. 🙏శుభాభినందనలు 🙏
. ఆధ్యాత్మికత ప్రకృతి తత్వం.
బెలూన్ ని ఎంత ఆనందంగా గాలిలోకి వదులుతామో అంత ఆనందంగా మనం చేయవలసిన పని చేసి ఫలితాన్ని ప్రకృతికి వదలాలి.అప్పుడు ఫలితాలు అద్భుతంగా ఉంటాయి.గాలివాటుకి సైకిల్ తొక్కితే శ్రమలేకుండా ఎలా వేగంగా వెళ్ళిపోతుందో, విషయాలను ప్రకృతికి వదిలినా అంతే.
గాలి మనకు అనుకూలమైన వైపుకు వీస్తూ అద్భుతమైన వేగంతో అనాయాసంగా గమ్యాన్ని చేరుస్తుంది.అది ప్రకృతి యొక్క శక్తి.విశ్వశక్తి చలన సూత్రం.....ఒకరకంగా ఇది కర్మసన్యాసయోగం లా అనిపిస్తోంది కదా....
అవును .....పనిచేయాలి....ఫలితాన్ని ప్రకృతికి వదలాలి....ఎంత అందమైన భావన??భావనే కలియుగంలో ప్రయత్నానికి కారణం....భావనే కార్యం....భావనామాత్రం చేత విశ్వ చలన సూత్రాలన్నీ తమను తాము విపులంగా విశదీకరించుకుంటాయి. .....మన ముందు.
ఇలా మంచి భావనలు చేయండి....చేస్తూ....చేస్తూ.... వుండండి....నిరంతరం చేస్తూనే వుండండి....శరీరం ఏ పని చేస్తున్నా మన భావన విశ్వశక్తికి చిక్కుకుని ఉండాలి.అప్పుడు మనం విశ్వశక్తికి అనుసంధానం కాగలుగుతాము.మనలోని చిన్న చిన్న భావనలే విశ్వాసత్యాలుగా ఆవిష్కృతం అవుతాయి....
. శుభాకాంక్షలతో
. -🙏------🙏
No comments:
Post a Comment