భగవద్గీత -భక్తి యోగం - 13 వ భాగము
సంస్కృత శ్లోకం - 12-17
యో న హృష్యతి న
ద్వేష్టి న శోచతి న కాఙ్క్షతి
శుభాశుభపరిత్యాగీ
భక్తిమాన్యః స మే ప్రియః
తెలుగు అర్దం....
ఎవడు సంతోషించడో, ద్వేషించడో, శోకించడో, కాంక్షించడో, శుభాశుభాలను వదిలేస్తాడో, అలాంటి భక్తుడు నాకు ప్రియుడు.
సంస్కృత శ్లోకం - 12-18
సమః శత్రౌ చ మిత్రే చ
తథా మానావమానయోః
శీతోష్ణసుఖదుఃఖేషు
సమః సఙ్గవివర్జితః
తెలుగు అర్దం....
శతృమిత్రులు, మానావమానాలు, శీతోష్ణాలు, సుఖదుఃఖాలు వీటియందు సమంగా ఉండేవాడు, సంగాన్ని విడిచేవాడు నాకు ఇష్టుడు...
విశేష అర్దం...
ఎవడు సంతోషించడో అంటే ఎవరైతే అనుక్షణము అనుపమానము, అత్యున్నతము, అనన్య సామాన్యమైన ఆత్మ ఆనందం లో ఉంటారో వారికి లోకంలో వచ్చే ఆనందాలు చాల తక్కువ స్థాయిలో ఉంటాయి దాని ముందు ఇదెంత అనే భావన లో ఉంటారు, అంతటి స్థితిలో ఉన్నవారికి శుభం అశుభం అనే భావన ఉండదు ఏదైనా ఒకటే విధంగా ఉంటారు,ఏదో పోయిందే అనే బాధ ఉండదు, కొత్తగా పొందాలి అనే ఆలోచన ఉండదు, శత్రువు, మిత్రుడు అంటూ ప్రత్యేకముగా ఉండరు ఎందుకంటే ప్రతి అణువులో పరమాత్మ యే కనపడతాడు, అతడు సంగ వివర్జితుడు అంటే అన్నీ పనులు చేస్తుంటారు, మనలాగే కనపడుతూ ఉంటారు కానీ అనుక్షణం ఆ పరమాత్మ తో అనుసందానం చెందుతూ ఉంటారు వారు అలాంటి స్థితిలో ఉన్నవారు అసలైన భక్తులు...
....సశేషం
No comments:
Post a Comment