Friday, July 17, 2026

ప్రతి కొత్త సత్యాన్ని ప్రపంచం ఎందుకు ద్వేషిస్తుంది?

ప్రతి కొత్త సత్యాన్ని ప్రపంచం ఎందుకు ద్వేషిస్తుంది?

Author Name:Dr_Pasupathi_Raj_Gurejala

Youtube Channel Url:https://www.youtube.com/@Dr_Pasupathi_Raj_Gurejala

Youtube Video URL:https://www.youtube.com/watch?v=iPiasCPmf6E



Transcript:
(00:00) అభినందనలు మీరు ఈ వీడియో వరకు చేరుకున్నారు. చాలామంది దీన్ని యాదృచ్చికం అంటారు. కానీ ఒక విషయం మాత్రం నిజం మీ ఆసక్తులు. మీరు చూసే విషయాలు మీరు ఆలోచించే విధానం వల్లే ఈ వీడియో మీ ముందుకు వచ్చింది. ఎందుకంటే ఇది సాధారణ వినోదం గురించి కాదు. ఇది సత్యం గురించి. ఇది చైతన్యం గురించి. ఇది మనం ప్రపంచాన్ని ఎలా చూస్తామ అనే దాని గురించి.
(00:21) అయితే ఒక ప్రశ్న ఉంది. నిజాన్ని వెతికే మనుషులను సమాజం నిజంగా ఇష్టపడుతుందా? చరిత్ర చెప్పే సమాధానం చాలా అసౌకర్యంగా ఉంటుంది. కొత్త ఆలోచనలను మొదట ప్రజలు నవ్వుతారు. తరువాత వాటిని తిరస్కరిస్తారు. కొన్నిసార్లు వాటిని చెప్పిన వారినే శిక్షిస్తారు. చివరికి అదే ఆలోచనలను నిజమని అంగీకరిస్తారు. ఎందుకంటే సత్యం కేవలం ఒక సమాచారాన్ని మార్చదు.
(00:43) మనిషి మనసును కదిలిస్తుంది. అతని అహంకారాన్ని ప్రశ్నిస్తుంది. అతను ఎన్నో సంవత్సరాలుగా నమ్ముతున్న నమ్మకాలను సవాలు చేస్తుంది. మన మెదడు ఒక విచిత్రమైన విధంగా పని చేస్తుంది. కొత్త నిజాన్ని తెలుసుకోవడం కంటే ఇప్పటికే నమ్ముతున్న దాన్నే కాపాడుకోవాలని ఎక్కువగా ప్రయత్నిస్తుంది. అందుకే అసౌకర్యమైన సత్యం కంటే సౌకర్యమైన అబద్ధాన్ని చాలా మంది సులభంగా నమ్ముతారు.
(01:02) ఎందుకంటే అబద్ధం మనల్ని ఓదారుస్తుంది. కానీ సత్యం మనల్ని మార్చమని బలవంతం చేస్తుంది. వేల సంవత్సరాల పాటు భూమే విశ్వానికి కేంద్రం అని ప్రజలు నమ్మారు. సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడని, చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడని, నక్షత్రాలన్నీ మన కోసమే తిరుగుతున్నాయని విశ్వసించారు. ఎందుకంటే కళ్ళకు కనిపించేది కూడా అలాగే ఉండేది.
(01:22) కానీ కనిపించేది ఎప్పుడూ నిజం కాదు. ఆ సమయంలో నికోలాస్ కోపర్నికస్ ఒక ధైర్యమైన ప్రశ్న అడిగాడు. ఒకవేళ మనం తప్పుగా అర్థం చేసుకొని ఉంటే అని. ఆ ప్రశ్నే ప్రపంచాన్ని మార్చింది. ఆయన భూమి కాదు. సూర్యుడే సౌర కుటుంబానికి కేంద్రం అని వివరించాడు. అది కేవలం ఒక శాస్త్రీయ సిద్ధాంతం కాదు. మనిషి తన గురించి కలిగి ఉన్న గొప్పతనాన్ని కూడా సవాలు చేసిన ఆలోచన.
(01:44) తర్వాత గెలీలియో గెలీలియ టెలిస్కోప్ తో పరిశీలించి అదే విషయానికి మరిన్ని ఆధారాలు చూపించాడు. కానీ అధికారంలో ఉన్నవారు ఆ సత్యాన్ని వెంటనే అంగీకరించలేదు. ఆయనను విచారించారు. జీవితాంతం గృహ నిర్బంధంలో ఉంచారు. ఒక మనిషిని బంధించారు. కానీ అతను చూపించిన ఆధారాలను మాత్రం బంధించలేకపోయారు. జోడానో బ్రూనో విశ్వం అపారమై ఉండవచ్చని మన ఊహలకు మించిన వాస్తవం ఉండవచ్చని తన ఆలోచనలను వెల్లడించాడు.
(02:10) ఆ ఆ కాలంలోని మతపరమైన మరియు తాత్విక విభేదాల నేపథ్యంలో ఆయనను విచారించి చివరికి సజీవ దహనం చేశారు. చరిత్ర మనకు గుర్తు చేస్తుంది. కొత్త ఆలోచనలు కొన్నిసార్లు కేవలం విమర్శనే కాదు తీవ్రమైన ప్రతిఘటనను కూడా ఎదుర్కొంటాయి. ఇప్పుడు కొందరు ఇలా అడగవచ్చు. ఇవన్నీ విదేశీ శాస్త్రవేత్తలే చెప్పారా? మన భారతీయ సనాతన సంప్రదాయంలోని మహర్షులు వేదాలు ఉపనిషత్తులు విశ్వం గురించి కాలం గురించి సృష్టి గురించి ఎంతో లోతుగా ఆలోచించలేదా అని ఆ ప్రశ్న కూడా సమంజసమే మన ప్రాచీన ఋషులు విశ్వ స్వరూపం గురించి సృష్టి చక్రాల గురించి సత్యాన్ని అన్వేషించడం గురించి అద్భుతమైన తాత్విక భావాలను చెప్పారు. ఆధునిక శాస్త్రవేత్తలు
(02:47) వాటిని పరిశీలన, గణితం, ప్రయోగాలు, ఆధారాలతో పరీక్షించే విధానాన్ని అభివృద్ధి చేశారు. కాబట్టి సత్యాన్ని వెతికే ప్రయాణం ఒక్క దేశానిది కాదు ఒక్క నాగరికతది కాదు సత్యాన్ని నిజాయితీగా వెతికిన ప్రతి మనిషి ఆ ప్రయాణంలో భాగమే అయితే అసలు ప్రశ్న ఇప్పుడు మొదలవుతుంది చరిత్రలో ప్రతిసారి ఎందుకు ఇదే జరిగింది ఎందుకు కొత్త సత్యం బయటపడినప్పుడల్లా దానికి వ్యతిరేకంగా ఇంత పెద్ద ప్రతిఘటన వచ్చింది కారణం చాలా సులభం మనుషులు కేవలం నిజాలను మాత్రమే నిర్మించరు వాటి చుట్టూ నమ్మకాలను నిర్మిస్తారు సంప్రదాయాలను నిర్మిస్తారు వ్యవస్థలను నిర్మిస్తారు గుర్తింపులను నిర్మిస్తారు ఆ
(03:22) నమ్మకాల మీద కుటుంబాలు నిలుస్తాయి, సమాజాలు నిలుస్తాయి, సంస్థలు నిలుస్తాయి. కొన్నిసార్లు మతపరమైన భావనలు కూడా నిలుస్తాయి. అలాంటి సమయంలో ఒక కొత్త సత్యం వచ్చి మీరు ఇంతకాలం నమ్మింది పూర్తి చిత్రం కాదు అని చెప్పినప్పుడు చాలా మందికి అది కేవలం ఒక కొత్త సమాచారం కాదు. తమ జీవితానికి పునాది కదిలినట్టుగా అనిపిస్తుంది.
(03:42) అందుకే వారు సత్యాన్ని పరిశీలించే ముందు దాన్ని తిరస్కరించడానికి ప్రయత్నిస్తారు. కానీ చరిత్ర మరో విషయం కూడా చెబుతోంది. ఒక మనిషిని మౌనం చేయవచ్చు. ఒక పుస్తకాన్ని నిషేధించవచ్చు. ఒక ఆలోచనను అపహాస్యం చేయవచ్చు. ఒక సత్యాన్ని కొంతకాలం దాచిపెట్టవచ్చు. కానీ సత్యాన్ని శాశ్వతంగా బంధించడం ఎవరి వల్ల కాలేదు. సత్యం సూర్యుడు లాంటిది. అబద్ధాలు మేఘాలు లాంటివి.
(04:04) మేఘాలు కొంతసేపు సూర్యుని కప్పేయగలవు. వెలుతురును తగ్గించగలవు. ఆకాశం మొత్తం చీకటిగా కనిపించేలా చేయగలవు. కానీ మేఘాలకు ఒక పరిమితి ఉంది. సూర్యుడికి లేదు. కొంతసేపటి తర్వాత అదే సూర్యకాంతి ఆ మేఘాలను చీల్చుకుంటూ బయటకు వస్తుంది. మళ్ళీ ప్రపంచాన్ని వెలిగిస్తుంది. అలాగే సత్యాన్ని కూడా కొంతకాలం దాచిపెట్టవచ్చు. దాని మీద అబద్ధాల పొరలు వేయవచ్చు.
(04:25) అపోహలు సృష్టించవచ్చు. ప్రచారాలు చేయవచ్చు. కానీ చివరికి సత్యం తన దారిని తానే వెతుక్కుంటుంది. అరచేతితో సూర్యున్ని ఎవరూ ఆపలేనట్లే. అబద్ధాలతో సత్యాన్ని ఎవరూ శాశ్వతంగా అడ్డుకోలేరు. అందుకే ఒకే ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఎవరిని అందంగా నమ్మకండి. నన్ను కూడా కాదు ప్రశ్నించండి, పరిశీలించండి ఆధారాలు వెతకండి. మీకు అసౌకర్యంగా అనిపించిన మీ పాత నమ్మకాలను సవాలు చేసిన నిజం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లే ధైర్యం కలిగి ఉండండి.
(04:54) ఎందుకంటే చరిత్రను మార్చింది అందరినీ అనుసరించిన వారు కాదు. సత్యాన్ని వెతకడానికి భయపడని వారు. ఆ

No comments:

Post a Comment