Wednesday, July 15, 2026

 *సత్సంగం*🚩

*మీ హృదయంలోని అసూయ - అహంకారం అనే చీకటిని పారద్రోలటానికి "భక్తి - విశ్వాసం" అనే జ్ఞాన దీపాలను వెలిగించండి.*🙏🙏🙏


*పాముకు తన రెండు కోరలలో విషం ఉంటుంది. ఈ విషంతో ఎంతటి మనిషినైనా క్షణంలో చంపగలదు. సర్పం అంతటి ప్రమాదకరమైనది. అయితే దానికున్న రెండు కోరలు పీకేసామనుకోండి శునకమును కూడా ఏమీ చేయలేనంత శక్తిహీనమైపోతుంది.*


*మానవునికి కూడా అసూయ, అహంకారమనే రెండు విషపు కోరలు ఉంటున్నాయి. వీటి మూలముగా ఇతరులకే కాక తనకు తాను కూడా అపకారం తలపెట్టుకుంటున్నాడు.*


*వీటి మాయలో పడి పరమాత్మను దూరం చేసుకుంటున్నాడు. జీవిత గమ్యం నుండి తప్పించివేస్తున్న ఈ రెండు విషపు కోరలను తగిన సాధనల ద్వారా పీకేయాలి.*


*అపుడు అంతటా పరమాత్మ తత్త్వమే గోచరిస్తుంది. అమితానందం సిద్ధిస్తుంది.*

🔱*ఓం నమః శివాయ*🙏🙏🙏

No comments:

Post a Comment