Friday, July 10, 2026

తల్లితండ్రులూ... ఇప్పటి పిల్లలు ఎందుకు మౌనంగా వుంటున్నారు? Why Are The Present Children Silent?

తల్లితండ్రులూ... ఇప్పటి పిల్లలు ఎందుకు మౌనంగా వుంటున్నారు? Why Are The Present Children Silent?

Author Name:maruthi kiran Poruri

Youtube Channel Url:https://www.youtube.com/@maruthikiranPoruri

Youtube Video URL:https://www.youtube.com/watch?v=kS-mjwFToXQ



Transcript:
(00:01) మీరు గమనించారా లేదా అండి ఈ మధ్యకాలంలో ముఖ్యంగా పిల్లలు తల్లిదండ్రులతో మౌనంగా ఉంటున్నారండి. పెద్దగా ఏమి మాట్లాడట్లేదు. నేను చాలామంది తల్లిదండ్రులని అడిగాను అలాగే రామకృష్ణ మట్టలో పేరెంటింగ్ సెషన్స్ తీసుకుంటున్నప్పుడు కూడాను నేను అడిగాను. మీ పిల్లలు సైలెంట్ గా ఉంటున్నారు మీతో వాళ్ళు ఎందుకు అలా ఉంటున్నారు అని అడిగితే ఎవరు కూడాను ఎదమిద్ధమైన సమాధానం ఇవ్వలేదండి.
(00:30) కానీ మౌనంగా ఉంటున్నారు అన్న మాట మటకు ఆల్మోస్ట్ అందరూ అంగీకరించారు. నేను ఆలోచించాను. జనరేషన్ వ్యాప ఇలా జరుగుతున్నదా లేకపోతే ఈ టెక్నాలజీ మరీ ఎక్కువైపోయింది కదా దాన్ని పిల్లల పెంపకంలో పడి తల్లిదండ్రులు అందుకోలేకపోతున్నారు కదా కాబట్టి తల్లిదండ్రులకి ఏమీ తెలియదు కాబట్టి మనం చెప్పినా అర్థం కాదు కాబట్టి [గొంతు సవరించుకోవడం] వీళ్ళతో డిస్కస్ చేయడం అనవసరం అని మౌనంగా ఉంటున్నారా అని కూడా నాకు ఆలోచన వచ్చింది.
(01:07) కానీ నాకు ఎందుకో ఇదంత సబబుగా అనిపించలేదండి అందుకనే నేను ఇవాళ ఈ టాపిక్ ని ఎనుకున్నాను. పిల్లలు ఎందుకు మౌనంగా మారుతున్నారు మీ పిల్లలు పెద్దయ్యాక మీ గురించి ఏమంటారో ఎప్పుడైనా ఆలోచించారా? కాబట్టి తల్లిదండ్రులారా ముఖ్యంగా చిన్న పిల్లలున్న తల్లిదండ్రులారా ఆలస్యం కాకముందే వాస్తవాన్ని తెలుసుకోండి అని చేస్తున్న వీడియోనండి ఇది నాకు ఏమనిపించిందంటే నోట్స్ రాసుకుంటూ ఉంటే మీ పిల్లలు మీ ఆస్తి కాదు అంటే మీరు
(01:52) అనుభవించే ఆస్తి కాదు వాళ్ళు దేవుడు మీకు అప్పగించిన బాధ్యత అంతేనండి చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే మేము పిల్లల్ని ప్రేమిస్తున్నామ అని అనుకుంటున్నారు కానీ పిల్లల్ని నిజంగా కోల్పోతున్నారండి కోల్పోతున్నారు ప్రతి జీవి కూడాను ఈ భూమి మీదకి ఓ ప్రయోజనం మేరకు పంపబడుతుంది కదా మీకు తెలుసు నేను కూడా చాలా వీడియోలో చెప్పాను కూడా అలాగే తల్లిదండ్రులు కూడా అంతే కదా ఓ ప్రత్యేకమైన ప్రయోజనం కోసం ఈ భూమి మీద పంపబడతారు.
(02:37) మరి నా ప్రశ్న ఏంటంటే అటువంటప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని చిన్న పుచ్చటం తక్కువ చేయటం అవమానించటం ఇంకా పైగా బెదిరించటం ఇవన్నీ గనుక చేస్తున్నట్లయితే పిల్లల్ని వాళ్ళ ప్రయోజనానికి దూరం చేయటమే కదా ఆలోచించాలండి నిజంగా చెప్పాలి అంటే మీరు మీ పిల్లలకు జీవితాన్ని ఇవ్వలేదు. కేవలం జన్మను మాత్రమే ఇచ్చారు. ఈ ప్రపంచంలో రావడానికి ఒక ద్వారంగా మాత్రమే ఉపయోగపడ్డారు.
(03:18) అంటే జస్ట్ ఎంట్రీ పాయింట్ గా ఉపయోగపడ్డారు. ఎందుకంటే ఆ పిల్లవాడు లేకపోతే ఆ పిల్ల వాడి యొక్క ఆత్మకి వాళ్ళదైన ప్రయాణం అంటే ఒకటి ఉంది కదా ఆ ప్రయాణానికి కేవలం మనమందరం కూడాను మార్గదర్శకులకు మాత్రమే నిర్దేశకులకు మాత్రం కాదు యజమానుల అంతకంటే కాదు ఎందుకంటేనండి అందరినీ సృష్టించి నిజమైన ఒకడు ఉన్నాడు పైన ఆయనకు తెలుసు వీళ్ళ జీవితం ఎలా ఉండాలి అని ఆ నిర్దిష్టమైన ఆలోచనతోనే భూమి మీదకి పంపించాడు.
(03:59) మనం చిదిగేసామ అనుకోండి వాళ్ళు ఒత్తిడికి గురైపోయి చిదిగిపోతారుఅన్నమాట. ఇప్పుడు పిల్లలు పుట్టినప్పుడు గింజలు లాంటి వాళ్ళండి. ఓ గింజ ఇద్దరి జీవితాల్లోకి వచ్చింది. ఆ గింజ తన విస్తృత రూపాన్ని ప్రదర్శించడానికి సిద్ధంగా ఉంది. మనం చేయవలసింది ఏంటంటే ఆ విస్తృత రూపాన్ని చూడడానికి సిద్ధంగా ఉండటమే నీరు పోయాలి గాలి వెలుతురు తగలనివ్వాలి.
(04:35) ఒక స్థాయి వరకు కంచగట్టి ఇతర జంతువులు అవి తినకుండా మనం కాపాడాలి. ఎందుకంటే మనకు కూడా కొంత అనుభవం ఉంది కదా జీవిత అనుభవం తర్వాత మెల్లమెల్లగా ఆ బిడ్డ తన ప్రయోజనాన్ని చూసుకుంటుంది. ఇప్పుడు ఉదాహరణ చెప్తానండి అదేంటంటే మీరు గనుక నిజమైన శిల్పే అయితే రాయిని ప్రేమతో చిక్కుతారుగా రాయి ఇబ్బంది పడవచ్చు కానీ అసలు శిసలైన ఒక సహజ గుణాన్ని వెలికి తీసే ప్రయత్నంలో మీరు చాలా ప్రేమతో లాలిస్తారుగా అవసరమైతే దండిస్తారు కానీ అది కోరత్నంతో దండించరు
(05:21) ప్రేమతో దండిస్తారుగా అందుకని నేను [గొంతు సవరించుకోవడం] ఉదాహరణ చెప్తున్నా మీరు నిజంగా గనుక అద్భుతమైన శిల్పి గనుక అయితే రాయని ప్రేమతో చెక్కుతారు అప్పుడు ఏమవుతుంది పూజలు అందుకునే విగ్రహం తయారవుతుంది. అందుకు కావల్సింది ఏంటి తల్లిదండ్రులకి నిగ్రహం కావాలి అంటే వాళ్ళ మీద వాళ్ళకి కంట్రోల్ కావాలి. కానీ కోపంతో సుత్తితో ఎక్కడ పడితే అక్కడ కుడితే ఏమవుతుంది అండి రాయి విరిగి చిన్న చిన్న ముక్కలు అయిపోతుంది కదా చివరికి గురి మెట్లకు కూడాను పనికి రాకుండా పోతుందిరా ఇప్పుడు మీ పిల్లలకి మీరే తల్లిదండ్రులుగా దొరకటం అనేది అదిఒక కర్మ బంధం అండి
(06:08) మీరు చేస్తున్న పూర్వజన్మ కర్మలు పిల్లలు చేస్తున్న పూర్వ జన్మ కర్మలు ఇవన్నీ ఒక బంధంగా ఏర్పడి వాళ్ళు మీకు పిల్లలుగా పుట్టారు మీరు వాళ్ళకి తల్లిదండ్రులుగా అయ్యారు. మీరు మీ పిల్లల్ని చూడవలసిన రీతిలో చూడకపోతే మీరు మీ సొంత కర్మని తయారు చేసుకున్నట్లే సృష్టించుకున్నట్లే తర్వాత మళ్ళీ దీన్ని మీరు ఏ జీవితంలోనా అనుభవించాలి లేకపోతే వచ్చే జన్మలో అయనా అనుభవించాలి.
(06:39) ఇప్పుడు ప్రతిజీవి మరణిస్తుంది కదండీ మనం కూడా మరణిస్తాం కదా అంటే మనం చనిపోయిన తర్వాత భగవంతుని న్యాయస్థానంలో నిలబడ్డప్పుడు ఇప్పుడు భగవంతుడు అడుగుతాడు నేను నీ చేతిలో ఒక విత్తనాన్ని పెట్టాను అది మహా వృక్షమయ్యే అవకాశం ఉంది నువ్వు దానికి నిజంగా నీళ్లు పోసావా లేక ప్రతిరోజు దాని కొమ్మల్ని విరిచేసావా చెప్పు అని అడుగుతాడండి ఇప్పుడు మీ సమాధానం ఏంటి మీ పిల్లలు మీ కలలకి వారసులుగా రారు ఈ భ్రమలో మీరు వారిని బానిసలుగా మారుస్తున్నారేమో ఒకసారి
(07:22) ఆలోచించండి పిల్లలు పుట్టనే చాలా మంది తల్లిదండ్రులు చేస్తున్న పని ఏంటంటే ఆశిస్తున్నారు అక్కడ గనుక ఆశ బంధం అయింది అనుకోండి వాళ్ళ పిల్లల్ని హింసిస్తున్నారు ఇందాక చెప్పినట్టు బెదిరిస్తున్నారు కోపడుతున్నారు కదా అంటే ఈ భ్రమలో అందుకనే మీరు వాళ్ళని మీకు బానిసలుగా మారుస్తున్నారేమో ఆలోచించండి ఎందుకంటే వాళ్ళ సృజనాత్మకత గాలికి ఎగిరిపోతున్నది.
(07:51) కానీ ఒక్కటి మటుకు నిజమండి వాళ్ళు ఒక కొత్త సంగీతాన్ని కొత్తదనంగా ఈ సమాజానికి ఇవ్వడానికి ఈ భూమి మీదకి పంపబడ్డారు. మీరు చేయవలసింది అలా ఒకటే ఆ అద్భుతమైన సంగీతానికి ఎందుకంటే సంగీతం వినపడడానికి అవసరమైన ఒక నిశశబ్దాన్ని ధైర్యాన్ని ప్రేమను ఇవ్వండి అంతే అంతకంటే ఏం చేయొద్దు. దండించాలి నేను కాదంటలే కానీ భవిష్యత్తులో వాడు ఏదో అయిపోతాడని క్రోరంగా దండించకూడదు అంటే పిల్లల్ని పెంచడం అంటే వారిని మనకు నచ్చిన మనుషులుగా మార్చడం కాదండి కానే కాదు వారిలో భగవంతుడు దాచిన దైవత్వాన్ని
(08:37) వ్యక్తిత్వాన్ని ప్రేమతో వికసింప చేయటమే దీనికి పరిణితి కూడా కావాలండి. అయితే పేరెంట్స్ గా మీకు ఒకే ఒక సూటి ప్రశ్న అదేంటంటే మీ బిడ్డ పుట్టిన రోజున మీరు ఏడ్చారా ఏడవలేదు కదా [గొంతు సవరించుకోవడం] ఏడ్చింది ఎవరు మీ బిడ్డ నవ్వింది ఎవరు మీరు నవ్వారు సంతోషంతో అను మా ఇంటికి దేవుడు ఒక వరాన్ని ఇచ్చాడు అని చెప్పేసి భావించారు.
(09:07) మరి అదే [గొంతు సవరించుకోవడం] బిడ్డ నువ్వు దొరుకుతున్న క్రమంలో నువ్వు పనికి రావు నీ వల్ల ఏమీ కాదు నీకు బుద్ధి లేదు అని మౌనంగా రోధింప చేస్తే ఎలాగా ఆ హక్కు మనకు ఎవరు ఇచ్చారు దేవుడా కాదు సమాజమా కాదు మరి ఇంకేంటి మీ అహంకారమే మీకు ఆ హక్కుని ఇచ్చిందండి ఇవ్వలేదు మీరే తీసుకున్నారు అంతే అంటే పిల్లల యొక్క ఆత్మవిశ్వాసాన్ని చంపడము అంటే స్లో పైస పటమేనండి ఎందుకో మాట కొంచెం కఠినంగా పడుతున్నది కదా సంసార రంజిలో పట్టం వల్ల మీ మాటలు
(09:52) మీకు గుర్తుండకపోవచ్చు అనేస్తూ ఉంటారు మళ్ళీ జీవన రంగులో పడిపోతూ ఉంటారు కాబట్టి ఏమన్నారో ఎప్పుడు అన్నారో ఎందుకు అన్నారో కూడా మీకు గుర్తుండకపోవచ్చు కానీ ఒకటి మటుకు జరుగుతుందండి వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ లో అవి నిక్షిప్తమై ఉంటాయి. వాళ్ళు ఓడిపోతున్నప్పుడు అల్లా మీ మాటలు వాళ్ళకి గుర్తుకొస్తూ ఉంటాయి. ఇంట్లో జరుగుతున్న తతంగానికంతా మరి పిల్లలే ప్రత్యక్ష సాక్షులు కాబట్టి పాపం వాళ్ళు అది నిజమే అనుకుంటూ ఉంటారు.
(10:25) కొంచెం స్పిరిచువల్ గా మాట్లాడాలంటేనండి దేవుడు మీ ఇంటికి ఒక ఆత్మను పంపాడు. అది తన కర్మని పూర్తి చేసుకోవడానికి వచ్చింది. ఆ పరీక్షల్లో అది నెగ్గాలి కానీ మీరు ఫెయిల్ మార్క్స్ వేస్తే ఎలా చెప్పండి రేపు మీరు భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు అడిగేది పిల్లవాడు యొక్క మార్కుల గురించి కాదండి వాడు తనదైన శైలిలో తన మార్కుని తన ముద్రని సమాజం మీద వేసే ప్రయాణంలో నీ పాత్రని నువ్వు సరిగా పోషించావా లేదా అని అడుగుతాడు అప్పుడు తల దించుకుంటావా లేకపోతే నీ బర్ంతో తలఎత్తుకుంటావా
(11:13) ఆలోచించండి ఒక విధంగా చెప్పాలి అంటే భర్తగా మీరు మీ ఇంట్లో అతిథి కదండీ ప్రతి యజమాని కూడాను తన ఇంట్లో తన అతిథి పాత్రను పోషించాలి. అన్ని ఏర్పాట్లు చేయాలి. బాధ్యతగా చేయాలి మౌనంగా నిలబడాలి అని శాస్త్రం చెప్తుంది అంటే ఇది ఒక అద్భుతమైన కుటుంబ జీవనంలోని యజమాని యొక్క పాత్ర అలాగే మీ పిల్లలు కూడాను మీ ఇంట్లో అతిథులే తప్ప వాళ్ళు మీ ఆస్తి కాదు మీ కలలను నెరవేర్చడానికి వచ్చిన
(11:57) ఎంప్లాయీస్ కానే కాదు గుర్తుపెట్టుకోవాలి మనం ఇది మీ అహంకారాన్ని మోసే షౌల్డర్స్ కాదండి వాళ్ళు షౌడర్స్ కాదు వారి దారి వాళ్ళకి వేరేది ఉంది. మీ బాధ్యత ఏదైనా ఉంది అంటే ఆ దారిని వాళ్ళకి చూపెట్టడమే తప్ప మూసేయడం కాదు. నాకు ఎందుకో మీతో మాట్లాడుతుంటే ఒక చర్చి ఫాదర్ మాటలు గుర్తుకొస్తున్నాయండి. మీ పిల్లలు మీ సమాధి దగ్గరికి వచ్చినప్పుడు మా అమ్మ నాన్న మమ్మల్ని ప్రేమించారు అద్భుతంగా పెంచారు.
(12:35) అని ఏడవాలండి కానీ మమ్మల్ని ఎప్పుడు ప్రేమించలేదు అని ఏడవకూడదండి ఒకవేళ గనుక అలా ఏడిస్తే అది మీ జీవితంలో జరిగిన అతి పెద్ద ఓట అని వర్షంలో ఉన్నా కూడాను కొంచెం సీరియస్ గా రాసుకున్నాను లేండి రాసుకుంటూ ఉంటే ఆ సీరియస్నెస్ నాకు ఆటోమేటిక్ గా వచ్చేసింది. అందుకనే నేను కొంచెం నిర్మాట చెప్పాల్సి వస్తున్నదండి. అంటే మీరు మీ పిల్లలకి అందించే వారసత్వం ఏదన్నా ఉంది అంటే అది కేవలం ఆత్మవిశ్వాసం మాత్రమే తప్ప మీ అప్పులు అవమానాలు చిన్ననాటి గాయాలు కాదండి
(13:21) అయితే చివరిగా ఒక మాట వాస్తవానికి చెప్తున్నానండి మీ పిల్లలు మీ దగ్గర ఎంత కాలం ఉంటారు చెప్పండి మహా ఉంటే 20 ఏళ్ళు ఉంటారు 25 సంవత్సరాలు మాత్రమే ఉంటారు. కదా కానీ మీ ప్రవర్తన ఉంది చూశరా వాళ్ళలో దాదాపు 80 సంవత్సరాలకు పైగానే గుర్తుండిపోతుంది. అంటే మీ ఐదు నిమిషాల ఆవేశం వారి మనసులో 50 సంవత్సరాల వరకు ప్రతిధ్వనిస్తుందండి ఇప్పుడు ఎముక విరిగితే మళ్ళీ అతుక్కోవచ్చు కానీ విరిగిన ఆత్మవిశ్వాసం ఉంది చూశరా అది అదుక్కోవడానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క జీవిత కాలం కూడాను సరిపోదండి సో పిల్లల్ని పెంచడం అంటే వాళ్ళ భవిష్యత్తుని నిర్మించడం కాదండి
(14:08) వాళ్ళ భవిష్యత్తుని పాడు చేయకుండా ఉండటమే వాళ్ళకి మనం చేసిన పెద్ద మేలు అన్నమాట కాబట్టి వీడియోని గనక ఇంకోసారి విన్నట్లయితే మీరు ఎవరితో ఏమి చర్చించక్కర్లేదు ఈ విషయాన్ని అలా నిశిద్ధంగా ఉండండి మన అంతరాత్మ మనకు చెప్తూ ఉంటుంది అరే కరెక్టే కదా నువ్వు పొరపాటు చేస్తున్నావు కదా ఏదేదో ఊహించేసుకొని వాళ్ళు అలా అయిపోతారేమో భవిష్యత్తు అని చెప్పేసి ఇవాళ్ళని స్థాయికి నుంచి నిందిస్తున్నావు కదా అని మీ అంతరాత్మ ఎక్కడో పొరలో నుంచి మెల్లగా మూలుగుతుందండి అది తప్పకుండా మీకు వినిపిస్తుంది కూడా కాబట్టి పిల్లలని పెంచే క్రమంలో మనం కూడాను ఒక్కొకసారి ఆత్మ విమర్శ
(14:48) చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతే ఈ కాలానికి వాళ్ళు ప్రతినిధులు మీ కాలానికి మీరు ఎట్లా ప్రతినిధులు మీ అనుభవం ఏదన్నా ఉంది అంటే వాళ్ళు ఎదగడానికి తోడ్పడాలి ఆత్మవిశ్వాసం ని పెంపొందించడానికి తోడ్పడాలండి అంతే మీరు ఊహించుకున్నట్టుగా మీ పిల్లలు కారండి ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నది వాళ్ళ ఆలోచనలు వాళ్ళకి ఉంటాయి.
(15:13) మీ ఆలోచనలు మీరు ఎట్టు పరిస్థితిలో వాళ్ళకి ఇవ్వలేరు. ఎందుకంటే నేను చెప్పాను కదా కేవలం మీరు మీ పిల్లలకి జన్మని ఇచ్చారు అంతే తప్ప ఇంకేమి ఇవ్వలేదండి కాకపోతే చెప్పానుగా నా బాధ్యత అంటూ ఉందని చెప్పేసి సో ఇదండి ఈ వీడియోలోని సంగతి మీ కృతజ్ఞతలు మనసులని గనుక గాయపెడితే దయచేసి నేను క్షమించండి. వీడియో నచ్చితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీలంత ఎక్కువ మందికి షేర్ చేయండి.
(15:40) నాతో మాట్లాడాలి అనుకుంటే హాయిగా మాట్లాడండి నా ఫోన్ నెంబర్ 9491063089 నా పేరు మారుతి కిరణ్ అండి YouTube లోకి వెళ్లి ఎంఈఆర్ టిహచ్ ఐ స్పేస్ హచ్ కే ఐఆర్ఏఎన్ అంటే చేస్తే పిఓ ఆర్ యు యు ఆర్ ఐ పోరు అని ఇంటి పేరు వస్తుంది. లైక్ బటన్ బెల్ ఐకాన్ అంటారా మీరు ఎటు నొక్కుతారు ఎందుకంటే 845వ వీడియో అండి అది కాబట్టి మీరు ఎటు నొక్కుతారో నాకు తెలుసు కాకపోతే చిన్న అభ్యర్థన ఏంటంటే కామెంట్ బాక్స్ లో మంచి మెసేజ్ని పెట్టండి ఎలా తోస్తే అలా పెట్టండి వీలైతే నేను నేర్చుకుంటాను కూడా [నవ్వు] నమస్కారంఅండి

No comments:

Post a Comment