మోసం చేసిన వాళ్లను ఏం చేయాలి? | అశ్వత్థామని పగ ఏం చేసింది? | SEETAKANTH TALKIE #karmastory
Author Name:SEETAKANTH TALKIE
Youtube Channel Url:https://www.youtube.com/@SEETAKANTHTALKIE
Youtube Video URL:https://www.youtube.com/watch?v=A7FGYhRuU_U
Transcript:
(00:00) బాగా రద్దీగా ఉన్న ఒక గుడి జనం అటు ఇటు తిరుగుతున్నారు అక్కడ ఎటు చూసిన పువ్వులు కర్పూర హారతులు గంటల శబ్దం అందరూ దేవుడు దర్శనానికి వచ్చిన వాళ్ళే కానీ ఆ గుంపులో ఒక్క మనిషి దేవుడు కోసం రాలేదు అతని పేరు రాఘవ్ వయసు 35 అతని కళ్ళల్లో భక్తి లేదు ఉన్నదఒక్కటే పగ అతని చొక్కా లోపల నడుము దగ్గర దాచిన ఒక రివాల్వర్ ఉంది అతను ఎవరి కోసమో ఎదురు చూస్తున్నాడు తనని మోసం చేసి తన జీవితాన్ని నాశనం చేసిన మనిషి కోసం ఆ మనిషి ఇవాళ కుటుంబంతో సహా ఆ గుడికి వస్తున్నాడు.
(00:35) రాఘవ ప్లాన్ ఒక్కటే ఆ కుటుంబంలో ఒక్కరు కూడా మిగలకూడదు. ఒక మనిషి ఇంత చీకట్ిలోకి ఏది నేడుతుంది ఒక మనిషి చంపడానికి గుడి మెట్ల దగ్గర ఎందుకు నిలబడాలి అది తెలియాలంటే కొన్నేళ్ళు వెనక్కి వెళ్ళాలి. రాఘవుకి ఒక చిన్ననాటి స్నేహితుడు ఉండేవాడు పేరు వైభవ్ ఇద్దరూ కలిసి పెరిగారు కలిసి కలలు కన్నారు కలిసి ఒక వ్యాపారం మొదలు పెట్టారు.
(00:57) రాఘవు అమాయకుడు మనిషిని నమ్మితే గుడ్డిగా నమ్మేవాడు. వైభవుని వాడు నా తమ్ముడు లాంటివాడు అనేవాడు వ్యాపారంలో డబ్బు వ్యవహారాలు సంతకాలు కాగితాలు అన్ని వైభవ్ చూసుకునేవాడు రాఘవ్ కళ్ళు మూసుకొని సంతకాలు పెట్టేవాడు ఎందుకంటే నమ్మకం అదే అతను చేసిన పొరపాటు వైభవ్ ఆ వ్యాపారం పేరుతో పెద్ద ఎత్తున మోసాలు చేశడు చాలా మంది దగ్గర డబ్బు తీసుకున్నాడు నకిలీ కాగితాలు సృష్టించాడు కానీ ఆ మోసం అంతా కాగితాల మీద రాఘవు పేరుతోనే జరిగింది.
(01:22) వైభవ్ చాలా తెలివిగా అన్ని నేరాలు రాఘవు నెత్తిన పడేలా ముందే ఏర్పాటు చేశాడు. ఒకరోజు అంతా బయటపడింది పోలీసులు వచ్చారు సంతకాలన్నీ రాఘవ్వి రాఘవు ఎంత అరిచినా నేను చేయలేదు వైభవే చేశడు అని ఎంత మొత్తుకున్న ఒక్క సాక్ష్యం కూడా అతని వైపు లేదు వైభవ మాత్రం ఏమీ తెలియనట్టు నిర్దోషిగా బయటకి నడిచి వెళ్ళిపోయాడు. కోర్టు తీర్పు చెప్పింది రాఘవుకి జైలు శిక్ష పడింది.
(01:47) అలా ఒక మనిషి నమ్మకం అదే మనిషిని జైలుకి పంపింది. బయట అతని భార్య అతని పిల్లలు తండ్రి లేని పిల్లలు భర్త లేని భార్య వాళ్ళు ఊళలో తల దించుకొని బతికారు వాడో మోసగాడు జైలుకి పోయాడు అనే మాటలు వింటూ రాఘవ కుటుంబం రోజు చచ్చి బతికింది. జైల్లో రాగ ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా లేడు అతని మనసులో నిద్రపోని ఒకే ఒక ఆలోచన వైభవ్ వాడు నా జీవితాన్ని లాక్కున్నాడు వాడు నా పిల్లల్ని అనాధనలు చేశడు వాడు హాయిగా బతుకుతున్నాడు నేను ఇక్కడ కుళ్ళిపోతున్నాను రోజులు గడిచే కొద్ది ఆ పగ ఒక మంటలా పెరిగింది రాఘవ ఇక దేనికోసం బతకలేదు ఒక్క పగ కోసమే బతికాడు ఎప్పుడు బయటికి వెళ్తానా ఎప్పుడు వాడి మీద
(02:24) పగ తీర్చుకుంటానా అని ఒక్క విషయం గమనించండి ఇన్నాళ్ళు వైభవ ఏం చేస్తున్నాడు బయట హాయిగా బతుకుతున్నాడు రాఘవ ఉన్నాడన్న సంగతే మర్చిపోయి కానీ రాఘవ్ ప్రతిరోజు ఆ పగలో కాలుతూనే ఉన్నాడు. హోల్డింగ్ ఏ గ్రడ్జ్ ఇస్ లెటింగ్ సంవన్ లివ్ రెంట్ ఫ్రీ ఇన్ యువర్ హెడ్ అంటే ఎవరి మీదైనా పగ పెట్టుకోవడం అంటే వాడికి నీ తలలో ఉచితంగా ఇల్లు ఇచ్చినట్టే వాడు నీ తలలో కూర్చొని నీ ప్రశాంతతని రోజు తినేస్తాడు.
(02:50) రోజు రోజుకి నీ మనశశాంతిని కొంచెం కొంచెంగా దూరం చేస్తూనే ఉంటాడు. జైల్లో రాఘవకి ఒక క్రిమినల్ గ్యాంగ్ పరిచయం అయింది బయటికి వచ్చిన వెంటనే వాళ్ళ మనుషుల ద్వారా ఒక రివాల్వర్ ని సంపాదించాడు. జైల్ నుంచి విడుదలైన రోజు ఇన్నేళ్ళు ఎదురుచూసిన భార్య పిల్లలు వాళ్ళు రాఘవు కోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తున్నారు కానీ రాఘవ్ ఇంటికి వెళ్ళలేదు నేరుగా పగను వెతుక్కుంటూ వెళ్ళాడు.
(03:14) అతని నిర్ణయం వైభవుని చంపటం కాదు అది చాలా తేలిక కానీ రాఘవుకి కావాల్సింది వేరే వాడి కుటుంబాన్ని వాడి కళ్ళ ముందే లాక్కోవాలి ఇన్నాళ్ళు నా కుటుంబానికి నేను దూరంగా బతికినట్టు వాడికి కుటుంబం లేకుండా చేసి జీవితాంతో ఏడుస్తూ బతికేలా చేయాలి. అదే రోజు తెలిసింది వైభవ్ తన కుటుంబంతో గుడికి వస్తున్నాడని రాఘవు గుడి దగ్గర నిలబడ్డాడు రివాల్వర్ నడుముకుంది కళ్ళల్లో పగ వైభవ కుటుంబం గుడిలో నుంచి బయటికి వచ్చే క్షణం కోసం అలా ఎదురు చూస్తున్నాడు సరిగ్గా అప్పుడే ఒక చిన్న సంఘటన జరిగింది.
(03:43) రాఘవ ఉద్రేకంలో ఆత్రంలో ఉన్నాడు అటు ఇటు తిరుగుతున్నాడు ఆ తొందరలో పక్క నుంచి వెళ్తున్న ఒక ముసలాయనకి గట్టిగా తగిలాడు. ఆ ముసలాయన చేతిలో ఒక చిన్న గుడ్డ సంచి అందులో రోజంతా అమ్మగా మిగిలిన కొన్ని పువ్వులు ఒక చిన్న డబ్బు సంచి రాఘవు తోసిన తోపుడికి అవన్నీ కింద పడిపోయాయి డబ్బు చల్లా చెదురయింది పువ్వులు మట్టిలో కలిసిపోయాయి ముసలాయన నెమ్మదిగా వంగి ఏమి అనకుండా తన సామాన్లు ఏరుకోవడం మొదలు పెట్టాడు.
(04:10) ఒక్క మాట కూడా అనలేదు ఒక్క చూపు కూడా కోపంగా చూడలేదు మౌనంగా ఏరుకుంటున్నాడు. రాఘవు కూడా అతనికి డబ్బులు ఏరుకోవడానికి సహాయం చేస్తూ ఒక మాట అడిగాడు. నా వల్ల మీ సామాన్లు పడిపోయాయి మీ డబ్బు పోయింది మీ కష్టం వృధ అయిపోయింది అయినా మీకు కోపం రాలేదా నా మీద అరవలేదు కనీసం ఒక్క మాట అయినా ఎందుకు అనలేదు అని అడిగాడు ముసలాయన రాఘవ కళ్ళల్లోకి చూసాడు చిన్నగా నవ్వాడు తర్వాత ఒక మాట అన్నాడు ఆ మాట రాఘవ గుండెల్లోకి స్ట్రైట్ గా వెళ్ళింది.
(04:37) నా సామాన్లు కింద పడిపోతే జనం రెండు రకాలుగా చేస్తారు కొందరు జాలిపడి రెండు రూపాయలు ఎక్కువ ఇచ్చి వెళ్ళిపోతారు కొందరు పట్టించుకోకుండా వెళ్ళిపోతారు కానీ నువ్వు నన్ను ఆపి నీకు కోపం రాలేదా అని అడిగావు కోపంతో రగిలిపోతున్న వాడే అందరిలో కోపాన్ని వెతుకుతాడు నీ లోపల ఏదో పెద్ద మంట ఉంది బాబు అది నీ కళ్ళల్లో కనిపిస్తుంది నువ్వు నా గురించి అడగలేదు నీ గురించి అడిగావు అన్నాడు రాఘవు ఆ మాటకి షాక్ అయ్యాడు ఒక అపరిచిత వ్యక్తి ఒక ముసలాయన ఒక చూపుతో తన లోపలి మంటని చూసేసాడు అప్పుడు రాఘవ అడిగాడు అవును ఒకడు ఘోరమైన అన్యాయం చేశడు నా జీవితాన్ని లాక్కున్నాడు వాడి మీద నాకు పగ ఉంది అది తప్ప అన్యాయం
(05:13) చేసిన వాడిని వదిలేయాలా అని అడిగాడు. ముసలాయన మళ్ళీ నవ్వాడు కూర్చున్నాడు చెప్పటం మొదలు పెట్టాడు. మహాభారత యుద్ధంలో అశ్వద్ధామ అని ఒక వీరుడు ఉన్నాడు ద్రోణాచార్యుడి కొడుకు గొప్ప యోధుడు కురుక్షేత్ర యుద్ధంలో అతని తండ్రి ద్రోణుడిని ఒక మోసంతో చంపారు అశ్వద్ధామ చనిపోయాడు అని ఒక అబద్ధం చెప్పి ఆయన ఆయుధం కింద పెట్టిన క్షణంలో చంపేశారు కొడుకు అశ్వద్ధామ ఇది చూశడు అతని పగకి అంతు లేదు తండ్రిని మోసంతో చంపారు అదే మోసం అదే పగ అతన్ని గుడ్డివాడిని చేసింది ఆ పగతో అతను ఏం చేసాడో తెలుసా రాత్రిపూట అందరూ నిద్రపోతున్నప్పుడు శత్రువుల శిబిరంలోకి
(05:46) దొంగతనంగా వెళ్లి నిద్రపోతున్న పాండవుల పిల్లలైన ఉపాండవుల్ని పసిపిల్లల్ని పసిపిల్లలని కూడా వదలలేదు ద్రౌపది ఐదుగురు కొడుకుల్ని నిద్రలో ఉండగా చంపేశడు అతని పగ తీరింది శత్రువులు నాశనంఅయ్యారు కానీ దానికి అతను చెల్లించిన మూల్యం ఏంటో తెలుసా శ్రీకృష్ణుడు అతన్ని శపించాడు ఏమనో తెలుసా నువ్వు చావు లేకుండా వేల సంవత్సరాలు బతుకుతావు ఒంటినిండా గాయాలతో చీము నెత్తురు కారుతూ ఎవర లేని అడవుల్లో ఒంటరిగా తిరుగుతావు ఏ ఒక్కరు నీకు తోడు ఉండరు.
(06:17) అశ్వద్ధామ కొంత కాలానికి తను చేసింది తప్పు అని అర్థమయింది పశ్చాత్తాప పడ్డాడు కానీ ఆ పశ్చాత్తాపం అతని శిక్షని ఆపగలిగిందా లేదు ఎందుకంటే పగతో చేసిన పని తిరిగి వెనక్కి తీసుకోలేనిది ఒక్క రాత్రి పగ కోసం అతను యుగాల తరబడి శిక్ష అనుభవిస్తూనే ఉన్నాడు ఇప్పుడు చెప్పు అశ్వద్ధామ పగ తీర్చుకున్నాడు కానీ అతనికి మనశశాంతి దొరికిందా అని అడిగాడు ముసలాయన రాఘవు దగ్గర సమాధానం లేదు ముసలాయన కొనసాగించాడు పగ అనేది ఒక విషం నువ్వు ఆ విషాన్ని గిన్నెలో పెట్టుకొని ఇది వాడికి తాగిస్తాను అనుకుంటున్నావ్ కానీ నిజం ఏంటంటే ఆ గిన్నె నీ చేతిలో ఉంది ఆ విషం మెల్లగా నీ చేతినే కాలుస్తుంది వాడు
(06:52) హాయిగా ఉన్నాడు కాలేది నువ్వే ఇక్కడ ఇంగ్లీష్ లో ఒక గొప్ప మాట ఉంది బుద్ధుడు చెప్పాడు అంటుంటారుహోల్డింగ్ ఆన్ టు యangర్ ఇస్ లైక్ గ్రస్పింగ్ ఏహాట్కోల్విత్ దఇంటెంట్ ఆఫ్ త్రోయింగ్ఇట్సవన్ ఎల్స్ యుఆర్ ద వన్ హ గెట్స్బర్డ్ అంటే కోపాన్ని పట్టుకోవడం అంటే ఇంకొకరి మీద విసరటానికి నువ్వు ఒక నిప్పు కనికని చేతిలో పట్టుకున్నట్టు విసిరే లోపు కాలేది నీ చెయ్యే ఆ మనిషి నీకు ఒక్కసారి అన్యాయం చేశాడు కానీ నువ్వు ఆ పగని మోస్తూ రోజు నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటున్నావ్ అంటే ఒక్కసారి వాడు నిన్ను దెబ్బ తీశడు కానీ ప్రతిరోజు నిన్ను నువ్వు దెబ్బ
(07:26) తీసుకుంటున్నావ్ అసలు నీ శత్రువు వాడా నువ్వా రాఘవుకి ఇప్పుడు ఆ ముసలాయన ఒక సాధారణ మనిషిలా కనిపించడం లేదు ఒక గురువులా అనిపిస్తున్నాడు. అతను చాలా మామూలుగా చెప్తున్న మాటలు భగవద్గీతలా అనిపిస్తున్నాయి. రాఘవు అడిగాడు మరి మనల్ని మోసం చేసిన వాళ్ళని అలా వదిలేయాలా వాళ్ళకి శిక్ష పడకూడదా ముసలాయన అన్నాడు శిక్ష పడకూడదని ఎవరు అన్నారు కచ్చితంగా పడుతుంది కానీ ఆ శిక్ష వేయటానికి నువ్వు ఎవరు ఎవరు తప్పు చేశారో ఎవరికి ఏ శిక్ష పడాలో అది ఆ భగవంతుడు చూసుకుంటాడు అదే కర్మ సిద్ధాంతం మనం చేసే ప్రతి పని మనతోనే ఉంటుంది మంచి చేస్తే మంచి చెడు చేస్తే
(07:59) చెడు ఏదో ఒక రోజు తిరిగి మన దగ్గరికే వస్తుంది ఇది ఎవరు ఆపలేని నియమం నువ్వు వాడిని శిక్షించాల్సిన అవసరం లేదు వాడి కర్మ వాడిని శిక్షిస్తుంది నీ పని ఏంటంటే ఎవరి మీద ద్వేషం లేకుండా ఆ భగవంతుడు ఇచ్చిన ఈ జీవితాన్ని ప్రశాంతంగా బతకటం అంతే పట్టుకోవటం వదిలేయటం ఇవన్నీ మన చేతుల్లో లేవు మనం ఎవరం ఒకరి తలరాతని రాయటానికి అంతా చెప్పాక ముసలాయన లేచాడు తన సంచి తీసుకొని నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు రాఘవు అక్కడే నిలబడిపోయాడు సరిగ్గా అప్పుడే గుళలో నుంచి వైభవ కుటుంబం బయటికి వచ్చింది.
(08:32) రాఘవు చూశడు చెయ్యి రివాల్వర్ దగ్గరికి వెళ్ళింది కానీ వైభవం చూసి రాఘవు చెయ్యి ఆగిపోయింది. అక్కడ వైభవుకి ఒక కాలు లేదు ఏదో ప్రమాదంలో పోయినట్టు ఉంది ఒక కర్ర సాయంతో కుంటుకుంటూ నడుస్తున్నాడు అతని భార్య అతన్ని పట్టుకొని జాగ్రత్తగా నడిపిస్తుంది. రాఘవు నిలబడి చూశడు ఆ మనిషి ఒకప్పుడు దర్జాగా రెండు కాళ్ళ మీద నడిచాడు ఇవాళ ఒక కర్ర సహాయం లేకుండా అడుగు కూడా వేయలేడు.
(08:54) ముసలాయన మాట గుర్తొచ్చింది తప్పు చేసిన వాడిని ఆ దేవుడే శిక్షిస్తాడు అది నిజమే అనిపించింది. రాఘవు శిక్ష వేయాల్సిన అవసరమే లేదు వైభవ కర్మ అప్పటికే వైభవుని శిక్షించడం మొదలు పెట్టింది ఆ క్షణంలో రాఘవకి ఒక పెద్ద నిజం అర్థమయింది ఆ శిక్ష వేయడానికి నేనెవరు నేను గనుక ఇప్పుడు వైభవ కుటుంబాన్ని చంపితే అప్పుడు నేను ఇంకో తప్పు చేసిన వాడిని అవుతాను దానికి మళ్ళీ నేను శిక్ష అనుభవించాలి మళ్ళీ జైలుకి వెళ్ళాలి మళ్ళీ నా భార్య నా పిల్లలకి దూరం కావాలి.
(09:22) ఇన్నాళ్ళు నేను జైల్లో నా కుటుంబానికి దూరంగా ఉన్నాను అంటే అది ఏ కర్మ ఫలితమో ఏమో కచ్చితంగా అది ఎప్పుడో నేను చేసిన తప్పుకు శిక్ష అయి ఉంటుంది ఇప్పుడు దాన్ని దాటి బయటికి వచ్చాను ఇప్పుడు మళ్ళీ ఈ పగ కోసం ఒక తప్పు చేస్తే మళ్ళీ అదే జైలు మళ్ళీ అదే దూరం అప్పుడు నేను జైలుకి వెళ్ళడానికి కారణం వైభవ్ కానీ ఇప్పుడు నేను మళ్ళీ జైలుకి వెళ్తే దానికి కారణం వైభవ్ కాదు నా పగ నా పగే నన్ను మళ్ళీ నా కుటుంబానికి దూరం చేస్తుంది అంటే నా అసలు శత్రువు వైభవు కాదు నా పగే నా అసలు శత్రువు ఆ ఆలోచన రాగానే రాఘవు చేతులు వణకాయి రివాల్వర్ పక్కనే ఉన్న పొదల్లో విసిరేసాడు ఆ ఒక్క క్షణంలో రివాల్వర్ తో
(09:56) పాటు ఇన్నేళ్ళు మోసిన ఆ పగని కూడా అక్కడే వదిలేసాడు. అతని భుజాల మీద నుంచి కొన్నంత బరువు దిగిపోయింది రాఘవ వెనక్కి తిరిగాడు. వైభవ వైపు కాదు తన ఇంటి వైపు ఇన్నేళ్ళు తన కోసం ఎదురుచూస్తున్న భార్య పిల్లల దగ్గరికి మొదటిసారి అతని కళ్ళల్లో పగలేదు ప్రశాంతత ఉంది. కాత ఇక్కడితో అయిపోయింది ఇప్పుడు మన సంగతి మాట్లాడుకుందాం మనందరి జీవితంలో ఒక వైభవం ఉంటాడు మనల్ని మోసం చేసినవాడు మోసగించినవాడు అవమానించినవాడు నొప్పించినవాడు వాడి మీద మనకు పగ ఉంటుంది అది సహజం అది తప్పు కాదు కానీ ఒక్క విషయం మనం అర్థం చేసుకోవాలి ఆ పగ మనం ఎంతకాలం మోస్తామో అంతకాలం మనం బతకడం లేదు
(10:29) కాలుతున్నాం. వాడు మనకు అన్యాయం చేసింది ఒక్కసారి కానీ ఆ పగని పట్టుకొని మనం మనల్ని బాధ పెట్టుకుంటుంది ప్రతిరోజు వాడు మనల్ని ఒక్కసారి గాయపరిచాడు కానీ ఆ గాయాన్ని మనం రోజు గెలుక్కుంటున్నాం. ఇక్కడ ఒక చివరి ఇంగ్లీష్ మాట చెప్తాను ద వీక్ కెన్ నెవర్ ఫర్గివ్ ఫర్గివ్నెస్ ఇస్ ద ఆట్రిబ్యూట్ ఆఫ్ ద స్ట్రాంగ్ ఇది మహాత్మా గాంధీ అన్న మాట అంటే బలహీనులు ఎప్పటికీ క్షమించలేరు క్షమించడం అనేది బలవంతుల లక్షణం పగతీర్చుకోవడం బలం కాదు పగని వదిలేయడమే అసలైన బలం ఇప్పుడు మనం నిర్ణయించుకోవాలి మనం బలవంతులమా బలహీనులమా అయితే మరి మనకు అన్యాయం చేసిన వాళ్ళని
(11:03) శిక్ష పడకుండా అలా వదిలేయాలా లేదు కథల ముసల ఆయన చెప్పాడు కదా కచ్చితంగా శిక్ష పడుతుంది కానీ ఆ శిక్ష వేయాల్సింది మనం కాదు ఎవరు ఏ తప్పు తప్పు చేశారో ఎవరికి ఏ శిక్ష పడాలో అది కర్మ చూసుకుంటుంది ఆ భగవంతుడు చూసుకుంటాడు. ఒకరి తలరాతన రాయడానికి మనం ఎవరం ఒకరికి శిక్ష వేయడానికి మనం ఎవరం మన పని ఒక్కటే ఎవరి మీద ద్వేషం లేకుండా మన జీవితాన్ని ప్రశాంతంగా జీవించడం గుర్తుంచుకోండి క్షమించడం అంటే మనం వెనకడుగు వేయడం కాదు వాడు గెలిచాడని ఒప్పుకోవడం కాదు మనం ఓడిపోవడం అస్సలు కాదు క్షమించడం అంటే నా మనశశాంతిని ఇక నీకు తాకట్టు పెట్టను నా జీవితాన్ని నేను తిరిగి తీసుకుంటాను అని
(11:37) గట్టిగా చెప్పటం మీరు ఎవరి మీదైనా ఆ పగని మోస్తున్నారా ఒక్కసారి ఆలోచించండి ఆ పగ వాళ్ళని ఏం చేస్తుంది ఏమీ చేయడం లేదు వాళ్ళు హాయిగా ఉన్నారు కానీ ఆ పగ మిమ్మల్ని రోజు కాల్చేస్తుంది. ఆ నిప్పు కణకని ఇంక ఎంత కాలం చేతిలో పట్టుకుంటారు ఇవాళే దాన్ని కింద పెట్టండి వదిలేయండి. మీకోసం మీ మనశశాంతి కోసం మీ కుటుంబం కోసం ఎందుకంటే పగని వదిలేసిన క్షణం మీరు ఓడిపోరు మొదటిసారి నిజంగా గెలుస్తారు.
(12:00) మీ జీవితంలో మీరు ఎవరినైనా క్షమించి మనసుని తేలిక చేసుకున్న క్షణం ఉంటే ఆ అనుభవాన్ని కామెంట్స్ లో రాయండి అది ఇంకెవరికో బరువు తించుకునే ధైర్యాన్ని ఇస్తుంది. మరో పవర్ఫుల్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. గుర్తుంచుకోండి ఎవరి మీద పగ పెట్టుకోకండి ఆ నిప్పుని కింద పెట్టండి ప్రశాంతంగా బతకండి కలుద్దాం జై హింద్ జై శ్రీరామ్
No comments:
Post a Comment