Friday, July 10, 2026

అసలైన స్వేచ్ఛ అంటే ఏంటో నీకు తెలుసా | What Is True Freedom | Satyagrahi

అసలైన స్వేచ్ఛ అంటే ఏంటో నీకు తెలుసా | What Is True Freedom | Satyagrahi

Author Name:Satyagrahi

Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories

Youtube Video URL:https://www.youtube.com/watch?v=tGWrNoU2_aM



Transcript:
(00:05) మీరు అలసిపోయారు కానీ ఎందుకో మీకు అస్సలు తెలియదు. మీరు ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు. కానీ రోజు చివరిలో బెడ్డు పై పడుకున్నప్పుడు లోపల ఒక రకమైన బాధ నిజం చెప్పండి ఆ బాధ మీకు అనిపించిందా లేదా మీరు పరిగెడుతున్నారు. కానీ ఎక్కడికి వెళ్తున్నారో మీకు క్లారిటీ లేదు. పక్కింటివాడు కారు కొన్నాడని మీరు బైక్ మార్చాలనుకుంటున్నారు.
(00:28) ఆఫీస్ లో ఇంకొకరికి ప్రమోషన్ వచ్చిందని మీరు రాత్రంతా నిద్రపోకుండా ప్రాజెక్టులు చేస్తున్నారు. సమాజం ఒక రేస్ ట్రాక్ గీసింది మీరు అందులో పరిగెడుతున్నారు. అసలు ఆ రేస్ ట్రాక్ ఎవరు గీశారు? మీరు ఎవరి కోసం గెలవాలి? ఈ రేస్ లో మీరు అనుభవిస్తున్న ఈ నరకాన్ని ఎవ్వరూ క్రియేట్ చేయలేదు. ఈ మాట వినడానికి చాలా ఘోరంగా ఉంటుంది కానీ ఇదే నిజం. మనం అనుకుంటాం మన బాధలన్నిటికీ కారణం మన బాస్ అనో లేకపోతే మన పేరెంట్స్ అనో అది కూడా కాకపోతే మన దగ్గర డబ్బు లేకపోవటం వల్లేమో అనుకుంటాం.
(00:56) కానీ రియాలిటీ ఏంటంటే నీ జీవితాన్ని నాశనం చేస్తున్న శత్రువు బయట లేడు అది నీలోనే ఉన్నాడు. మీరు రోజువారి జీవితాన్ని ఒక్కసారి గమనించండి. పొద్దున్నే లేవగానే మొబైల్ స్క్రీన్ చూస్తారు. అక్కడ ఎవడో 5 లక్షల జీతం వస్తుందని చెప్పేసి పోస్ట్ పెడతాడు. నేను ఫారెన్ లో ఇంత సంపాదిస్తున్నాను అంత సంపాదిస్తున్నాను రోజుకి ఇంత వస్తుంది నాకు అని చెప్పేసి వాడు వీడియో పెడతాడు మీరు కూడా చూస్తారు.
(01:17) అది చూడగానే మీ లోపల ఏదో ఒక తెలియని అసంతృప్తి మొదలవుతుంది. అందరూ బాగానే బతుకుతున్నారు నేనే బ్రతకలేకపోతున్నాను అని చెప్పేసి అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న మీ మనసు ఒక్కసారిగా అభద్రత భావంలోకి వెళ్ళిపోతుంది. అంటే ఇన్సెక్యూరిటీలోకి వెళ్ళిపోతుంది. మీ సంతోషం మీ బాధ అంత ఒక చిన్న స్క్రీన్ మీద వచ్చే అక్షరాల మీద ఆధారపడి ఉంది.
(01:38) జిడ్డు కృష్ణమూర్తి గారు ఒక అద్భుతమైన మాట అంటారు. మనం బ్రతుకుతున్నాం అని అనుకుంటాం కానీ నిజానికి మనం కేవలం రియాక్ట్ అవుతున్నాం. ఎవరో మెచ్చుకుంటే ఉబ్బిపోతాం ఎవరో ఒక మాట అంటే కుంగిపోతాం. ఇది జీవితం ఎలా అవుతుంది అని ఇది కేవలం ఒక రిమోట్ కంట్రోల్ బొమ్మ లాంటిది అని. మరి మీ జీవితం అనే రిమోట్ కంట్రోల్ ఎవరి చేతిలో ఉంది? మీ చేతిలో ఉందా లేక సమాజం చేతిలో ఉందా? మీకు తెలుసో లేదో చాలా మంది ఈ రోజుల్లో పుష్ యువర్ సెల్ఫ్ పెయిన్ ఇస్ బెటర్ దెన్ రిగ్రెట్ అని స్టేటస్ లు పెట్టుకుంటారు.
(02:06) అంతేకాకుండా మిమ్మల్ని మీరు తోసుకుంటారు కష్టపడండి నరకం అనుభవించండి పర్లేదు గెలవండి అని చెప్పేసి మోటివేషన్ స్పీకర్లా చెప్తూ ఉంటారు. కానీ అసలు ప్రశ్న ఇది కాదు మిమ్మల్ని ఎవరు పుష్ చేస్తున్నారు? లోపల ఉన్న మీ స్వచ్ఛమైన ఇష్టమా లేక వెనకబడిపోతున్నామేమో అనే భయమా? భయం నుంచి పుట్టిన ఏ విజయమైనా సరే మీకు ఎప్పటికీ శాంతిని ఇవ్వలేదు. కానీ ఇష్టం నుంచి పుట్టిన విజయం అంటే నాకు క్రికెట్ అంటే ఇష్టం నేను క్రికెటర్ అవ్వాలి నాకు డాక్టర్ అంటే ఇష్టం నేను డాక్టర్ అవ్వాలి అని మీ స్వచ్ఛమైన ఇష్టం ఏదైతే ఉందో అది మాత్రమే మీకు శాంతిని ఇవ్వగలదు. చాలా మందికి ఒక భ్రమ ఉంటుంది.
(02:43) తము చాలా లోతుగా ఆలోచిస్తున్నామని జీవితంలో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నామ అని అనుకుంటారు. కానీ నిజం ఏంటంటే మీ బుర్రలో తిరిగే ఆలోచనలు అసలు మీవి కానే కావు. అవి చిన్నప్పటి నుంచి మీ చుట్టూ ఉన్నవాళ్ళు ఈ సమాజం మీ మైండ్ లోకి ఎక్కించిన ప్రోగ్రామింగ్ అవి మీరు కేవలం ఆ టేప్ రికార్డర్ ని మళ్ళీ మళ్ళీ ప్లే చేసి చూస్తున్నారు అంతే అంతకుమించి ఏం లేదు అక్కడ ఒకసారి ఆలోచించుకోండి సమాజం మనకి కొన్ని అబద్ధాలని చాలా అందంగా అమ్మేసింది.
(03:09) ఎక్కువ డబ్బు ఉంటేనే గౌరవం తక్కుతుందని చెప్పింది. అందరికన్నా పెద్ద ఉద్యోగం చేస్తేనే నువ్వు సక్సెస్ అయినట్లు అని చెప్పేసి మిమ్మల్ని నమ్మించింది. ఒక పెద్ద హోదా ఉంటేనే నీ బ్రతుక్కి ఒక విలువ ఉంటుంది అని బ్రెయిన్ వాష్ చేసింది. ఇవన్నీ నమ్మి మనం మన జీవితాన్ని ఒక మిషన్ లో మార్చేసుకుంటున్నాం. కానీ అసలు ట్రాజిడీ ఎక్కడఉందో తెలుసా ఈ రేస్ లో పడి అసలు మీరు ఎవరు అనేది మీరు మర్చిపోతున్నారు.
(03:34) మీకు డిగ్రీ తెలుసు మీ జీతం ఏంటో తెలుసు. మీ క్రెడిట్ కార్డు లిమిట్ ఏంటో తెలుసు కానీ ప్రశాంతంగా కూర్చొని నేను ఎవరు అసలు నాకు ఏం కావాలి అని అడిగితే లోపల నిశశబ్దం తప్ప ఏ సమాధానం వినిపించదు. విజయంఅంతా బయట జరుగుతుంది కానీ జీవితం లోపల పూర్తిగా చచ్చిపోతుంది. జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పేది ఇదే ఈ సమాజం మిమ్మల్ని ఒక పద్ధతికి అలవాటు చేసింది.
(03:58) ఆ పద్ధతిలో మీరు కేవలం ఒక నెంబర్ మాత్రమే మీరు ఆఫీస్ లో ఒక ఐడి కార్డు బ్యాంకు లో ఒక అకౌంట్ నెంబర్ కానీ ఒక మనిషిగా మీ లోపల ఉన్న చైతన్యాన్ని ఆ స్వేచ్ఛని మీరు ఎప్పుడో కోల్పోయారు. మరి ఈ నరకం నుంచి బయటపడటం ఎలాగా? ఈ శృంఖాలాలను ఎలా తెంచుకోవాలి? అసలు ఈ మానసిక నరకానికి ఈ అలసటకి అసలైన కారణం ఎక్కడ మొదలవుతుందో తెలుసా కంపారిజన్ అంటే అవతలి వాళ్ళతో పోల్చుకోవటం మీ జీవితాన్ని నాశనం చేసిన మొదటి విషయం ఇదే.
(04:27) మనం పుట్టినప్పటి నుంచి ఈ విషయాన్ని మనం రక్తంలోకి ఎక్కించేశరు. స్కూల్లో ఉన్నప్పుడు పక్కింటి అబ్బాయి మార్కులతో పోల్చారు. కాలేజీకి రాగానే క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పోలుస్తారు. ఇప్పుడు ఉద్యోగంలో ప్యాకేజీలతో పోల్చుకుంటారు. నిజం చెప్పాలంటే మీరు మీకు నచ్చినట్లు జీవించడం లేదు. ఎవరో బ్రతుకుతున్న జీవితాన్ని కాపీ చేయడానికి ట్రై చేస్తున్నారు.
(04:47) ఎప్పుడైతే మీరు ఇంకొకరిలా మారాలి అనుకుంటారో అక్కడే మీ సహజత్వం మీ ఆనందం చనిపోతాయి. ఒక పులి వెళ్లి సింహంలా మారాలి అనుకుంటే ఎంత కామెడీగా ఉంటుందో మీరు ఇంకొకరిలా మారాలనుకోవడం కూడా అంతే కానీ మనం అబద్ధంలోనే బ్రతుకుతాం. మీరు అనుకోవచ్చు నేను ఇంకొకరితో పోల్చుకోకపోతే జీవితంలో ఎలా ఎదుగుతాను అంతేకాకుండా జీవితం అంటేనే కాంపిటీషన్ కదా కాంపిటీషన్ లో ఎలా గెలుస్తాను అని.
(05:13) కానీ ఆ ఎదుగుదల వెనుకున్న అసలు నిజం ఏంటో తెలుసా? ఆ నిజం పేరే భయం. ఒకవేళ నేను అందరికంటే వెనకబడిపోతే సమాజం నన్ను తక్కువ చేసి చూస్తుందేమో అనే భయం. పేదవాడిగా మిగిలిపోతానేమో అనే భయం నలుగురిలో నా పేరు పోతుందేమో అనే భయం అంటే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మీ జీవిత లక్ష్యం కాదు మీలో ఉన్న భయం అందరికన్నా వెనకబడిపోతానేమో అనే భయం డబ్బు లేకుండా మిగిలిపోతానేమో అనే భయం సమాజంలో నా పరువు పోతుందేమో అనే భయం నలుగురు నన్ను గౌరవించరేమో అనే భయం ఆ భయానికి మీ సహజత్వానికి చాలా తేడా ఉంది.
(05:49) భయం ఆధారంగా నిర్మించుకున్న సామ్రాజ్యాలు ఎప్పుడైనా కోలిపోవాల్సిందే. మీరు ఎంత పెద్ద పొజిషన్ కి వెళ్ళినా బ్యాంకు బ్యాలెన్స్ ఎంత పెంచుకున్నా లోపల ఉన్న భయం మాత్రం అలాగే ఉంటుంది. ఎందుకంటే ఆ భయమే మిమ్మల్ని ఆ స్థానానికి తీసుకెళ్ళింది. నిజం ఏంటంటే భయం నుంచి పుట్టిన ఏ విజయము మీకు ప్రశాంతతను ఇవ్వలేదు. మనల్ని ఎప్పుడూ మనల్ని మనం శిక్షించుకుంటూ ఉంటాం.
(06:12) ఎదురుగా ఉన్న అదను చూసుకుంటూ నేను ఇంకా సరిపోను నేను ఇంకా సాధించాలి నేను ఓడిపోయాను అని చెప్పేసి మనతో మనమే ఒక నిరంతర యుద్ధం చేస్తూ ఉంటాం. ఆ యుద్ధానికి ఎప్పటికీ ముగింపు ఉండదు ఎందుకంటే ఇక్కడ పోరాడుతున్న వాడు నువ్వే ఆ దెబ్బలు తింటున్న వాడు కూడా నువ్వే మీతో మీరే యుద్ధం చేసుకుంటే ఇక గెలిచేది ఎవరు ఓడేది ఎవరు. జిడ్డు కృష్ణమూర్తి గారు మనుషుల మైండ్స్ గురించి ఒక అద్భుతమైన అబ్జర్వేషన్ చేశారు.
(06:36) మనం ఎప్పుడూ ఒక భ్రమలో బ్రతుకుతుంటాం. దాన్ని ఆయన అన్కాన్షియస్ లివింగ్ అంటారు అంటే అసలు ఏం జరుగుతుందో తెలియకుండా కళ్ళు మూసుకొని బ్రతకడం అన్నమాట బాధ అనేది మనిషిని చంపదు కానీ ఎందుకు బ్రతుకుతున్నామో తెలియకుండా ఆ మెకానిక్ లైఫ్ కి అలవాటు పడిపోవడం చూశారు అది నిజమైన బాధ మనం రోజు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చాలని వ్యవస్థలని మార్చాలని పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తున్నాం కానీ మన బుర్రలోకి వచ్చే ఆ ఒక్క ఆలోచనను కూడా మనం కనీసం గమనించలేం ఆఫీస్ బాస్ తిట్టగానే కోపం వచ్చేస్తుంది.
(07:08) ఆ కోపంలో ఎదుటి వారిపై అరిచేస్తాము ఆ తర్వాత గిల్టీగా ఫీల్ అవుతాము. ఇదంతా ఒక లూప్ లా జరిగిపోతూనే ఉంటుంది. కానీ ఆ కోపం ఎందుకు వచ్చింది దాని వెనుకున్న ఈగో ఏంటి అని ఒక్క క్షణం కూడా ఆగి ఆలోచించం మనం. అయితే ఈ మానసిక వలయం నుంచి బయట పడటం ఎలా? దీనికి జిడ్డు కృష్ణమూర్తి గారు ఒక సింపుల్ గా ఒక విషయం చెప్పారు. అబ్జర్వేషన్ వితౌట్ జడ్జిమెంట్ అంటే ఎలాంటి జడ్జిమెంట్లు లేకుండా మిమ్మల్ని మీరు ఒక సాక్షిలా గమనించడం.
(07:37) మీకు కోపం వచ్చిందనుకోండి నేను కోపపడకూడదు నేను మంచివాడిని కావాలి అని చెప్పేసి దాన్ని అనిచి వేయడానికి ప్రయత్నించకండి లేదా మీ లోపల భయం ఉన్నప్పుడు నేను ధైర్యవంతుడిని అని మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి ఆ కోపాన్ని ఆ భయాన్ని ఒక మూడో వ్యక్తిలా నిలబడి చూడండి అంటే ఎవరో గొడవాడుకుంటుంటే మనం చూస్తూ ఉంటాం కదా అలాగా మనకి కోపం వచ్చినప్పుడు అసలు ఈ కోపం ఎందుకు వస్తుంది ఈ కోపం వచ్చినప్పుడు నా బాడీలో ఏమేమి మార్పులు వస్తున్నాయి అని చెప్పేసి మిమ్మల్ని మీరు క్షుణణంగా పరిశీలిస్తున్నప్పుడు మీరు మీరు ఎవరో మీకు తెలుస్తుంది. మీలో ఉన్న తప్పులు ఏంటో మీకు
(08:09) అర్థం అవుతాయి. అలా అర్థమైన వెంటనే నేను మంచివాడిని నేను చెడ్డు వాడిని అని చెప్పేసి ముద్ర వేసుకోకండి. ఎప్పుడైతే మీరు మీ ఆలోచనల్ని ఎలాంటి తీర్పు లేకుండా గమనించడం మొదలు పెడతారో అప్పుడు ఆ ఆలోచనల వేగం సహజంగా తగ్గిపోతుంది. ఎందుకంటే మీరు సత్యం వైపు నడుస్తున్నారు కాబట్టి సత్యం ఏంటంటే మీరు దేన్నైతే పూర్తిగా అర్థం చేసుకుంటారో అది మీ జీవితం నుంచి సహజంగానే ముగుస్తుంది.
(08:34) దానికోసం మీరు ప్రత్యేకంగా పోరాడాల్సిన అవసరం లేదు. స్వేచ్ఛ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే మనల్ని ఎవరు కంట్రోల్ చేయకపోవడం నచ్చినట్లు తిరగడం అనుకుంటారు. కానీ అసలైన స్వేచ్ఛ అంటే ఏంటో తెలుసా నీ భయం నిన్ను కంట్రోల్ చేయకుండా ఉండటం, నీ కోరికలు నిన్ను ఆడించకుండా ఉండటం, నీ గతం నిన్ను వెంటాడకుండా ఉండటం, నీ భవిష్యత్తు నిన్ను భయపెట్టకుండా ఉండటం. ఇవేవి నీ మనసుని కదల్చలేనప్పుడు నీ లోపల ఒక అద్భుతమైన నిశ్శబ్దం ఏర్పడుతుంది.
(09:00) అదే నిజమైన స్వేచ్ఛ. మీరు మొదటగా చేయాల్సింది ఒకటే మిమ్మల్ని మీరు శిక్షించుకోవడం ఆపండి. ఈ క్షణం నుంచి ఆ పోలికల ప్రపంచాన్ని పూర్తిగా వదిలేయండి. పక్కింటి వాడి సక్సెస్ గ్రాఫ్ మీ జీవితానికి కొలమానం కాదు వాడి జీవితం వాడిదే మీ జీవితం మీదే వాడు రెండు సంవత్సరాల్లో సక్సెస్ అవ్వచ్చు. కానీ మీరు నాలుగు సంవత్సరాల తర్వాత వాడికన్నా ఎక్కువ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది.
(09:22) మీ అసలైన ప్రయాణం మొదలు పెట్టండి. మీరు ఎలా ఉన్నారో మీ బలహీనతలు ఏంటో మీ భయాలు ఏంటో ముందు యదాతదంగా అంగీకరించండి. ఆ అంగీకారమే మిమ్మల్ని ఈ మానసిక బానిసత్వం నుంచి విడుదల చేస్తుంది. నిజమైన మార్పు అనేది మీ అలవాట్లను మార్చడం వల్ల రాదు. ఉదయాన్నే 5ు గంటలకు లేవటం రోజుకి 10 పేజీల పుస్తకం చదవటం ఇవన్నీ పైపైన మెరుగులు మాత్రమే. జీవితం నిజంగా మారాలంటే మీ లోపల ఒక ప్రాథమికమైన అవగాహన రావాలి అంటే అవేర్నెస్ రావాలి.
(09:53) మీ మైండ్ మిమ్మల్ని ఎలా మోసం చేస్తుందో మిమ్మల్ని ఎలా పరిగెత్తిస్తుందో మీరు లైవ్ గా చూడగలగాలి. సమాజం మీకు ఒకటే చెప్తుంది పుష్ యువర్ సెల్ఫ్ కష్టపడు పోరాడు అని కానీ జిడ్డు కృష్ణమూర్తి గారి దృష్టిలో చూస్తే అసలు ఆ పుష్ చేయాలనే ఆలోచనే పెద్ద బ్రమ ఒక్క క్షణం ఆగి ఆలోచించండి మిమ్మల్ని ఎవరు పుష్ చేస్తున్నారు లోపల ఉన్న ఏ ఈగో మిమ్మల్ని తరుబుతుంది ఎవరిని పుష్ చేస్తున్నారు ఎందుకు పుష్ చేస్తున్నారు ఈ ప్రశ్నల వెనుక ఉన్న నిజాన్ని మీరు ఒక్కసారి పట్టుకుంటే బహుశా మిమ్మల్ని మీరే బలవంతంగా తోసుకోవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే అవగాహన ఉన్నచోట యాక్షన్ చాలా సహజంగా ప్రశాంతంగా ఉంటుంది. ప్రపంచం మిమ్మల్ని
(10:29) రేసు గుర్రంలా మార్చాలని చూసిన మీరు మాత్రం ఒక మనిషిలా బ్రతకడం నేర్చుకోండి. విజయం అనేది బయట జరిగే ఒక చిన్న సంఘటన మాత్రమే. జీవితం అనేది మీ లోపల ప్రతిక్షణం ప్రవహించే ఒక నది బయట ఎంత సంపాదించినా ఎలాంటి హోదా తెచ్చుకున్నా లోపల ప్రశాంతత లేకపోతే ఆ జీవితం వృద. మీకు వచ్చే ప్రతి ఆలోచనని ఎలాంటి జడ్జిమెంట్ లేకుండా మొదటిసారి ఒక చిన్న పిల్లాడిలా వింతగా చూడటం నేర్చుకోండి.
(10:56) ఆ అవగాహన వచ్చిన రోజు మీ చుట్టూ ఉన్న నరకం అలాగే ఉంటుంది. ఈ మోసపూరితమైన ప్రపంచం అలాగే ఉంటుంది. కానీ ఆ నరకంలో కూడా ఏమాత్రం చలించని ఒక సరికొత్త మనిషిగా మీరు నిలబడతారు. అదే జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పిన పరమ సత్యం. సో మీరు కూడా ఆ స్థితికి వస్తారని నేను నమ్ముతున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కచ్చితంగా వస్తాను అని కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్.
(11:23) [సంగీతం] [సంగీతం]

No comments:

Post a Comment