Friday, July 10, 2026

కుండలినీ/ఆధ్యాత్మిక జ్ఞానం, EMOTIONAL TRIGGERS, SPIRITUAL ASCENSION, SPIRITUAL HEALING

కుండలినీ/ఆధ్యాత్మిక జ్ఞానం, EMOTIONAL TRIGGERS, SPIRITUAL ASCENSION, SPIRITUAL HEALING

Author Name:కుండలినీ మార్గదర్శి

Youtube Channel Url:https://www.youtube.com/@%E0%B0%95%E0%B1%81%E0%B0%82%E0%B0%A1%E0%B0%B2%E0%B0%BF%E0%B0%A8%E0%B1%80%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%A6%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6%E0%B0%BF

Youtube Video URL:https://www.youtube.com/watch?v=KbTJwObTpRY



Transcript:
(00:00) నమస్తే ఏ విషయం అయితే మనల్ని ఎంతగానో బాధ పెడుతుందో ఏ గాయం కేసి అయితే మనం చూడటానికి ఇష్టపడామో అంటే మానసిక గాయం గాని బాధ గాని లోపల ఏదో వెలితి ఉందనేటువంటి ఒక భావన గాని అది మనకి మింగుడు పడదు. ఈ భావన మనలో ఉన్నంత కాలం ఏమవుతుందంటే మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి అది ఆటంకం అవుతుంది. చాలాసార్లు ఆధ్యాత్మిక ప్రయాణంలో పదే పదే ఈ గాయం అనేది మనకి కనిపిస్తుంది.
(00:36) బహుశా మన మీద మనకి నమ్మకం ఉండకపోవచ్చు మనకి ప్రేమించేటువంటి అర్హత లేదు లేదంటే ప్రేమని స్వీకరించేటువంటి అర్హత లేదు ఇలాంటివి చాలా మనం పెట్టుకుంటాం మనసులో ఇలాంటివన్నీ మనకి బాధని కలిగిస్తాయి అంటే పక్కవారితో పోల్చుకుని నేను తక్కువేమో లేదు అంటే నేను ఎంత చేసినా కూడా ఎదుటివారు నన్ను స్వీకరించడం లేదు తిరస్కరిస్తున్నారు ఇలాంటివి రకరకాల మనకు ఉంటాయి.
(01:05) ఈ బాధలు మనకి తీవ్రమైనటువంటి గాయాలు అయిపోతాయి. ఈ గాయాలు మన లోపల ఉన్నాయని సంగతి మనకి తెలియకపోయినా మనల్ని పీడించాలి వేధించాలి అనేటువంటి ఉద్దేశం ఉన్నవాళ్ళు ముందు మనల్ని పరీక్షిస్తారు మన లోపల ఎలాంటి గాయాలు ఉన్నాయి ఎలాంటి భయాలు ఉన్నాయి ఎలాంటి బలహీనతలు ఉన్నాయి అన్న విషయాన్ని వాళ్ళు పదే పదే మనల్ని రకరకాలుగా వాళ్ళు ఆ రెచ్చగొట్టి రెట్టించేటువంటి మాటలు మాట్లాడి ఆ వాళ్ళు పరీక్షిస్తూ ఉంటారు అన్నమాట దేనికి మనం చెల్లిస్తాము దేనికి మనం తిరగబడతాము దేనికి మనకి కోపం వస్తుంది ఉద్వేగం వస్తుంది అనేది వాళ్ళు పరీక్షిస్తుంటారు అంటే అవి మీ బలహీనతలుగా వాళ్ళు జమకడతారు. కట్టి వాళ్ళు ఎప్పుడైతే
(01:49) మిమ్మల్ని హింసించాలి అనేటువంటి ఆలోచన వస్తుందో అదే గాయం మీద నొక్కి నొక్కి పొడుస్తూ ఉంటారు. ఆ అదే గాయం మీద వాళ్ళు నొక్కి నొక్కి పుడుస్తున్నప్పుడు మనకి ఇంకా దుఃఖం ఎక్కువైపోతుంది గట్టిగా అరుస్తాము ఏడుస్తాము మనకి తీవ్రమైన కోపం వ్యధ వస్తుంది ఎలా దాన్ని ఎదుర్కోవాలో మనకి తెలియదు వాళ్ళు ఎన్నిసార్లు ఆ రకంగా మనల్ని పొడిచినా అన్ని సార్లు మనం అలాగే ప్రతిస్పందిస్తాం.
(02:18) వీటిని మనం ఇంగ్లీష్ లో ట్రిగర్స్ అని అంటాం అంటే ఏ విషయం అయితే మనల్ని పదే పదే మనల్ని ప్రేరేపిస్తుందో మనలో కోపం దుఃఖం బాధ ఒక లోటు అనేది మనకి ఉంది అనేటట్టుగా మనల్ని మనం ప్రశ్నించుకునేటట్టుగా మన విలువను మనం ప్రశ్నించుకునేటట్టుగా అర్హతని ప్రశ్నించుకునేటట్టుగా మనల్ని ఆలోచింపజేస్తుందో ఇవన్నీ కూడా మన లోపల ఉన్నటువంటి గాయాలు ఈ గాయాలు ఒక జీవిత కాలం మీద కాదు రకరకాలజీ జీవిత కాలాల మీద ఏర్పడినటువంటి మానసిక మచ్చలు అనుకోవచ్చు.
(02:53) పైగా అందరికీ గాయాలు ఒకే తీరుగా ఉండవు. అది మన వ్యక్తిత్వం బట్టి ఉంటుంది. వ్యక్తిత్వానికి ఆ మనిషి బయట జరిగే విషయాలకి ఏ రకంగా ప్రతిస్పందిస్తారు ఏ విషయం తనకి ఎక్కువ దుఃఖాన్ని కలిగిస్తుంది ఏ విషయం ఆ అతనికి ఎక్కువగా లోపల ఉన్నటువంటి అతని అభద్రత భావాన్ని రెచ్చగొడుతుంది అనేది మళ్ళీ వ్యక్తి వ్యక్తికి అది మారుతూ ఉంటుంది.
(03:21) కొంతమందికి భావోద్వేగాలు చాలా తీవ్రంగా వాళ్ళకి భయం రూపంలో ఉంటాయి కొంతమందికి కొంతమందికేమో కోపం రూపంలో ఉంటాయి. కొంతమందికేమో అవమాన భారంగా ఉంటాయి. అది మళ్ళీ వాళ్ళ వ్యక్తిత్వం బట్టి ఉంటుంది అందరికీ ఒకే తీరుగా ఉండదు. అయితే కొన్ని కొన్ని సార్లు మనల్ని రెచ్చగొట్టే విషయాలు రెట్టించే విషయాలు అవి సమస్య స్థాయి నుంచి రావచ్చు అంటే మీరు ఏదైనా ఒక మతం కులం ప్రాంతం ఆధారంగా మిమ్మల్ని మీరు గనుక ఐడెంటిఫై చేసుకుంటే దాన్ని ఏమైనా అంటే మనకి కోపం వచ్చేస్తుంది లేదు అంటే కుటుంబంలో ఒకళ్ళనొకళ్ళు ఏదో ఒక మాటలు అనుకుని రచ్చగొట్టుకుంటూనే ఉంటారు మన కుటుంబం వాళ్ళకి తెలుసు మన లోపల ఉన్న
(04:02) బలహీనతలు ఏమిటి అనేది కోపం వచ్చినప్పుడల్లా అవే విషయాలు పాత విషయాలు వాళ్ళు పొడిచి పొడిచి పైకి రేకెత్తిస్తూ ఉంటారు. చాలా మటుకు గాయాలు మన వ్యక్తిగత గాయాలు మన వ్యక్తిత్వం బట్టి ఉంటాయి. ఈ గాయాలు లేదంటే ఈ ట్రిగర్స్ ఏవైతే ఉన్నాయో అంటే మనల్ని అక్కడ పొడిస్తే మనకి ఒక్కసారిగా మనం లేస్తాం అన్నమాట కోపంతో లేకపోతే దుఃఖంలోకి వెళ్ళిపోవటం ఏడవటము బాధలోకి వెళ్ళిపోవటమో ఆ రకంగా మనం ప్రతిస్పందిస్తాము.
(04:37) ఇవి మనం వీటిని తప్పించుకోలేము. పైగా ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు ఇవి ఇంకా మనకి స్పష్టంగా కనిపించడం మొదలు పెడతాయి. ఆధ్యాత్మిక ప్రక్రియలో మనకి మూడో కన్ను తెరుచుకుంటుంది. మూడో కన్ను తెరుచుకున్నప్పుడు ఏమవుతుంది అంటే అంత క్రితం మనకి కనిపించని విషయాలనేవి ఇప్పుడు కనిపిస్తూ ఉంటాయి. ఈ గాయాలు అనేవి మన లోపల ఎక్కడో సబ్కాన్షియస్ మైండ్ లోతుల్లో ఉంటాయి.
(05:06) ఇవి మనకి అంత చిక్కవు ఎప్పుడైతే ఆధ్యాత్మిక ప్రక్రియ మొదలవుతుందో సబ్కాన్షియస్ మైండ్ తెరుచుకుంటుంది. ఈ సబ్కాన్షియస్ మైండ్ ఎన్నో జన్మల తర్వాత కేవలం ఆధ్యాత్మిక ప్రక్రియలు తెరుచుకుంటుంది. తెరుచుకున్నప్పుడు దాని లోపల దాగి ఉన్న విషయాలన్నీ బయటికి వస్తాయి అందులో మన దుఃఖాలు అవమానాలు, బాధలు, కష్టాలు అన్నీ కూడా అక్కడ ఉంటాయి. అవన్నీ ఇప్పుడు మనకి కంటికి స్పష్టంగా కనిపిస్తున్నాయి.
(05:31) వీటిని మనం తప్పించుకోలేం వీటి నుంచి పారిపోలేం. కాకపోతే మనకి వీటిని ఎట్లా ఎదురుకోవాలో తెలియదు ఇది మనకి ఒక చాలా కష్టమైన పరిస్థితిలాగా అనిపిస్తుంది. మనకున్న మన విచక్షణ మన తెలివి స్థాయికి ఇవి అంతు చెక్కవు అంతుపట్టవు వీటిలోనుంచి బయట పడే మార్గం ఇలాంటి విషయాలు ఇలాంటి గాయాల మీద ఎవరైనా ఒకవేళ పొడిచినా ప్రతిఘటించకుండా ప్రతిస్పందించకుండా ఎలా ఉండాలి శాంతంగా అనేది మనకు అర్థం కాదు.
(06:10) ముఖ్యంగా మనం చాలా పోటీ ఉన్నటువంటి ఒక లోకంలో బ్రతుకుతున్నాం. చాలామంది మన జీవితంలోకి వచ్చినప్పుడు వాళ్ళకి ఈర్షా అసూయలు ఉంటాయి వాళ్ళకఏదో మందించి లాక్కునేది ఉంటుంది మనల్ని పీడించే ఉద్దేశంతో కొంతమంది వస్తారు అందరి ఆలోచనలు సరిగ్గా ఉండవు. అలాంటప్పుడు ఇలాంటి వాళ్ళు మనల్ని ఎక్కువగా బాధ పెట్టటానికి అవే గాయాల మీద కారం చెల్లినట్టుగా అక్కడ వాళ్ళు ఒక స్ట్రా వేసి అక్కడన్న వంటి శక్తిని హరిస్తూ వాళ్ళు మన ప్రాణాల్ని ఆ గాయల నుంచి హరిస్తున్నట్టుగా పీల్ చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది.
(06:46) ముఖ్యంగా మీరు గనుక సున్నిత మనస్కులయితే ఇలాంటివి ఏమైనా మీలో ఉంటే ఎదుటి మనిషి ఒక్క మాటలు మీ మనసు మీద ఒక చెరగని ముద్ర వేసేస్తాయి. వేసేసి మీలో ఉన్నటువంటి శాంతిని, ప్రశాంతతని భగ్నం చేస్తూ నిత్యం మిమ్మల్ని అవి ఆ ఆలోచనలు లోపల తిరుగుతా మిమ్మల్ని చాలా బాధ పెడతాయి. వాటిని ఎట్లా వదిలించుకోవాలో కూడా మీకు తెలీదు. పైగా ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్ది ఇవన్నీ ఇంకా స్పష్టంగా మనకి కనిపిస్తాయి ముఖ్యంగా భావోద్వేగాలు అంటే స్వాధిష్టాన చక్ర స్థాయి నుంచి మనం బ్రతుకుతున్నప్పుడు వీటిని మనం తప్పించుకోలేము.
(07:26) మన గాయాల్లోకి మనం తొంగి చూడాలి వాటిని మనం తిరస్కరించలేము వాటికి మొహం చాటేయలేము ఏదో ఒకటి చెప్పుకుని వాటిని అణ చేయలేము ఇప్పుడు అవన్నీ బయటికి వస్తున్నాయి. ఎప్పుడైతే మనం ఈ గాయాల్లోకి తొంగి చూసుకుని వీటిని మాంచుకోవాలి మనల్ని మనం మార్చుకోవాలి మనం నేర్చుకోవాలి ఆధ్యాత్మికంగా ఎదగాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ముందుకు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మన నర్వస్ సిస్టం అనేది నరాల వ్యవస్థ రీసెట్ అవుతుంది.
(08:00) రీసెట్ అయ్యేసరికి అది పనిచేసే విధానం మారుతుంది. మారి మిమ్మల్ని గతం తాలూకు విషయాల్లో నుంచి బయటకి తీసుకొస్తుంది ఆధ్యాత్మిక ప్రక్రియ అంటేనే మిమ్మల్ని గతంలో నుంచి బయటకి తీసుకొచ్చి మీకు పూర్తి స్వస్థతని ఇచ్చేటువంటి ప్రక్రియ ఇది కానీ ఆ బయటకి తీసుకొస్తున్నప్పుడు మనం ఆ అగ్నిలో ఉన్నప్పుడు మనకి అక్కడ నిలబడటం కష్టం అనిపిస్తుంది. కాకపోతే ఈ ప్రక్రియ మిమ్మల్ని స్వస్థత వైపే తీసుకెళ్తుంది మిమ్మల్ని పతనం వైపు అయితే తీసుకెళ్ళదు.
(08:26) పైగా ఈ స్థాయిలో ఏంటంటే మనకి ఒంట్లో హార్మోన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి ఆధ్యాత్మిక ప్రక్రియలో దాని మూలంగా కోపం కాస్త వచ్చినా చాలా ఎక్కువగా వచ్చినట్టు అనిపిస్తుంది. దుఃఖం కొద్ది దుఃఖం కూడా మనకి భూతద్దంలో చూసుకున్నట్టుగా చాలా పెద్దదిగా అనిపిస్తుంది. ప్రతి భావోద్వేగం మీరు చాలా తీవ్రంగా పెద్ద స్థాయిలో అనుభవిస్తారు.
(08:48) కాబట్టి ప్రతి చిన్నదానికి మీరు చాలా చెల్లిస్తారు. చాలా ప్రతిస్పందిస్తారు. ఇలాంటప్పుడు కొంతకాలం ఒంటరిగా ఉండటం మంచిది ఒంటరిగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మన నర్వస్ సిస్టం అనేది రీసెట్ అవుతుంది. రీసెట్ అయ్యి మనకి గాయాలు మానిపోయాక ఆ తర్వాత మనం ప్రశాంతంగా మామూలుగా ఉంటాం ఎవరైనా వచ్చి మన పాత గాయాలని రేపే ప్రయత్నం చేసినా దాని ప్రభావం మన మీద ఉండదు.
(09:16) అయితే ఈ పాత గాయాలు మనల్ని బాధ పెట్టకూడదు. అవి మానిపోవాలి అంటే మనం కొంతవరకు మన బుర్రని రీట్రైన్ రీప్రోగ్రామ్ చేసుకోవాలి. ఇక్కడ మన లోపల హుక్స్ ఎమోషనల్ హుక్స్ ఏ హుక్స్ అయితే అంటే ఇప్పుడు గాయాల్ని మనం ఒక హుక్ లాగా అనుకున్నామఅండి అనుకుంటే ఏమవుతుందంటే ఎవరైనా దానికి తాడేశరు అనుకోండి మనల్ని పీడించే ఉద్దేశం ఉన్నవాళ్ళు ఆ హుక్కుని లాగుతూ ఉంటారు తాడేసి లాగుతుంటే ఏమవుతుందంటే మీకు చాలా నొప్పి వస్తుంది గాయం మానదు.
(09:52) ఎప్పుడైతే ఈ హుక్కుని తీసి మనం బయట పడేస్తామో ఈ హుక్కుని ఎలా తీసి బయట పడేస్తాము అంటే మనం మన గాయాల్ని అర్థం చేసుకుని వాటిని సరిచేసుకునేటువంటి ఒక దిశగా మనం వెళ్ళినప్పుడు మనల్ని మనం మార్చుకుంటూ పాఠాలు నేర్చుకుంటూ గతాన్ని వదిలేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు ఈ హుక్కులు అనేవి వదిలేసుకుంటాం. వదిలేసుకున్నప్పుడు ఈ హుక్కు పోయింది అనుకోండి ఎవరైనా మళ్ళీ తాడేసి ఆ గాయం మీద దాన్ని లాగే ప్రయత్నం చేసినా కూడా అది పని చేయదు ఎందుకంటే అక్కడ హుక్కు లేదు ఆ హుక్కు మీరు పెట్టుకున్న హుక్కు ఈ హుక్స్ అన్ని ఏమవుతాయి అంటే మీకు ఆధ్యాత్మిక ప్రక్రియలో అవి పడిపోతాయి మీరు స్వస్థత
(10:29) వచ్చినప్పుడు పడిపోతాయి. పడిపోయినప్పుడు ఏంటంటే ఎవరైనా మిమ్మల్ని పాత వాళ్ళు మళ్ళీ అలాగే పీడిద్దాం ఏడిపిద్దాం అనుకున్న వాళ్ళు వాళ్ళు తాడు వేసినా కూడా అక్కడ హుక్కు లేదు కాబట్టి అది తగలదు అది పడిపోతుంది. మీ మీద ఎలాంటి ప్రభావం ఉండదు ఇది ఏ రకంగా అవుతుంది ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు అనేది నేను ఈరోజు వివరిస్తున్నాను.
(10:54) మొదటిది జ్ఞానం సంపాదించడం ఏ విషయాల మీద జ్ఞానం సంపాదించడం అంటే మానసిక శాస్త్రం మనుషుల్లో రకాలు పీడించే తత్వం ఉన్నవాళ్ళు ఏ రకంగా ప్రవర్తిస్తారు ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాలి మనస్తత్వాలు ఎందుకు అర్థం చేసుకోవాలి అంటే మనకి మనుషుల మనస్తత్వాలు అర్థం అయితేనే నిజా నిజాలు అర్థం అవుతాయి నేను గతంలో చాలా వీడియోస్ చేసి ఉన్నాను మీకు మానసిక శాస్త్రం రకరకాల మనుషులు వ్యక్తిత్వ దోషాలు అంతేకాకుండా వ్యక్తిత్వాలు ఉంటే ఎన్ని రకాల వ్యక్తిత్వాలు ఉంటాయి అని చెప్పి నేను రెండు ప్లే లిస్ట్స్ ఉన్నాయి ఆ రెండు ప్లే లిస్ట్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో
(11:30) పెడతాను తప్పకుండా చూడండి. మీకు ఒక మనిషిలో పీడించే తత్వం ఉందన్న విషయం మీరు గ్రహించినప్పుడు ఆ పరిస్థితిలో ఆ మనిషి కి మీ మీద ఏదో ఒక కోపం లేదంటే ఏదో మీతో చాలా అనవసరపు పోటీ లేదంటే తీవ్రమైనటువంటి ఓరలేనితనం ఉందనుకోండి ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే పక్కా వాళ్ళని ఎవరినైతే వాళ్ళు ఆ టార్గెట్ చేస్తున్నారో వాళ్ళని కిందకి లాగేసేటటువంటి ప్రయత్నం నిత్యం చేస్తారు మన పక్కనే మన స్నేహితుల్లా మెదులుతూ నిత్యం మనల్ని కిందకి లాగే ప్రయత్నం చేస్తారు.
(12:11) మీకు గనుక ఇలాంటి వ్యక్తుల గురించి అవగాహన లేదనుకోండి వాళ్ళు అనే ప్రతి మాట మీరు మనసుకు తీసుకుని మిమ్మల్ని మీరు తూలలాడుకుంటారు ఉదాహరణకి వాళ్ళు నువ్వు అంత మంచి దానివి కాదు నువ్వు ఇంత మంచి పని ఎలా చేశావు నీకు అంత అర్హత ఉంది అనుకుంటున్నావా ఇలా మాట్లాడుతారు అంటే నిత్యం కిందకి లాగుతారు. ఇలాంటి వాళ్ళు మీ చుట్టూ ఉన్నప్పుడు ఆ మనిషికి నా మంచి కోరుకునేటువంటి ఉద్దేశం లేదు నన్ను కిందకి లాగే ఉద్దేశం ఉందన్న విషయం మీరు గ్రహించాలి.
(12:44) గ్రహించలేదు అనుకోండి వాళ్ళు చెప్పే ప్రతి మాట నమ్ముతారు. ఎప్పుడైతే వాళ్ళకి దురుద్దేశం ఉందని మీరు గ్రహిస్తారో పసిగడతారో ఇంకా ఆ మాటల ప్రభావం మీ మీద ఉండదు అవి మీ మీద పడినా కూడా రాలిపోతాయి. అక్కడ మీకు కనిపించేది ఏంటంటే ఆ మనిషి మనసులో గాయాలు కనిపిస్తున్నాయి ఆ మనిషికి ఓరవలేని తలానికి మాట్లాడుతున్నారు లేదంటే ఆ మనిషికి నేను పైకి ఎదగడం ఇష్టం లేదు లేదంటే ఆ మనిషి నా మీద నిందలు మోపే ప్రయత్నంలో నన్ను చెడ్డ మనిషిగా నిలబెట్టే ప్రయత్నంలో ఉన్నారు.
(13:19) నా మంచి కోరుకోవట్లేదు అన్న విషయం మీరు గ్రహించినప్పుడు ఏమవుతుంది అంటే ఆ మనిషి మాటలు ఇంకా మీ మీద పని చేయవు. అలా మీరు ఎదుటి మనుషుల తత్వాలు గ్రహించాలి వాళ్ళ ఉద్దేశాలు గ్రహించాలి అంటే మీకు మానసిక శాస్త్రం మీద బాగా పట్టు ఉండాలి లేదంటే కొద్దో గొప్పో మీరు మనుషుల్ని అంచనా వేయగలిగి ఉండాలి సరిగ్గా మరి అందరినీ చెడుగా కాదు కొంతమంది మీకు సదుద్దేశంతోనే మీకు చెప్పే ఉద్దేశంతో వస్తారు వాళ్ళకి వీళ్ళకి మీకు తేడా తెలియాలి కాకపోతే మీ మంచి కోరి మీకు చెప్పేవాళ్ళు మిమ్మల్ని పైకి లేపేటట్టుగా చెప్తారు కానీ మిమ్మల్ని కిందకి పడేసేటట్టుగా అవమానించేటట్టుగా మీకు కోపం
(13:56) దుఃఖం వచ్చేటట్టుగా మీకు వాళ్ళు చెప్పరు. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే తప్పు నాలో లేదు ఈ వ్యక్తిలో అనవసరపు పోటీ తత్వం అనవసరపు ఓర్వలేని తనానికి మాట్లాడుతున్నాడు తన మనసులో ఉన్న చెడును నాకు రుద్దుతున్నారు అనేటువంటి విషయం మీరు గ్రహించినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ మాటలు మీకు అంటవు ఆ తర్వాత అలాంటి వ్యక్తులకు కూడా మీరు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారు ఒకవేళ మాట్లాడాల్సి వచ్చిన ఆలోచించి సరిగ్గా స్పందిస్తారు.
(14:29) దాని మూలంగా మీరు ఇక్కడ భావోద్వేగ పరంగా తీవరమైనటువంటి దుఃఖంకో, కోపంలోకో వెళ్ళిపోయి, ప్రతిస్పందిస్తూ, ప్రతిఘటిస్తూ మాట్లాడకుండా చాలా ఆలోచనతో విచక్షణతో అక్కడ ప్రవర్తిస్తారు. రెండోది ఎవరైతే ఎక్కువగా బాధ దుఃఖంలో ఉన్నారో వాళ్ళకి పాత గాయాలు పదే పదే గుర్తుకొస్తున్నాయో ఇలాంటి వాళ్ళు చాలా చక్కగా నాభిలోకి వాళ్ళు శ్వాస పీల్చుకోవటం అనేది నేర్చుకోవాలి.
(15:01) వాళ్ళు రోజూ కూడా ఒక ఎక్సర్సైజ్ లాగా కూర్చుని నాభిలోకి శ్వాస పీల్చుకోవడం నేర్చుకోవాలి. దాని వల్ల ఏమవుతుందంటే మన లోపల టక్కమని వచ్చే కోపం గాన ఎవరైనా ఏమైనా మన అంటే ఒక ఉద్రేకం వస్తుంది చూడండి ఆ ఉద్రేకం మనకి అదుపులో ఉంటుంది. ఎవరైనా మిమ్మల్ని ఏమనా అన్నా కూడా మీరు వెంటనే చలించకుండా ముందు శ్వాస మీద ధ్యాస పెట్టి మీరు మీ ప్రతిస్పందని ఒక 10 సెకండ్లు వాయిదా వేయండి.
(15:32) 10 సెకండ్లు వాయిదా వేసే లోపు ఏమవుతుందంటే మీ శరీర మనసు మళ్ళీ మీ పట్టులోకి వస్తుంది. వచ్చేసరికి మీరు అరవకుండా మీరు సరైన సమాధానం ఆలోచించి చెప్పగలుగుతారు. ఇక్కడ మీకు పై స్థాయి మీ బుద్ధి పనిచేస్తుంది. మీ లోపల కోపంలో నుంచో దుఃఖంలో నుంచో మీరు జవాబు చెప్పరు. ఒక్కసారి మీరు అలా జవాబు చెప్పారు అంటే ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి రారు ఎందుకు రారు అంటే వాళ్ళు విసిరే గాలం అది మీ హుక్కులోకి పడి లాగితేనే వాళ్ళకి ఆనందం మీకు ఆ నొప్పి అనేది మీరు తెలిపితేనే వాళ్ళకి ఆనందం ఎక్కడైతే మీకు అక్కడ హుక్కు లేదో వాళ్ళకు ఆనందం ఉండదు మిమ్మల్ని రెచ్చగొట్టి మాట్లాడితే వాళ్ళకి ఏమీ రాదు
(16:13) కాబట్టి వాళ్ళు మళ్ళీ మీ జోలికి రారు చాలా మటుకు కాబట్టి మీలో గాయాలు ఉన్నంత కాలం ఇలాంటి వాళ్ళు పీ పీడించే వాళ్ళని ఎక్కువ ఆకర్షిస్తుంది ఆ శక్తి మీలో గాయాలు లేవనుకోండి పీడించే వాళ్ళు అసలు మీ దరిద్రాపులోకి కూడా రారు ఎందుకంటే మిమ్మల్ని ఎలా పీడించాలో వాళ్ళకి తెలీదు. పీడించే ప్రతి వాళ్ళు ముందు వాళ్ళు మిమ్మల్ని పరీక్షిస్తారు.
(16:37) ఏ విషయం ఈ మనిషికి మనసుకి గట్టిగా తగులుతుంది. నేను ఎలా మాట్లాడితే వీళ్ళు ఎక్కువ బాధపడతారు? ఎక్కువ కృంగిపోతారు అనేది వాళ్ళు పరీక్షగా చూసి రకరకాలుగా ప్రయత్నిస్తారు ఓ 10 రకాలుగా ప్రయత్నిస్తారు బహుశా మీరు గుర్తుపట్టకపోవచ్చు జోకుల్లా కూడా అవమానించే వాళ్ళు ఉంటారు అది మీరు ధ్యాసకి రాకపోవచ్చు వాళ్ళు 10 రకాలుగా ప్రయత్నించినప్పుడు మీరు తొమ్మిది రకాలకి చలించకుండా ఒకదానికి మీకు కోపం వచ్చిందనుకోండి వాళ్ళ ఓహో ఇది నీ బలహీనత నువ్వు దొరికిపోయావు అని వాళ్ళు అనుకుంటారన్నమాట తర్వాత పదే పదే అక్కడే పొడుస్తూ ఉంటారు మిమ్మల్ని ఆ పుండుని పెద్ద గాయంగా చేసేటువంటి ప్రయత్నం
(17:14) చేస్తారు. అదంతా ఎందుకు చేస్తారు అంటే నిత్యం మిమ్మల్ని తక్కువ చేయడానికి మిమ్మల్ని అదుపులో పెట్టుకోవడానికి మిమ్మల్ని హింసించడానికి అది ఆనందం వాళ్ళకి పైశాచిక ఆనందం అలా చేస్తున్నప్పుడు ఏంటంటే మీరు బాధపడుతున్నప్పుడు మీ లోపల శక్తిని మీరు కోల్పోతారు ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రయాణంలో మీలో ఆధ్యాత్మిక చేతన స్థితులు పెరిగేటప్పుడు మీలో మీ శరీరంలో కాంతి పెరుగుతుంది.
(17:39) మీరు ఆ దుఃఖంలో తీవ్రమైనటువంటి ఒక మానసిక వేదనలోకి వెళ్లి గట్టిగా అరిచి అలా మీరు ప్రతిస్పందించినప్పుడు కొద్దిగా మీ వెలుగు తగ్గుతుంది. వెలుగు వెళ్ళిపోతుంది వాళ్ళ ముఖాలు చూడండి వాళ్ళ ముఖాలు మెరుస్తూ ఉంటాయి వాళ్ళ ముఖాలు మెరవడానికి వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది అది మీలోంచి వెళ్ళిపోయిన వెలుగే వాళ్ళ ముఖం మీద మీకు కనిపిస్తుంది.
(18:00) మీరు దుఃఖం లోకి కృంగిపోతారు కాబట్టి ఇవన్నీ మనం పాఠాలు నేర్చుకోవాలి ఆధ్యాత్మిక ప్రక్రియలో ఈ ప్రక్రియ మనకి పాఠాలు నేర్పిస్తుంది మానసిక శాస్త్రం మీద మనుషుల మీద ఈ పాఠాలు ఎంత తొందరగా మీరు నేర్చుకుంటే అంత తొందరగా మీరు ఎదుగుతారు ఒకవేళ నేర్చుకోలేదు అనుకోండి అప్పుడు అక్కడే ఉంటారు అనుభవాలు వస్తూనే ఉంటాయి అలాంటి మనుషులు తిరిగి తిరిగి ఇంకో రూపంలో ఇంకో సంబంధంగా ఈ కర్మ సంబంధాలు మీ జీవితంలోకి వస్తూనే ఉంటాయి ఆ పాఠాలు మీరు మీరు పూర్తిగా నేర్చుకొని వాటిలో నుంచి ఎదిగి బయటికి వచ్చే వరకు మీ లోపల ఇంక ఎలాంటి గాయాలు ఉండకూడదు వాళ్ళ వాళ్ళు మీ మీదకి తాడు విసిరి ఆ హుక్కును లాగటానికి
(18:38) ఎట్లాంటి హుక్కు గాయాలు ఉండకూడదు మీకు అయితే నేను చెప్పాను ఆధ్యాత్మిక ప్రక్రియ ప్రక్రియ స్వస్థత వైపు తీసుకెళ్ళేటువంటి ప్రక్రియ మీలో గాయాలు లాగటానికి హుక్స్ ఉంటే స్వస్థత లేనట్టే కదా కాబట్టి ఇవన్నీ వెళ్ళిపోవాలి ప్రక్రియ భాగంగా ఇక్కడ మీరు నావిలోకి శ్వాస పీల్చుకోవటం ఎవరైనా ఉద్రేక పరిచినా ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినా తర్వాత మీరు ఏకాంతంగా ఉన్నప్పుడు మీకు ఆ మాటలు గుర్తుకు వచ్చినా కూడా ఆ మాటలు గుర్తుకు వచ్చినా కూడా మీరు వెంటనే శ్వాస మీద ధ్యాస పెట్టి దాన్ని అదుపులో తెచ్చుకునే ప్రయత్నం చేశారంటే మీ మనసులో దుఃఖం అలా ఒక మబ్బు
(19:21) వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతుంది అంటే మీరు తొందరగా దుఃఖం నుంచి బయటకి రాగలుగుతారు అలా మీరు సాధన ధన చేసే కొద్ది మీకు మీ మనసు మీద పట్టు అనేది పెరుగుతుంది. ప్రతి అవకాశాన్ని మీ మీద మీరు పట్టు తెచ్చుకునేటట్టుగా వాడుకోవాలి మీరు బయట నుంచి లోకం మీ మీద రాళ్ళు విసిరిన రాళ్ళు తీసుకుని దాంతో ఇల్లు కట్టుకోవాలే కానీ ఆ రాళ్ళు తగిలి మనం పడిపోకూడదు క్రిందకి కాబట్టి ఇక్కడ మీకు ఒంటరిగా ఉన్నప్పుడు మీకు కోపం దుఃఖం వచ్చినా కూడా వెంటనే శ్వాస మీదకి మీకు గ్యాస్ వచ్చేసేయాలి.
(19:55) అది మీకు లోపల ఒక ఎమోషనల్ రియాక్షన్ మిమ్మల్ని మీరు అదుపులోకి మీ శ్వాస ద్వారా తెచ్చుకుంటే ఆ మబ్బు లాగా దుఃఖం వెళ్ళిపోతుంది. తర్వాత ఆధ్యాత్మిక ప్రక్రియలో సబ్కాన్షియస్ మైండ్ తెర్చుకునేటప్పుడు మనకి చాలా కాలం మనం శూన్య స్థితుల్లో ఉన్నప్పుడు ఈ కోపం దుఃఖం అప్పుడు మన అదుపులోకి తెచ్చుకోవాలని చాలా కష్టం అనిపిస్తుంది అప్పుడు అంత తేలిక కాదు.
(20:20) అప్పుడు ఏం చేయాలంటే మనం ఎప్పుడైతే అదుపులో పెట్టుకోలేమో కోపాన్ని దుఃఖాన్ని సాక్షి మాత్రంగా చూడగలగాలి. అంటే ఈ కోపం దుఃఖం నాకు ఏం చెప్పదలుచుకుంది నా లోపల ఉన్న గాయం నాకు ఏం నేర్పించదలుచుకుంది పాఠాలు అనేటువంటి ఒక నేర్చుకునే ధోరణతో మనం మన గతాన్ని చూడాలి పాఠాలు నేర్చుకోవాలి గతం నుంచి ఈ మన లోపల బాధ అంతా మనం నేర్చుకొని పాఠాలే ఎప్పుడైతే మనం ఆ బాధ చెప్పే పాఠాలు నేర్చుకుంటామో బాధ కరిగిపోతుంది బాధ తొలగిపోతుంది పాఠాలుగా మారిపోతుంది తర్వాత మన లోపల ఉన్నటువంటి హుక్స్ మనం తీసేయాలి అంటే
(21:06) అసలు దీనికి మూలం ఏంటి నాకు అసలు ఈ హుక్ ఎందుకుఉంది గాయం ఎందుకు ఉంది అసలు నాలో అని ప్రశ్నించుకోవాలి. ఇది నాకు చిన్ననాటి జ్ఞాపకమా ముఖ్యంగా మనం చిన్నప్పుడు తల్లిదండ్రులు మన ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళు ఏం చెప్తే అది నిజమని నమ్మేస్తాం. అలాంటప్పుడు వాళ్ళు వాళ్ళు మన గురించి చెడుగా చెప్పినా కూడా నమ్మేస్తాం. నమ్మేసి అది మన లోపల జ్ఞాపకాలు మన మీద మనకు ఏర్పడినటువంటి అభిప్రాయాలు అవన్నీ మన లోపల గాయాలుగా అయిపోతాయి.
(21:37) మనకి ఇవి తెలియదు సబ్కాన్షియస్ మైండ్ లో ఉంటాయి. కాకపోతే ఈ గాయం యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మన మానసిక స్థితి అదుపు అంతా ఈ గాయం లోనే ఉంటుంది. ఈ గాయం మనకి అది రేగిందంటే మనకి మనం మనకి మన మీద మనకి ఇంకా పట్టు ఉండదు పట్టు తప్పిపోతాం మనం భావోద్వేగ పరంగా దుఃఖంలోకి వెళ్ళిపోతాం దాంట్లోనుంచి బయటికి రాలేము చాలా మటుకు ఈ జ్ఞాపకాలు మన చిన్నప్పటి విషయాలతో ముడిపడి ఉంటాయి.
(22:08) తర్వాత అందరికీ ఒకే రకమైనటువంటి జ్ఞాపకాలు ఉండవు అందరూ బాధని దుఃఖాన్ని ఒకటే రకంగా మనసులో దాచుకోరు మన నర్వస్ సిస్టం అంతా ఈ జ్ఞాపకాలతో అది బరువెక్కుపోయి ఉంటుంది. ఆ బరువెక్కుపోయి అది ఓవర్లోడ్ అయినప్పుడు దాన్ని విడుదల చేసే ప్రయత్నం చేసేటప్పుడు మనకి తీవ్రమైనటువంటి భావోద్వేకాలు అనేవి ఈ ప్రక్రియలో వస్తాయి అది విడుదల చేసి మన లోపల ఖాళీ ఏర్పడితేనే మన లోపల మళ్ళీ గురువుల నుంచి వచ్చేటువంటి శక్తిపాతాన్ని తీసుకోవటానికి నిలుపుకోవడానికి మనలో ఖాళీ ఉంటుంది.
(22:48) లేదు అంటే మనలో ఖాళీ ఏర్పడవు ఖాళీ అంతా ఈ అజ్ఞానంతో నిండిపోయి ఉంటుంది దుఃఖంతో నిండిపోయి ఉంటుంది. మన వ్యక్తిత్వం ఎలా పనిచేస్తుంది అనేది మనం అర్థం చేసుకుంటే గనుక ఏ విషయాలు మనల్ని కోపం తప్పిస్తాయి మనల్ని రెచ్చగొడతాయి మనలో ప్రతి ఘటన అనేది ఏ రూపంలో వస్తుంది అనేది మనల్ని మనం అర్థం చేసుకునే కొద్దీ వీటికి మనం పరిష్కారాలు వెతుక్కోగలుగుతాం. ముఖ్యంగా మనం మన గాయాల మూలాలకి చేరగలిగితే అసలు ఎక్కడ మొదలైంది ఈ గాయం ముందు అసలు ఎవరు నన్ను గాయపరిచారు ఆ మూలం ఎక్కడఉంది అనేది మనం ఆ మూలం వరకు వెళ్లే మూలాన్ని కనుక్కుంటే గాయం వెళ్ళిపోతుంది చాలా తేలిగ్గా ఇక్కడ చాలా మందికి పాస్ట్ లైఫ్
(23:34) రిగ్రెషన్ పనికొస్తుంది. పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ లో మన సబ్కాన్షియస్ మైండ్ లో లోతుల్లో ఏముందో పాస్ట్ లైఫ్ రెగ్రేషన్ చేయగలిగే వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా గనుక మనం ఆ ఒక హిప్నాటిక్ స్టేట్ లోకి వెళ్లి మన సబ్కాన్షియస్ మైండ్ లోతుల్లో ఉన్నటువంటి గాయాలు మీ గత జన్మలవి అన్ని మీరు మళ్ళీ వాటిని అందుకోగలుగుతారు. కాకపోతే పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అందరి మీద పనిచేయదు ఎవరిలో అయితే తీవ్రమైనటువంటి భావోద్వేగాలు అంటే కోపం దుఃఖం ఈ రూపంలో భావోద్వేగాలు ఉన్నాయో వాళ్ళకి పాస్ట్ లైఫ్ రిగ్రేషన్ ఎక్కువ పనిచేస్తుంది.
(24:14) ఎవరైతే ఎక్కువగా ఆలోచనా పరంగా ఉంటారో ఎక్కువ ఆలోచిస్తారో వాళ్ళకి భావోద్వేగాలు అంతగా వాళ్ళకి అనిపించదు వాళ్ళకి బహుశా పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అంతా పనిచేయకపోవచ్చు. తర్వాతది మీకు కలలు వస్తాయి మీ కలలో కూడా మీరు మీ మానసిక స్థితి మీరు మీ భయాలని ఏ రకంగా దాచుకున్నారో మీరు ఏ రకంగా బాధలో కూరుకుపోతున్నారో కర్మ సంబంధాలు ఏమిటి మీ కోరికలు ఏమిటి మీ గురించి మీకు తెలియని చాలా విషయాలు మీ కలలు చెప్తాయి.
(24:48) ఆ కలల్లో వచ్చేటువంటి విషయాల్ని సమాచారాన్ని పక్కకు నెట్టేయకండి కలల్ని రాసుకుని మిమ్మల్ని మీరు కలల ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అప్పుడప్పుడు మనకు ఒక గాయం మానిపోయినా మనకి స్వస్థత వచ్చిన మన కల రూపంలో ఆ సందేశం మనకు వస్తుంది సబ్కాన్షియస్ మైండ్ మనతో కల రూపంలో సంభాషిస్తుంది కాబట్టి మీకు మీ కలలు చాలా ముఖ్యం మీకు ఏ రకంగా ముందుకు వెళ్ళాలి ఏ రకంగా ముందుకు వెళ్తున్నారు అనేది కూడా మీకు మీ కల చూపిస్తుంది తర్వాత అది మీరు మీకు చెప్పుకునేటువంటి కథలు మన నిత్యం మనతో మనం లోపల మాట్లాడుకుంటూ ఉంటాం.
(25:28) కథలుగా మనకి మనం జరిగిన విషయాలు చెప్పుకుంటూ ఉంటాం. మీరు కథలు ఏ రకంగా అయితే చెప్తున్నారో మీ జాగ్రఫీ అంటే మీది మానసిక జాగ్రఫీ మీ భావోద్వేగ పరంగా మీ జాగ్రఫీ అనేది ఆ రకంగా లోపల అది మలచబడుతుంది. మీకు భావోద్వేగాలు జలతత్వం నీరు నీరు ఏం చేస్తుంది? ఇప్పుడు ఒక నేల మీద నీరు ప్రవహిస్తుంటే ఆ నీరు ఏ రకంగా అయితే ప్రవహిస్తుందో ఎన్ని పాయలుగా వీడిపోయి ప్రవహిస్తుందో అది అక్కడ ఉన్నటువంటి నేలని దాని రూపాన్ని మారుస్తుంది ఒకవేళ ఇటు ప్రవహించే నది ఇంకోవైపు ప్రవహించింది అనుకోండి అక్కడ నేల స్వరూపమే
(26:13) మారిపోతుంది. అదే రకంగా మన మనసులో మన మాటలు మన భావోద్వేగాలు మనం ఏ రకంగా మనకి మనం కథలు చెప్పుకుంటున్నాము జరిగిపోయిన విషయం గురించి ఇప్పుడు మన జీవితంలో జరిగే విషయం గురించి మన గురించి మనకి మనం ఏం చెప్పుకుంటున్నామో దాని ఆధారంగా మన భావోద్వేగాలు మన లోపల మన మానసిక స్థాయిలో అక్కడ రూపాన్ని మారుస్తున్నాయి లోపల రూపాన్ని మానసిక రూపాన్ని మారుస్తున్నాయి ప్రవాహంతో మీరు మీకు ఎలా ఎలాంటి కథలు చెప్పుకుంటున్నారో మీరు ధ్యాస పెట్టుకోవాలి.
(26:48) మీరు మీకు చెప్పుకునే కథలు గనుక మిమ్మల్ని పతనం చేసి పైపు తీసుకెళ్ళేటట్టయితే అది కష్టం. మీరు మీకు చెప్పుకునే కథలు మిమ్మల్ని పైకి లేపేటట్టుగా మీరు లోపల మీ మాటలు మీరు మార్చుకోవాలి ఉదాహరణకి చాలామందికి నాకు చేత కాదు నేను చేయలేను గతంలో చేయలేదు ఇప్పుడు నేను చేయలేను ఇలాగే చెప్పుకుంటారు వారికి వారు దాని వల్ల వాళ్ళకి వాళ్ళ మీద నమ్మకం ఉండదు.
(27:12) ఇక్కడ ఏంటంటే మనిషి ప్రాక్టికల్ గా ఆలోచించి నేను ఎంత చేయగలను ఇంత చేయగలను ఇంతే చేస్తారు నెమ్మదిగా వాళ్ళ సామర్థ్యాన్ని పెంచుకుంటూ క్రమేపి సామర్థ్యాన్ని పెంచుకుంటూ కొత్తవి నేర్చుకుంటూ వాళ్ళకి ఏంటంటే నెమ్మదిగా వాళ్ళ మీద వాళ్ళకి ధైర్యం వస్తుంది ఇంత నేను చేయగలను ఈ రకం మార్పు రావాలి అంటే మన కథలు లోపల మారాలి. ఒకసారి నాకు జీవితంలో వైఫల్యం వచ్చింది కాబట్టి ఎప్పటికీ వస్తుందని చెప్పుకునేటువంటి కథ లోపల ఉందనుకోండి మనం మళ్ళీ కొత్త విషయాలని ప్రయత్నించాం భయంతో అక్కడే ఉండిపోతాం.
(27:55) కాబట్టి మనం ఏం కథలు చెప్తున్నాము అప్పుడప్పుడు మన కథలు మనల్నే రెచ్చగొడుతూ ఉంటాయి లోపల మనకి మన మాటలు మనకే కోపాన్ని దుఃఖాన్ని తెప్పించేటట్టుగా ఉంటాయి. వీటన్నిటిని మనం గుర్తించాలి గమనించాలి గమనించి మన లోపల మనతో మనం మాట్లాడుకునే వాక్యాలు ఉంటాయి చూడండి అవి మనల్ని రెచ్చగొట్టేటట్టుగా కాకుండా మనకి జీవితం అర్థమయ్యేటట్టుగా వాటిని మలుచుకోవాలి ఇక్కడ ఏంటంటే మనం బుద్ధిని వాడాలి బుద్ధిని వాడినప్పుడు ఆ లోపల చెప్పుకునే కథని సరిగ్గా చెప్పాలి.
(28:27) అంటే మనల్ని మనం మన జీవితాన్ని మనం ఒక సాక్షిగా చూస్తూ గనుక మన కథని చెప్పుకున్నాం అనుకోండి అప్పుడు మీకు కథలో అసలు నిజాలు అర్థంఅవుతాయి. మనం ఎప్పుడు దుఃఖంలోంచి భయంలోంచి మన కథల్లోనుంచి చూసినప్పుడు మీకు అసలు విషయాల కంటే కూడా మనకి జరిగిన దానికి భిన్నంగా మన భయాల్ని పెద్దవి చేస్తూ మనకి కథ అర్థంవుతుంది. ఇక్కడ మన కథల్ని కూడా మనం ఒక రకమైనటువంటి వైరాగ్యంతో భావనతో ఒక రకమైనటువంటి సాక్షి భూతంగా మనం మన కళల్ని జీవితాన్ని చూడాలి అప్పుడు దాంట్లో ఉన్న అసలు సత్యాలు మనకి అవగతం అవుతాయి.
(29:10) తర్వాత మీరు ఇక్కడ మీ అంతట మీకు ఇది కాదు అంటే ఒక సైకాలజిస్ట్ సహాయము చాలామంది ఏమనుకుంటారుంటే సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే పిచ్చి పడితేనే వెళ్తారు సైకయాట్రిస్ట్ దగ్గరికి సైకాలజిస్ట్ దగ్గరికి అని అనుకుంటారు తప్పు అది చాలాసార్లు మన గురించి మనకి తెలియని విషయాలు మనలో తీవ్రమైనటువంటి వ్యధ బాధ ఇట్లాంటివి ఉంటే కూడా సైకాలజిస్ట్ తోనో లేదంటే సైకయాట్రిస్ట్ తోనో మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే ముఖ్యంగా సైకాలజిస్ట్ కౌన్సిలింగ్ చేస్తారు.
(29:35) దాని వల్ల ఏమవుతుందంటే మనసులో మాటలు బయటికి చెప్పుకోవడం వల్ల సగం నొప్పి తగ్గిపోతుంది సగం గాయం మానిపోతుంది. అక్కడ వినే వాళ్ళు ఉన్నప్పుడు రెండోది వాళ్ళు హిప్నో థెరపీ అని వేరే ఉంటాయి వాళ్ళ దగ్గర రకరకాల పద్ధతులు దాని ద్వారా మిమ్మల్ని మీ భయాల్లో నుంచి బాధల్లో నుంచి బయటికి తీసుకొచ్చి మీ పాత గతం దాని తాలూకు గాయాలన్నీ మానిపోయేటట్టుగా వాళ్ళు మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకెళ్ళగలుగుతారు వాళ్ళతో మీరు ఒక మంచి సైకాలజిస్ట్ గనుక మీకు దొరికితే దానివల్ల మీరు లోపల ప్రశాంతత వైపు వెళ్తారు కామ అవుతారు కామయి మీ నర్వస్ సిస్టం రీసెట్ అవుతుంది రీసెట్ అయ్యేసరికి
(30:19) మీ లోపల పాత విషయాలు ఏవైతే మిమ్మల్ని తీవ్రంగా కదిల్చేవో లేదా డిస్టర్బ్ చేసేసేవో అవన్నీ ఇంకా వాటి ప్రభావం మీ మీద ఉండదు గతం తాలకు విషయాలు ఎవరైనా మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నంతోనో లేదంటే మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నంతో మాట్లాడినా కూడా మీరు చాలా కూల్ గా ఉంటారు మీరేమీ దానికి కోపంతో స్పందించరు మీరు నెమ్మదిగా ఎలాంటి జవాబు చెప్పాలో అలాగే స్పష్టంగా మాట్లాడేస్తారు.
(30:51) దానివల్ల ఏమవుతుందంటే మిమ్మల్ని పీడించాలి హింసించాలి అదుపులో పెట్టి ఆడుకోవాలి అని చూసే వాళ్ళు ఉంటారు చూడండి అలాంటి వాళ్ళకు మీరు ఇంకా ఆకర్షణీయంగా కనిపించరు ఎందుకంటే మనం పొడుస్తే ఎగిరే మనిషి ఉంటే వాళ్ళకి నచ్చుతుంది. నేను ఎంత పొడిచిన ఈ మనిషి పట్టించుకోవట్లేదు అంటే వాళ్ళకి పాపం వాళ్ళకి నీరసం వస్తుంది కాబట్టి వాళ్ళు ఇంకా వేరే వాడిని వెతుక్కొని వేరేవాళ్ళ వేరే వాళ్ళని హింసించే ప్రయత్నంలో వాళ్ళు ఉంటారు.
(31:22) అంతేకాకుండా మనకి విక్టిం పర్పెట్రేటర్ రెస్క్యూర్ డైనమిక్ ఉంటుంది అంటే నేను బాధితున్నని లేదంటే బాధితురాలని లేదు అంటే నేను బాధితురాలని కాబట్టి ఇప్పుడు నా వంతు వచ్చింది కాబట్టి నేను వెళ్లి వాళ్ళకు గుణపాఠం నేర్పిస్తాను అది పర్పెట్రేటర్ అంటే ఇప్పుడు నేను పక్కవాళ్ళ మీద దాడి చేయడానికి వాళ్ళు తిరిగి అనటానికి సిద్ధంగా ఉన్నాను అన్నమాట ఇంకొకటి అక్కవాళ్ళని కాపాడేద్దాం నేను బాధలో ఉన్నప్పుడు నన్ను ఎవరో తిట్టారు అప్పుడు నన్ను ఎవరో కాపాడలేదు కాపాడలేదు కాబట్టి ఇప్పుడు నేను వేరే వాళ్ళని కాపాడతాను.
(32:04) ఈ మూడు ఉంటాయి చూడండి ఈ మూడింట్లోకి మనం పడకూడదు ఈ మూడింట్లో మనం పడినంత కాలం మనకి కర్మ అంటుతుంది మనల్ని కర్మ కిందకి లాగుతుంది. మీరు ఎప్పుడూ బాధితులు కాదు ఆ సంగతి మీరు అర్థం చేసుకోవాలి మనకి జీవితంలో కష్టాలు రాంగానే మన కథలు మనం మనకి మనం చెప్పుకునేటప్పుడు మనం బాధితులం అన్నట్టుగా మనకి కథలు చెప్పుకుంటాం. నేను బాధితురాల్ని కాను అని తిరిగి అదే కథ చెప్పుకున్నారు అనుకోండి మీకు కథ వేరేగా గోచరిస్తుంది.
(32:35) మీకు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నేను బాధితురాలిని కాను నేను బాధితురాలని కాను అన్నప్పుడు వెంటనే మీకు ఏమవుతుంది అంటే మీకు కోపం రాదు కాబట్టి ఎదుటి మనిషి మీద తిరిగి మీరు ఏదో చేయాలి అనే ఆలోచన కూడా మీకు ఉండదు అంటే తిరిగి వాళ్ళు కక్ష తీర్చుకోవాలి అనే ఆలోచన మీకు ఉండదు ఎప్పుడైతే మనల్ని మనం బాధితులుగా చూసుకుంటామో మనం ఎదుటి వాళ్ళ మీద కక్ష తీర్చుకునే ప్రయత్నంలో ఉంటాం.
(33:02) నాకు అవకాశం వస్తే నేను చూపిస్తాను అనేటువంటి ఒక ధోరణలో మనం ఉంటాం. ఎప్పుడైతే మనల్ని మనం పాత్రులం అనుకోమో ఇవంతా మన బహుశా గతజన్మ కర్మ నాకు తిరిగి వస్తుంది. అదే నిజం మీరు మీ గత జన్మ తాలుకు కర్మ ఉంటేనే ఏదన్నా మీకు ఈ జీవిత కాలంలో జరుగుతుంది అంటే ఎవరైనా వచ్చి మిమ్మల్ని అనవసరంగా తిట్టి వెళ్ళినా కూడా అది వాళ్ళు గత జన్మ నుంచి వచ్చినటువంటి కర్మను తీసేస్తున్నారు.
(33:31) అది నిజం అది మీకు అర్థమయింది అనుకోండి మిమ్మల్ని మీరు బాధతులు అనుకోరు వాళ్ళు అన్న మాటలు కూడా మీరు పట్టించుకోరు ఎందుకు పట్టించుకోరు అంటే ఆ మనిషి తన తన అవగాహన గుద్ది తన బుద్ధి గుద్ది మాట్లాడుతున్నాడు అన్న విషయం మీకు అర్థమైనప్పుడు ఆ మాటలు మీకు అంటవు ఆ సమయంలో మీరు జ్ఞానంతో మాట్లాడుతారు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడి సమస్యని అక్కడికి పెంచేస్తారు.
(33:57) మీరు ధైర్యంగా అక్కడ నిలబడతారు నిలబడి మామూలుగా సమాధానం చెప్తారు కక్ష తీర్చుకునే ఉద్దేశంతో కాదు అక్కడ మీ నిజం మీరు నిర్భయంగా మాట్లాడుతారు అంతేకాకుండా వేరే ఎవరినో కాపాడేసేయాలి వాళ్ళ పక్షాన్న నేను పోరాడాలి ఇవన్నీ కూడా మీకు ఎక్కడ వస్తాయి అంటే మీరు బాధితలు నేను బాధలో ఉన్నప్పుడు ఎవరు నాకు సహాయం చేయలేదు కాబట్టి నేను ఇప్పుడు వేరే వాళ్ళకి చేస్తాను.
(34:25) ఆ రకంగా మనం పక్కవాళ్ళది జరిగిన దానికి మనం ఉక్రోషం తెచ్చుకుంటాం పక్కవాళ్ళకి సహాయం చేయొద్దని నేను చెప్పట్లేదు కాకపోతే మీరు వాళ్ళు వాళ్ళని బాధితులుగా చూసి చేయకండి ఒకవేళ మీకు వాళ్ళకి ఇచ్చి పుచ్చుకునే రుణం ఉంటే అది ఎలాగో జరుగుతుంది. కాబట్టి మిమ్మల్ని మీరు ఎప్పుడు బాధితులుగా చూసుకోవద్దు పక్కవాళ్ళని కూడా బాధ్యతలుగా చూడొద్దు.
(34:50) మీరు ఎప్పుడైతే ఈ విక్టిం పర్పెట్రేటర్ రెస్క్యూర్ డైనమిక్ లో పడరు మీకు కర్మ అంటదు తర్వాత మీరు ఏం పని చేసినా కూడా అక్కడ మీకు కర్మ అనేది అంటదు అంటకపోవడం వల్ల మీకు కర్మ సంబంధాలు మీతో పెంచుకోవాలని దురుద్దేశంతో మీ దగ్గరికి వచ్చే వాళ్ళు ఉంటారు చూడండి మీతో వాళ్ళు ఏ రకంగా ముడి వేసుకోవాలన్న సంగతి వాళ్ళకి అర్థం కాదు వాళ్ళవి ఏవి పని చేయవు మీ మీద వాళ్ళు పొగిడినా పని చేయదు వాళ్ళు తిట్టినా పని చేయదు కాబట్టి వాళ్ళకి ఇంకా మీరు పనికిర తర్వాత చాలామంది ఏంటంటే వాళ్ళ గాయాలక వేసి వాళ్ళు చూడటానికి ఇష్టపడరు ఎందుకంటే మన గాయాలు మనకి చాలా బాధ పెడతాయి.
(35:32) కాకపోతే వాటికి వేసి చూసి వాటిలోనుంచి ఏం నేర్చుకోవచ్చో మనం చూసినప్పుడే మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతాం. ఈ గాయాలు మనకి ఒంటి మీద గాయం ఉందనుకోండి మనకి చర్మం పక్కక వెళ్ళిపోతుంది జరిగిపోతుంది మనకి లోపల మీకు మాంసం కనిపిస్తుంది. అదేరకంగా మన మానసిక గాయాలు అవి తలుపులు ద్వారాలు అక్కడ కొద్దిగా మీకు గాయం ఉండటం వల్ల మానసిక గాయం ఉండటం వల్ల పైన చర్మం విడిపోయినట్టుగా మనసు పొర లోపల కూడా ఇదిఒక భాగాన్ని తెరుస్తోంది.
(36:08) ఆ భాగంలో నుంచి మీరు లోపలికి వెళ్లొచ్చు మీరు అదొక తలుపు ఒక ద్వారం అది దాన్ని మాన్పుకుంటూ మీరు ఆధ్యాత్మికంగా ఎదగడానికి అది ఒక మార్గం అయిపోతుంది తలుపు అయిపోతుంది. ముఖ్యంగా ఎవరికైతే ఒక తీవ్రమైనటువంటి బాధ ఉంటుందో ఆ బాధక చూడటానికి కూడా ఇష్టపడరో వాళ్ళకి చూడటమే వాళ్ళకి చాలా బాధ అనిపిస్తుందో అలాంటి గాయం అలాంటి బాధ మీలో ఉంటే దానికి వేసి చూడండి.
(36:37) ఎంతగా చూస్తారో మీరు దానికి వేసి భయపడకుండా తప్పించుకోకుండా నొక్కేయకుండా అదిమేయకుండా దానికి వేసే చూస్తారో దాని మీద వెలుగు పడుతుంది అది మీకు చాలా పాఠాలు నేర్పిస్తుంది. మీరు దానికి వేసి చూసి దాంట్లో నుంచి వచ్చే బాధని మీరు ఎదురుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ గాయం మాన్తుంది ఆ గాయం మానటమే కాకుండా ఇందాక నేను చెప్పినట్టుగా అది మీకు ఆధ్యాత్మికంగా ఎదిగటానికి ఒక మార్గంగా కూడా తయారవుతుంది.
(37:11) మన గాయాలు మానాలి అంటే మనం మన బ్రెయిన్ ని రీట్రైన్ చేయొచ్చు బ్రెయిన్ ఒక మెషిన్ లాంటిది. మీ కథల్ని మీరు తిరిగి రాయొచ్చు. మీరు ఏమి ఎంచుకుంటున్నారు జీవితంలో ఎలాంటి వాళ్ళతో కాలం గడుపుతున్నారు ఎలాంటి వాళ్ళ సాన్నిధ్యంలో ఉన్నారు ఏం పనులు చేస్తున్నారు ఖాళీ సమయాన్ని ఎక్కడ గడుపుతున్నారు ఇట్లాంటి విషయాలు మీ నిర్ణయాలు ఎవరిని సలహాలు అడుగుతున్నారు ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా మీరు వాటి మీద ధ్యాస పెట్టినప్పుడు అక్కడ చిన్న చిన్న మార్పులు చేసుకున్నప్పుడు మీ జీవితం చాలా మారిపోతుంది.
(37:46) నేను ఇందాక చెప్పినట్టుగా మన కథలు అనేవి మన లోపల మన అంతరంగంలో మార్గాలని సూక్ష్మ మార్గాలని ఇవి మారుస్తాయి. మార్చటం వల్ల మీకు మీ దేహంలో ప్రాణం గనుక కొత్త మార్గంలో నుంచి ప్రవహించింది అనుకోండి మీకు మీరు కొత్త కథ చెప్పుకున్నప్పుడు అంటే జరిగిన విషయాన్ని కొత్త విధానంగా మీకు మీరు వివరణ ఇచ్చుకున్నప్పుడు లోపల సరైన విధానంలో మీ ప్రాణ ప్రవాహం పాత కథ రూట్ వదిలేసేసి కొత్త కథ రూట్లోకి వెళ్తుంది వెళ్లేసరికి మీకు పాత కథ అనేది అది ఇంకా పనిచేయదు అక్కడ క్రమేపి అది ఆ మార్గం అనేది ఇంకా అది అంతగా దాంట్లో నుంచి ప్రాణం వెళ్ళదు. వెళ్ళకుండా కొత్త
(38:33) మార్గాల గుండా ప్రాణ ప్రవహించడం మూలంగా మీ నర్వస్ సిస్టం రీసెట్ అవుతుంది మీరు పాత గాయాల్లోనుంచి పాత కథల్లో నుంచి బయటికి వస్తారు మీ మీద మీకు పట్టు వస్తుంది మానసిక స్థితి మీద మీ మీద మీకు అవగాహన పెరుగుతుంది మిమ్మల్ని మీరు ఎక్కువ అర్థం చేసుకుంటారు అర్థం చేసుకుని గతం తాలూకు విషయాలు ఏవైతే మిమ్మల్ని బాధ పెట్టేవో ఇంకా అవన్నీ మీ మీద పని చేయవు అవన్నీ ఇంకా ఎవరైనా ఆ ఉద్దేశం తో మీ దగ్గరికి వచ్చినా కూడా వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో మీకు ఇక్కడ బాగా తెలుస్తుంది.
(39:09) ఇక్కడ మీరు నిత్యం రోజు ఒక పనిగా ఆ రోజు ఏ విషయాలు మిమ్మల్ని గాయపెట్టాయి మనసుని మీకు దుఃఖం కలిగించేది రెచ్చగొట్టేటట్టుగా మీకు లోపల మాటలు కి మీకు మీ శరీరం స్పందించిందో అవన్నీ ఏంటో మీరు రాసుకోవాలి. ఈ విషయం నా లోపల ఒక బలహీనత ఈ బలహీనత ఎవరు పసిగట్టారు ఈ ఫలానా వ్యక్తి పసిగట్టారు పసిగట్టి నన్ను అలా ఆడిస్తున్నారు ఇవంతా మీకు ముందు తెలిసి ఉండాలి మీ గురించి మీకు మీ బలహీనతలు మీకు తెలిసినప్పుడు ఆ బలహీనతను ఏ రకంగా జయించారు అనేది ఆలోచిస్తారు మీరు అక్కడ మనకి ఏదో ఒక విషయంతో ఐడెంటిఫికేషన్ ఉన్నప్పుడు దాన్ని తిడితే మనకు కోపం వస్తుంది ఉదాహరణకే మనకి ఫిలిం స్టార్ అంటే
(39:55) ఇష్టం మీ స్నేహితుడు వచ్చి ఊరుకునే ఫిలిం స్టార్ ని తిడుతూ ఉంటే మీకు చాలా కోపం వచ్చేస్తుంది. ఇక్కడ బాధ మన ఫేవరెట్ ఫిలిం స్టార్ ని ఎవరో తిడుతున్నారు. అది ఆ బాధ నాకు ఎందుకు కలిగింది నాకు అతనితో ఒక అటాచ్మెంట్ ఉంది అది నాకు అవసరం అవసరం లేదు అటాచ్మెంట్ కట్ చేసేసుకుంటా ఇప్పుడు అతన్ని తిట్టిన నాకు బాధ కలగదు.
(40:17) బాధ కలగదు కాబట్టి అతన్ని తిట్టి తిట్టి పోసినా కూడా నేను చలించకుండా ఉంటే అతనికి విసుగొద్ది విసుగొచ్చి వెళ్ళిపోతాడు. మీకు నేను చెప్పేది అర్థం అవుతుంది కదా ఇట్లాంటి మనం చాలా ఐడెంటిఫికేషన్స్ ఉంటాయి మనకి జీవితంలో కొన్ని తేలికగా దంచేసుకుంటాం కొన్ని ఇంటికి తెంచుకోకుండా మనిషికి సరైన సమాధానం చెప్పగలగాలి. అలా చెప్పినప్పుడు ఆ మనిషి మనల్ని పీడించడానికి మన దగ్గర రాలేదు ఇది మళ్ళీ సందర్భాన్ని బట్టి ఉంటుంది అన్ని సందర్భాలకి ఒకటే రకంగా ఉండదు.
(40:48) కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు జర్నలింగ్ అంటే మీ మనసులో దుఃఖాల్ని రాసుకోవడం వాటిని కవిత రూపాల్లోనో లేకపోతే బొమ్మల రూపాల్లో వాటిని వ్యక్తపరుస్తుంటే కూడా మీకు ఆ పాత గాయాలు మానిపోతాయి. మిమ్మల్ని ఎవరైనా పీడించే వ్యక్తులు ఉంటే వాళ్ళని మీ జీవితంలో నుంచి దూరం పెట్టటము సరైన పుస్తకాలు చదవటము ఆధ్యాత్మికంగా ఎదిగిన యోగుల పుస్తకాలు చదవటము మీరు నాభిలోకి శ్వాస పీల్చుకోవటము తర్వాత మీ లోపల మీ మీద మీకు నమ్మకం లేదు ఇలాంటివన్నీ ఉంటాయి చూడండి మీరు హార్ట్ అవేకనింగ్ సాధన ఏదన్నా కూడా మీరు హనుమాన్ చాలీసా చదివినా మీరు నేను హృత్చక్ర సాధన ఇచ్చాను మెంబర్షిప్లో అలాంటివి చేసినా కూడా
(41:31) ఏమవుతుందంటే గుండె బలం పెరుగుతుంది. గుండె బలం పెరిగినప్పుడు ఏంటంటే మీ లోపల మీ మీద మీకు ఉన్నటువంటి అభద్రత భావాలు మీ మీద మీకు నమ్మకం లేకపోవడం ఇలాంటి విషయాలన్నీ మీ దేహంలో కదిలే ప్రాణ కదలికలు వాటిని తీసేస్తాయి. మీ ప్రయత్నం లేకుండానే మీ దేహంలో పైకేసి ప్రవహించే వ్యానవాయువు వాటిని తొలగించేస్తుంది. అలా వ్యానవాయువును పెంచుకునేటువంటి పద్ధతులు ఉన్నాయి మెంబర్షిప్ దాంట్లో మీరు అవి చేస్తే కూడా దీంట్లోనుంచి మీరు బయటకి రాగలుగుతారు అందుకనే మంత్ర సాధన లాంటివి చేసినప్పుడు మనం గతం తాలూకు దుఃఖాల నుంచి బయటికి వస్తాం కాకపోతే ఆ దుఃఖాలు
(42:13) మనలోనుంచి బయటకి విడుదల అవుతున్నప్పుడు మనం తీవ్రంగా బాధపడతాం. అవి తీవ్రంగా మనల్ని బాధ పెట్టి అంటే ఏదైనా వస్తువు మనలోనుంచి వెళ్ళిపోతుంది అనుకోండి అది సూక్ష్మ స్థాయిలో కూడా మన మీద ముద్రలు మానసిక ముద్రలు అయినా కూడా అవి కూడా వెళ్ళిపోతుంటే అవి దుఃఖపరితమైనటువంటి ముద్రలు అయితే మనం వాటిని విడుదల చేస్తున్నప్పుడు కూడా అదే దుఃఖాన్ని అనుభవిస్తాం అనుభవించి దాన్ని విడుదల చేస్తాం అన్నమాట ఇంకా తర్వాత మనల్ని అది పీడించదు దానికి మన మీద ఇంకా పట్టు ఉండదు సాధన వలన ఇవన్నీ అవుతాయి తర్వాత ఒకటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ విషయం అయితే మిమ్మల్ని ఎక్కువ బాధ
(42:55) పెడుతుందో అదే విషయం మీకు మోక్షానికి మార్గం అవుతుంది మీరు ధ్యాస అంతా దాని మీద పెట్టి ఆ గాయాన్ని మార్చుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నప్పుడు మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. స్వస్థత, ఆధ్యాత్మిక ఎదుగుదల ఈ రెండు వేరు వేరు విషయాలు కాదు. ఈ రెండు ఒకటే. మీరు ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ మీరు స్వస్థత వైపు వెళ్తారు.
(43:18) మీరు స్వస్థత వైపు వెళ్ళే కొద్దీ మిమ్మల్ని పీడించే వాళ్ళు మీ జీవితంలో చెల్లిపోతారు. మీరు స్వస్థత వైపు వెళ్లే కొద్దీ మీకు పాత గాయాలు మానిపోతాయి. మీరు స్వస్థత వైపు వెళ్ళే కొద్ది మీ మీద మీకు అవగాహన పెరుగుతుంది మీరు ఏంటో మీకు అర్థం అవుతుంది. మీ కొంత మీకు అర్థంఅయ్యాకే అంటే మీరు ఈ భూమ్మీద మీ జీవితం మీ మానసిక స్థితి మీ భావోద్విక స్థితి వీటన్నిటి మీద పట్టు వచ్చాకే మీరు జీవనముక్తులు అవుతారు అప్పటిదాకా అవ్వలేరు.
(43:50) ప్రక్రియ అలా జరుగుతుంది మీలో గాయం ఉంది అంటే అదేమి తప్పు విషయం చెడు విషయం కాదది ఆ గాయం అదిఒక ద్వారం మీరు దాని లోపల మీ సాధనతో వెలుగు ఆ గాయంలో నింపగలిగితే ఆ గాయం ద్వారా మీరు మోక్షాన్ని కూడా మీరు చేరగలుగుతారు మనకి జీవితంలో చాలా పీరించే వ్యక్తులు ఉంటారు ఒకసారి మనం ఒక మనిషితో మనం చాలా పడి ఉంటాం ఎన్నో ఏళ్ళు అనుభవించి ఉంటాం కానీ ఆ తీవ్రమైన దుఃఖంలో నుంచి చాలా మందికి ఆధ్యాత్మిక జాగృతి జరుగుతుంది కొండలినే జాగృతి జరుగుతుంది.
(44:25) వాళ్ళు గనుక ఆ వ్యధ అనుభవించి ఉండకపోతే వాళ్ళకి ఆ జాగృతి జరిగేది కాదు కాబట్టి మన గాయాలు మనకి ద్వారాలు అది మనకి తెలిసినప్పుడు మనం వాటికీసి చూస్తాము. వాటిని పక్కకి నెట్టేసే ప్రయత్నం, వాటిని తప్పించుకుని తిరిగే ప్రయత్నం, అణచేసే ప్రయత్నం సబ్కాన్షియస్ మైండ్ లో మనం చేయం. నమస్కారం.

No comments:

Post a Comment