*నిద్రను ఎవరూ తెచ్చుకోలేరు. దానంతట అది రావాల్సిందే. నిజానికి నిద్ర అనే ఒక ప్రత్యేక అనుభవం అంటూ ఏదీలేదు. మనసు అన్ని అనుభవాల నుండి పొందే ఉపసంహరణే నిద్రగా పరిణమిస్తుంది. అదే పనిని మన ప్రయత్నంతో చేస్తే అది ధ్యానంగా పరిమళిస్తుంది. అది ప్రయత్నంతో పనిలేని సహజ ధ్యానంగా మారేవరకూ...* *మనకు ఉన్న అనేక అనుభవాల్లాగానే ధ్యానం* *కూడా ఒక అనుభవంగా ఉంటుంది. అందుకే మనలోని ప్రాపంచిక భావాలను,* *భయాలను తీసేయడానికి అవసరమైన అనుభవాలకోసం* *గురువు/దైవం భౌతిక సంఘటనలనే వాడుకుంటారు* !
*ఆత్మవస్తువుకు వచ్చిన కొదువలేదు* !!
*జ్ఞానాజ్ఞానములు రెండూ బ్రహ్మమేనని చెప్పటంలో ఎంతో ఉన్నతమైన సత్యం ఇమిడి ఉంది. చంటి పిల్లాడు జ్ఞానా* ? *అజ్ఞానా ? జ్ఞానం యొక్క ప్రమేయం తెలియకుండా అజ్ఞానాన్ని ఎలా నిర్వచించగలం.* *ఇప్పుడు దేన్నైతే అత్యున్నతమైన జ్ఞానంగా భావిస్తున్నారో అది లేకపోవడం అజ్ఞానం అనుకుంటున్నాము.* *కాని ఆ రెండు స్థితులు ఉన్నా లేకున్నా ఆత్మవస్తువుకు వచ్చిన కొదువలేదు.* *కనుక జ్ఞాని, అజ్ఞాని ఇద్దరూ బ్రహ్మస్వరూపాలే అవుతారు.* *స్వస్వరూపం తెలియడం, తెలియకపోవడం అనే వ్యత్యాసం తప్ప ఆ భగవంతుని సృష్టిలో దేనిలోనూ న్యూనతకు తావులేదు.* *అందుకే తన స్వరూపం తెలిసిన జ్ఞాని అందరినీ బ్రహ్మస్వరూపంగా గౌరవంతో చూస్తారు* !
*గమనించడం అనేది పరిణామ క్రియ* !!
*మనకి దైవాన్ని చూడాలనో, ఇంకా చూడలేదనో ఒక భావం ఉంటుంది.* *తెలియని వస్తువు విషయంలో మనకా ఆలోచన రాదు.* *ఒక విలువైన వస్తువు గురించి తెలిసిన తర్వాత అది గోచరం అయ్యే వరకూ ప్రయత్నం ఉంటుంది.* *గోచరించడం అంటే మనకు స్పృశించేది, కనిపించేది, వినిపించేది, గమనించగలిగేది.* *గమనించడం అనేది మానసికంగా జరిగే పరిణామ క్రియ. ఒక విషయంలోకి లోతుగా చూడటం పరిశీలన అవుతుంది. మామిడి పండును చూసి* *తెలుసుకుంటాం. తర్వాత దానిని తిని రుచిని తెలుసుకుంటాం.* *ఆ రుచిలోని మాధుర్యాన్ని తెలుసు కుంటాం. ఇదంతా గమనింపులో వివిధ దశల్లో జరిగే ప్రక్రియ. దైవం విధాయంలోనూ ఉన్నాడని తెలియడం,* *ఎలా ఉన్నాడో తెలియడం, ఎక్కడ ఉన్నాడో తెలియడం... ఇలా సాగి ఒక రోజుకి నాతోనే, నాలోని, నాగానే ఉన్నాడని గమనింపులోకి వస్తుంది* !
*అనుభవాలన్నీ... చిన్మాత్రలే* !!
*బ్రహ్మము నిరంతర చైతన్య స్వరూపము. అది ఎప్పుడూ స్థబ్దుగా ఉండదు.* *అది నిరంతర చైతన్య ప్రవాహంగా ఉంటుంది.* *అందుకే ద్రవ్యం కూడా చిన్మాత్రము అన్నారు.* *ద్రవ్యం అంటే కేవలం డబ్బు అని కాదు.* *ఈ సృష్టిలో మనకు ఉపయోగకరంగా ఉన్న ప్రతీదీ చిన్మాత్రమే.* *అలాగే కాలం అంటే మనం గడియారాలతో లెక్కించే కొలతకాదు.* *మన అనుభవాలకు కారణమైనది అని. అనుభవమే కాలం. అనుభవాలన్నీ చిన్మాత్రములే.* *సూర్యుడు నిత్యప్రకాశి. మరి ఉదయాస్తమయాలు రెండూ అసత్యం.* అయినా మనకు అనుభవంలోనివి కనుక చిన్మాత్రలే అవుతాయి !
భావంగా తప్ప నిజంగా బంధం లేదు !!
భగవంతుడు దయామయుడు. కఠిన సాధన చేయమనడు. మనం ఇప్పటికే చేస్తున్నవే, చేయగలిగినవే సాధనగా చెప్తున్నాడు. చూసేది , చూడబడేది, తెలిసేది, తెలుసుకునేది అన్ని చైతన్య ప్రవాహంలో భాగాలే కనుక చిన్మాత్రము కాకుండా ఏదీలేదని గుర్తిస్తే చాలు. అనుభవంగా గోచరించే ప్రతి చైతన్యక్రియలోనూ చిన్మాత్రమే ఉంది. జ్ఞానమార్గంలో బంధం, మోక్షం రెండూ లేవని చెప్తారు. అంటే... ఒకటి ఉందనుకుంటేనే మరొకటి ఉందని గుర్తించమని బోధిస్తున్నారు. బంధంలేని స్థితి మోక్షం. మోక్షం కానిస్థితి బంధం. ఏ ఒక్కటి భావించకపోయినా రెండోదానికి ఉనికి లేదు.
ఇది తెలుసుకొని భావంగా తప్ప నిజంగా బంధం లేదని గుర్తిస్తే మనం బ్రహ్మముగానే ఉన్నామని తెలుస్తుంది ! *ఆధ్యాత్మిక కుటుంబం*
No comments:
Post a Comment