Friday, July 17, 2026

నీ జీవితాన్ని మార్చే ఆ ఒక్క రహస్యం ఇదే | Secrets To Control Negative Thoughts | Satyagrahi

నీ జీవితాన్ని మార్చే ఆ ఒక్క రహస్యం ఇదే | Secrets To Control Negative Thoughts | Satyagrahi

Author Name:Satyagrahi

Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories

Youtube Video URL:https://www.youtube.com/watch?v=1n0v57Ma2Iw



Transcript:
(00:03) [సంగీతం] ఒక్క క్షణం ఆగండి మీ చుట్టూ చూడకండి మీ లోపలికి చూసుకోండి నిజం చెప్పండి మిమ్మల్ని ఎక్కువసార్లు ఓడించింది ఎవరు మీ శత్రువులా మీ చుట్టూ ఉన్న ఈ సమాజమా లేకపోతే మీకు అసలు కలిసి రాని అదృష్టమా కాదు మిమ్మల్ని నిలువునా ముంచేసింది ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు మీ మెదడులో తిరిగే కొన్ని ఆలోచనలే మనకు బయట ఒక శత్రువు ఉంటే వాడి నుంచి తప్పించుకోవచ్చు కానీ 24 గంటలు మీతోనే ఉంటూ మీ తల లోపలే కూర్చుని మిమ్మల్ని నాశనం చేసే శత్రువు నుంచి ఎలా తప్పించుకుంటారు? మీరు ప్రతిరోజు నమ్ముతున్న ఆ అబద్ధాలే మీ జీవితాన్ని జైలుగా మారుస్తున్నాయి. మీకు తెలుసా మనిషి
(00:44) ఈ ప్రపంచాన్ని గెలవాలని రాత్రి పగలు కష్టపడతాడు. రాజకీయాలు చేస్తాడు, యుద్ధాలు చేస్తాడు, డబ్బు సంపాదిస్తాడు కానీ తన సొంత మనసుని గెలవడం మాత్రం మర్చిపోతాడు. పరమహంస యోగానంద్ గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. మనిషి బాధలన్నిటికీ మూలం ఈ ప్రపంచం కాదు. ఆ ప్రపంచాన్ని చూసి అతడు తన మనసులో సృష్టించుకునే బ్రమలే అని నువ్వు నీ ఆలోచనలు కాదు వాటిని గమనించే చైతన్యానివి అంటే వాటిని అబ్జర్వ్ చేసే ఒక నాలెడ్జ్ ఉన్న పర్సన్ వి అని.
(01:16) ఈ ఒక్క చిన్న సత్యం అర్థమైతే మీ సగం బాధలు ఇప్పుడే మాయమైపోతాయి. కానీ మనం ఏం చేస్తున్నాం మెదడు ఒకటి చెబితే దాన్ని పట్టుకొని ఏడుస్తాం. మన మనసు ఒక భయాన్ని చూపిస్తే నిజమే అని చెప్పేసి వనికిపోతాం. అసలు సమస్య ఎక్కడఉందో తెలుసా మీరు మీ ఆలోచనలతో మిమ్మల్ని మీరు ఐడెంటిఫై చేసుకుంటున్నారు. ఒకటి గమనించండి మీ మెథడు ఎప్పుడు మీకు నిజాలు చెప్పదు.
(01:40) అది కేవలం కథలు మాత్రమే చెప్తుంది. మీకు రోజు వచ్చే వేలాది ఆలోచనల్లో ఎక్కువ భాగం పాత గాయాలు, లేనిపోని ఊహలు, ఎవడో అన్న మాటలు మాత్రమే. కానీ మీరు ఏం చేస్తున్నారు ఆ చెత్తనంతా పట్టుకొని అదే మీ జీవిత సత్యం అనుకుంటారు. ఇక్కడే మీ లైఫ్ తప్పుదారు పడుతుంది. ఒక చిన్న నెగిటివ్ ఆలోచన సరిగ్గా గమనించకపోతే మీ జీవితాలు జైలుగా మారిపోతుంది.
(02:02) నేను పనికి రాను నేను ఈ పని చేయలేను. ఈ ఒక్క థాట్ చాలు మీ లోపల ఉన్న వందల కలల్ని చంపేయడానికి మీకున్న ఆత్మవిశ్వాసాన్ని నిలువున దొంగలించడానికి ఈ ప్రపంచం వచ్చి మిమ్మల్ని కిందకి నెట్టాల్సిన అవసరం లేదు. మీ ఆలోచనలే మిమ్మల్ని ఓడిస్తాయి. నిజం చెప్పాలంటే మనసు అనేది ఒక అద్భుతమైన సేవకుడు కానీ చాలా దరిద్రమైన యజమాని కూడా దానికి ఏం చేయాలో చెబితే వింటుంది.
(02:26) కానీ దాన్ని మీ నెత్తిన కూర్చోబెట్టుకుంటే మిమ్మల్ని భయాల లోపలికి నెట్టేస్తుంది. లేకపోతే లాగేస్తుంది. మనసు మీరు ఉపయోగించుకోవాలి. అంతే తప్ప మనసు చేతిలో మీరు ఒక బొమ్మలా వాడబడకూడదు. మీ జీవితంలో ఉన్న బాధల్లో సగం బాధ నిజంగా జరిగిన సంఘటన వల్ల వచ్చింది కాదు. ఆ జరిగిన దాని గురించి మీరు మీ తలలో మళ్ళీ మళ్ళీ ఆలోచించడం వల్ల వచ్చింది.
(02:50) ఒకసారి ప్రాక్టికల్ గా ఆలోచించండి ఒక చేదు సంఘటన మీ జీవితంలో కేవలం ఒక ఐదు నిమిషాలు మాత్రమే జరిగి ఉండొచ్చు. కానీ ఆ ఐదు నిమిషాల దరిద్రాన్ని మీరు మీ మనసులో ఐదు సంవత్సరాలుగా మోస్తూనే ఉన్నారు. ఆ సంఘటన ఎప్పుడో అయిపోయింది. కానీ మీ ఆలోచనలు దాన్ని ఇంకా బతికిస్తూనే ఉన్నాయి. మీ మనసు మీకు రోజుకి 100 అబద్ధాలు చెప్తుంది. అందరూ నిన్ను జడ్జ్ చేస్తున్నారని నువ్వు ఎలాగో ఫెయిల్ అవుతావని ఇప్పటికే ఆలస్యం అయిపోయిందని నీ వల్ల ఇంకేం కాదని చెప్తూ ఉంటుంది.
(03:21) ఈ వాక్యాల్లో ఒక్కటి కూడా నిజం కాదు కానీ మీరు దాన్ని నమ్మిన మరుక్షణమే అవి మీ జీవిత సత్యాలుగా మారి మిమ్మల్ని బానిసలుగా మార్చేస్తాయి. పరమహంస యోగానంద గారు చెప్పిన లోతైన సత్యం ఏంటంటే ప్రతి ఆలోచనను మీరు నమ్మాల్సిన అవసరం లేదు. మీ ఇంటి దగ్గరికి ఎవరో అపరిచిత వ్యక్తి వస్తే వెంటనే లోపలికి రానిచ్చి మీ బెడ్రూమ్ లో కూర్చోబెట్టారు కదా మరి మీ మెదడులోకి వచ్చే ప్రతి పనికి రాని ఆలోచనని మీ హృదయంలోకి ఎందుకు రాణిస్తున్నారు దానికి ఎందుకు అంత వాల్యూ ఇస్తున్నారు ఆలోచించండి మనకి కర్మ ఎందుకు పట్టింది ఎందుకు మన ఆలోచనలే మనల్ని రోజు టార్చర్ పెడుతున్నాయి ఎందుకంటే మీ మనసు ఒక శిక్షణ లేని అడవి
(03:59) గుర్రం లాంటిది అడవి గుర్రం మీద కూర్చుంటే అది మిమ్మల్ని ఏ అగాధంలోకి నెట్టేస్తుందో ఎవ్వడికీ తెలియదు కానీ అదే గుర్రానికి సరైన ట్రైనింగ్ ఇస్తే అది మిమ్మల్ని మీ గమ్య స్థానానికి చేరుస్తుంది. మనం మనసుని వదిలేసాం. దానికి ట్రైనింగ్ ఇవ్వడం మర్చిపోయాం. మనకున్న అత్యంత ప్రమాదకరమైన అరవాట్ ఏంటో తెలుసా ఆలోచించడం కాదు వచ్చిన ఆలోచనని ఓ ప్రశ్న కూడా అడగకుండా నమ్మేయడం.
(04:22) మీ లోపల ఒక నెగిటివ్ థాట్ రాగానే ఇది నిజమేనా దీనికి ఏమైనా ఆధారం ఉందా అని ఎప్పుడైనా అడిగారా అడగరు మీరు. అది ఏది చెబితే అది వేద వాక్కు అనుకొని మోసపోతున్నారు. పరమహంస యోగానంద గారు చెప్పినట్లు ఈ అజ్ఞానమే మనల్ని మన నిజ స్వరూపం నుంచి దూరం చేస్తుంది. నిజానికి మీరు కాపాడుకోవాల్సింది బయట ఉన్న చెడ్డ మనుషుల నుంచి కాదు మీ మనసులో ప్రతిరోజు పుడుతున్న ఆరు దొంగల నుండి ఒకటి నిరాశ రెండు అసూయ మూడు భయం నాలుగు కోపం ఐదు న్యూన్యత భావం ఆరు అపరాధ భావన వీళ్లే మీ లోపల ఉంటూ మీ ఎనర్జీని రోజంతా దొంగలిస్తున్నారు.
(05:01) మీరు ఏం ఆలోచన అయితే పదే పదే ఆలోచిస్తారో మీ మనసులో ఏ విత్తనానికి అయితే రోజు నీళ్లు పోస్తారో అదే మీ జీవితంలో ఒక పెద్ద వృక్షంలా పెరుగుతుంది. భయానికి నీరు పోస్తే భయం పెరుగుతుంది. ధైర్యానికి నీరు పోస్తే ధైర్యం పెరుగుతుంది. ఛాయిస్ ఎప్పుడు మీ చేతిలోనే ఉంది. మీకు తెలుసో లేదో ఈ ప్రపంచం మీ జీవితాన్ని అంతగా నియంత్రించదు.
(05:22) కానీ మీ లోపల మీరు రోజు మాట్లాడుకునే అంతర్గత సంభాషణ ఉంది. అది మీ జీవితాన్ని డిసైడ్ చేస్తుంది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు నా వల్ల కాదు నాకు అంత సీన్ లేదు నేను చేయలేను అని రోజుకి 100 సార్లు మీతో మీరు చెప్పుకుంటే ఈ ప్రపంచం మొత్తం వచ్చి మిమ్మల్ని ప్రోత్సహించినా సరే మీరు ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేరు. మనం చేసే ఇంకో పెద్ద తప్పు ఏంటంటే నిశ్శబ్దంగా ఉండలేకపోవడం.
(05:47) ఈ రోజుల్లో యువతకి ఒంటరిగా నిశ్శబ్దంగా కూర్చోవడం అంటేనే ఒక పెద్ద భయం చేతిలో ఫోన్ లేకపోతే పిచ్చెక్కి పోతుంది కానీ నిశ్శబ్దం అనేది మీ మనసు శత్రువు కాదు మిత్రుడు మీరు నిశశబ్దంగా కూర్చున్నప్పుడు ఆలోచనలు పూర్తిగా ఆగిపోవు కానీ వాటి మీద మీకు కంట్రోల్ మీ అధికారం పెరుగుతుంది. అందుకే పూర్వ మహానుభావులు యోగులు ధ్యానాన్ని ఎంచుకునేవాళ్ళు. పరమహంస యోగానంద గారి ఫిలాసఫీ ప్రకారం మనసులో వచ్చే ఆలోచనలన్నీ కేవలం మీ ఈగో సృష్టించే భ్రమలే ఈ సమాజం ఈ చుట్టూ ఉన్న పరిస్థితులు మనకు కొన్ని ఐడెంటిటీలు ఇస్తాయన్నమాట నువ్వు ఫెయిల్యూర్ వి నువ్వు పేదవాడివి నువ్వు అందగాడివి లేకపోతే నువ్వు అందంగా
(06:25) లేవు అని చెప్పేసి మీ మనసు ఈ మాటలను పట్టుకొని ఒక తప్పుడు గుర్తింపుని క్రియేట్ చేసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళందరూ అంటూ ఉన్నారు కదా అందుకని మీరు కూడా దాన్ని నమ్ముతారు. మీరంటే మీరు కాదు, మీ మనసు మీ మనసు నమ్మిన తర్వాత మీరు ఆటోమేటిక్ గా బాధపడటం స్టార్ట్ అవుతుంది. మీరు ఆ ఐడెంటిటీని నిజం అనుకొని బ్రతకడం వల్లే మీ లోపల ఉన్న అనంతమైన శక్తి గుర్తించలేకపోతున్నారు.
(06:48) ఇప్పుడు అసలైన విషయానికి వద్దాం. ఈ తలతిక్క మనసుని ఎలా హ్యాండిల్ చేయాలి? పరమహంస యోగానంద గారు ఒక సింపుల్ అండ్ పవర్ఫుల్ సీక్రెట్ చెప్పారు. మనసుతో యుద్ధం చేయకండి. దానిని బలవంతంగా ఆపాలని అస్సలు ప్రయత్నించకండి. ఎందుకంటే మీరు దేన్ని ఆపాలని చూస్తారో అది ఇంకా ఎక్కువ బలపడుతుంది. దానికి బదులు మీ ఆలోచనలు ఒక మూడో వ్యక్తి లాగా ప్రేమతో గమనించడం అలవాటు చేసుకోండి.
(07:13) ఒక చిన్న ఉదాహరణ చెప్తాను జాగ్రత్తగా వినండి. ఆకాశంలో మేఘాలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ మేఘాలు ఆకాశం కాదు కదా. ఆకాశం ఎప్పుడూ నిశ్చలంగా ప్రశాంతంగానే ఉంటుంది. మీ ఆలోచనలు కూడా అంతే. అవి కేవలం మీ మనసు అనే ఆకాశంలో కదిలే మేఘాలు మాత్రమే. నువ్వు ఆ ఆలోచనవి కావు నువ్వు వాటిని గమనించే నిశశబ్ద సాక్షివి. ఈ సత్యాన్ని మీరు మనస్ఫూర్తిగా తెలుసుకున్న రోజు మీ లోపల ఉన్న భయం బలహీనపడటం మొదలవుతుంది.
(07:41) బాధ తీవ్రత తగ్గుతుంది. అక్కడి నుంచే మీ అసలైన స్వేచ్ఛ మొదలవుతుంది. నిజం ఏంటంటే మీ తలలో వచ్చే నెగిటివ్ ఆలోచనల్ని ఫిల్టర్ చేయడం నేర్చుకోవాలి. మీ మెదడులోకి ఒక పనికి రాని థాట్ రాగానే అక్కడే దాన్ని నిలదీయండి. ఇది నా లైఫ్ కి అవసరమా దీని వల్ల నాకు ఏమైనా ఉపయోగం ఉందా అని చెప్పేసి ప్రశ్నించండి. మీరు ప్రశ్నించడం మొదలుపెడితే మీ మనసు అబద్ధాలు చెప్పడం ఆపేస్తుంది.
(08:07) ఎందుకంటే దానికి భయపెట్టడం మాత్రమే తెలుసు ప్రశ్నలు ఫేస్ చేయడం తెలియదు. ఆలోచనలని నియంత్రించడం అంటే వాటిని చంపేయడం కాదు వాటికి యజమానిగా మారి అవి మీకు లొంగి ఉండేలా చూసుకోవడం. మీరు ధ్యానాన్ని ఒక మతపరమైన ప్రక్రియ గానో లేదా ముసలివాళ్ళు చేసే పనిగానో చూస్తే మీరు చాలా పెద్ద పొరపాటు చేస్తున్నట్లే ధ్యానం అంటే మీ మెదడుకి ఇచ్చే అత్యున్నతమైన శిక్షణ పరమహంస యోగానంద్ గారు తన ఆటోబయోగ్రఫీ లో చెప్పినట్లు ధ్యానం అనేది మీ అంతర్గత శక్తులని అన్లాక్ చేసే కీ రోజు కనీసం 10 నిమిషాలు నిశశబ్దంగా కూర్చోండి మీ ఆలోచనల ట్రాఫిక్ ను కేవలం గమనించండి వాటితో
(08:46) కొట్టుకుపోకండి ఆ ప్రాక్టీస్ మీ మైండ్ ఒక పవర్ హౌస్ లా మారుస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీ అంతర్గత సంభాషణ మార్చండి అంటే సెల్ఫ్ టాక్ ని మార్చండి. నేను చేయలేను అనే చోట నేను ప్రయత్నిస్తాను నేను నేర్చుకుంటాను అని మార్చండి. ఇది జెనరిక్ మోటివేషన్ కాదు ప్యూర్ సైకాలజీ మీరు మీ మెదడికి ఎలాగ సిగ్నల్స్ ఇస్తారో అది అలాంటి కెమికల్స్ ని మాత్రమే రిలీజ్ చేస్తుంది.
(09:11) మిమ్మల్ని మీరు తక్కువ చేసుకునే ప్రతి ఆలోచనని వెంటనే రిజెక్ట్ చేయడం నేర్చుకోండి. చివరిగా ఒక నిరాపేక్ష సత్యాన్ని గుర్తుంచుకోండి. మీ జీవితాన్ని మార్చడానికి మీరు ఈ ప్రపంచాన్ని మార్చాల్సిన అవసరం లేదు. మీ అంతర్గత ప్రపంచాన్ని మీ ఆలోచనలతో మీకు ఉన్న సంబంధాన్ని మారిస్తే చాలు పరమహంస యోగనంద గారి బోధనల సారం ఇదే ఎవరైతే తన సొంత మనసు గెలుచుకుంటారో అలాంటి వ్యక్తిని ఓడించే శక్తి ఈ విశ్వంలో మరేదానికి ఉండదు.
(09:39) పరిస్థితులు ఎప్పుడూ మీ చేతుల్లో ఉండకపోవచ్చు కానీ ఆ పరిస్థితులను మీ మనసు ఎలా స్వీకరిస్తుంది అనేది మాత్రం 100% మీ చేతుల్లోనే ఉంది. కంఫర్ట్ జోన్ లో కూర్చొని ఆలోచనల వలయంలో చిక్కుకుపోవడం చాలా తేలిక. కానీ రిస్క్ తీసుకొని ఆ ఆలోచనలని దాటి ప్రయాణించడమే అసలైన జీవితం. ఈ క్షణం నుంచి మీ ఆలోచనలకి మీరే యజమాన అవ్వండి. బానిసగా మిగలకండి.
(10:04) ఎందుకంటే మీ నిజమైన రూపం ఈ ఆలోచనల మేఘాల వెనుక ఉన్న ఎప్పటికీ మసకబారని అనంతమైన కాంతివంతమైన సూర్యుడు. మీ జీవితాన్ని మార్చాలంటే ముందుగా ప్రపంచాన్ని మార్చాల్సిన అవసరం లేదు. నీ ఆలోచనలతో నీ సంబంధాన్ని మార్చు. ఎందుకంటే మనసును గెలిచిన వ్యక్తిని ఓడించే శక్తి ఈ ప్రపంచంలో చాలా అరుదు. మీ జీవితాన్ని ఎక్కువగా బాధ పెట్టింది ఏది అనిపిస్తుంది బయట జరిగిన సంఘటనలా లేక దాని గురించి మీ మనసు పదే పదే చెప్పిన కథలా మీ అనుభవాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను బాయ్ [సంగీతం] [సంగీతం]
(10:50) [సంగీతం]

No comments:

Post a Comment