*_గురు పౌర్ణమి సందర్భంగా ఒక కథ గుర్తొచ్చింది._*
_(—యండమూరి వీరేంద్రనాథ్)_
=================
*ఒక కుర్రవాడికి 'మైక్ టైసన్' ని గెలవాలని కోరిక కలిగింది. ముగ్గురు గురువుల్ని అడిగాడు. వాళ్లు వెటకారంగా నవ్వి _"నీకుఎడమ చేయి లేదురా.. నువ్వెలా గెలుస్తావ్..?"_ అని నిరాకరించి నిరుత్సాహపరచాలని ప్రయత్నించారు.*
*అయితే అతడు ప్రయత్నం ఆపలేదు. అనేకమంది గువులను కలిసి ప్రాదేయపడుతూనే ఉన్నాడు. చివరకు ఒక గురువు అతనిని చేరదీసి, ఏడాది పాటు శిక్షణ ఇచ్చి పోటీకి పంపించాడు.*
*విచిత్రంగా మైక్ టైసన్ పై గెలిచిన ఆ శిష్యుడు ఆశ్చర్యంతో.. ఆనందంతో.. తన గురువు దగ్గరకి వచ్చి. కాళ్ళకి నమస్కరించి, _"నేనిది నమ్మలేని వింతగా ఉంది. ఇంతకూ నేను ఎలా గెలిచాను స్వామి ?"_ అని ప్రశ్నించాడు.*
*అప్పుడు గురువు... _"నీకు నేను 'గజబంధం' విద్య నేర్పాను. అందులో నీ ప్రత్యర్థి నీ ఎడమ చేయి పట్టుకొని గిరగిరా తిప్పి కిందకి పడగొట్టాలి. కానీ... పోటీ జరుగుతున్నంతసేపూ టైసన్ నీ ఎడమ చేయి ఎక్కడ ఉందని వెతుకుతూనే ఉన్నాడు. అందువల్ల నువ్వు గెలిచావు."_ అన్నాడు ఆ గురువు.*
*మంచి గురువు ఎప్పుడూ శిష్యుడు లోని నెగిటివ్ పాయింట్స్ వెతకడు. పాజిటివ్ చూస్తాడు. నెగిటివ్ ని పాజిటివ్గా ఎలాగా మార్చాలా అని ఆలోచిస్తాడు.*
_(మైక్ టైసన్ తో మల్లయుద్ధం ఏమిటని అనుమానం పడవద్దు. just enjoy: --యండమూరి వీరేంద్రనాథ్)_
::::::::::::::::::::::::::::::::::::::::::::::
*_-•{సేకరణే: --వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు & స్టూడెంట్ మోటివేటర్, ఆత్మకూరు పట్టణం, నెల్లూరు జిల్లా}•-_*
No comments:
Post a Comment