Friday, July 10, 2026

పేదవాడ్ని తొక్కేయడానికి ధనవంతుడు రాసుకున్న స్క్రిప్టే చట్టం | SUGALI PREETHI || PRATIKULA VEDAM

పేదవాడ్ని తొక్కేయడానికి ధనవంతుడు రాసుకున్న స్క్రిప్టే చట్టం | SUGALI PREETHI || PRATIKULA VEDAM

Author Name:PRATIKULA VEDAM

Youtube Channel Url:https://www.youtube.com/@pratikulavedam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=hYz07zVN5vI



Transcript:
(00:00) ఒక ఆడపిల్లకు జరిగిన అన్యాయానికి న్యాయం చేకూర్చడం చేతకన్నప్పుడు ఆ తల్లికి న్యాయం చేస్తానని ప్రామిస్ ఎందుకు చేశాడు అని ఒక నాయకుడిని పట్టుకొని లాజికల్ గా కడిగేస్తున్నారు. ఇన్ఫాక్ట్ అది కరెక్ట్ ప్రశ్నే కానీ దీన్ని ఇంకో కోణంలో చూడండి అసలు మన సొసైటీకి నిజం వినే దమ్ము ఉందా? హ్ ఒక నాయకుడు ఎన్నికల ముందు మీ దగ్గరికి వచ్చి చూడమ్మ నీకు అన్యాయం జరిగింది.
(00:25) కానీ సిస్టం మొత్తం కరప్ట్ అయిపోయింది. మన పోలీసులు అమ్ముడిపోయారు సాక్ష్యాలు నాశనం చేశారు. కాబట్టి నా పేరులో పీకే ఉన్నంత మాత్రాన నేను పవర్ లోకి వచ్చాక పీకగలిగేది ఏమీ లేదు. నేను లాయర్ కోట వేసుకొని ఆడపిల్లల్ని ఏది ఏమైనా కాపాడేస్తున్నట్టు సినిమాల్లో బిల్డప్ ఇస్తా గానీ బయటికవచ్చి పీకగలిగేది ఏమీ ఉండదు. ఒకవేళ సిబిఐ విచారణలో ఏమి తేలకపోతే ఇంక నేను చేసేది ఏమీ లేదు అని నా చేతులు నేను హాయిగా దులిపేసుకుంటాను.
(00:51) ఈ ఇదే తర్వాత జరగబోయే వాస్తవం అని గానీ పచ్చి నిజం చెప్తే నువ్వు ఆ నాయకుడు కొట్టేస్తావా వెయ్ నీకొక భ్రమ కావాలి. నిన్ను ఎవడో ఒక బాహుబలి లాంటి హీరో వచ్చి ఉద్దరించేస్తాడు అనే ఒక ఫ్యాంటసీ కావాలి. నీలో పోరాడే ధైర్యం లేదు కాబట్టి ఆ భారాన్ని ఒక రాజకీయ నాయకుడి మీద మోపేసి నువ్వు చేతులు తులుపుకోవాలి అనుకుంటున్నావ్. ప్రజలకు అబద్ధాలు కావాలి కాబట్టే నాయకులు అబద్ధాలాడుతున్నారు.
(01:15) సోక్రటీస్ డెమోక్రసీ గురించి ఒక హెచ్చరిక చేశాడు. ప్రజలకు ఆలోచించే శక్తి లేనప్పుడు ప్రజాస్వామ్యం కేవలం ఒక నాటకంగా మిగిలిపోతుంది. నాయకుల హామీలుఇచ్చి నెరవేర్చకపోవడం తప్పైతే ప్రాక్టికల్ గా సాధ్యం కాని హామీలను గుడ్డిగా నమ్మేసి తెర మోసపోయాక విక్టిం కార్డు ప్లే చేయడం అంతకంటే పెద్ద తప్పు. ఇకపోతే ఈ కేసులో ఇంకో పెద్ద డైలాగ్ వింటుంటాం.
(01:38) సాక్షాదారాలు లేవు. డిఎన్ఏ సాక్ష్యాలు తారుమారయ్యాయి కాబట్టి మేము ఏమి చేయలేము అని సాక్ష్యాలు అంటే అవి ఏమైనా కర్పూరం వెళ్ళలా గాలిలో వదిలిస్తే ఆవిరైపోవడానికి ఒక క్రైమ్ సీన్ లో సాక్ష్యం తారుమారు అవ్వాలంటే అది ఒకరి వల్ల మాత్రమే అయ్యే పని కాదు ఒక సాక్ష్యం నాశనం అవ్వాలంటే మొదట క్రైమ్ సీన్ కి వెళ్ళిన కానిస్టేబుల్ కళ్ళు మూసుకోవాలి రెండు పంచనామా రాసే ఎస్ఐ తప్పుడు రిపోర్ట్ రాయాలి మూడు పోస్ట్మార్టం చేసే డాక్టర్ ఫారెన్సిక్ ఎక్స్పెక్ట్ శాంపిల్స్ కలెక్ట్ చేసేటప్పుడు తప్పులు చేయాలి లేదా మార్చ చేయాలి ఇక నాలుగు వీళ్ళందరినీ కోఆర్డినేట్
(02:12) చేస్తూ పైనున్న డిఎస్పి నో ఎస్పీ నో ప్రెజర్ తీసుకురావాలి. ఒక పాపకు జరిగిన అన్యాయాన్ని కప్పి పుచ్చడానికి ఇన్ని స్థాయిల్లో ఇంతమంది చదువుకున్న వాళ్ళు ఒక నెట్వర్క్ లా పని చేశారు. దీన్ని మీరు సిస్టం ఫెయిల్యూర్ అంటారా కానే కాదు దీన్నే సిస్టమిక్ ఎఫిషియన్సీ అంటారు. ఒక నేరస్తుడిని కాపాడడానికి మన సిస్టం ఎంత పర్ఫెక్ట్ గా ఎంత యూనిటీతో పని చేస్తుందో చూస్తే భయం వేస్తుంది.
(02:39) అసలు సాక్షాలనే తారుమారు చేసిన వీళ్ళంతా ఎవరు ఆకాశం నుంచి ఊడిపడ్డారా లేదు ఇదే సమాజం నుంచి వచ్చిన వాళ్ళే కదా వాడు నీ పక్కింటివాడో నీ చుట్టమో లేక నీ కులం వాడో అయి ఉంటాడు. నిజం చెప్పాలంటే సిస్టం ఎక్కడో ఢిల్లీలోనో అమరావతిలోనో లేదు మనమే ఆ సిస్టం. ట్రాఫిక్ ఫైన్ తప్పించుకోవడానికి వంద రూపాయ లంచం ఇచ్చే అలవాటు ఉన్న మనం క్యూ లైన్ లో నిలబడకుండా వెనకదారిలో వెళ్ళడానికి రికమెండేషన్లు వాడే మనం మనకు అన్యాయం జరిగినప్పుడు మాత్రం ఈ సిస్టం మొత్తం సత్య హరిశ్చంద్రుడులా పని చేయాలని ఆశిస్తాం.
(03:08) నీతి నిజాయితి అనేవి నీ అవసరాన్ని బట్టి మార్చుకునే ఫ్లక్సిబుల్ టూల్స్ కాదుగా రోడ్డు మీద ఒక అన్యాయం జరుగుతుంటే దాన్ని ఆపకుండా వీడియోలు తీసుకుంటూ లైకుల కోసం సోషల్ మీడియాలో పెట్టే ప్రతి ఒక్క పౌరుడు ఆ నేరంలో పరోక్ష భాగస్వామి కోర్టు మెట్లెక్కి సాక్ష్యం చెప్పడానికి భయపడే ప్రతి పిరికివాడు కూడా ఆ అత్యాచారం చేసినోడితో సమానమే సిస్టం మీద ఏడవడం మానేయండి పునాది మొత్తం బురత్తతో కట్టి పైకప్పు ఎందుకు బేటలు వారుతుంది అని ముఖ్యమంత్రి గారిని అడిగితే ఏం లాభం ఇక మరో దరిద్రమైన పాయింట్ ఒక కాపు నాయకుడు తప్పు చేస్తే కాపులందరూ కలిసి వాడిని కాపాడటం దళితులు తప్పు చేస్తే
(03:44) అట్రాసిటీ యాక్ట్ ని కవచంలో వాడుకోవడం అసలు నీ కులంలో పుట్టిన ఒకడు అత్యాచారాలు చేస్తుంటే హత్యలు చేస్తుంటే వాడిని వెనకేసుకొని రావాలి అని నీకు ఎందుకు అనిపిస్తుంది దీని వెనకున్న అసలైన సైకాలజీ ఏంటో ఎప్పుడైనా లోతుగా ఆలోచించావా ఒక మనిషి తను తాను తెలుసుకోలేనప్పుడు తనకంటూ ఒక ఇండివిడ్యువల్ ఐడెంటిటీ లేనప్పుడు వాడు కులానికో మతానికో జెండాకో అతుక్కుపోయి ఉంటాడు.
(04:08) నీకంటూ ఒక వ్యక్తిత్వం లేదు నువ్వు నీ జీవితంలో సాధించింది ఏమీ లేదు అందుకే నీ ఈగో మొత్తం నీ కులం మీద ఆధారపడి బ్రతుకుతుంది. వాడు మనభంగం చేశడా వాడు క్రిమినలా అనేది నీకు అనవసరం వాడు కేవలం నీ కులం వాడు కాబట్టి వాడిని ఎవడైనా ప్రశ్నిస్తే నిన్ను పర్సనల్ గా అటాక్ చేసినట్లు ఫీల్ అయిపోతున్నావ్. ఇది కేవలం రాజకీయ వ్యోహం కాదు ఇది ఒక మానసిక రోగం. ఒక పసిపిల్లకు అన్యాయం జరిగితే అక్కడ న్యాయాన్ని చూడాల్సిన కళ్ళు కులాన్ని వెతుకుతున్నాయి అంటే మనక అసలు మనిషి అని పిలిపించుకునే అర్హత ఉందా నువ్వు ఎవరో నీకు తెలియనంత కాలం సమాజం నీకు అంటించిన ఈ కులం అనే మురుగునే నీ అస్తిత్వంగా భావించి
(04:45) బ్రతుకుతావు. ఒక ఆడపిల్ల మీద చెయ్యి వేస్తే వాడిని లా అండ్ ఆర్డర్ కాపాడుతుందా శిక్షిస్తుందా అనేది పక్కన పెట్టండి. అసలు ఆ చెయ్యి వేసే ధైర్యం వాడికి ఎలా వచ్చింది? ఎందుకంటే వాడికి తెలుసు ఈ సమాజంలో మనుషులు లేరు కేవలం కులాలు డబ్బు పరపతి మాత్రమే ఉన్నాయి అని వాడి వెనక వాడి కులం నిలబడుతుందని వాడి డబ్బు పోలీసులని కొంటుందని ప్రజలు రెండు రోజులుఫేస్బ లో పోస్టులు పెట్టి మూడో రోజు మర్చిపోతారని కూడా వాడికి స్పష్టంగా తెలుసు.
(05:13) నీషే తన ఫిలాసఫీలో చాలా స్పష్టంగా ఒక మాట చెప్పాడు. చట్టాలు ఎప్పుడు బలహీనుల్ని రక్షించవు. ఎప్పుడైతే సొసైటీ నైతికంగా చచ్చిపోతుందో అప్పుడు ఆ చట్టాలు కేవలం బలవంతుడి చేతిలో ఆయుధాలుగా మారుతాయి. చట్టం అంటే అదిఏదో ఒక పుస్తకం కాదు లా అండ్ ఆర్డర్ అనేది మనిషి లోపల ఉండే స్పృహ. కాన్షస్నెస్ సమాజంలో ప్రతి ఒక్కడు నైతికంగా చచ్చిపోయినప్పుడు ఎన్ని కొత్త చట్టాలు తెచ్చినా ఎన్ని ఉరిశిక్షలు వేసినా నేరాలు ఆగవు.
(05:44) నిర్భయ చట్టం వచ్చాక దిశ జరగలేదా? దిశా చట్టం వచ్చాక సుగాలి ప్రీతి జరగలేదా ఎందుకంటే మనం చట్టాల్ని మారుస్తున్నాం కానీ మన స్పృహని మార్చుకోవట్లేదు. మనం సిస్టం ని బ్లేమ్ చేసి చాలా ఈజీగా ఎస్కేప్ అవుతాం. కానీ ఒక హార్డ్ హిటింగ్ నిజం చెప్పనా ఎప్పుడైతే మన లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు అని కంప్లైంట్ చేస్తున్నామో దాని అర్థం ఏంటో తెలుసా మనలో కూడా ఆ క్రిమినల్ మెంటాలిటీ ఎక్కడో ఓ చోట దాగి ఉంది అని సాక్ష్యం చెప్పడానికి భయపడే ప్రతి పిరికివాడు కూడా ఆ నేరస్తుడితో సమానమే ఒక YouTubeూ్ వీడియో చూసి ఒక పొలిటికల్ స్పీచ్ విని అబ్బా ఎంత బాగా మాట్లాడాడు కదా అనో లేదా వీడికి చేత
(06:21) కాదు అందుకే ఇలా కవర్ చేసుకుంటున్నాడు అనో కామెంట్లు పెట్టడం చాలా సులభం కానీ అది పనికి మాలిన వాళ్ళు చేసే పని సమస్య చట్టంలో లేదు ఇంకో నాయకుడిలో కూడా లేదు. సమస్య మన బానిస ఆలోచన విధానంలో ఉంది. కులాన్ని డబ్బుని అహంకారాన్ని పక్కన పెట్టి ఒక మనిషిగా ఒక ఇండివిడ్యుల్ గా ఆలోచించడం మొదలు పెట్టిన రోజున ఏ నాయకుడు కూడా నీకు అబద్ధపు హామి ఇవ్వలేడు ఏ వ్యవస్థ నీ సాక్ష్యాన్ని మాయం చేయలేదు.
(06:48) గుర్తుపెట్టుకోండి నిన్ను ఉద్ధరించడానికి ఏ దేవుడు రాడు ఏ నాయకుడు రాడు నిన్ను నువ్వే కాపాడుకోవాలి. ముందు ఈ కులాల మురుగు గుంటలో నుంచి నీ బుర్రని బయటికి తీయ్ ఒక నాయకుడి వైఫల్యాన్ని వేలెత్తి చూపే ముందు అద్దంలో నిన్ను నువ్వు చూసుకో ఈ క్షణం నీకు నువ్వు వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటే నేను ఈ సమాజంలో ఒక మనిషిగా నాకంటూ ఒక క్లారిటీతో బ్రతుకుతున్నానా లేక కేవలం ఒక కులానికి బానిసగా ఒక పార్టీకి ఓటు వేసే యంత్రంగా బ్రతుకుతున్నానా అని నిజాన్ని జీర్ణించుకునే దమ్ము ఉంటే మార్పు నీతోనే నీ ఆలోచనతోనే మొదలుపెట్టు అప్పుడు మాత్రమే సుగాలి ప్రీతి లాంటి పిల్లలకి ఈ దేశంలో
(07:26) బ్రతికే హక్కు దొరుకుతుంది. ఆలోచించు.

No comments:

Post a Comment