నేచురల్ లాండ్రీ డిటర్జెంట్ లిక్విడ్ | Stop Buying Laundry Detergent - This Rs '0 Recipe Lasts a Year
Author Name:v channel by venu
Youtube Channel Url:https://www.youtube.com/@vchannelbyvenu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=2BAf2LUC1uQ
Transcript:
(00:03) ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈ వీడియోలో కేవలం మూడంటే మూడే ఇంగ్రిడియంట్స్ తో కెమికల్ ఫ్రీ హోమ్ మేడ్ లాండ్రీ డిటర్జెంట్ లిక్విడ్ చేసి చూపించబోతున్నాను. దీనికైతే మనకు కావాల్సింది బట్టల సోడా బోరాక్స్ మరియు ప్యూర్ కాస్టిల్ సోప్ ఇది మీకు ఆన్లైన్ లో దొరుకుతుంది లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు అక్కడి నుంచి పర్చేస్ చేయొచ్చు.
(00:28) ఇది ఒక వన్ అండ్ హాఫ్ సోప్ తీసుకోవాలి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఈ కాస్టిల్ సోప్ ని మంచిగా తురుముకోవాలి. కాస్టిల్ సోప్ అంటే ఏం కాదండి ప్యూర్ నాచురల్ సోప్ అన్నమాట పార్బన్ మరియు సల్ఫేట్ ఫ్రీ ఆలివ్ మరియు కొబ్బరి వంటి నూనెల నుండి తయారు చేయబడిన స్వచ్ఛమైన సబ్బు కఠినమైన కృత్రిమ రసాయనాలు లేకుండా బట్టల మురికిని తొలగించడం దీని ప్రధాన లక్షణం.
(00:58) అలాగే బట్టల మృదత్వాన్ని మరియు రంగును కాపాడడానికి ఇది సహాయపడుతుంది. సో ఈ విధంగా మంచిగా తురుముకోవాలి. తర్వాత ఈ తురిమిన సబ్బుని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇంతకుముందు వీడియోలో మనం నాచురల్ పౌడర్ చేశము ఇది లిక్విడ్ అన్నమాట. ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే పైన ఐ కార్డ్స్ లో ఇస్తున్నాను. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత అది కూడా చూడండి.
(01:23) ఇప్పుడు ఇందులో ఒక లీటర్ వరకు వాటర్ పోయాలి ఇది వాటర్ ప్లాంట్ నుంచి తెచ్చిన ప్యూరిఫైడ్ వాటర్ దీన్నే ఆర్వ వాటర్ అని కూడా అంటారు. [నిట్టూర్పులు] నార్మల్ వాటర్ ఇక్కడ వాడకూడదు లిక్విడ్ ఎక్కువ కాలం నిలవ ఉండదు పాడైపోతాది. సో ప్యూరిఫైడ్ వాటర్ మాత్రమే వాడాలన్నమాట. ఇప్పుడు దీన్ని మనం సన్నని మంట మీద ఈ సోప్ అంతా కరిగే వరకు వేడి చేయాలి.
(01:47) మరిగించకూడదు సోపు కరిగే వరకు వేడి చేస్తే సరిపోతుంది. చూడండి సోప్ అంతా పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత 20లీటర్లు పట్టే ఒక బకెట్ తీసుకోండి. ఇందులో సగం వరకు వేడినీళ్లు పోయాలి. ఈ వాటర్ కూడా ఆర్వ వాటరే మొత్తం అంతా ప్యూరిఫైడ్ వాటర్ే వాడాలి. ఈ వాటర్ ఎక్కువ క్వాంటిటీ కాబట్టి నేను వాటర్ హీటర్ తో వేడి చేశాను.
(02:25) మీ దగ్గర వాటర్ హీటర్ లేకపోతే స్టవ్ మీదైనా మరిగించి ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఇందులో రెండు కప్పుల బట్టల సోడా వేయాలి. ఈ కప్పు 250 ml కప్పు అన్నమాట. ఇంట్లో తయారు చేసుకునే లిక్విడ్ డిటర్జెంట్లలో వాషింగ్ సోడా ఉపయోగించడం వల్ల మొండి జిడ్డును తొలగిస్తుంది. బట్టలు తాజాగా పరిమలించేలా చేస్తుంది ఇది. మన నెక్స్ట్ ఐటం బోరాక్స్ దీన్నే తెలుగులో వెలిగారం అంటారు.
(02:55) ఇది సహజంగా లభించే ఒక ఖనిజం సో ఇది కూడా ఒక రెండు కప్పులు తీసుకోవాలి. బోరాక్స్ [గురకలు] ఉపయోగించడం వల్ల సహజమైన శుభ్రపరిచే బూస్టర్ గా పనిచేస్తుంది. ఇంతకుముందు మనం బట్టల సోడా కలిపాం కదా అది మురికిని వదలగొడితే ఆ మురికి తిరిగి బట్టలకు అంటకుండా ఇది సహాయపడుతుందన్నమాట. సో ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిసే విధంగా బాగా కలపాలి.
(03:21) ఇవన్నీ మీకు కిరాణ షాప్స్ లో దొరుకుతాయి తెచ్చుకుని ఈ విధంగా చక్కగా చేసుకున్నట్లయితే 20లీటర్ల నాచురల్ లిక్విడి డిటర్జెంట్ తయారవుతుంది. తర్వాత మనం సోప్ కరిగించి పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసి బాగా కలపాలి. [నిట్టూర్పులు] బ్రాండెడ్ లిక్విడి డిటర్జెంట్ల రేట్లతో పోలిస్తే దాదాపు ఇది జీరో కాస్ట్ అన్నమాట. ఒక చిన్న ఫ్యామిలీ అయితే వన్ ఇయర్ వచ్చేస్తది బాగా పనిచేస్తది ఇది ఇప్పుడు ఈ బకెట్ నిండుగా వాటర్ పోసేసి మొత్తం అంతా బాగా కలిసే విధంగా బాగా కలపాలి.
(03:56) నాకు తెలిసి తెలుగులో ఇదే మొట్టమొదటి వీడియో అనుకుంటా YouTube లో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అందరూ నాచురల్ ప్రొడక్ట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు అటువంటి వారికి ఈ వీడియో బాగా హెల్ప్ అవుతుంది. [గురకలు] బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక రాత్రంతా అట్లా వదిలేసేయండి.
(04:22) తర్వాత మీరు బాటిల్స్ లో వేసుకుని ఉపయోగించుకోవచ్చు. ఉపయోగించే ముందు బాటిల్ ని బాగా షేక్ చేసి ఉపయోగించండి మంచి రిజల్ట్స్ ఉంటాయి. హ్యాండ్ వాష్ కి గాని మిషన్ వాష్ కి గాని ఒక కప్పు వేస్తే చాలు ఎక్కువ అవసరం లేదు థాంక్యూ
No comments:
Post a Comment