Friday, July 10, 2026

Why Nietzsche Rejects “Zero Suffering” | Telugu Explanation

Why Nietzsche Rejects “Zero Suffering” | Telugu Explanation

Author Name:Nagna Satyam

Youtube Channel Url:https://www.youtube.com/@Nagnasatyam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=H4ak6H9ywfU



Transcript:
(00:05) మనలో చాలామంది ఒకే ఒక్క కోరికతో బ్రతుకుతారు. నాకు కష్టాలు లేకుండా ఉండాలి అని ప్రశాంతంగా ఎలాంటి బాధలు లేకుండా సాఫీగా వెళ్లే జీవితమే మంచి జీవితం అనుకుంటాం. మనం కోరుకునేది సంతోషం కాదు బాధ లేకపోవడమే కానీ ఒకసారి ఆలోచించావా బాధ లేకపోవడం అంటే నిజంగా జీవించడం అనే అర్థం వస్తుందా లేక అది కేవలం ఒక సేఫ్ గా ఉన్న కానీ లోపల ఖాళీగా ఉన్న జీవితం మాత్రమేనా అని బుద్ధిజం స్టోయిసిజం వంటి కొన్ని పాత ఫిలాసఫీలు కూడా బాధల నుండి ఎలా విముక్తి పొందాలో లేదా వాటిని ఎలా అణచివేయాలో చెప్తాయి కానీ నీషే దీనికి పూర్తిగా గా వ్యతిరేకం బాధల నుండి తప్పించుకోవాలని
(00:51) చూడడం తప్పు జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించాలంటే బాధ కూడా ఒక భాగమే అని ఆయన అంటారు. మనిషి సహజంగా బాధను శత్రువులా చూస్తాడు. దాన్ని తప్పించుకోవాలని దాచుకోవాలని లేక పూర్తిగా మాయమైపోవాలని కోరుకుంటాడు. కానీ జీవితంలో ఉన్న ప్రతి లోతైన అనుభవం ప్రతి నిజమైన మార్పు ప్రతి గొప్ప ఆలోచన ఇవన్నీ సౌకర్యం నుంచి పుట్టలేదు.
(01:19) అవి అసౌకర్యం నుంచి కష్టం నుంచి కొన్నిసార్లు విరిగిపోయే క్షణాల నుంచి పుట్టాయి. బాధ లేకుండా బ్రతికే జీవితం ఒక స్మూత్ గా నడిచే కథలా కనిపించొచ్చు. కానీ అందులో ఎలాంటి గాఢత ఉండదు. ఒక చెట్టుని గమనిస్తే అది ఆకాశాన్ని తాకాలంటే అది కేవలం సూర్యకాంతి, నీళ్లు మాత్రమే సరిపోవు. గాలులు దాన్ని ఊపాలి, తుఫానులు దాన్ని పరీక్షించాలి, నేల దాన్ని బలంగా పట్టుకోవాలి.
(01:45) ఆ ఒత్తిడి లేకుండా అది ఎదగదు. అలాగే మనిషి కూడా ఎప్పుడూ కష్టాలు రాకుండా చూసుకుంటూ ఉంటే మనం పెరుగుతున్నట్టు అనిపించొచ్చు కానీ లోపల మాత్రం మనం అదే స్థాయిలో నిలిచిపోతాం. బాల మనల్ని తప్పనిసరిగా మంచి వాళ్ళగా మారుస్తుందా అంటే కాదు కానీ అది మనల్ని లోతైన వాళ్ళగా మాత్రం మారుస్తుంది. జీవితాన్ని సింపుల్ గా పైపైన చూసే దృష్టి పోతుంది. ఒక రకమైన తెలివి వస్తుంది.
(02:11) ఆనందం విలువ కూడా బాధ తర్వాతే అర్థమవుతుంది. ఎలాంటి నష్టాలు, అవమానాలు, ఫెయిల్యూర్స్ చూడని మనిషి నవ్వు కూడా కొంచెం తేలికగానే ఉంటుంది. ఇక్కడే నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే నీ జీవితాన్ని అది ఎలా ఉందో అలా అంగీకరించగలవా కేవలం మంచి క్షణాలను మాత్రమే కాదు [సంగీతం] నిన్ను బాధ పెట్టిన ప్రతి సంఘటనను కూడా ఇదే నా జీవితం అని స్వీకరించగలవా ఎందుకంటే నిజం ఏంటంటే నువ్వు ప్రేమించే ప్రతి సంతోషానికి వెనుక నువ్వు ద్వేషించే కొన్ని కష్టాలు తప్పకుండా ఉంటాయి.
(02:46) వాటిని తీసేస్తే ఈ క్షణం కూడా ఉండదు. సో మనిషి తరచుగా ఒక పొరపాటు చేస్తాడు. నాకు మంచి మాత్రమే కావాలి అని కానీ జీవితం అలా పని చేయదు. సుఖం, బాధ, గెలుపు, ఓటమి ఇవన్నీ కలిసి ఒక సంపూర్ణ అనుభవం అవుతాయి. వాటిలో ఏదో ఒకటి తీసేస్తే మిగతావి కూడా అర్థం కోల్పోతాయి. ఎప్పుడూ సేఫ్ గా కంఫర్ట్ గా ఉండే జీవితం చివరికి మనల్ని బలహీనంగా సాధారణంగా మార్చేస్తుంది.
(03:14) కానీ కష్టాలు మాత్రం వేరే పనిచేస్తాయి. అవి మనలో దాగి ఉన్న శక్తిని బయటకు లాగుతాయి. మనం ఎవరమో మనం ఎంతవరకు వెళ్ళగలమో మనం నిజంగా ఏం తట్టుకోగలమో ఇవన్నీ చూపిస్తాయి. అందుకే బాధను చూసి వెనక్కి తగ్గడం కాదు దాన్ని చూసి నిలబడగలగడం ముఖ్యం. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఎదగడం అంటే కష్టాలు తగ్గడం కాదు వాటిని తట్టుకునే మన సామర్థ్యం పెరగడం.

No comments:

Post a Comment