కుండలిని సిండ్రోమ్!? for pyramid, kriya yoga practitioners, kundalini lovers and spiritual seekers.
Author Name:ధ్యాన పాఠశాల
Youtube Channel Url:https://www.youtube.com/@%E0%B0%A7%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A8-%E0%B0%AA%E0%B0%BE%E0%B0%A0%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B2
Youtube Video URL:https://www.youtube.com/watch?v=D8ltEnpY2KY
Transcript:
(00:07) కుండల్ని శక్తి మేలుకుంటే అద్భుతం జరుగుతుంది. అది ఒక్కొక్క చక్రంలోకి ప్రవేశిస్తూ ఉద్ధవగమనం చెందుతున్నప్పుడు గొప్ప గొప్ప దివ్యానుభూతులు కలుగుతాయి అనే ఆశతో కొంతమంది విషయాన్ని పూర్తిగా తెలుసుకోకుండా కేవలం ఆరాటం ఉమలాటంతో ఆ కుండల్ని శక్తిని జాగృతం చేయాలని ప్రయత్నిస్తారు. లేనిపోని సమస్యలని కొనితెచ్చుకుంటారు.
(00:30) వాళ్ళకు వచ్చే ఎన్నో శారీరక మానసిక రుగ్మతలకు వైద్యుల పరిభాషలో పేరే కుండల్ని సిండ్రోమ్ ఇంతకీ వాళ్ళు చేసినటువంటి ఆ తప్పులు ఏమిటి వాళ్ళకు ఉన్నటువంటి ఆ అపోహలు ఏమిటి అసలు వాళ్ళకు వచ్చిన ఆ రుగ్మతలు ఏమిటి అలాంటి కొంతమంది విచిత్ర సాధకుల వింత కథలని ఈరోజు మనం తెలుసుకుందాం. మనము కుండలిని కథ అనే వీడియోలో చర్చించాం మనసే కుండలిని అని దాన్ని ఒప్పుకొని వాళ్ళకి నేను ఒకే ప్రశ్న వేస్తాను మనస్సు అంటే ఏమిటో తెలుసా అది ఎక్కడఉందో తెలుసా అది ఎలా ఉంటుందో తెలుసా ఎవ్వరికీ తెలియదు కానీ మనసు ఏం చేస్తుందో మాత్రం అందరికీ తెలుసు అదే మనసుకు ఉన్నటువంటి మాయాశక్తి మనసుకు ఉన్నటువంటి ఈ
(01:11) గొప్పతనాన్ని మనం ఎందుకు గమనించలేకపోతున్నాం అంటే మనసు నానా రకాలైనటువంటి ఆలోచనలుగా నానా రకాలైనటువంటి కోరికలుగా వ్యాపకాలుగా చికాకులు చింతలుగా చెదిరిపోయి ఉన్నది. ఆ చెదిరిపోయిన మనసుని మనం ఒక దగ్గరికి తీసుకురావాలి. అలాంటి ఏకాగ్రతను సాధిస్తే అందులోనుంచి ఒక గొప్ప శక్తి పుడుతుంది. దాన్నే తాంత్రికులు కుండల్ని శక్తి అన్నారు ఆధునికులు విశ్వశక్తి అంటున్నారు ఇంకొకళ్ళు ఇంకో పేరుతో పిలవచ్చు అలా ఏకాగ్రతను పొందుతున్నప్పుడు మనసులోని మలినాలు నెమ్మదిగా నశిస్తాయి.
(01:45) అది అంతర్ముఖమై ఉత్తమ స్థితులను పొందుతుంది. ఆ మనసు పొందే స్థితులనే తాంత్రికుల చక్రాలు అని పిలిచారు. ఈ తాంత్రికుల భావనలైనటువంటి ఈ కుండల్ని షట్చక్రాల అనేవి యోగంలోకి ఎలా ప్రవేశించాయి అంటే హటయోగ ప్రదీపిక ద్వారా ఈ హటయోగుల దగ్గరికి కుండల్ని చేరంగానే అది పెద్ద ప్రమాదాన్ని సంతరించుకున్నది ఎందుకంటే ఇక మనసుతో అవసరం లేకుండా చిత్తశుద్ధితో అవసరం లేకుండా కేవలం శరీర కర్మలతోనే బంధాలు ప్రాణాయామాలు ఆసనాలు వీటితోనే కుండల శక్తిని మేలుకొలపడము ఊర్ధ్వగమనం చెందించడం సాధ్యము అనే తప్పుడు భావన వాళ్ళ దగ్గరే మొదలైంది అది గొప్ప ప్రమాదానికి దారి తీస్తుందని
(02:25) అర్థం చేసుకున్న ఆరంభకులు ఏదో తరుడైన మేలుకొలపాలి ఏదో అద్భుతాలను చూడాలి అనే అపోహలతో అజ్ఞానంతో ఈ కుండలన శక్తిని మేలుకొలుపుదామని అతిగా ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే మొట్టమొదటగా ఈ ఆసన ప్రాణాయామాలను మిత్తిమీరి అభ్యాసం చేస్తారు. ప్రాణాయామం అనేది మనసుని ఏకాగ్రం చేయడానికి కొంతవరకు ఉపయోగపడుతుంది కానీ మితిమీరి చేస్తే అది ప్రమాదాలకు దారితీస్తుంది.
(02:57) ఎందుకంటే మితిమీరిన ప్రాణాయామంతో అమితమైన వేడి పుడుతుంది శరీరంలో ఆ వేడి అనేది మన మెదడుని నరాల వ్యవస్థని కొంతవరకు నష్టం చేస్తుంది. కాబట్టి ఈ ప్రాణాయామం అనేది మితంగా చేస్తే అదొక వరము మితిమీరు చేస్తే అతికి పోతే అదే గొప్ప శాపంగా మారుతుంది. ఈ ఆసనాలను అతిగా అభ్యాసం చేయడం అనేది కూడా మంచిది కాదు. అవి కూడా ఆరోగ్యానికి కొంతవరకు మేలు చేస్తాయి కానీ ఆసనాల మీద విపరీతంగా దృష్టి పెడితే ఏమవుతుందంటే దేహ ధ్యాస పెరిగిపోతుంది.
(03:27) మనం ధ్యానం చేసేది ఈ శరీరాన్ని మించిపోయి ఆత్మలోకి వెళ్ళాలంటే ఈ శరీరాన్ని మర్చిపోవాలని ధ్యానం చేస్తున్నాం. అలాంటప్పుడు ఈ శరీర ధ్యాసను పెంచుకుంటే ఎలా ఉంటుందంటే ముందుకు వెళ్ళడానికి బదులుగా వెనక్కి వెళ్ళినట్టుగా ఉంటుంది అంటే పురోగమనానికి బదులుగా తిరోగమనం అదిగాక ఈ దేహధ్యాస అధికంగా ఉన్న వాళ్ళకి భోగాసక్తి ఎక్కువగా ఉన్నవాళ్ళకి కుండల్ని శక్తి ఎక్కడ ఉంటుంది కిందన్న రెండు చక్రాల్లోనే కదా అతి కష్టం మీద అది మూడో చక్రానికి చేరుతుంది కదా మరి అలాంటి వాళ్ళు ఈ కుండల్ని శక్తిని మేలుకొలపాలి లేకపోతే ఊర్దోగమనం చెందించాలి పైకి తీసుకురావాలి అని కోరడం ఎంతవరకు
(04:01) సమంజసం ఇక ఈ ఆరంభకులు చేసేటువంటి రెండో తప్పు ఏమిటంటే కొన్ని రకాల ధ్యానాలని అతిగా అభ్యాసం చేస్తారు. అవి ఏంటంటే కుండలిని భావన చేయటము చక్రాలను భావన చేయటము భ్రూమధ్యంలో దృష్టి నిలపడము సహస్రారంలో దృష్టి నిలపడమ ఇలాంటివి అన్నమాట. ఈ ప్రాణాయామం అయినా ధ్యానాలైనా సరే విసుగు పుడితే మానేయాలి లేదనుకోండి మెదడు మీద తీవ్రమైన ఒత్తిడి పడుతుంది.
(04:26) ఈ ధ్యానాలు ఎలాంటివి అంటే ప్రాణాయామం లాంటివే అవన్నీ ఎందుకు పనికి వస్తాయి అంటే మనసుని కొంతసేపు స్తంభింప చేయడానికి పనికి వస్తాయి అంటే బలవంతంగా మనసుని ఒకచోట కూర్చోబెట్టడం అన్నమాట అంతకుమించి మనసులో అంతర్గతంగా శాశ్వతమైన మార్పు తీసుకురావడానికి ఈ ధ్యానాలు పనికిరావు ఈ భూమధ్యంలో చూడటం సహస్రారంలో చూడటం నాసికాగ్రాన్ని గమనించడం త్రాటకం అంటే కొంత దూరంలో ఉన్నటువంటి ఒక వస్తువు మీద దృష్టిని కేంద్రీకరించటం ఇవన్నీ కూడా మానసిక చంచలత్వానికి తాత్కాలిక పరిష్కారాలు గాని శాశ్వతమైనటువంటి సమాధానాలు కావు శాశ్వతమైన అంతర్గతమైనటువంటి మార్పును అవి
(05:02) తీసుకురాలేవు మనసుని ఏకాగ్రం చేయలేవు మనసును శుద్ధం కూడా చేయలేవు అవి చేస్తున్నంతసేపు మనసు కుదురుగా ఒక దగ్గర ఉన్నట్టుగా కనిపిస్తుంది అంతే ఒకసారి వాటిని మానేసామ అనుకోండి ప్రాణాయామాన్ని మానేసామ అనుకోండి మళ్ళీ యధా ప్రకారంగా మనసు చంచలంగా ప్రవర్తించడం మొదలు మొదలు పెడుతుంది కోతి చేష్టలు మొదలు పెడుతుంది అంతేగాన అందులో శాశ్వతమైనటువంటి మార్పు రాదు కానీ మరి భగవద్గీతలో చెప్పారే శ్రీకృష్ణ భగవానుడు భూమధ్యంలో చూడమని అంటే భగవానుడు అదిఒక్కటేనా చెప్పింది ఆయన చెప్పింది ఏంది ధ్యానానికి సరైన నిర్వచనం యతోయతో నిశ్చరతి మనస్చలమస్తరం తతస్తతోనియమేతత తత్మన్యేవ వషంనయేత
(05:37) ఎప్పుడెప్పుడైతే మనసు చంచలంగా ఉండి బయటికి పరిగెడుతుందో దాన్ని నెమ్మదిగా తీసుకొచ్చి అంతర్ముఖం చేసి లోపల ఉంచండి అది ధ్యానాభ్యాసం చేయడానికి భగవద్గీత చెప్పినటువంటి సరైన నిర్వచనం మరి భ్రూమధ్యంలో చూడండి నాసికాగ్రం మీద దృష్టి పెట్టండి అని ఎందుకు చెప్పారంటే ఆరంభకులు వాళ్ళు చేసే ఐదు నిమిషాల ధ్యానానికి కొద్దిగా రిలాక్స్ అవ్వడానికి మనసుని ఒక దగ్గర ఉంచడానికి అవి ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో చెప్పారు తప్ప ఇంకొకటి కాదు తర్వాత భగవద్గీతలో ధ్యానానికి మరెన్నో అద్భుతమైన ప్రక్రియలు ఉండగా ఆరంభకులకు వీటి మీదే దృష్టి ఎందుకు పోతుంది ఆలోచన
(06:13) చేయండి తర్వాత ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉన్నది సాధారణమైనటువంటి లౌకికడి కుండలిన శక్తి ఎక్కడ ఉంటుంది కిందన్న రెండు చక్రాల్లో ఉంటుంది అతి కష్టం మీద మూడో చక్రంలో ఉంటుంది అని చెప్పుకున్నాం కదా మరి అతడు పైకి రావాలంటే దేని మీద దృష్టి పెట్టాలి అనాహతం మీద దృష్టి పెట్టాలి అంతేగాన ఆజ్ఞా చక్రం మీద భ్రూమ మధ్యంలో సహస్రారంలో దృష్టి పెట్టడం ఎంతవరకు సమంజసమో అది అదః పాతాళంలో ఉన్నవాడు ఆకాశంలో ఎగరడానికి ప్రయత్నం చేయడం లాంటిది కదా దానివల్ల ప్రమాదాలు రావా దానివల్ల మెదడు మీద అత్యంత ఒత్తిడి పడదా ఇవేమి ఏమే ఆలోచించని ఆరంభకుల్లో కొంతమంది ఉంటారు
(06:49) వాళ్ళు ఒక సపరేట్ బ్యాచ్ అన్నమాట వాళ్ళు ఏం చేస్తారంటే డ్రగ్స్ తీసుకుంటారు ఎందుకంటే పతంజలి యోగ సూత్రాల్లోనే ఉన్నది ఔషధాల సేవనం వల్ల సమాధి స్థితిని పొందవచ్చును అని కాబట్టి వీళ్ళు కొన్ని డ్రగ్స్ ఉంటాయి సైకోడెలిక్ డ్రగ్స్ అంటారు. వాటి వల్ల ఏమవుతుందంటే మన చైతన్య స్థాయి మారుతుంది మనసులో మార్పులు వస్తాయి అని చెప్తారు.
(07:12) అంటే ప్రస్తుతం మనం ఒక చైతన్య స్థాయిలో ఉన్నాం నేను ఫలానా అని తెలుసు నాకుఒక గతం ఉన్నది భవిష్యత్తు మీద కొన్ని ఊహలు ఉన్నాయి ఒక వర్తమానం ఉన్నది దాని ద్వారా నాకు ఒక వ్యక్తిత్వం ఏర్పడుతుంది ఒక పర్సనాలిటీ దానికోసం నా మెదళలో కొన్ని నాడీ వ్యవస్థలు పనిచేస్తూ ఉంటాయి. అదే ఆ డ్రగ్స్ తీసుకున్నాం అనుకోండి ఒక కొత్త వ్యక్తిత్వం ఏర్పడింది అంటే ఒక కొత్త లోకంలో కొత్త ఊహా లోకంలో ఏదో జరగొచ్చు అట్లాంటిది దాన్ని వీళ్ళు మెథడ్లో పెట్టుకొని ఇక ఆ డ్రగ్స్ తీసుకోవడం మొదలు పెడతారు ఎంత అంటే కొంత ఇంతో అంతో కాదు విపరీతంగా డ్రగ్స్ ని తీసుకుంటారు అప్పుడు ఏమవుతుందంటే ఈ
(07:43) మెదడ్లో ఉన్నటువంటి నాడీ వ్యవస్థలు ఈ వ్యక్తిత్వాన్ని రూపొందిస్తున్నవి ఏమవుతాయి అంటే అవన్నీ చెదిరిపోయి చిందర అందరగా మారి ఆ డ్రగ్స్ అనే వరదలో కొట్టుకుపోతూ ఉంటాయి అంతా ఏకమైపోతుంది దాన్ని వాళ్ళు ఆత్మ సాక్షాత్కారం అంటారు. ఇలా తప్పు మీద తప్పు చేస్తూ ఈ ఆరంభకులు తమ నాడ వ్యవస్థ మీద మెదడు మీద అతిగా భారాన్ని వేసి దాన్ని చెడగొట్టుకునేదాకా వాళ్ళకి నిద్రపట్టదు ఇక వాళ్ళకి రకరకాల వింత మానసిక శారీరక రుగ్మతలు మొదలవుతాయి.
(08:17) అవి ఎలా ఉంటాయి అంటే వెన్నెముకలో ఏదో పాకినట్టుగా ఉండడము వెన్నెముకలో విపరీతమైన వేడి మెదడిలో విపరీతమైన వేడి శరీరంంతా మండిపోతున్నట్టుగా ఉండడం ఇలాంటి బాధలు మొదలవుతాయి. రెండోది ఈ శరీర అంగాలు అనేవి ఊగిపోతుంటాయి చేతులు కాళ్ళు ఊగిపోతుంటాయి మెడ అనే దానికంత ఊగిపోతుంటాయి మన ప్రమేయం ఏమి లేకుండానే అవే ఊగిపోతూ ఉంటాయి.
(08:38) ఇలాంటి అవస్థలు వాళ్ళకి కలుగుతాయి. ఇక మానసికంగా చూస్తే రకరకాల దృశ్యాలు చూడటం రకరకాల శబ్దాలు వినటము తీవ్రమైన స్ట్రెస్ యంజైటీ ఒత్తిడి ఆందోళనకు గురవ్వటం పానిక్ అటాక్స్ అంటే ఒక క్షణమేమో బాగుంటారు మరొక క్షణంలో విపరీతమైన భయానికి గురవుతారు హైపర్ సెన్సిటివిటీ అంటే వెలుగును చూసిన చీకటిని చూసిన జనాలను చూసిన వింత వింతగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు.
(09:03) ఇక ఈ బాధలన్నీ పడి మెదడింతగా చెడిపోయిన తర్వాత వాళ్ళకి నిద్ర ఏం పడుతుంది ఆ నిద్ర అనేది పూర్తిగా నాశనం అయిపోతుంది ఇక వాళ్ళకి నిద్రే పట్టదు. ఇంత బాధపడుతూ ఇన్ని మానసిక సంఘర్షణలు అనుభవించిన తర్వాత ఇంకా వాళ్ళకి చనిపోవాలనిపిస్తుంది జీవితం మీద విరక్తి కలుగుతుంది. సూయిసైడల్ థాట్స్ వస్తాయి ఈ రకంగా వాళ్ళు ఇన్ని వింత శారీరక మానసిక తుఫాన్లలో కొట్టుకుపోతా ఉంటాయి.
(09:25) దీనిని కొంతమంది ఏమంటారంటే ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ మీకు ఉండలన శక్తి మేలుకున్నది అది మీ లోపలని బాగు చేయడానికి ప్రయత్నం చేస్తున్నది. ఈ లక్షణాలను మీరు కొంతకాలం తట్టుకుంటే మీ సాధనలని కొనసాగిస్తే ఇవి నెమ్మదిగా తొలగిపోతాయి అని చెప్తారు. నిజమే మహాత్ముల జీవితాల్లోనూ ఇట్లాంటి లక్షణాలు కొన్ని కనిపించాయి కానీ అవి కనిపించినప్పుడు వాళ్ళు మరింతగా అంతర్ముఖులై తమ సాధనలో మరింతగా పురోగమించి వాటిని జయించారు.
(09:53) కానీ వీళ్ళు ఏం చేస్తారు ఈ బాధలని తట్టుకోలేక సాధనలు ఆపేయాలి లేకపోతే మామూలు స్థితికి ఎలా రావాలి ఆత్మహత్య చేసుకోవాలి ఇలాంటి ఆలోచనలో పడిపోతారు వీళ్ళు మహాత్ముల దగ్గర గొప్పతనం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు గతంలో చేసినటువంటి నిజమైన సాధన వల్ల వాళ్ళ మనోబలం అనేది అమితంగా పెరిగిపోయి ఉంటుంది ఇలాంటి సమస్యలు ఎన్ని వచ్చినా వాళ్ళు ఎదుర్కునే స్థితిలో వాళ్ళు ఉంటారు కానీ వీళ్ళు తమ తిక్కతిక్క సాధనల వల్ల వింతవింత పోకడల వల్ల తమ మెదడిని నారడీ వ్యవస్థని మనసుని బలహీనం చేసుకొని ఉంటారు కాబట్టి ఈ కష్టకాలంలో వాళ్ళకి అవి ఏమి ఉపయోగపడక వాళ్ళని మరింత అదః పాతాళంలోకి తొక్కేస్తూ
(10:31) ఉంటాయి. కాబట్టి వీళ్ళ రుగ్మతకి వాళ్ళ యొక్క బలానికి మనం పోలిక చెప్పకూడదు అది తప్పుఅవుతుంది. ఇక వీళ్ళ సంగతికి వస్తే కొంతమంది వివేకంతో కూడినటువంటి గురువులు ఉంటారు వాళ్ళకి ఈ సంగతి అర్థం అవుతుంది వీళ్ళకి సత్యం చెబితే అర్థం కాదని చెప్పి వాళ్ళు కొంత తిప్పి చెబుతారు ఏమని మీకు కుండల్ని శక్తి జాగృతమయింది అది పైకి పోలేక అవస్థ పడుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి దాన్ని కిందికి తీసుకొచ్చి మళ్ళీ ప్రశాంత పరచాలి దానికోసం ఏం చేయాలంటే మీరు మొట్టమొదటగా మీరు చేస్తున్న ఈ సాధనలన్నిటిని మానేయండి.
(11:04) రెండోది ఏంటంటే గ్రౌండింగ్ ఫుడ్స్ అంటే కిందికి తీసుకొచ్చే ఫుడ్స్ బరువైన ఆహార పదార్థాలు అంటే నేలలో కాసేటువంటి ఆలగడ్డలు దుప్పూరలు ఉంటాయి కదా వాటిని మరియు బలవర్ధకమైనటువంటి కొవ్వు పదార్థాలని మీరు ఎక్కువగా తీసుకోండి అని చెప్తారు. తర్వాత గ్రౌండింగ్ పని అంటే బరువైన పని చెప్పులు వేసుకోకుండా చాలా దూరం నడవటము తోట పనులు చేయడము బరువులు ఎత్తడటం ఇలాంటి బరువైన పనుల్ని చేయండి.
(11:32) తద్వారా ఏమవుతుంది అంటే మీకు మంచి విశ్రాంతి దొరుకుతుంది మీ సమస్యలనేవి తగ్గే అవకాశం ఉంది అని వాళ్ళ ఉద్దేశం అన్నమాట దాన్ని మనం వాడుక భాషలో చెప్పామ అనుకోండి దాని అర్థం ఏమిటంటే మీరు ఇన్నాళ్ళు ఏదో తిక్క తిక్క పనులు చేసి మీ మెదడిని కొంతగా చెడగొట్టుకున్నారు ఇక మీరు ఏం చేయాలంటే పౌష్టికాహారం తీసుకొని అధికమైన విశ్రాంతి తీసుకున్నారు అనుకోండి ఆ విశ్రాంతిలో మెదడు తనంతాను కొంత బాగు చేసుకుంటుంది మీ సమస్యలు కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.
(12:01) ఇలాంటి వింత పోకడలు కలిగినటువంటి విచిత్ర సాధకుల కథలు కొన్ని నేను విన్నాను కొంతమందితో నేను స్వయంగా మాట్లాడాను వాటిని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిది ఒక విదేశీ వనిత గురించి ఆ అమ్మాయికి కూడా కుండల్ని సాధన చేస్తున్నప్పుడు ఇలాంటి వింత లక్షణాలే కనిపించాయి శరీరంఅంతా వేడిగా ఉండడము శరీరంఅంతా ఊగిపోతుండడం ఇలాంటివన్నీ కనిపించాయి.
(12:27) ఆ అమ్మాయిని ఒకే ప్రశ్న అడిగారు మీరు ఎందుకు అసలు ఈ సాధనకు పోనుకున్నారు అంటే ఆవిడ ఒక వింత సమాధానం చెప్పారు నేను భగవంతుడి అవతారం స్థాయికి చేరాలనుకున్నాను అంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే కుండల శక్తి మేలుకుంటే తాను ఒక భగవంతుని అవతారంగా మారిపోతుంది చూడండి ఇలాంటి అపోహాలతో ఎంత గొప్ప సాధన చేస్తే మాత్రం ఏం లాభం వస్తుంది తర్వాత ఏం చేసింది ఆ అమ్మాయి ఆ లక్షణాలను పోగొట్టుకోవడానికి భగవంతుని ప్రార్థించడం మొదలు పెట్టింది ఈ కుండల్ని సాధనలు ఈ ప్రాణాయామాలు అతి ఆసనాలు అన్నిటిని వదిలేసి భగవంతుని ప్రార్థించడం ద్వారా ఆ రుగ్మతలన్నింటిని ఆ అమ్మాయి చాలా మరకు రూపు మాపుకొని ఇప్పుడు
(13:02) మామూలు స్థితికి చేరింది. ఇక రెండో కథ ఉన్నది చాలా ప్రసిద్ధం భారతదేశంలో కాశ్మీర్లో ఒకాయన ఉండేవాడు ఆయన దాదాపు 15 ఏళ్ల పాటు ధ్యానం చేశడు సీరియస్ గా ఒకరోజు ఆయనకి కుండల్ని జాగృతి అనుభూతి కలిగింది. ఎలా అంటే అది వెన్నుపూస గుండా ఒక వెండి ద్రవం పైకివచ్చి మెదడంతా పరుచుకున్నట్టుగా అనుభవం కలిగింది. అబ్బా గుండెలు జాగృతి కలిగింది ఇంకేమి అని మనం అనుకోవచ్చు కానీ ఆ తర్వాతే నరకం మొదలైంది ఆయనకి ఒళ్ళంతా విపరీతమైన మంట వేడి జీవితం మీద ఎలాంటి ఆసక్తి లేదు ఒకటే ఒత్తిడి ఆందోళన ఆయన తన గదికే పరిమితం అయిపోయాడు దాదాపు 12 ఏళ్ళు అలాంటి నరకాన్ని అనుభవించాను అని ఆయన ఒక
(13:43) పుస్తకంలో రాశడు. ఆ సమయంలో ఆయన ఇంటిని ఆయన భార్య ఓపికగా ప్రశాంతంగా పోషించింది. ఇప్పుడు అనిపిస్తుంది ఏంటంటే మనకి ఇలాంటి తిక్క తిక్క సాధనలు చేసి తలం జడగొట్టుకునే వాళ్ళం కన్నా అలా సాధారణమైన స్థితిలో ఉండి తమ ఓర్పుని ప్రశాంతతని కాపాడుకునే వాళ్లే ఎంతో గొప్పవాళ్ళు వాళ్లే నిజమైన యోగులు ఇక 12 ఏళ్ల తర్వాత ఈయనకు ఒక వింత విషయం జ్ఞాపకం వచ్చింది ఏంటంటే ఉండల్నే శక్తి సుషుమనాలోకి కాకుండా పింగళానాడిలోకి ప్రవేశించిందేమో అందుకే నాకు ఈ వేడి కలిగింది ఇక నుంచి నా దృష్టిని ఇడానాడి మీద పెడతాను అనుకున్నాడు అంటే దృష్టిని ఎడమవైపు శరీరంలో ఎడం వైపు కింది భాగంలో
(14:21) ఎడం వైపు మళ్ళంచాడు అంతే దాంతోనే ఆయన మంటలు తగ్గుముఖం పట్టాయట కొంత కాలానికి ఆయన సాధారణ స్థితికి వచ్చాడు. ఈ కథ వినడానికి చాలా బాగుంది కానీ ఇందులో కొన్ని లాజికల్ లోపాలు ఉన్నాయి ఏంటంటే కుండలిని శక్తి అనేది ఒక గుడ్డి గుర్రం లాంటిదో తాగుబోతో లేకపోతే తెలివి తక్కువ దద్దమ్మో కాదు అది జడమైన శక్తి కాదు అది దైవికమైనటువంటి శక్తి దానికి దైవికమైనటువంటి ఇంటెలిజెన్స్ బుద్ధి ఉన్నది అందుకే దాన్ని మనం దైవానుగ్రహం అంటాం.
(14:55) ఆ దైవానుగ్రహం ప్రసరించినప్పుడే ఆ శక్తి అనేది మేలుకుంటుంది. అంతేగన ఎవరికి పడితే వాళ్ళకి ఎప్పుడు పడితే అప్పుడు తెలివి లేకుండా ప్రవర్తించడానికి అదేమి ఒక తెలివి తక్కువ దద్దమ్మ కాదు ఒక దీపావళి టపాకాయ ఉందనుకోండి దాన్ని వెళ్లి ఎవరు ఎవరు వెలిగించినా పేలుతుంది అదే చిన్న పిల్లోడు వెలిగిస్తున్నాడే పేలితే అతడికి నష్టం కలుగుతుందే అని ఆ టపాకాయకు తెలియదు కానీ కుండల్ని శక్తికి తప్పకుండా తెలుసు అందుకే ఉపనిషత్తులో చెప్పారు ఆత్మ అనేది సాధకుడిని ఎంచుకుంటుంది అని కుండల్ని శక్తి ఎంచుకుంటుంది ఎవరిలో మేలుకోవాలి ఎవరి ఎవరి అర్హత ఎంత ఎవరికి ఎంత శుద్ధి ఉన్నది ఎవరికి ఎంత చిత్త శుద్ధి ఉన్నది
(15:29) అనేది కుండల్ని శక్తి నిర్ణయిస్తుంది అంతేగాన మనం అనుకున్నట్టుగా అది మేలుకోదు అదిఒక వింత విషయం ఆ కథలో ఉన్నటువంటి పెద్ద లోపం అదన్నమాట అది పింగళనాడిలోకి ప్రవేశించను ఒకటి శాస్త్రంలోనే ఉన్నది సుషుమ్న నాడి అనేది ఎప్పుడు మూసుకొని ఉంటుంది దాన్ని తెరిచిన తర్వాత మాత్రమే కుండల్ని జాగృతి కలుగుతుంది అది సుషుమ్నా నాడిలోకి ప్రవేశించి మెదడు పక్కగా వెళ్తుంది అని పింగళా నాడిలోకి ప్రవేశించడం ఏంటి అదొక వింత రెండోది ఏంటంటే కేవలం ఇడానాడి మీద దృష్టి పెట్టంగానే తలదనం మొదలైంది అంటే ఇడానాడిని యక్టివేట్ చేయడం అంత సులభమా అట్లాగయితే మనం శరీరం మధ్యలో దృష్టి పెడితే కుండలని
(16:07) యాక్టివేట్ అయిపోతుందా సుషుమన నాడు యాక్టివేట్ అయిపోతుందా ఎంత హాస్యాస్పదంగా ఉన్నది ఈ కథ చూడండి. ఇంతకన్నా ఇంకో గొప్ప హాస్యాస్పదం ఇందులో ఉన్నది ఏంటంటే 15 ఏళ్ళ ఆయన యోగ సాధన చేశడు ధ్యానం చేశడు అని చెప్పుకున్నాం కదా దేని మీద ధ్యానం చేశడయ్యా అంటే ఆయన చేసిన సహస్రారం మీద ధ్యానం చేశడు ఆయన దృష్టిని సహస్రారంలో ఉన్నటువంటి ఒక కమలం దాంట్లో ఒక వెలుగు ఉంది ఇలాంటి భావనల ధ్యానం చేశడని 15 ఏళ్ళ పాటు చూడండి ఇక ఆయనక వచ్చింది నిజమైన కుండలి జాగృత లేక కల్పన లేక నాడ వ్యవస్థలో నష్టమా ఇక మీరే ఆలోచించుకోండి తర్వాత ఇంకొ కథ ఉన్నది ఒకాయన ఆయన మాకు బంధువులే
(16:46) అవుతారు ఆయన ధ్యానం చేయడానికి ఒక సంకల్పాన్ని తీసుకున్నాడు. నేను నా సూక్ష్మ శరీరాన్ని దర్శిస్తాను అని చెప్పేసి ధ్యానం మొదలు పెట్టాడు. కొంతకాలం తర్వాత దర్శించాడు ఎవరిని ఇంటి పక్కనే ఉండే ఒక డాక్టర్ ని ఎందుకంటే ఆ పిచ్చి సంకల్పం పిచ్చి అపోహల ద్వారా ఆయనకి తలెత్తిన సమస్యలను తగ్గించుకోవాలంటే మరి ఆ డాక్టరే మందులు ఇవ్వాలి కదా ఇంకొక కథ ఉన్నది ఇందులో ఉన్నవాళ్ళ నేను స్వయంగా వాళ్ళతో మాట్లాడాను అన్నమాట ఒక అమ్మాయి ఆ అమ్మాయికి ఉన్నట్టుండి ఒక పురుగు తులిచింది మెదడిలో గ్రహాలకి శాంతి చేయాలి ఒక పుస్తకం ద్వారా ఈ గ్రహశాంతి మంత్రాలను
(17:19) సేకరించి ఉదయం నాలుగుింటికే లేచి శుభ్రంగా స్నానం చేసి ఈ మంత్రాలని జపించడం మొదలు పెట్టింది. కొంతకాలంలోనే ఆవిడలో వింత మార్పులు చోడు చేసుకున్నాయి శరీరంలో ఏవో వైబ్రేషన్స్ రావడం మొదలు పెట్టాయి దాంతో పాటుగా ఎవరేం మాట్లాడుకున్న తన గురించి ఆవిడకి తెలిసిపోయేది అలాంటి వింత శక్తులు కూడా వచ్చాయి అబ్బా ఆమెకి సిద్ధులు వచ్చాయి వైబ్రేషన్స్ వచ్చాయి అని అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు.
(17:45) కానీ తర్వాతే ఆమె జీవితం అస్తవ్యస్తం అయపోవడం మొదలు పెట్టింది. ఆవిడ వైవాహిక జీవితం విచ్చిన్నం అయిపోయి విదేశాల్లో ఉండే ఆవిడ ఈ స్వదేశానికి ఇండియాకి తిరిగి వచ్చింది తన తండ్రితో కలిసి ఈ సమస్యలని ఎవరు తగ్గిస్తారు ఈ వైబ్రేషన్లు ఎవరు తగ్గిస్తారు ఇవన్నీ నా జీవితాన్ని నార్మల్ ఎవరు చేస్తారు అని చెప్పి వెతుక్కోవడం మొదలు పెట్టింది.
(18:04) నేను అప్పుడు ఆ అమ్మాయిని కొన్ని ప్రశ్నలు అడిగాను. ఏమిటి అంటే మీరు ఎప్పుడైనా జీవితంలో పూజ పునస్కారం లాంటిది ఏమైనా చేశరా అమ్మాయి చెప్పింది ఎప్పుడూ చేయలేదు అంటే నేరుగా మొట్టమొదటిసారి ఈ మంత్ర జపానికి కూర్చున్నది అది మొట్టమొదటి తప్పు తర్వాత నేను ఒక ప్రశ్న అడిగాను మీకు నిద్రపడుతుందా ఆవిడ దానికి ఎంత వింత సమాధానం చెప్పారంటే నేను అవాక్ అయిపోయాను ఆవిడ చెప్పారు నేను రోజు నిద్రపోతాను అయితే అరగంటలోనే వచ్చే గ్రహాలు నన్ను నిద్రలేపుతాయి ఇక మీరే ఆలోచించుకోండి ఆవిడకి నిజమైన ఆధ్యాత్మిక అనుభూతులు కలిగి లేక నరాల వ్యవస్థలో దెబ్బతినడం వల్ల రుగ్మతలు కలిగాయా అని సత్యం ఏంటో
(18:41) చెప్పమంటారా సుఖంగా నిద్రపోతూ ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నామ అనుకోండి ఆ సంగతి మనిషికి పెద్ద గొప్పగా అనిపించదు నిద్ర ఆనందము శాంతిని చెడగొట్టుకునేదాకా మనిషికి నిద్రపట్టదున్నమాట కానీ ఒక్కసారి చెడిపోయిన తర్వాత ఎంత ఏడ్చి మొత్తుకున్నా అవి తిరిగి రావడం చాలా కష్టము. తర్వాత ఈ మధ్య నేను ఇంకో రెండు కథలని YouTubeూ్ లో చూశాను ఒకాయనకి కుండల్ని జాగృతి అయింది ఎలా అయింది గుండె దగ్గర నుంచి మొదలయిందట అది మొదట కింది భాగంలోకి వెళ్లి తర్వాత సహస్రారానికి చేరింది బాగుంది తర్వాతే ఆయన చెప్పిన వింత కథ వినండి ఆ కుండల్ని శక్తి శరీరంంతా వ్యాపించి కుండల్ని బ్లాక్స్ గా
(19:19) ఏర్పడిందట అంటే చిన్న చిన్న బాల్స్ గా ఏర్పడిందట ఇప్పుడు మనం ఏం చేయాలి దాన్ని కరిగించాలి కరిగించడానికి ఏం చేయాలి గుండెలోనుంచి నుంచఏమో పాజిటివ్ ఎనర్జీ వస్తుందట తల మీద నుంచి ఏమో నెగిటివ్ ఎనర్జీ వస్తుందట భ్రూమధ్యంలో నుంచిఏమో న్యూట్రల్ ఎనర్జీ వస్తుందట ఈ మూడు ఎనర్జీ సహాయంతో మనం ఆ కుండల్ని బ్లాక్స్ ని కరిగిస్తే మనం మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చేస్తాం ఆయనట ఇప్పుడు ఎక్కడున్నా కూడా ఎవరితోనైనా కనెక్ట్ అవుతాడట మంచిదే ఇంకొక కథ వినండి ఒకాయనకి కుండల్ని జాగృత అయింది ఎలా అంటే ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్టుగా అయిందట మూలాధారంలో నుంచి మెదడు వరకు
(19:57) బాగుంది ఒక వెలుగు కింద నుంచి పైకి పై నుంచి కిందికి రావడం కూడా చూశడట అంటే సహస్రారం వరకు ప్రయాణం చేయడం కిందకి రావడం భూమధ్యంలోనే గొప్ప వెలుగు కనిపించిందట అంటే ఏమిటి ఈ కుండల్ని జాగృతి అంతా అయిపోయింది పూర్తి అయిపోయింది కానీ ఆయన చెప్తాడు నాకు దాని వల్ల ఎలాంటి సంతృప్తి కలగలేదు. నాకు కొన్ని ప్రశ్నలు ఉండిపోయాయి నేనెవరు ఈ సృష్టి ఏమిటి ఈ సృష్టిని ఎవరు సృష్టిస్తున్నారు సృష్టికర్త ఎవరు ఇలాంటి వాటికి సమాధానాలు తెలుసుకోవాలని నేను అనుకున్నాను ఈ కథ బాగుంది ఈ కథలో కూడా చాలా లోపాలు ఉన్నాయి గుండల్ని జాగృత అయింది దాని ప్రయాణం పూర్తయింది శివశక్తుల
(20:33) సంగమం పూర్తయింది సహస్రారాలలో ఆత్మతో కలిసింది అంటే ఏమిటంటే ముక్తిని పొందాడు అని ముక్తి అంటే అహంకార నాశనం అంటే తాను ఒకడు ఉన్నాడఅనే విషయమే తెలియదు ఇక లోపల బయట అంతా అంత ఏకమైపోతుంది ఆత్మే ఉంటుంది ఇంక తాను ఉండడు దాన్నే ముక్తి అంటారు. ఇంక మళ్ళీ లోపల నుంచి ప్రశ్నలు రావడం ఏంటి మనం ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతున్నాము అంటే మొట్టమొదట తెలిసేది ఏంటంటే సందేహ నివృత్తి అంటే అతడికి అన్ని సందేహాలు సమస్య పోతాయి ఇంక దేని మీద అతడికి డౌట్ అనేది ఉండదు ఆ తర్వాత నిజమైన సాధన మొదలవుతుంది.
(21:06) అది శాస్త్రంలో ఉన్న విషయం కానీ ఈయనక అన్ని సందేహాలు అట్లాగే ఉండిపోయినాయట అంటే ఏంటి ఏదో వెలుగు వెలిగింది ఆరిపోయింది మన జీవితం ఎలా ఉందో అలాగే ఉంది ప్రశ్నలు అట్లాగే ఉన్నాయి సమాధానం దొరకలేదు ఏం లాభం ఇలాంటి కుండల జాగృతి వల్ల ఇక్కడ రెండు జరిగి ఉండాలి ఒకటి ఆయన అట్లాంటి విషయాలను ఊహించుకొని ఉండాలి కల్పనలు అంటారు లేదనుకోండి అది జరగకపోయినా మనకు ఒక కథ చెప్పి ఉండాలి ఈ రెండు విషయాల్లో ఏదో ఒకటి ఈ కథలో జరిగింది తప్ప నిజమైన కుండల్ని జాగ్రత్త మాత్రం ఆయనకు కలగలేదు.
(21:37) అమాయకులు గనుక వీటన్నిటిని నమ్మి వాళ్ళని అనుసరించారు అనుకోండి వాళ్ళ ఉపదేశాలు నిజంగానే పాటించారు అనుకోండి అయినప్పటికీ మనకి అలాంటి అనుభూతులు ఏవి కలగవు కేవలం వాళ్ళకు మాత్రమే కలుగుతాయి ఎందుకో మీరే ఆలోచించుకోండి. తర్వాత నేను ఎప్పుడూ ఒకటి చెబుతాను ఏంటంటే ధ్యానము అంటే కుండలిని చక్రాలు ఎనర్జీస్ వైబ్రేషన్స్ సటిల్ బాడీస్ నెగిటివ్ ఎనర్జీలు పాజిటివ్ ఎనర్జీలు వీటిని గురించే మాట్లాడుతుంటే వాళ్ళకి ఎంత వీలైతే అంత దూరంలో ఉండండి ఆధ్యాత్మిక జీవితంలో ధ్యాన జీవితంలో పురోగతి అంటే వాటితో సంబంధమే లేదు.
(22:13) మరి ధ్యాన జీవితంతో దేనికి సంబంధం అంటే సంకల్ప శక్తిని పెంచుకోవటము మనోనిగ్రహాన్ని పెంచుకోవటము ఆనందము ప్రశాంతత సద్గుణాలను పెంచుకోవడము మన చెడు అలవాట్లను తొలగించుకోవడము అదే కదా భగవద్గీతలో భగవానుడు చెప్పాడు దైవాసుర సంపద్ విభాగ యోగము అంటే అసురీ లక్షణాలు తగ్గించుకొని దైవీ లక్షణాలు పెంచుకోండి అదే కదా స్వామి వివేకానంద చెప్పాడు జంతువు స్థాయి నుండి దేవత స్థాయికి రావడానికే మనం ఈ ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తున్నాం ధ్యానం చేస్తున్నాం అంతే అంతేగాని ఈ ఎనర్జీస్ తో కుండలిన జాగృతితో వాళ్ళతో ఎలాంటి ప్రమేయము ధ్యానానికి లేదు అది మనం బాగా అర్థం
(22:50) చేసుకోవాలి ఎవరు ఎంత బాగా అర్థం చేసుకుంటే వాళ్ళకి శాశ్వతమైనటువంటి శాంతి ఆనందాలు లభిస్తాయి తప్ప ఈ క్షణికమైన కుండలి జాగృతి అవుతుంది పోతుంది దానివల్ల ఏ లాభం ఉండదు మన జీవితం మాత్రం ఇక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు ఉంటుంది ఇంకా వీలైతే వెనక్కే వెళ్తాం ఇంకా తిక్క తిక్క సాధనలు చేశారు అనుకోండి అతిగా ప్రెషర్ పెట్టారు అనుకోండి నాడీ వ్యవస్థ మీద మనం ఇప్పటి వరకు చెప్పుకున్నట్టుగా నానా రుగ్మతలను కూడా కొనదీచుకుంటాం.
(23:17) శాంతి సంతృప్తి ఆనందం పొందాలంటే మనం ఇంత కష్టపడాల్సిన పని లేదు ధ్యానంలో పురోగమిస్తే చాలు ఇలా తప్పులు తడకలుగా ధ్యానం చేసిన వాళ్ళకు కూడా చివరికి ఒక జ్ఞానోదయం అవుతుంది ధ్యానం ఎలా చేయకూడదు అని వాళ్ళకు తెలుస్తుంది. అది మనం ముందే ఎందుకు తెలుసుకోకూడదు ధ్యాన జ్ఞానాన్ని పెంచుకుంటే ఈ రెండు సాధ్యంవుతాయి అలాంటి మరింత ధ్యాన జ్ఞానంతో మనం మళ్ళీ కలుసుకుందాం.
(23:43) ఓం శాంతి శాంతి శాంతిహి హరిహి ఓం తత్సత్
No comments:
Post a Comment