Wednesday, July 15, 2026

 ఇంద్రాంశతో పుట్టిన వాలి ,ఇంద్రుని జయించిన రావణునితో మైత్రీబంధం ఏర్పరచుకున్నాడు.ఇందులోని తర్కంఏమిటి?
భలే ప్రశ్న వేశారండీ! పైకి చూస్తే ఇది మా నాన్నని కొట్టిన వాడితో నేను దోస్తీ చేయడమేంటి అనే సెంటిమెంట్ లాజిక్‌లా కనిపిస్తుంది. కానీ దీని వెనక ఉన్నది పక్కా ప్రాక్టికల్ పాలిటిక్స్ మరియు భూలోక లౌక్యం. దీని వెనకున్న అసలు తర్కాన్ని కాస్త సరదాగా, మన కాలపు లాజిక్కులతో విడమరిచి చెప్తాను, వినండి.

మొదటిగా, ఫ్యామిలీ సెంటిమెంట్లు వేరు, బిజినెస్ వేరు. వాలి ఇంద్రుడి కొడుకే కాదనట్లేదు. కానీ వాలికి ఇంద్రుడు ఆస్తి ఏమైనా ఇచ్చాడా అంటే అదీ లేదు. ఇంద్రుడు అమరావతిలో కూర్చుని సోమరసం తాగుతుంటే, వాలి ఇక్కడ కిష్కింధ అడవుల్లో కష్టపడి సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. దేవతలకి, రాక్షసులకి పాత పగలు ఉంటే అది వాళ్ల లోకాలకు పరిమితం. లంకలో ఉండే రావణుడు వచ్చి కిష్కింధ మీద పడితే, అమరావతి నుండి ఇంద్రుడు వచ్చి కాపాడడు కదా? అందుకే వాలి మా నాన్న పగలు నాకు అనవసరం, నా రాజ్య భద్రత నాకు ముఖ్య అనుకున్నాడు. దీన్నే ఈ రోజుల్లో ఫారిన్ పాలసీ అంటున్నారు.

రెండవది, చంకలో పెట్టి నేర్పిన బుద్ధి. రావణుడు ఎలాంటోడు? ముప్పై ముక్కోటి దేవతలని చెరసాలలో పెట్టి, నవగ్రహాలని తన సింహాసనానికి మెట్లుగా చేసుకున్న మహా ఘనుడు. అలాంటి లంకాధిపతి మన వాలి దగ్గరికి వచ్చి వెనక నుండి దాడి చేయబోయాడు. కట్ చేస్తే, వాలి అతగాడిని ఒక్క పట్టు పట్టి, తన చంకలో ఇరికించుకుని, నాలుగు సముద్రాల చుట్టూ తిప్పుతూ సంధ్యావందనం ముగించాడు. అంటే రావణుడి అహంకారం మొత్తాన్ని వాలి తన చంక చెమటతో కడిగేశాడన్నమాట. అప్పుడు రావణుడికి ఒక విషయం అర్ధమైంది. ఈ భూమ్మీద మనకంటే పెద్ద తోపు ఇంకొకడున్నాడు, వీడితో పెట్టుకుంటే మన లంక లొట్టపీసు అయిపోద్ది అని. వాలికి కూడా అర్ధమైంది. వీడు మా నాన్ననే గెలిచినా, నా చంకలో పిల్లిలా పడి ఉన్నాడు. వీడిని శత్రువుగా ఉంచుకోవడం కంటే, మిత్రుడిగా మార్చుకుంటే మార్కెట్ లో మన రేటింగ్ పెరుగుతుంది అని.

మూడవది, ప్రమోషన్ స్ట్రాటజీ. రావణుడితో స్నేహం వల్ల వాలి బ్రాండ్ వాల్యూ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇంద్రుడిని గెలిచిన రావణుడే వాలికి సాష్టాంగపడ్డాడు, రావణుడి లాంటి డాన్ కి వాలి గాడ్‌ఫాదర్ అని టాక్ నడిచింది. ఈ ఒక్క దెబ్బతో కిష్కింధ జోలికి రావడానికి ఏ రాక్షసుడూ, ఏ రాజూ ధైర్యం చేయలేదు. అగ్నిసాక్షిగా స్నేహం చేసేశారు.

చివరగా, క్లైమాక్స్ ట్విస్ట్ లేదా రామకార్య లాజిక్. అన్నిటికంటే పెద్ద తర్కం ఏంటంటే, ఒకవేళ వాలి, రావణుడిని అక్కడే చంపేసి ఉంటే రామాయణం అక్కడితో అయిపోయేది. లేదా రావణుడితో కక్ష పెట్టుకుని ఉంటే, సీతాపహరణం జరిగినప్పుడు రాముడు కిష్కింధకు రాగానే వాలి లంకపై దండెత్తి సీతమ్మను తెచ్చి ఇచ్చేవాడు. కానీ వాలి, రావణుడికి ఫ్రెండ్ అయిపోయాడు. కాబట్టి మిత్రధర్మం ప్రకారం వాలి, రావణుడికి వ్యతిరేకంగా వెళ్ళలేడు. అందుకే రాముడు సుగ్రీవుడితో డీల్ కుదుర్చుకోవాల్సి వచ్చింది, వాలిని చెట్టు వెనక నుండి కొట్టాల్సి వచ్చింది. ఇదంతా పైనున్న డైరెక్టర్ రాసిన పక్కా స్క్రిప్ట్.

బాటమ్ లైన్ ఏంటంటే, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు, కేవలం స్వప్రయోజనాలు మాత్రమే శాశ్వతం అని మనకంటే ముందే వాలి నిరూపించాడు. తండ్రిని కొట్టాడని రావణుడితో గొడవ పెట్టుకుంటే వాలి వానరుడు అయ్యేవాడు, పక్కా ప్లాన్‌తో వాడినే దోస్త్ చేసుకున్నాడు కాబట్టే రాజకీయ చతురుడు అయ్యాడు.

మీకు ఈ సమాధానం నచ్చితే ఒక అప్-వోట్ పడేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్‌ రూపంలో పంచుకోండి.

✍️TMS RAO

No comments:

Post a Comment