Saturday, July 11, 2026

ఆజ్ఞా చక్రం రహస్యం: నుదిటిపై బొట్టు పెట్టుకోవడం వెనుక ఉన్న అసలైన సైన్స్! | Third Eye Secrets

ఆజ్ఞా చక్రం రహస్యం: నుదిటిపై బొట్టు పెట్టుకోవడం వెనుక ఉన్న అసలైన సైన్స్! | Third Eye Secrets

Author Name:Daily Inspire Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@DailyInspireTelugu-y2s

Youtube Video URL:https://www.youtube.com/watch?v=5e5X-sCwS8A



Transcript:
(00:00) సనాతన ధర్మంలో మనం చేసే ప్రతి చిన్న ఆచారంలోనూ ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యం దాన్ని మించిన సైన్స్ దాగి ఉన్నాయి. మన ఇంట్లో పెద్దవాళ్ళు నుదిటిపై బొట్టు లేకుండా బయటకు వెళ్ళకూడదు అంటారు. ఎందుకు కేవలం సాంప్రదాయమా అలంకారమా కాదు మనం బొట్టు పెట్టుకునే ఆ స్థానమే మన శరీరంలో ఉన్న అత్యంత శక్తివంతమైన ఆరవ కేంద్రం అదే ఆజ్ఞ చక్రం.
(00:29) జీవితంలో ఎప్పుడైనా మీకు ఇలా అనిపించిందా ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక మైండ్ అంతా కన్ఫ్యూజ్ అయిపోవడం ఎంత చదివినా ఎంత కష్టపడిన బుర్రకెక్కక పోవడం అసలు నా లైఫ్ ఎటు వెళ్తోంది అనే గందరగోళం మన చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచాన్ని చూడడానికి దేవుడు మనకి రెండు కళ్ళ ఇచ్చాడు. కానీ మన లోపల ఉన్న ఈ అంధకారాన్ని తుడిచేసి జీవితంలో ఒక పర్ఫెక్ట్ క్లారిటీ ఇచ్చే మూడో కన్ను మనలోనే దాగి ఉంది.
(00:54) దాన్నే ఆజ్ఞ చక్రం లేదా థర్డ్ ఐ అని అంటారు. ఈరోజు ఈ ఒక్క బొట్టు వెనకున్న ఆధ్యాత్మిక సత్యాన్ని సైన్స్ కారణాన్ని మరియు ఈ చక్రం యొక్క అనంతమైన శక్తులను తెలుసుకుంటే మన సనాతన సంస్కృతి పట్ల మీ గుండె గర్వంతో ఉప్పొంగిపోతుంది. వీడియో లో ఇంకాస్త ముందుకు వెళ్లే ముందు మీరు మొదటిసారి నా ఛానల్ ని చూస్తున్నట్లయితే ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.
(01:23) వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ గా ఒక చిన్న కామెంట్ పెట్టండి. పూజ చేసేటప్పుడు మనం ఉంగరపు వేలుతో ఆజ్ఞ చక్రం పై తిలకం దిద్దుతాం. మన నాడుల వ్యవస్థ ప్రకారం ఉంగరపు వేలు నేరుగా హృదయానికి కనెక్ట్ అయి ఉంటుంది. అలా బొట్టు పెట్టడం ద్వారా మనలోని అహంకారం కరిగిపోయి నేను బాహ్య ప్రపంచాన్ని చూస్తూ నా జీవితాన్ని వృధా చేసుకోను నా దృష్టి ఎప్పుడూ నా లోపల ఉన్న శివతత్వం వైపే ఉంటుంది అని మనకి మనమే గుర్తు చేసుకోవడం.
(01:50) మెడికల్ సైన్స్ ప్రకారం మనం బొట్టు పెట్టుకునే స్థానంలో మన ముఖానికి సంబంధించిన నాడులన్నీ కలిసే ఒక ముఖ్యమైన జంక్షన్ ఉంటుంది. మనం బొట్టు పెట్టుకునే ఈ రెండు కనుబొమ్మల మధ్య ఉండే ప్రాంతాన్ని గ్లాబెల్లా అంటారు. ఈ భాగం చర్మం కింద ముఖానికి సంబంధించిన నరాల శేఖలు ముఖ్యంగా ట్రైజెమినల్ నర్వ్ శేఖలు ఉంటాయి. ఈ ప్రాంతాన్ని స్వల్పంగా తాకడం లేదా వత్తడం వల్ల అక్కడి సెన్సరీ నరాలు ప్రేరేపించబడతాయి.
(02:19) అందుకే చాలామందికి ఈ భాగాన్ని మెల్లగా మసాజ్ చేస్తే ప్రశాంతంగా అనిపించడం ఏకాగ్రత పెరిగిన భావన కలగడం వంటి అనుభూతులు కలుగుతాయి. అందుకే భారతీయ సంప్రదాయంలో ఈ స్థానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఇచ్చారు. మనం బొట్టు పెట్టుకునేటప్పుడు ఆ స్థానాన్ని స్వల్పంగా ప్రెస్ చేసినప్పుడు అక్కడ ఉండే నరాలు ప్రేరేపించబడి మెదడుకు రక్త ప్రసరణ పెరుగుతుంది.
(02:43) దీనివల్ల తలనొప్పి, మైగ్రేన్, మానసిక ఒత్తిడి వంటివి తక్షణమే తగ్గుతాయి. మనిషి తీవ్రంగా ఆలోచిస్తున్నప్పుడు లేదా కోపగించుకున్నప్పుడు అత్యధిక శక్తి ఈ నుదిటి భాగం నుండే వేడి రూపంలో బయటకు నష్టపోతుంది. అక్కడ కుంకుమ లేదా చందనం పెట్టడం వల్ల ఆ స్థానం చల్లబడి శరీరంలోని పాజిటివ్ ఎనర్జీ బయటకు పోకుండా లాక్ చేయబడుతుంది.
(03:06) ఇప్పుడు ఈ ఆరవ చక్రం యొక్క ప్రాథమిక తత్వాలను లోతుగా అర్థం చేసుకుందాం. ఆజ్ఞ చక్రం యొక్క రంగు ఇండిగో బ్లూ ఇది అనంతమైన విశ్వానికి అంతరజ్ఞానానికి ప్రతీక. ఈ చక్రానికి చిహ్నంగా రెండు రేకులు ఉన్న తామర పువ్వు ఉంటుంది. ఈ రెండు రేకులు దేన్ని సూచిస్తాయో తెలుసా మన శరీరంలో ప్రవహించే ముఖ్యమైన నాడులు ఈడ మరియు పింగడ అంటే మన ఎడమ మరియు కుడి శ్వాస మార్గాలు.
(03:31) ఒక రకంగా చెప్పాలంటే మనలోని లాజికల్ మైండ్ మరియు క్రియేటివ్ మైండ్. ఈ రెండు కలిసే సంగమ స్థానమే ఆజ్ఞ చక్రం సృష్టిలో పంచభూతాలైన నింగి నేల నీరు నిప్పు గాలి ఆ మహాదేవుని ఆధీనంలో ఉన్నట్లే మన శరీరంలోని పంచ చక్రాలు కూడా ఈ ఆజ్ఞ చక్ర ఆధీనంలో ఉంటాయి. దీని ప్రాథమిక తత్వం మనస్సు కింద ఉన్న ఐదు చక్రాలు పంచభూతాలకు సంబంధించినవి.
(03:59) కానీ ఈ ఐదింటిని దాటి వాటన్నింటిని శాసించే మనసు తత్వమే ఆజ్ఞ చక్రం అందుకే దీనికి ఆజ్ఞ అని పేరు వచ్చింది. ఇక్కడి నుండే మన ఇంద్రియాలకు ఆలోచనలకు కమాండ్స్ అందుతాయి. దీని బీజ మంత్రం సృష్టి యొక్క మూల శబ్దమైన ఓంకారం ఏ ఏరియాలో అయితే సైన్స్ ఆగిపోతుందో అక్కడ ఆధ్యాత్మికత మొదలవుతుంది. మన శరీరం లోపల మూలాధార చక్రంలో నిద్రిస్తున్న ఆ పరాశక్తి దాన్నే మనం కుండలిని శక్తి అంటాం.
(04:31) అది మేల్కొని ఐదవ చక్రమైన విశుద్ధ చక్రం వరకు చేరుకోవడం ఒకఎత్తు కానీ ఆ విశుద్ధ చక్రం నుండి ఆరవ చక్రమైన ఆజ్ఞ చక్రం చేరుకోవడం అనేది ఈ సృష్టిలోనే అత్యంత పవిత్రమైన కఠినమైన ఆధ్యాత్మిక ప్రయాణం ఈడ మరియు పింగళా నాడులు ప్రయాణించి సరిగ్గా మన బృటి స్థానంలో లయమైపోయినప్పుడు మధ్యలో ఉండే సుషుమ్నా నాడి తెరుచుకుంటుంది. ఆ సంగమ స్థానంలోకి కుండలిని శక్తి ప్రవేశించినప్పుడు సాధకుడి శ్వాస పూర్తిగా నిలిచిపోతుంది.
(05:01) అంటే శ్వాసతో పనిలేని కాలంతో పనిలేని ఒక దివ్యమైన స్థితిలోకి ఆత్మ ప్రవేశిస్తుంది. అప్పటివరకు బాహ్య ప్రపంచాన్ని చూసిన మనిషి మొదటిసారి తనను తాను చూసుకోవడం ప్రారంభిస్తాడు. అసలు ఆజ్ఞ చక్రాన్ని శివనేత్రం అని ఎందుకు అంటారో తెలుసా? ఇక్కడే అసలైన ఆధ్యాత్మిక రహస్యం ఉంది. సృష్టిలో పురుష శక్తి శివుడు ప్రకృతి శక్తి పార్వతి మూలాధారంలో ఉన్న కుండలిని శక్తి పార్వతీ దేవి రూపం ఆమె తన భర్త అయిన పరమశివుడిని కలవడానికి చేసే ప్రయాణమే ఈ చక్రాల సాధన ఆజ్ఞా చక్రమే పరమశివుని నివాసం గుర్తుంచుకోండి ఆజ్ఞా చక్రమే పరమశివుని నివాసం ఎప్పుడైతే ఈ కుండలిని
(05:43) శక్తి ఆజ్ఞ చక్రాన్ని తాగుతుందో అప్పుడు జీవాత్మ పరమాత్మల కలయక జరుగుతుంది. ఇక్కడికి చేరాక సాధకుడిలో అహంకారం పూర్తిగా భస్మం అయిపోతుంది. శివుడు మన్మధుడిని తన మూడవ కంటితో భస్మం చేశాడు అంటే కామాన్ని లౌకిక కోరికలను ఈ చక్రం వద్దకు వచ్చేసరికి జ్ఞానాగ్నితో కాల్చేయాలని అంతరార్థం. ఇక్కడ సాధకుడికి దివ్య దృష్టి అంటే సిక్స్త్ సెన్స్ లభిస్తుంది.
(06:12) ఎదుటి మనిషి మనసులో ఏముందో కళ్ళతో చూసి చెప్పేయగలడు. ఎందుకంటే అతను మనసును దాటి ఆత్మ స్థితికి చేరుకున్నాడు. మరి అంతటి పవర్ఫుల్ ఆజ్ఞ చక్రాన్ని ఎలా మేలుకొలపాలి దీనికోసం మనం అడవులకి వెళ్ళక్కర్లేదు. మన ఇంట్లోనే కొన్ని నియమాలు పాటించాలి. ధ్యానంలో కూర్చొని దీని బీజ మంత్రమైన ఓంకారాన్ని రోజుకు 27, 44 లేదా 108 సార్లు పూర్ణాత్మతో జపించాలి. ఆ వైబ్రేషన్స్ నేరుగా మీ నుదిటి భాగాన్ని యాక్టివేట్ చేస్తాయి.
(06:43) ఒక దీపం వెలిగించి ఆ జ్యోతి వైపు కనురెప్ప వేయకుండా నిలకడగా చూస్తూ ధ్యానం చేయడం వల్ల ఏకాగ్రత అద్భుతంగా పెరుగుతుంది. దీన్నే త్రాటక సాధన అంటారు. కెమికల్స్ ఎక్కువగా ఉండే జంక్ ఫుడ్ కు దూరంగా ఉండండి. ఈ చక్రం రంగు ఇండిగో కాబట్టి నల్ల ద్రాక్ష బ్లూబెర్రీస్ తాజా పండ్లు పచ్చి కూరగాయలు లాంటి క్లీన్ ఫుడ్ మాత్రమే తీసుకోండి. రాత్రిపూట ఫోన్ పక్కన పెట్టి గాఢమైన చీకటి గదిలోఏడు నుండిఎనిమిది గంటలు నిద్రపోవడం వల్ల మెదడులోని పీనియల్ గ్రంధి రీచార్జ్ అవుతుంది.
(07:17) ఈ సాధనాలన్నీ ఒకే రోజులో రిజల్ట్ ఇవ్వవు. పట్టుదలగా క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తే మీ జీవితంలో అంతులేని ప్రశాంతత క్లారిటీ రావడం మీరే గమనిస్తారు. శరీరానికి ఉన్న హద్దుల్ని దాటి దైవత్వంలో కలిసిపోయే అద్భుతమైన ముక్తిమార్గ సారాంశమే ఈ ఆజ్ఞ చక్రం. ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. బయటి కళ్ళు ఈ ప్రపంచాన్ని చూపిస్తాయి. కానీ మీ మూడో కన్ను అయిన ఈ ఆజ్ఞ చక్రం నీ అసలు స్వరూపాన్ని ఆ పరమశివుడిని నీలోనే చూపిస్తుంది.
(07:46) మీలోని దైవత్వాన్ని మేల్కొల్పే ఈ పవిత్రమైన జర్నీని ఈ రోజు నుండే ప్రారంభించండి. ఈ ఆధ్యాత్మిక రహస్యం మీ హృదయాన్ని తాకితే ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులతో స్నేహితులతో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హర హర మహాదేవ్.

No comments:

Post a Comment