Friday, July 17, 2026

దేవాలయాలపై శృంగార శిల్పాలు ఎందుకు చెక్కారు? వాటి వెనుక దాగి ఉన్న వేదాంత రహస్యం!

దేవాలయాలపై శృంగార శిల్పాలు ఎందుకు చెక్కారు? వాటి వెనుక దాగి ఉన్న వేదాంత రహస్యం!

Author Name:Dr_Pasupathi_Raj_Gurejala

Youtube Channel Url:https://www.youtube.com/@Dr_Pasupathi_Raj_Gurejala

Youtube Video URL:https://www.youtube.com/watch?v=QLBmuZWdn1w



Transcript:
(00:00) మన దేవాలయాల బయట గోడలపై శృంగార శిల్పాలు, జంతువుల బొమ్మలు అలాగే యుద్ధ సన్నివేశాలు వంటి ఎన్నో అద్భుతమైన చక్కడాలు మనం చూస్తూ ఉంటాం. అయితే చాలామంది ముఖ్యంగా నేటితరంలో మరియు ఇతర మతాలకు చెందిన వారు ఈ శృంగార శిల్పాలను చూసి మన ప్రాచీన దేవాలయాలు సెక్స్ ని లేదా కామాన్ని ప్రోత్సహిస్తున్నాయి అని అపార్ధం చేసుకుంటారు.
(00:25) కానీ అందులో దాగిన అసలు అర్ధం ఏంటి? మన పూర్వీకులు దేవుడి గుడి మీద అలాంటి బొమ్మలు ఎందుకు చెక్కారు అని ఎప్పుడైనా ఆలోచించారా ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఈ శిల్పాల వెనుక దాగి ఉన్న వేదాల పరమార్థాన్ని, ఆగమ శాస్త్రాల రహస్యాలను, భగవద్గీత సారాంశాన్ని మరియు సనాతన ధర్మం యొక్క అసలైన గొప్పతనాన్ని నా విశ్లేషణలో మీకు స్పష్టంగా తెలియజేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం లేడీస్ అండ్ జెంటిల్మెన్ యువర్ అటెన్షన్ ప్లీజ్ దిస్ ఇస్ డాక్టర్ పశుపతి రాజ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రాచీన హిందూ తత్వశాస్త్రం ప్రకారం మనిషి జీవితం ప్రధానంగా నాలుగు లక్ష్యాల చుట్టూ తిరుగుతుంది. అవే ధర్మం, అర్థం, కామం
(01:06) మరియు మోక్షం ఇక్కడ కామం అంటే శారీరక కోరికలు మరియు ఆనందం. మన పూర్వీకులు ఈ కోరికలను ఎప్పుడూ ఒక పాపంగా చూడలేదు. పైగా అది మనిషి జీవితంలో ఒక సహజమైన దశ అని నమ్మారు. దీనికి భగవద్గీతలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ఒక అద్భుతమైన శ్లోకమే పెద్ద సాక్ష్యం ఏడవ అధ్యాయం 11వ శ్లోకంలో కృష్ణుడు ఇలా అంటాడు. ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అంటే ఓ అర్జున ధర్మానికి విరుద్ధం కాని కామాన్ని నేనే అని సాక్షాత్తు ఆ భగవంతుడే ప్రకటించాడు.
(01:41) సృష్టి ముందుకు సాగడానికి కారణమైన ఆ పవిత్రమైన కలయికను మన ధర్మం ఎంత గొప్పగా గౌరవించిందో చెప్పడానికి ఈ శ్లోకమే నిదర్శనం. ఇక్కడ మనం అత్యంత సూక్ష్మంగా గమనించాల్సిన మరో అద్భుతమైన పాయింట్ ఒకటి ఉంది. గుడి గోడల మీద కేవలం శృంగార శిల్పాలు మాత్రమే ఉండవు. జంతువులు మరియు భయంకరమైన యుద్ధాలు చేస్తున్న మనుషుల బొమ్మలు కూడా ఉంటాయి. ఇవన్నీ ఒకే చోట ఎందుకు చెక్కారో తెలుసా? దీనికి మహాభారతంలో మరియు హితోపదేశంలో ఉన్న ఒక పవర్ఫుల్ శ్లోకం సరైన సమాధానం ఇస్తుంది.
(02:12) ఆహార నిద్ర భయ మైధునంచ సామాన్యమేతత్ పశుభిర్నరాణం ధర్మో హీ తేషామధికో విశేషో ధర్మేణ హీనాః పశుభిస్సమానాః అని ఆ శ్లోకం చెబుతుంది. అంటే ఆహారం తీసుకోవడం, నిద్రపోవడం, భయపడటం లేదా పోరాడటం మరియు మైధునం అనగా శృంగారంలో పాల్గొనడం ఈ నాలుగు లక్షణాలు మనుషులకు మరియు జంతువులకు సమానంగా ఉంటాయి. కేవలం ధర్మం మాత్రమే మనిషిని జంతువు నుండి వేరు చేస్తుంది.
(02:44) గుడి బయటి గోడల మీద ఉన్న ఆ జంతువులు ఆ యుద్ధాలు. ఆ శృంగార శిల్పాలు మనిషిలోని ఈ ప్రాథమిక జంతు లక్షణాలకు ప్రతీక. నువ్వు గుడి లోపలికి వెళ్లి దేవుడిని చూడాలి అంటే నీలో ఉన్న ఆ జంతు లక్షణాలను ఆ భయాన్ని ఆ కామాన్ని బయటే వదిలేయాలి అని చెప్పే అద్భుతమైన సైన్స్ ఇది అసలు ఈ విశ్వం ఎలా పుట్టింది అని మోడరన్ సైన్స్ ని అడిగితే బిగ్ బ్యాంగ్ థియరీ గురించి చెబుతారు.
(03:08) ఒక చిన్న బిందువు నుండి విశ్వం విస్తరించాలనే ఒక ఎనర్జీ పుట్టింది అంటారు. ఇదే విషయాన్ని మన ఋగ్వేదంలోని నాసదీయ సూక్తం వేల సంవత్సరాల క్రితమే చెప్పింది. అందులో కామస్త దగ్గరే సమవర్తతాధి అనే వాక్యం ఉంటుంది. అంటే ఈ సృష్టి ప్రారంభం కావడానికి. ఆ అనంతమైన శూన్యం నుండి జీవం పుట్టడానికి మూల కారణం ఒక కోరిక. ఆ ఎనర్జీనే మన వేదాలు కామం అని పిలిచాయి.
(03:33) ఆ సృష్టి రహస్యాన్ని జీవ పరిణామాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యేలా చెప్పడానికి గుడి బయట గోడల మీద ఆ శిల్పాలు చెక్కారు. మన తైతర్య ఉపనిషత్తులో బృగువల్లి అనే అధ్యాయంలో ఒక అద్భుతమైన వాక్యం ఉంది. ఆనందో బ్రహ్మేతి వ్యజనాథ్ అంటే బ్రహ్మం అనగా సృష్టికర్త కేవలం ఆనంద స్వరూపుడు అని అర్థం. ఈ సృష్టిలో జీవులు పొందే ప్రతి ఆనందం ఆ బ్రహ్మానందంలో ఒక చిన్న బిందువు మాత్రమే.
(03:58) ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే శారీరక కలయకలో పుట్టే ఆనందం కేవలం ఒక క్షణం మాత్రమే ఉంటుంది. కానీ ఆ క్షణికమైన ఆనందమే అంత గొప్పగా అనిపిస్తే ఇక శాశ్వతమైన ఆ భగవంతుని చేరుకున్నప్పుడు కలిగే మోక్ష ఆనందం ఎంత గొప్పగా ఉంటుందో ఊహించుకోండి. ఆ బ్రహ్మానందాన్ని మీకు పరిచయం చేయడానికే బయటి గోడల మీద ఈ శిల్పాలు చెక్కారు. క్షణికమైన ఆనందాన్ని బయట వదిలేసి శాశ్వతమైన ఆనందం కోసం లోపలికి రండి అని గుడి పిలుస్తోంది.
(04:25) ఆగమ శాస్త్రాల ప్రకారం దేవాలయ నిర్మాణం అనేది ఒక వాస్తు పురుష మండల యంత్రం లాంటిది. గుడి బయటి ఆవరణను భౌతిక ప్రపంచంగా డిజైన్ చేస్తారు. మనిషిలో సత్వ రజో తమో గుణాలు అని మూడు రకాల గుణాలు ఉంటాయి. భక్తులు గుడికి వచ్చేటప్పుడు తమలో ఉండే రజోగుణాన్ని తమోగుణాన్ని అంటే కోపాలు కోరికలు వ్యామోహాలు ఇవన్నీ బయట గోడల మీద ఉన్న ఆకర్షణలకు వదిలేయాలి.
(04:50) లోపలికి వెళ్లే కొద్దీ కేవలం సత్వగుణం అంటే అత్యంత ప్రశాంతమైన స్వచ్ఛమైన మనసు మాత్రమే మిగులుతుంది. ఈ గోడలు మనలోని నెగిటివ్ ఎనర్జీని మరియు భౌతిక ఆలోచనలను లాగేసుకునే మాగ్నెట్స్ లాగా పనిచేస్తాయి. స్కంద పురాణంలో మానవ శరీర నిర్మాణానికి మరియు దైవత్వానికి ముడిపెడుతూ ఒక గొప్ప శ్లోకం ఉంది. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః అంటే ఈ మానవ శరీరమే ఒక దేవాలయం.
(05:16) అందులో ఉండే జీవాత్మ ఆ సనాతనమైన దేవుడు అని దీని అర్థం. ఆ దేహం పుట్టడానికి కారణమైన కలయికను ఒక అద్భుతమైన సృష్టి ప్రక్రియగా గౌరవించింది మన సనాతన ధర్మం. జీవశాస్త్రం ప్రకారం చూసినా సరే మనిషి ప్రాథమిక కోరికలు మూలాధార చక్రంలో మొదలై ఆత్మ జ్ఞానం వైపు అంటే సహస్రార చక్రం వైపు ప్రయాణిస్తాయి. గుడి బయట గోడలు ఈ మూలాధార చక్రానికి ప్రతీక.
(05:41) అందుకే అక్కడ ఆ కోరికలను సూచించే శిల్పాలు ఉంటాయి. మీరు లోపలికి నడుస్తున్న కొద్దీ మీలోని శక్తి పైకి ప్రవహించి గర్భగుడి అనే సహస్రార చక్రానికి చేరుకుంటుంది. అక్కడ ఎలాంటి బొమ్మలు ఉండవు. కేవలం శూన్యం మరియు దైవత్వం మాత్రమే ఉంటాయి. ఈ విషయాన్ని మోడరన్ సైకాలజీ పరంగా చూస్తే మన పూర్వీకుల మేధస్సుకు మీరు ఆశ్చర్యపోతారు. సిగ్మెంట్ ఫ్రాయిడ్ లాంటి ఆధునిక శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే మనిషి తన సహజమైన కోరికలను బలవంతంగా అణచివేస్తే అవి ఎప్పటికైనా మానసిక రుగ్మతలుగా మారుతాయి.
(06:14) మన ఋషులకు ఈ సైకాలజీ ఏనాడో తెలుసు. అందుకే ఆ కోరికలను దాచిపెట్టమని చెప్పలేదు. వాటిని అర్థం చేసుకొని ఆ తర్వాత వాటి నుండి మానసికంగా బయట పడమని చెప్పారు. బృహదారణ్యక ఉపనిషత్తులో భగవంతుడితో జీవాత్మ కలిసే మోక్ష స్థితిని ఎంతో అద్భుతంగా వర్ణించారు. ఒక మనిషి తనకు ఇష్టమైన వారిని హత్తుకున్నప్పుడు ఈ బాహ్య ప్రపంచాన్ని ఎలా మర్చిపోతాడో తనకంటూ ఒక ఉనికి ఉందని ఎలా అయితే మర్చిపోయి ఏకమవుతాడో పరమాత్మను చేరుకున్నప్పుడు కూడా మనిషి అలాంటి ఆనందాన్ని మరియు శూన్య స్థితిని పొందుతాడు అని చెప్పారు.
(06:46) ఇక ఇతర మతస్తులు మరియు కొందరు వితండవాదులు మన గుళ్ళ మీద ఉన్న శిల్పాలను చూసి హిందుత్వం కామంతో నిండి ఉంది అని విమర్శిస్తుంటారు. వాళ్ళకి ఇది ఒక స్ట్రాంగ్ కౌంటర్ దయచేసి వినండి. కొన్ని మతాలలో మనిషి పుట్టుకనే ఒక పాపంగా అంటే ఒక ఒరిజినల్ సీన్ గా భావిస్తారు. ఆ దేవుడు వద్దన్న పని చేయడం వల్లే ఈ సృష్టి జరిగింది అని. సెక్స్ అనేది దేహం చేసే ఒక పాపం అని నమ్ముతారు.
(07:09) అందుకే వాళ్ళు దేహాన్ని మరియు కోరికలను అసహించుకుంటారు. కానీ మన సనాతన ధర్మం అలా కాదు సృష్టిని ఒక తప్పుగా లేదా పాపంగా మన ఋషులు ఎప్పుడూ చూడలేదు. సృష్టి అనేది ఒక అద్భుతమైన లీల. దేవుడు చేసిన ఒక కళాఖండం. సెక్స్ అనేది చీకట్లో దాక్కొని భయపడుతూ చేసే తప్పు కాదు. అది జీవ పరిణామ క్రమంలో ఒక పవిత్రమైన యజ్ఞం. అందుకే మన ధర్మం ఏ విషయాన్ని అణచివేయమని చెప్పలేదు బలవంతంగా కోరికలను చంపుకోమని చెప్పలేదు వాష్యాయనుడు రాసిన కామసూత్ర గ్రంథం కేవలం సెక్స్ గురించి మాత్రమే కాదు అది మానవ మనస్తత్వాన్ని నాడీ వ్యవస్థను ఆకర్షణలను మరియు 64 కళలను వివరించే ఒక గొప్ప
(07:49) సైంటిఫిక్ గ్రంథం ఇలాంటి అత్యున్నత స్థాయి విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించిన ఏకైక ధర్మం మన సనాతన ధర్మం దేవుడిని చేరుకోవాలంటే నీలో ఉన్న సహజ లక్షణాలను ముందుగా అంగీకరించు అని మన గుడులు చెబుతాయి. దీన్ని మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక పెద్ద రద్దీగా ఉండే షాపింగ్ మాల్ మధ్యలో ఒక ప్రశాంతమైన ధ్యాన మందిరం ఉందనుకోండి.
(08:14) మీరు మాల్ బయట ఉన్నప్పుడు రంగు రంగుల లైట్లు పెద్ద శబ్దాలు ఆకర్షించే వస్తువులు మీ దృష్టిని లాగుతాయి. ఇవే మన ప్రాపంచిక కోరికలు కానీ మీరు ఆ ధ్యాన మందిరంలోకి వెళ్లి నిజమైన ప్రశాంతత పొందాలి అంటే వాటన్నింటిని బయటే వదిలేసి శూన్యమైన మనసుతో లోపలికి అడుగు పెట్టాలి. మన దేవాలయాలు కూడా అంతే. గుడి బయట ఉన్న ఈ శృంగార శిల్పాలు చూసి మీ మనసు దారి తప్పితే మీరు ఇంకా ప్రాపంచిక మాయలోనే చిక్కుకొని ఉన్నట్లు లెక్క.
(08:41) బయట గూడల మీద ఉన్న ఆకర్షణలు చూసి గర్భగుడి లోపలికి వెళ్లేసరికి మన బ్రెయిన్ లో ఉండే డోపమైన్ లెవెల్స్ అన్నీ శాంతించి ఒక పవిత్రమైన శూన్య స్థితికి చేరుకుంటాయి. ఆ శూన్యమే మన పరమాత్మ. ఈ ప్రపంచంలో ఎన్నో ఆకర్షణలు ఉంటాయి అని బయటి గోడలు చెప్తే అవన్నీ దాటుకొని శూన్యంలోకి అడుగు పెడితేనే అనంతమైన భగవంతుడు దొరుకుతాడు అని లోపలి గర్భగుడి చెబుతుంది.
(09:05) కాబట్టి ఈ శిల్పాలు కామాన్ని రెచ్చగొట్టడానికి కాదు ఆ కామాన్ని జయించి మోక్షం వైపు ఎలా అడుగులు వేయాలో నేర్పించడానికి చెక్కబడ్డాయి. కేవలం కళ్ళు ఉంటే పైకి కనిపించే బొమ్మలు మాత్రమే తెలుస్తాయి. కానీ సైన్స్ ధర్మం మరియు వేదాంతం తెలిసిన జ్ఞానం ఉంటేనే ఆ శిల్పాలలో ఉన్న పరమార్థం అర్థమవుతుంది. మన సనాతన ధర్మాన్ని విమర్శించే ముందు అందులోని ఈ అపారమైన సైన్స్ ని అర్థం చేసుకోవడం ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం.
(09:31) ఈ అనంతమైన విశ్వంలో ఉన్న రహస్యాలను మనిషి శరీరానికి అన్వయించి చూసిన మన మహర్షుల మేధస్సుకు ఎప్పటికీ మనం రుణపడి ఉంటాం. మీకు నా వీడియో అండ్ నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయతే ప్లీజ్ లైక్ అండ్ షేర్ రెగ్యులర్ గా నా వీడియో అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.
(09:59) ఈ టాపిక్ మీద మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి. మీకు నా వీడియో అండ్ నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. రెగ్యులర్ గా నా వీడియో అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా నా YouTube ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కన కనిపిస్తున్న గంట సింబల్ ని నొక్కినట్లయితే నేను ఎప్పుడు నా కొత్త వీడియోని అప్లోడ్ చేసినా అది మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్ కి వస్తుంది.
(10:26) థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థాంక్యూ ఆల్.

No comments:

Post a Comment