*పంచవిధ పాపములు వీటి నివృత్తి ధర్మములు*
*గృహస్థులు అయిదు విధములైన పాపములు చేయుదురనియు, ఆ పాప దోషములు పోవుటకు అయిదు విధములైన యజ్ఞములను చేయవలెననియు శాస్త్రములో చెప్పబడినది.* *ఎట్లన:*
*పంచవిధ పాపములు*
1. చెట్లను నరకుట, కూరగాయలను కోయుట,
2. నీటిని వాడుకొనునపుడు ప్రాణులు చచ్చుట,
3. చీపురుతో ఊడ్చునపుడు చీమలు చచ్చుట,
4. రోటిలో నూరునపుడు పురుగులు, చీమలు. చచ్చుట,
5. పొయ్యిలో కట్టెలను పెట్టినపుడు పురుగులం- చచ్చుట,
*పంచ యజ్ఞములు*
1. దేవ యజ్ఞము : నిత్యమును దేవతార్చన చేయుట,
2. పితృయజ్ఞము : తల్లిదండ్రులను, పితృదేవతలను పూజించుట.
3. మనుష్య యజ్ఞము : శక్తిహీనులకును, బ్రహ్మ నిష్టులైన సాధువులకును భిక్ష పెట్టుట,
4. భూత యజ్ఞము : పిల్లి, కుక్క, కాకి మొదలైన జంతువులకు ఆహారము పెట్టుట,
5. బ్రహ్మ యజ్ఞము : ప్రతి దినమును భగవద్గీతాది సద్గ్రంథములను పారాయణ చేయుట. *ఆధ్యాత్మిక కుటుంబం*
No comments:
Post a Comment