ అని కూడా వివరిస్తారు. పేర్లు మారాయి భాషలు మారాయి, సంప్రదాయాలు మారాయి.
(02:20) కానీ అవన్నీ చూపిస్తున్న దిశ ఒక్కటే వర్ణించలేని, విభజించలేని అనంతమైన మూల వాస్తవం. అందుకే భారతీయ ఋషులు తమ అనుభవాన్ని ఒక సిద్ధాంతంలా ప్రకటించలేదు. వారు ప్రశ్నించారు, పరిశీలించారు, మౌనంగా గమనించారు. చివరికి తమకు ప్రత్యక్షమైన దానిని సూచించే ప్రయత్నం మాత్రమే చేశారు. ఋగ్వేదంలోని నాసదీయ సూక్తం ఈ వినయానికి గొప్ప ఉదాహరణ. అప్పుడు సత్ లేదు, అసత్ లేదు అంటే ఉంది అనే భావన కూడా లేదు లేదు అనే భావన కూడా లేదు. దేవతలు కూడా లేరు.
(02:47) ఎందుకంటే దేవతలు కూడా సృష్టి తర్వాతే ప్రత్యక్షమయ్యారు. ఇది ఒక పురాణ కథ కాదు. మానవ ఆలోచన చరిత్రలో అత్యంత ధైర్యమైన తాత్విక ప్రకటనలలో ఒకటి. మనిషి బుద్ధి చేరలేని సరిహద్దును నిజాయితీగా అంగీకరించిన గొప్ప మేధో వినయం. ఉపనిషత్తులు అదే సత్యాన్ని మరో భాషలో వ్యక్తం చేశాయి. ఏకమేవా ద్వితీయం ఒకటే ఉంది.
(03:10) రెండోది లేదు మొదట వినగానే ఇది ఒక మత ప్రకటనలా అనిపించవచ్చు. కానీ ఇది మతాన్ని దాటి వెళ్ళే తాత్విక ప్రశ్న. ఎందుకంటే మన అనుభవం అంతా భేదాల మీదే నిలబడి ఉంది. నేను మరియు నువ్వు లోపల మరియు బయట. జీవం మరియు జడ. సుఖం మరియు దుఃఖం. కానీ రెండోది లేని స్థితిలో భేదానికి చోటు లేదు. భేదం లేకపోతే పోలిక ఉండదు. పోలిక లేకపోతే ఆలోచన కూడా నిలిచిపోతుంది.
(03:35) అక్కడ మనసు మొదటిసారి తన పరిమితిని గుర్తిస్తుంది. ఇక్కడ చెప్పబడుతున్న శివుడు మనం ఆలయాల్లో చూసే రూపం కాదు. జటాజూటం ధరించిన దేవుడు కాదు, త్రిశూలం పట్టుకున్న వ్యక్తి కాదు, మెడలో నాగును ధరించిన ఒక దైవ స్వరూపం కాదు, అవన్నీ తరువాత కాలంలో ఈ తత్వాన్ని అర్ధం చేసుకోవడానికి ఏర్పడిన ప్రతీకలు. ఈ తత్వం చెప్పే శివుడు రూపానికి ముందున్న సత్యం భాగాలు లేనివాడు కాబట్టి నిష్కలుడు గుణాలు లేనివాడు కాబట్టి నిర్గుణుడు వ్యక్తం కాలేదు కాబట్టి అవ్యక్తుడు మార్పు లేనివాడు కాబట్టి నిర్వికారుడు రెండోది లేనివాడు కాబట్టి అద్వయుడు ఇవి పేర్లు కాదు అనంతాన్ని పరిమిత భాషలో సూచించడానికి
(04:08) చేసిన ప్రయత్నాలు మాత్రమే ఈ స్థితిని చాలా మంది శూన్యం అని పిలుస్తారు. కానీ ఇక్కడ శూన్యం అంటే ఖాళీ కాదు ఏమీ లేకపోవడం కాదు. అన్ని అవకాశాలు దాగి ఉన్న అనంత సంభావ్యత. ఒక చిన్న విత్తనంలో మహా వృక్షం దాగి ఉన్నట్లుగా ఒక సంగీతం మొత్తం మొదటి నిశబ్ద క్షణంలో దాగి ఉన్నట్లుగా ఒక శిల్పం మొత్తం శిలలో దాగి ఉన్నట్లుగా ఈ విశ్వం మొత్తం కూడా ఆ అవ్యక్త స్థితిలో సంభావ్యతగా మాత్రమే ఉంది.
(04:33) వ్యక్తంగా కాదు ఇక్కడే ఒక గొప్ప ప్రశ్న మన ముందుకు వస్తుంది పరిపూర్ణమైనది ఎందుకు వ్యక్తమవుతుంది సంపూర్ణమైన దానికి ఇంకేం కావాలి ఈ ప్రశ్న వేల సంవత్సరాలుగా తత్వవేత్తలను ఆలోచింపజేసింది. కాశ్మీర్ శైవం ఇచ్చిన సమాధానం చాలా సున్నితమైనది సృష్టి అవసరం వల్ల కాదు లోటు వల్ల కాదు అసంపూర్ణత వల్ల కాదు అది లీల సహజ వ్యక్తీకరణ ఒక పువ్వు ఎందుకు వికసిస్తుంది అని అడిగితే దానికి ప్రత్యేక కారణం ఉండదు వికసించడం దాని స్వభావం సూర్యుడు ఎందుకు వెలుగుతాడు అని అడిగితే వెలుగు అతని స్వభావం అలాగే పరమ చైతన్యం కూడా తనను తాను వ్యక్తపరచుకోవడం దాని సహజ స్వభావమే అని ఈ తత్వం చెబుతుంది.
(05:08) ఉపనిషత్తులలో కనిపించే బహుసాం ప్రజాయేయ అనే భావన కూడా ఇదే దిశను సూచిస్తుంది. నేను అనేకం అవుదాం. ఈ వాక్యాన్ని కొందరు కోరికగా అర్థం చేసుకుంటారు. కానీ అద్వైతం మరియు కాశ్మీర్ శైవ సంప్రదాయాలు దానిని లోటు తీర్చుకోవాలనే కోరికగా చూడవు. అది సంపూర్ణత యొక్క సహజ విస్తరణ. పరిపూర్ణమైన దానికి ఏదీ అవసరం లేదు. కానీ తనను తాను వ్యక్తపరుచుకోవడానికి ఎలాంటి అడ్డంకి కూడా లేదు.
(05:36) ఆ వ్యక్తీకరణకి శక్తి అనే పేరు వచ్చింది. శక్తి శివునికి వేరుగా ఉన్న మరో వస్తువు కాదు శివుడి స్వభావమే శక్తి అగ్నికి వేడిని ఎలా విడదీయలేమో సూర్యుడికి కాంతిని ఎలా విడదీయలేమో అలాగే శివుడికి శక్తిని కూడా విడదీయలేము. శివుడు స్వప్రకాశమైన చైతన్యం అయితే శక్తి ఆ చైతన్యం తనను తాను తెలుసుకునే స్వయం జ్ఞానం. తనను తాను వ్యక్తపరుచుకునే అనంత సామర్థ్యం.
(05:58) ఇక్కడి నుంచే భారతీయ సంప్రదాయంలో కనిపించే ఎన్నో పురాణ ప్రతీకలు మరింత లోతైన అర్థాన్ని పొందడం ప్రారంభిస్తాయి. అర్ధనారీశ్వర స్వరూపం శివుడు మరియు శక్తి రెండు వేరువేరు సత్తాలు కాదని ఒకే పరమ వాస్తవానికి చెందిన విడదీయరాని రెండు కోణాలని సూచిస్తుంది. అదే భావాన్ని పురాణాలు శివపార్వతి కళ్యాణం ద్వారా మరో రూపంలో వ్యక్తపరిచాయి. బయటకు అది ఒక దైవ వివాహంగా కనిపించిన తాత్విక దృష్టిలో అది చైతన్యం మరియు దాని వ్యక్తీకరణ ఎప్పటికీ విడిపోని ఏకత్వానికి ప్రతీకగా కూడా అర్థం చేసుకోబడింది.
(06:27) కాశ్మీర్ శైవం మరియు భారతీయ తాత్విక వ్యాఖ్యానాలలో ఈ ప్రతీకలు కేవలం కథలు కాదు. అనుభవంతో గ్రహించాల్సిన తత్వానికి సంకేతాలు. ఇదే భావం తరువాత సాంఖ్య తత్వంలో పురుషుడు మరియు ప్రకృతి అనే రూపంలో మరో భాషలో వ్యక్తమవుతుంది. పదాలు మారినా ప్రతీకలు మారినా సూచిస్తున్న మూల సత్యం మాత్రం ఒకటే నిశ్చలంగా కనిపించే ఈ అనంత చైతన్యంలో మొదటిసారి ఒక అంతర్గత స్పందన కలిగింది.
(06:54) దీనినే కాశ్మీర్ శైవం స్పంద అని పిలుస్తుంది. ఇది భౌతిక శబ్దం కాదు గాలిలో ప్రయాణించే తరంగం కాదు పదార్థ ప్రకంపనం కాదు చైతన్యం తనను తాను గమనించడం ప్రారంభించిన మొదటి అంతర్గత కదలిక సృష్టి యొక్క మొదటి హృదయ స్పందన ఇక్కడ చాలా మంది ఒక పెద్ద పొరపాటు చేస్తారు. స్పందన అంటే ఇదే ఆధునిక క్వాంటం వైబ్రేషన్ అని నేరుగా చెప్పేస్తారు. కానీ అలా చెప్పడానికి ఇప్పటివరకు శాస్త్రీయ ఆధారాలు లేవు.
(07:17) ఆధునిక భౌతిక శాస్త్రం పదార్థాన్ని పరిశీలిస్తుంది. కాశ్మీర్ శైవం చైతన్యాన్ని పరిశీలిస్తుంది. రెండు వేరువేరు పద్ధతులను అనుసరిస్తాయి కొన్ని భావ సారూప్యాలు కనిపించవచ్చు కొన్ని రూపకాలు ఒకదానిని మరొకటి గుర్తు చేయవచ్చు కానీ అవి ఒకటేనని ప్రకటించడం శాస్త్రీయంగాను తాత్వికంగాను సరైన విధానం కాదు అయితే ఒక ఆశ్చర్యకరమైన విషయం మాత్రం కనిపిస్తుంది.
(07:40) వేల సంవత్సరాల క్రితం ఋషులు అడిగిన ప్రశ్న కూడా ఇదే. ఈరోజు ఆధునిక శాస్త్రం అడుగుతున్న ప్రశ్న కూడా ఇదే. అన్నిటికీ మూలం ఏమిటి? సమాధానాలు వేరు కావచ్చు పరిశోధన పద్ధతులు వేరు కావచ్చు భాషలు వేరు కావచ్చు కానీ అన్వేషణ మాత్రం ఒకటే అదే మనిషిని మిగతా జీవుల నుండి ప్రత్యేకంగా నిలబెడుతుంది. ప్రశ్నించే శక్తి తెలియని దాన్ని తెలుసుకోవాలని తపన. కనిపిస్తున్న దాని వెనుక కనిపించని మూలాన్ని వెతకాలనే ఆరాటం.
(08:03) ఈ పరిమితీకరణతో అనంతమైన చైతన్యం క్రమంగా వ్యక్తిగత అనుభవంగా ప్రత్యక్షమవుతుంది. ఇక్కడ సాంఖ్య తత్వంలో చెప్పిన ప్రకృతి మరియు పురుష భావనలు కూడా ప్రాధాన్యం పొందుతాయి. పురుషుడు అంటే పరిమిత చైతన్యం. ప్రకృతి అంటే వ్యక్తీకరణకు ఆధారం ఈ రెండింటి పరస్పర సంబంధంతో విశ్వ వైవిధ్యం క్రమంగా అనుభవంలోకి వస్తుంది. ఆ తరువాత మహత్ ఉద్భవిస్తుంది.
(08:25) మహత్ అంటే విశ్వబుద్ధి ఇది ఒక వ్యక్తి తెలివి కాదు విశ్వ నిర్మాణంలో అంతర్లీనంగా ఉన్న క్రమబద్ధత. గణితంలో కనిపించే సమన్వయం ప్రకృతిలో కనిపించే నియమం జీవ పరిణామంలో కనిపించే నిర్మాణం. ఇవన్నీ మహత్త అనే భావనను అర్థం చేసుకోవడానికి సహాయపడే ఉదాహరణలు మాత్రమే. దాని తరువాత అహంకారం ప్రత్యక్షమవుతుంది. ఇక్కడ అహంకారం అంటే గర్వం కాదు నేను అనే వ్యక్తిగత గుర్తింపు అనంతమైన చైతన్యంలో మొదటిసారి నేను మరియు ఇది అనే భేదం అనుభవించబడిన క్షణం.
(08:54) అదే వ్యక్తిగత అనుభవానికి ఆరంభం. ఈ భావనను అర్థం చేసుకోవడానికి మన జీవితంలో ప్రతిరోజూ జరిగే ఒక అనుభవాన్ని గమనించండి. గాడ నిద్రలో ఉన్నప్పుడు మనకు ప్రపంచం తెలియదు. కాలం తెలియదు. నేను అనే భావన కూడా ఉండదు. కానీ మేల్కొన్న వెంటనే మొదట ప్రత్యక్షమయ్యేది ప్రపంచం కాదు నేను అని అనుభూతి దాని తరువాతే కుటుంబం గుర్తుకు వస్తుంది. పని గుర్తుకు వస్తుంది.
(09:15) బాధ్యతలు గుర్తుకు వస్తాయి. ప్రపంచం మళ్ళీ ప్రత్యక్షమవుతుంది. ప్రతి ఉదయం మనలో ఒక చిన్న సృష్టి జరిగినట్లుగా అనిపిస్తుంది. ఇది విశ్వ సృష్టికి శాస్త్రీయ నిరూపణ కాదు. అలాగే వ్యక్తిగత అనుభవం మరియు విశ్వ సృష్టి ఒకటేనని చెప్పడం కూడా కాదు. కానీ ఒక లోతైన తాత్విక భావనను మన ప్రత్యక్ష అనుభవంతో అనుసంధానించి అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే అందమైన రూపకం అహంకారం తరువాత మనసు ప్రత్యక్షమవుతుంది బుద్ధి ప్రత్యక్షమవుతుంది ఇంద్రియాలు ప్రత్యక్షమవుతాయి తన్మాత్రలు ఉద్భవిస్తాయి.
(09:45) చివరకు పంచభూతాలు వ్యక్తమవుతాయి. ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి ఈ క్రమంలో చైతన్యం క్రమంగా సాంద్రమైన వ్యక్తీకరణగా మనం అనుభవిస్తున్న భౌతిక విశ్వంలా ప్రత్యక్షమవుతుంది. అందుకే కాశ్మీర్ శైవం ఒక విప్లవాత్మకమైన భావనను ప్రతిపాదిస్తుంది. పదార్థం అనేది చైతన్యానికి వ్యతిరేకం కాదు. చైతన్యమే అత్యంత సాంద్రమైన వ్యక్తీకరణగా పదార్థం కనిపిస్తోందని చెబుతుంది.
(10:10) అంటే రాయి, చెట్టు, నక్షత్రం, గ్రహం, శరీరం ఇవన్నీ వేరువేరు మూలాల నుండి వచ్చినవి కావు. ఒకే అనంత చైతన్యం యొక్క విభిన్న వ్యక్తీకరణాలు అని ఈ తత్వం ప్రతిపాదిస్తుంది. ఇక్కడ ఆధునిక శాస్త్రం పూర్తిగా వేరొక దృక్కోణాన్ని అందిస్తుంది. ప్రస్తుతం కాస్మాలజీ ప్రకారం విశ్వం 13.8 8 బిలియన్ ఇయర్స్ ఎగో అనగా సుమారుగా ఒక 1000 1380 కోట్లు సంవత్సరాల క్రితం అత్యంత వేడి మరియు సాంద్ర స్థితి నుండి విస్తరించడం ప్రారంభించింది.
(10:39) ఆ తరువాత ఉపపరమాణు కణాలు ఏర్పడ్డాయి. పరమాణువులు పుట్టాయి. మొదటి నక్షత్రాలు వెలిగాయి. వాటి గర్భంలో కార్బన్, ఆక్సిజన్, ఇనుము వంటి భారమైన మూలకాలు ఏర్పడ్డాయి. ఆ మూలకాలతో గ్రహాలు పుట్టాయి. భూమిపై జీవం ఆవిర్భవించింది. కోట్ల సంవత్సరాల పరిణామ క్రమంలో సంక్లిష్టమైన జీవులు అభివృద్ధి చెందాయి. చివరకు మానవ మెదడు ఏర్పడింది. ఇది పరిశీలనలు గణితం ప్రయోగాలు ఖగోళ పరిశోధనల ఆధారంగా రూపొందించిన ఆధునిక విజ్ఞాన శాస్త్రంలోని అత్యంత విజయవంతమైన నమూనాలలో ఒకటి అయినప్పటికీ ఒక ప్రశ్న ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదు.
(11:12) పదార్థం నుండి చైతన్యం ఎలా ఉద్భవించింది? జీవరసాయన ప్రక్రియలు ఎలా ప్రత్యక్ష అనుభవంగా మారాయి? ఈ ప్రశ్న ఇప్పటికీ శాస్త్రంలో పరిశోధనలోనే ఉంది. ఇక్కడ రెండు త్రికోణాలు ఎదురెదురుగా కనిపిస్తాయి. కాశ్మీర్ శైవం చైతన్యం నుంచే పదార్థం వ్యక్తమైందని ప్రతిపాదిస్తుంది. ఆధునిక శాస్త్రంలోని ప్రధాన నమూనాలు పదార్థ పరిణామం ద్వారా చైతన్యం ఉద్భవించిందని పరిశీలిస్తున్నాయి.
(11:32) ప్రస్తుతం ఈ రెండింటిలో ఏది అన్ని స్థాయిల్లో తుది సమాధానంగా నిరూపించబడలేదు. అందుకే ఇక్కడ వినయం అవసరం. తొందరగా ఒకదాన్ని గెలిపించడం కాదు. రెండు ఏ ప్రశ్నలకు సమాధానం వెతుకుతున్నాయో అర్థం చేసుకోవడం ముఖ్యం. అయితే ఈ రెండు మార్గాల మధ్య ఒక అందమైన సారూప్యత కూడా ఉంది. రెండు విశ్వాన్ని అర్థం చేసుకోవాలనే ప్రయత్నాలే.
(11:53) ఒకటి బయట ప్రపంచాన్ని పరిశీలిస్తుంది. మరొకటి లోపలి అనుభవాన్ని పరిశీలిస్తుంది. ఒకటి పరిశీలనలు గణితం, ప్రయోగశాలలను ఆశ్రయిస్తుంది. మరొకటి ధ్యానం, అంతర్ముఖ పరిశీలన. ప్రత్యక్ష అనుభవాన్ని ఆశ్రయిస్తుంది. పద్ధతులు వేరు భాషలు వేరు కానీ సత్యాన్వేషణ మాత్రం రెండింటి గుండెలో ఒకటే. ఇప్పుడు మరో ప్రశ్న సహజంగా వస్తుంది. ఒకే చైతన్యం ఉంటే ఈ విశ్వంలో ఇన్ని రూపాలు ఎందుకు కనిపిస్తున్నాయి? ఒకే సత్యం ఉంటే ఇన్ని భేదాలు ఎందుకు అనుభవంలోకి వస్తున్నాయి? కాశ్మీర్ శైవం దీనికి ఒక అందమైన రూపకాన్ని ఇస్తుంది.
(12:25) ఒకే సూర్యుడు వందల నీటి బిందువులలో ప్రతిబింబిస్తే వందల సూర్యులు కనిపిస్తారు. కానీ నిజానికి సూర్యుడు ఒక్కడే అలాగే ఒకే అనంత చైతన్యం అనేక జీవులుగా అనుభవంలో ప్రత్యక్షమవుతోంది. బేదం అనుభవంలో ఉంది. మూలంలో కాదు. అయితే ఈ భావనను కూడా గుడ్డిగా నమ్మమని ఈ తత్వం చెప్పదు. వినడం మొదటి అడుగు మాత్రమే. ఆలోచించడం రెండవ అడుగు. ప్రత్యక్షంగా గమనించడం అసలు ప్రయాణం ఎందుకంటే తత్వశాస్త్రం చివరికి ఒక నమ్మకం కాదు ఒక అన్వేషణ ఒక సిద్ధాంతం కాదు ఒక ప్రత్యక్ష పరిశీలన ఈ అన్వేషణ ఇప్పుడు మనలను భారతీయ తత్వశాస్త్రంలోని అత్యంత శక్తివంతమైన ప్రతీకలలో ఒకటైన అనంత జ్యోతిర్లింగ కథ
(13:02) దగ్గరకు తీసుకువెళ్తుంది. బయటకు చూస్తే అది ఒక పురాణం మాత్రమే అనిపిస్తుంది. కానీ లోపల దాగి ఉన్న సందేశం మానవ బుద్ధి యొక్క పరిమితి గురించి చెప్పే అత్యంత లోతైన తాత్విక రూపకాలలో ఒకటి. ఒకరోజు బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య ఒక ప్రశ్న తలెత్తింది ఎవరు గొప్పవారు ఎవరు ఆది ఎవరు అంతం ఆ ప్రశ్నకు సమాధానంగా వారి ముందు ఒక అనంతమైన జ్యోతిర్లింగం ప్రత్యక్షమైందని పురాణం చెబుతుంది.
(13:29) అది పైకి ఎంత వెళుతుందో కనిపించలేదు. కిందికి ఎంత దిగుతుందో కనిపించలేదు. బ్రహ్మ హంస రూపంలో పైకి ఎగిరాడు. విష్ణువు వరాహ రూపంలో లోతులకు దిగాడు. ఎంత అన్వేషించినా ఎంత ప్రయత్నించినా ఆ అనంత జ్యోతికి ఆది కనిపించలేదు. అంతం కనిపించలేదు. చివరికి ఇద్దరు తిరిగి వచ్చి తమ పరిమితిని అంగీకరించారు. అప్పుడు మాత్రమే ఆ జ్యోతి శివ స్వరూపంగా ప్రత్యక్షమైందని ఈ కథ చెబుతుంది.
(13:53) ఈ కథను చారిత్రక సంఘటనగా నిరూపించే ఆధారాలు లేవు. కానీ తాత్వికంగా చూస్తే ఇది భారతీయ ఆలోచనా సంప్రదాయంలో అత్యంత శక్తివంతమైన రూపకాలలో ఒకటి. ఎందుకంటే ఇక్కడ బ్రహ్మ ఒక దేవత మాత్రమే కాదు తెలుసుకోవాలని ప్రయత్నించే బుద్ధికి ప్రతీక. విష్ణువు ఒక దేవత మాత్రమే కాదు అనుభవాన్ని సంపూర్ణంగా గ్రహించాలని ప్రయత్నించే మనసుకు ప్రతీక. ఈ రెండు ఎంత ప్రయత్నించినా అనంతాన్ని పూర్తిగా కొలవలేవు.
(14:19) ఎందుకంటే పరిమితమైన సాధనం అనంతమైన వాస్తవాన్ని సంపూర్ణంగా గ్రహించలేదు. ఒక్కసారి ఆలోచించండి. ఒక చిన్న గ్లాసులో సముద్రం మొత్తాన్ని నింపగలమా? ఒక చిన్న అద్దంలో ఆకాశం మొత్తాన్ని బంధించగలమా? అలాగే పరిమితమైన మనసు అనంతమైన సత్యాన్ని పూర్తిగా బంధించలేకపోవడం సహజమే. దీని అర్థం మనిషి బుద్ధి పనికి రాదని కాదు, దానికి కూడా ఒక పరిమితి ఉందని మాత్రమే.
(14:41) ఆ పరిమితిని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానానికి ప్రారంభం. ఈ విషయం మానవ చరిత్రలో కూడా మళ్ళీ మళ్ళీ కనిపిస్తుంది. ప్రతి నాగరికత విశ్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది. ప్రతి తత్వశాస్త్రం మూలాన్ని వెతికింది. ప్రతి మతం పరమ సత్యాన్ని వివరించడానికి ప్రయత్నించింది. ఆధునిక శాస్త్రం కూడా అదే అన్వేషణను కొనసాగిస్తోంది.
(14:59) కానీ ప్రతి సమాధానం వెనుక మరో కొత్త ప్రశ్న పుడుతోంది. జ్ఞానం పెరిగే కొద్దీ తెలియని ప్రపంచం ఇంకా పెద్దదిగా కనిపిస్తోంది. అందుకే నిజమైన శాస్త్రవేత్తకు కూడా వినయం ఉంటుంది. నిజమైన తత్వవేత్తకు కూడా వినయం ఉంటుంది. ఎందుకంటే ఎంత తెలుసుకున్నా ఇంకా తెలియనిది ఎంతో ఉందని ఇద్దరికీ తెలుసు ఈ కథలో అసలు మలుపు బ్రహ్మ మరియు విష్ణువు వెతకడంలో లేదు వారు తమ పరిమితిని గుర్తించడంలో ఉంది.
(15:22) ఇక్కడ శరణాగతి అంటే ఆలోచించడం మానేయడం కాదు బుద్ధిని వదిలేయడం కాదు తనకు తెలిసింది పరిమితమే అని నిజాయితీగా అంగీకరించడం తర్కాన్ని తిరస్కరించడం కాదు తర్కం ఎక్కడి వరకు తీసుకెళ్తుందో తెలుసుకోవడం అక్కడి నుండి ప్రత్యక్ష అనుభవానికి అవకాశం ఇవ్వడం అందుకే భారతీయ తత్వశాస్త్రం జ్ఞానాన్ని రెండు స్థాయిలుగా చూసింది. ఒకటి వినడం చదవడం, ఆలోచించడం ద్వారా వచ్చే జ్ఞానం.
(15:43) రెండవది ప్రత్యక్ష అనుభవం ద్వారా వెలిసే జ్ఞానం. తేనె తీపిగా ఉంటుందని 1000 పుస్తకాలు చదివినా ఒక చుక్క తేనె రుచి చూసిన అనుభవానికి అది సమానం కాదు అలాగే పరమ సత్యం గురించి ఎంత విన్నా ఎంత చదివినా ఎంత చర్చించినా ప్రత్యక్ష అనుభవం లేకపోతే అది సమాచారం మాత్రమే రూపాంతరం కాదు ఇక్కడే కాశ్మీర్ శైవ తత్వంలోని అత్యంత గొప్ప భావన అయినా ప్రత్యభిజ్ఞ ప్రత్యక్షమవుతుంది.
(16:06) ప్రత్యభిజ్ఞ అంటే కొత్తగా ఏదైనా పొందడం కాదు ఎప్పటి నుంచో ఉన్న సత్యాన్ని మళ్ళీ గుర్తించడం మరచిపోయిన స్వరూపాన్ని తిరిగి తెలుసుకోవడం ఒక అద్దం మీద సంవత్సరాల పాటు దుమ్ము పేరుకు పోయిందని ఊహించండి ఆ దుమ్ము వల్ల అద్దం తన ప్రతిబింబాన్ని స్పష్టంగా చూపించలేకపోతుంది కానీ దుమ్ము తుడిచిన క్షణంలో అద్దానికి కొత్తగా ప్రతిబింబించే శక్తి రాలేదు ఆ శక్తి మొదటి నుంచే అక్కడే ఉంది.
(16:32) తొలగింది ఒక్కటే దానిని కప్పి ఉంచిన పొర. అలాగే కాశ్మీర్ శైవం ప్రకారం ప్రతి జీవి పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. మనం మన అసలు స్వరూపాన్ని కోల్పోలేదు. కేవలం మర్చిపోయాం. ప్రత్యభిజ్ఞ అంటే కొత్తగా ఏదైనా సాధించడం కాదు ఎప్పటి నుంచో ఉన్న మన నిజ స్వరూపాన్ని ప్రత్యక్షంగా గుర్తించడం. ఈ మరచిపోవడాన్నే మాయ అంటారు. ఇక్కడ మాయ అంటే ప్రపంచం అబద్ధం అని కాదు.
(16:52) పరిమిత దృష్టి వల్ల సంపూర్ణ సత్యం పూర్తిగా కనిపించకపోవడం. ఒక తెల్లని కాంతి ప్రిజం గుండా వెళ్తే ఏడు రంగులుగా విడిపోయినట్లు కనిపిస్తుంది. ఆ రంగులు అబద్ధం కావు కానీ అవి వేరు వేరు కాంతులు కూడా కావు. ఒకే కాంతి యొక్క విభిన్న వ్యక్తీకరణలు అలాగే ఈ విశ్వంలో కనిపిస్తున్న వైవిధ్యం కూడా ఒకే చైతన్యం యొక్క అనేక రూపాలుగా ఈ తత్వం చూస్తుంది.
(17:15) మన జీవితాన్ని కూడా ఒకసారి గమనించండి. పుట్టినప్పుడు మనకు పేరు తెలియదు, మతం తెలియదు, దేశం తెలియదు, జాతి తెలియదు, విజయాలు తెలియవు, అపజయాలు తెలియవు. క్రమంగా కుటుంబం ఒక పేరు ఇస్తుంది. సమాజం ఒక గుర్తింపును ఇస్తుంది. విద్య ఇంకొక గుర్తింపును ఇస్తుంది. వృత్తి ఇంకొక గుర్తింపును ఇస్తుంది. ఈ గుర్తింపులన్నీ కలిసి నేను అనే ఒక కథను నిర్మిస్తాయి.
(17:36) కొంత కాలానికి ఆ కథనే మన అసలు స్వరూపం అని నమ్మడం ప్రారంభిస్తాం. కానీ ఒక ప్రశ్న మాత్రం మిగిలిపోతుంది. ఈ కథ మొత్తాన్ని గమనిస్తున్నది ఎవరు? పేరు మారుతుంది శరీరం మారుతుంది బాల్యం మారుతుంది యవ్వనం మారుతుంది వృద్ధాప్యం వస్తుంది ఆలోచనలు మారుతాయి అభిప్రాయాలు మారుతాయి భావోద్వేగాలు మారుతాయి జ్ఞాపకాలు కూడా మారుతాయి కానీ ఈ మార్పులు అన్నింటిని గమనిస్తున్నది ఏమిటి ఇదే ప్రశ్న భారతీయ తత్వశాస్త్రానికి కేంద్ర బిందువు ఇదే ప్రశ్న మనలను చైతన్యం అనే అత్యంత లోతైన రహస్యం వైపు నడిపిస్తుంది.
(18:06) బయట ప్రపంచాన్ని తెలుసుకోవడానికి మనిషి వేలాది పరికరాలను కనిపెట్టాడు. టెలిస్కోప్ కనిపెట్టాడు. సూక్ష్మ దర్శని కనిపెట్టాడు. కణ వేగవంతక యంత్రాలను నిర్మించాడు. అంతరిక్ష నౌకలను పంపించాడు. కానీ తనను తాను తెలుసుకోవడానికి మాత్రం ఒకే సాధనం ఉంది. అవగాహన అందుకే భారతీయ తత్వశాస్త్రం వేల సంవత్సరాలుగా బయట ప్రపంచం కంటే తెలుసుకుంటున్న వాడినే పరిశీలించడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది.
(18:29) ఇప్పుడు ఈ మొత్తం ప్రయాణం మనలను అత్యంత క్లిష్టమైన ప్రశ్న ముందు నిలబెడుతోంది. చైతన్యం అంటే అసలు ఏమిటి? అది కేవలం మెదడు సృష్టించిన ఒక జీవరసాయన ప్రక్రియ మాత్రమేనా? లేక మెదడు కూడా చైతన్యంలో ప్రత్యక్షమవుతున్న ఒక అనుభవమా ఈ ప్రశ్న వేల సంవత్సరాలుగా తత్వవేత్తలను ఆలోచింపజేస్తోంది. ఈరోజు కూడా ప్రపంచంలోని ప్రముఖ శాస్త్రవేత్తలను అదే ప్రశ్న ఆలోచింపజేస్తోంది.
(18:51) ఆధునిక న్యూరో సైన్స్ మెథడ్ను అత్యంత సూక్ష్మంగా పరిశీలిస్తోంది. కోట్లాది న్యూరాన్లు ఎలా అనుసంధానమై ఉన్నాయో తెలుసుకుంటోంది. విద్యుత్ సంకేతాలు ఎలా ప్రయాణిస్తున్నాయో అధ్యయనం చేస్తోంది. జ్ఞాపకాలు ఎలా ఏర్పడుతున్నాయో భావోద్వేగాలు ఎలా మారుతున్నాయో నిర్ణయాలు ఎలా తీసుకుంటామో భాష ఎలా ఏర్పడుతుందో ఎన్నో విషయాలను అద్భుతమైన ఖచితత్వంతో వివరిస్తోంది.
(19:14) మనిషి మెదడు గురించి ఈరోజు మనకి తెలిసిన జ్ఞానం గతంలో ఎన్నడూ లేనంత విస్తరించింది. అయినప్పటికీ ఒక ప్రశ్న ఇంకా అలాగే మిగిలిపోయింది. మెదడులో జరిగే విద్యుత్ సంకేతాలు ఎలా ప్రత్యక్ష అనుభవంగా మారుతున్నాయి? ఎరుపు రంగును చూసినప్పుడు ఎరుపు అనే అనుభూతి ఎందుకు కలుగుతోంది? సంగీతం విన్నప్పుడు ఆనందం ఎందుకు పుడుతోంది? బాధ కేవలం నాడీ సంకేతం మాత్రమే కాకుండా నిజంగా ఎందుకు అనుభూతి అవుతోంది? ముఖ్యంగా నేను ఉన్నాను అనే ప్రత్యక్ష అవగాహన ఎక్కడి నుండి వస్తోంది? ఈ ప్రశ్నకే ఆధునిక తత్వశాస్త్రం హార్డ్ ప్రాబ్లం ఆఫ్ కాన్షస్నెస్ అనే పేరు ఇచ్చింది.
(19:46) దీనికి ఇప్పటివరకు సర్వసమ్మతమైన శాస్త్రీయ సమాధానం లేదు. ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి. ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ చైతన్యం యొక్క అసలు స్వరూపం ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. ఇక్కడ భారతీయ తత్వశాస్త్రం పూర్తిగా భిన్నమైన దిశలో ఆలోచిస్తుంది. చైతన్యం ఎలా పుట్టిందని అడగకుండా చైతన్యమే ప్రాథమిక వాస్తవం అయితే ఎలా ఉంటుందనే ప్రశ్నను ముందుకు తీసుకొస్తుంది.
(20:07) ఇది నిరూపితమైన శాస్త్రీయ నిర్ణయం కాదు అలాగే ఆధారం లేని ఊహ కూడా కాదు వేల సంవత్సరాలుగా ధ్యానం. అంతర్ముఖ పరిశీలన ప్రత్యక్ష అనుభవం ఆధారంగా అభివృద్ధి చెందిన ఒక తాత్విక నమూనా. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. శాస్త్రం మరియు ఆధ్యాత్మికత ఒకదానికొకటి శత్రువులు కావు. అవి ఒకే ప్రశ్నకు సమాధానం చెప్పడం లేదు. శాస్త్రం ప్రకృతి నియమాలను పదార్థాన్ని విశ్వ పరిణామాన్ని పరిశీలిస్తుంది.
(20:31) ఆధ్యాత్మిక సాధన ప్రత్యక్ష అనుభవాన్ని అవగాహనను, నేను అనే అనుభూతి యొక్క మూలాన్ని పరిశీలిస్తుంది. పద్ధతులు వేరు లక్ష్యాలు వేరు కానీ సత్యాన్ని తెలుసుకోవాలనే తపన మాత్రం రెండింటిలోనూ ఒకటే. ఈ మొత్తం ప్రయాణంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మనిషి విశ్వాన్ని ఎంత లోతుగా పరిశీలించినా చివరికి తనను తాను తప్పించుకోలేడు.
(20:52) ప్రతి పరిశీలన వెనుక ఒక పరిశీలకుడు ఉంటాడు. ప్రతి ఆలోచన వెనుక ఒక అవగాహన ఉంటుంది. ప్రతి అనుభవం వెనుక నేను అనుభవిస్తున్నాను అనే ప్రత్యక్ష సాక్షి ఉంటుంది. ఈ సాక్షి యొక్క స్వరూపమే భారతీయ తత్వశాస్త్రం వేల సంవత్సరాలుగా పరిశీలిస్తున్న అసలు విషయం. ఒక్కసారి ప్రశాంతంగా గమనించండి. మీరు ఒక ఆలోచనను గమనించగలరు.
(21:14) అంటే మీరు ఆ ఆలోచన మాత్రమే కాదు. మీరు ఒక భావోద్వేగాన్ని గమనించగలరు. అంటే మీరు ఆ భావోద్వేగం మాత్రమే కాదు మీరు శరీరంలో జరిగే మార్పులను కూడా గమనించగలరు. అంటే మీరు శరీరం మాత్రమే కూడా కాదు ఎందుకంటే గమనించబడుతున్నది ఒకటైతే గమనిస్తున్నది మరోటి కావాలి. ఇదే పరిశీలన మనిషిని బయట ప్రపంచం నుండి లోపలి ప్రపంచం వైపు తిప్పుతుంది.
(21:36) అందుకే ధ్యానం అంటే కొత్త అనుభవాలను సృష్టించడం కాదు. ప్రపంచం నుండి పారిపోవడం కాదు. ఆలోచనలను బలవంతంగా ఆపేయడం కాదు. ప్రతి అనుభవాన్ని వెలిగిస్తున్న అవగాహనను గుర్తించడం. ఆలోచనలు రావచ్చు వెళ్ళిపోవచ్చు భావోద్వేగాలు మారవచ్చు శరీరం మారవచ్చు కానీ ఈ మార్పులు అన్నింటిని గమనిస్తున్న సాక్షి గురించి ఎప్పుడైనా మనం ప్రశ్నించామా భారతీయ తత్వశాస్త్రం ప్రకారం అసలు అన్వేషణ అక్కడే ప్రారంభం అవుతుంది.
(22:01) కాశ్మీర్ శైవం చెప్పే ప్రత్యభిజ్ఞ ఇక్కడే తన పరిపూర్ణ అర్థాన్ని పొందుతుంది. మోక్షం అంటే ఎక్కడికో వెళ్ళడం కాదు. మరణం తరువాత లభించే స్థితి కాదు. కొత్తగా ఏదైనా సంపాదించడం కాదు. ఎప్పటి నుంచో ఉన్న స్వరూపాన్ని స్పష్టంగా గుర్తించడం. అందుకే ఈ తత్వం విముక్తిని భవిష్యత్తులో వెతకదు. ఈ క్షణంలోనే వెతుకుతుంది. శివోహం అనే వాక్యాన్ని కూడా ఇదే దృష్టితో అర్థం చేసుకోవాలి.
(22:21) ఇది వ్యక్తిగత అహంకారానికి ప్రకటన కాదు నేనే దేవుణ్ణి అనే గర్వం కాదు. అహంకారం పూర్తిగా కరిగిపోయిన తర్వాత మిగిలే చైతన్యం మరియు పరమ చైతన్యం వేరు వేరు కావని సూచించే అనుభవ భాష. అందుకే శివోహం అంటే నేను గొప్పవాడిని కాదు. నేను వేరనే భావనే అసలు పరిమితి అని ప్రత్యక్షంగా గుర్తించడం. ఇక్కడ మరో అపోహను కూడా తొలగించాలి.
(22:43) అన్నీ శివుడే అంటే ప్రపంచాన్ని తిరస్కరించడం కాదు జీవితాన్ని వదిలేయడం కాదు కుటుంబాన్ని సమాజాన్ని బాధ్యతలను నిరాకరించడం కాదు కాశ్మీర్ శైవం ఈ ప్రపంచాన్ని పరమ చైతన్యం యొక్క వ్యక్తీకరణగా చూస్తుంది అందుకే జీవితాన్ని వదిలిపెట్టమని కాదు జీవితాన్ని సంపూర్ణ అవగాహనతో జీవించమని ఆహ్వానిస్తుంది ఈ అవగాహన నిజంగా లోతుగా మారితే మన దృష్టి కూడా మారడం ప్రారంభిస్తుంది మనిషిని అతని పేరు ద్వారా మాత్రమే చూడము అతని మతం ద్వారా మాత్రమే చూడము అతని జాతి ద్వారా మాత్రమే చూడము ఎందుకంటే ప్రతి జీవిలో వెలుగుతున్నది ఒకే చైతన్యం కావచ్చనే అవకాశం మన ముందుకు వస్తుంది. ఇదే కారణంగా
(23:18) భారతీయ తత్వశాస్త్రంలో జ్ఞానం మరియు కరుణ వేరువేరు కావు నిజమైన జ్ఞానం పెరిగే కొద్దీ కరుణ కూడా సహజంగా పెరుగుతుంది. ఇప్పుడు మొదట అడిగిన ప్రశ్నల దగ్గరకు తిరిగి వెళ్దాం. విశ్వం ఎలా ప్రారంభమైంది? చైతన్యం ఎక్కడి నుండి వచ్చింది? పరమ సత్యం ఏమిటి? నిజం చెప్పాలంటే ఈ ప్రశ్నలకు ఇప్పటికీ తుది సమాధానాలు లేవు. బిగ్ బ్యాంకు ముందు ఏమి ఉంది అనే ప్రశ్నకు కూడా శాస్త్రంలో స్పష్టమైన సమాధానం లేదు చైతన్యం ఎలా ఉద్భవించింది అనే ప్రశ్నకు కూడా సర్వసమ్మతమైన వివరణ లేదు అలాగే పరమ సత్యం ఏమిటి అనే ప్రశ్నకు ప్రపంచంలోని అన్ని తత్వాలు ఒకే సమాధానం ఇవ్వలేదు
(23:53) శాస్త్రం తన అన్వేషణను కొనసాగిస్తోంది. తత్వశాస్త్రం తన పరిశీలనను కొనసాగిస్తోంది. ఆధ్యాత్మిక సాధన తన ప్రత్యక్ష అనుభవ యాత్రను కొనసాగిస్తోంది. ప్రస్తుతం మనకు తెలిసింది ఒకటే అన్వేషణ ఇంకా పూర్తి కాలేదు. కానీ బహుశా అత్యంత ముఖ్యమైన విషయం సమాధానం కాదు. అన్వేషణ ఎందుకంటే అన్వేషణ కొనసాగినంత కాలం మనిషి ఎదుగుతూనే ఉంటాడు.
(24:15) ప్రశ్నించడం ఆగిపోయిన చోట అంధ విశ్వాసం పుడుతుంది. ప్రశ్నించడం కొనసాగిన చోట విజ్ఞానం పుడుతుంది. ప్రత్యక్ష అనుభవం ప్రారంభమైన చోట తత్వం జీవితమవుతుంది. అందుకే భారతీయ ఋషులు సమాధానాల కంటే సాధనను గొప్పదిగా చూశారు. ఇతరుల అనుభవాన్ని మనం వినగలం, అర్థం చేసుకోగలం, చర్చించగలం. కానీ మన బదులు ఎవరూ చూడలేరు. ఎవరు మేల్కొనలేరు. మానవ చరిత్రలో జరిగిన ప్రతి గొప్ప విప్లవం కూడా ఒక ప్రశ్న తోనే ప్రారంభమైంది.
(24:41) భూమి నిజంగా విశ్వానికి కేంద్రమా అనే ప్రశ్న శాస్త్ర విప్లవాన్ని ముందుకు నడిపింది. పదార్థం చివరికి ఏమిటి అనే ప్రశ్న ఆధునిక భౌతిక శాస్త్రాన్ని విస్తరించింది. జీవం ఎలా పుట్టింది అనే ప్రశ్న జీవ శాస్త్రాన్ని కొత్త దిశలో తీసుకెళ్ళింది. అలాగే నేను ఎవరు అనే ప్రశ్న భారతీయ తత్వశాస్త్రాన్ని వేల సంవత్సరాలుగా నడిపిస్తోంది. ప్రశ్నలే మనిషిని ముందుకు తీసుకెళ్తాయి.
(25:04) సిద్ధంగా ఉన్న సమాధానాలు కాదు. ఈ కారణంగానే నిజమైన ఆధ్యాత్మిక సంప్రదాయం భయంపై నిలబడదు. ప్రశ్నలను నిషేధించదు. సందేహాన్ని శత్రువుగా చూడదు. ఎందుకంటే నిజమైన సందేహం అహంకారం నుండి పుట్టదు. సత్యాన్ని తెలుసుకోవాలని తపన నుండి పుడుతుంది. అందుకే ఉపనిషత్తులలో గురువు శిష్యుడిని గుడ్డిగా నమ్మమని చెప్పడు. ప్రశ్నించమని ప్రోత్సహిస్తాడు. పరిశీలించమని చెబుతాడు.
(25:26) చివరికి స్వయంగా తెలుసుకోమని ఆహ్వానిస్తాడు. ఇప్పుడు ఒక్కసారి మీ జీవితాన్ని గమనించండి. చిన్నప్పుడు మీకు ఒక ప్రపంచం కనిపించింది. యవ్వనంలో మరో ప్రపంచం కనిపించింది. ఈరోజు మరో ప్రపంచం కనిపిస్తోంది. ప్రపంచం మారిందా లేక ప్రపంచాన్ని చూసే మీ అవగాహన మారిందా ఆధునిక న్యూరోసైన్స్ కూడా ఒక ఆసక్తికరమైన విషయాన్ని చూపుతోంది.
(25:47) మనం ప్రపంచాన్ని నేరుగా చూడము. కళ్ళలోకి వచ్చే కాంతి సంకేతాలను మెదడు విశ్లేషిస్తుంది. చెవులకు వచ్చే శబ్ద తరంగాలను అర్థవంతమైన అనుభవంగా మారుస్తుంది. అంటే మనం అనుభవిస్తున్న ప్రపంచం బయట ఉన్న ప్రపంచానికి నేరుగా సమానం కాదు. అది మన మెదడు నిర్మించిన అనుభవ ప్రపంచం. ఇది కాశ్మీర్ శైవ తత్వాన్ని నిరూపించడం కాదు. కానీ ఒక విషయం మాత్రం గుర్తు చేస్తుంది.
(26:11) మన అనుభవం మరియు వాస్తవం మధ్య సంబంధం మనం ఊహించిన దానికంటే చాలా సంక్లిష్టమైనది. అందుకే భారతీయ తత్వశాస్త్రం మళ్ళీ మళ్ళీ ఒకే దిశలో చూపిస్తుంది. బయటకు వెళ్లే ముందు లోపలికి చూడండి. విశ్వాన్ని తెలుసుకోవడానికి ముందు తెలుసుకుంటున్న వాడిని తెలుసుకోండి. ఎందుకంటే మీరు చూసే ఆకాశం కూడా మీరు వింటున్న సంగీతం కూడా మీరు అనుభవించే ఆనందం కూడా మీరు అనుభవించే బాధ కూడా చివరికి అన్ని మీ అవగాహనలోనే ప్రత్యక్షమవుతాయి.
(26:36) ఒక కలను గుర్తు చేసుకోండి. కలలో పర్వతాలు ఉంటాయి. నదులు ఉంటాయి. మనుషులు ఉంటారు భయం ఉంటుంది ఆనందం ఉంటుంది. ఆ కల జరుగుతున్నంతసేపు అది పూర్తిగా నిజంగానే అనిపిస్తుంది. కానీ మేల్కొన్న తర్వాత ఒక్కసారిగా అర్థమవుతుంది. కలలో కనిపించిన ప్రతీది ఒకే మనసు యొక్క వ్యక్తీకరణ. కాశ్మీర్ శైవం ఈ ఉదాహరణను ప్రపంచం అబద్ధం అని చెప్పడానికి ఉపయోగించదు.
(26:57) అనుభవంలో కనిపిస్తున్న వైవిధ్యానికి మూలం ఒకటే కావచ్చని సూచించడానికి ఉపయోగిస్తుంది. ఇక్కడే శివోహం అనే మహా వాక్యం తన సంపూర్ణ అర్థాన్ని వెల్లడిస్తుంది. ఇది ఒక నినాదం కాదు ఒక మత గుర్తింపు కాదు ఒక వ్యక్తిగత గొప్పతనం కాదు ఇది ఒక ప్రత్యక్ష అనుభవానికి ఇచ్చిన పేరు మాత్రమే. నేను వేరనే భావన కలిగిపోయినప్పుడు మిగిలేది అదే పరమ చైతన్యం అనే గుర్తింపు.
(27:19) అందుకే ఈ వాక్యం అహంకారాన్ని పెంచదు. దానిని కరిగిస్తుంది. అప్పుడు శివుడు ఒక వ్యక్తి కాదు ఒక రూపం కాదు ఒక మతానికి మాత్రమే చెందిన దేవుడు కాదు ప్రతి ఆలోచనకు ముందు ఉన్న నిశ్చలత ప్రతి అనుభవాన్ని ప్రకాశింపజేసే అవగాహన ప్రతి జీవిలో మౌనంగా వెలుగుతున్న చైతన్యం ప్రతి శ్వాసలో దాగి ఉన్న సాక్షి ఈ క్షణంలో కూడా మీరు ఈ మాటలను వింటున్నారు.
(27:39) ఆలోచనలు వస్తున్నాయి వెళ్తున్నాయి భావాలు మారుతున్నాయి. కానీ ఈ అన్నింటిని గమనిస్తున్నది ఎవరు? ఆ గమనింపుకు వయస్సు ఉందా? పేరు ఉందా? మతం ఉందా? జాతి ఉందా? రూపం ఉందా? ఈ ప్రయాణం ముగిసే ముందు నేను మీతో ఒక వ్యక్తిగత విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియోలో మీరు విన్న విషయాలు కేవలం నేను ఎక్కడో చదివిన సమాచారం మాత్రమే కాదు ఎన్నో సంవత్సరాలుగా నా మనసులో నిశ్శబ్దంగా మెదిలిన ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ సాగిన నా సొంత అన్వేషణలో నాకు ఎదురైన ఆలోచనలు పరిశీలనలు అనుభవాలు ఆ ప్రయాణంలో నన్ను అత్యంత ఆశ్చర్యపరిచిన విషయం ఒక్కటే నా అంతరంగంలో నేను వెతుకుతూ తెలుసుకున్న అనేక
(28:15) విషయాలను వేల సంవత్సరాల క్రితమే మన ఋషులు వేదాలలో ఉపనిషత్తులలో పురాణాలలో తమ ప్రత్యక్ష అనుభవ భాషలో ఇప్పటికే వ్యక్త వ్యక్తపరిచారని తెలుసుకున్నప్పుడు నేను నిజంగా విస్మయానికి గురయ్యాను. అప్పుడు నాకు ఒక విషయం స్పష్టంగా అర్థమయింది. మనం వెతుకుతున్న సత్యం ఎక్కడో దూరంలో లేదు అది మన మధ్యే ఉంది. మనలోనే ఉంది. ప్రతి శ్వాసలో ఉంది. ప్రతి జీవిలో ఉంది.
(28:36) ప్రతి అనుభవంలో ఉంది. లోపించింది సత్యం కాదు. దానిని ప్రత్యక్షంగా గుర్తించే అవగాహన మాత్రమే. అందుకే ఈ వీడియోను ఒక సమాధానంగా కాదు. ఒక ఆహ్వానంగా చూడండి. నా మాటలను గుడ్డిగా నమ్మవద్దు. అలాగే వెంటనే తిరస్కరించవద్దు. ఒక రోజు జీవితపు హడావిడికి కాసేపు దూరంగా నిలబడి ప్రపంచాన్ని కాదు మీ మనసును గమనించండి. మీ ఆలోచనలను కాదు వాటిని గమనిస్తున్న దానిని గమనించండి.
(29:01) నేను ఎవరు? ఈ నేను అనే అనుభూతి ఎక్కడి నుంచి వస్తోంది? ఈ అవగాహనకు అసలు స్వరూపం ఏమిటి? అనే ప్రశ్నలను నిజాయితీగా మీలో మీరు అన్వేషించడం ప్రారంభించండి. అప్పుడు మీరు తెలుసుకునేది. ఏ పుస్తకము పూర్తిగా నేర్పలేనిది. ఏ గురువు మీ చేతిలో పెట్టలేనిది. ఏ వీడియో పూర్తిగా చెప్పలేనిది. ఎందుకంటే కొన్ని సత్యాలు వినిపించవు. అవి చదివి తెలుసుకునేవి కావు. అవి ప్రత్యక్షంగా అనుభవించబడతాయి.
(29:22) బహుశా అదే కారణం కావచ్చు. వేల సంవత్సరాల క్రితం మన ఋషులు చివరికి మాటలను వదిలి మౌనాన్ని ఆశ్రయించారు. ఎందుకంటే మౌనం అనేది జ్ఞానానికి ముగింపు కాదు. ప్రత్యక్ష అనుభవానికి ప్రారంభం. ఒకవేళ ఆ సాక్షిని మీరు ప్రత్యక్షంగా గుర్తించగలిగితే బహుశా మీరు వెతుకుతున్నది ఎప్పుడూ మీకు దూరంగా లేదని అర్థం అవుతుంది. వెతుకుతున్నవాడు వెతుకుతున్నది వెతకడం ఈ మూడు వేరు వేరు కావని స్పష్టమవుతుంది.
(29:47) ఆ క్షణంలో ప్రశ్నలు నిశశబ్దం అవుతాయి. సమాధానాలు కూడా అవసరం ఉండవు. మిగిలేది ఒక్కటే శివోహం ఆ

No comments:

Post a Comment