తపస్వి డ్రీమ్ టేల్స్
హారర్ కథల పోటీ
"ఊ కొడతావా! ఉలిక్కి పడతావా! "అంశం
*****
పి.బాలాత్రిపుర సుందరి
హైదరాబాద్
9441263871
*********
శీర్షిక: మరిచి పోయిన భయం..మళ్ళీ ఒక్కసారి
****
తలుపు తట్టిన చప్పుడు. మంచినిద్ర లో ఆదమరచి ఉన్న ఉషకు ఆ చప్పుడు వినబడలేదు. మరింత గట్టిగా దబదబ బాదిన శబ్దం. నిద్రలో నే జోగుతూ లేచి తలుపు తీసిందీ.
బాగున్నావా! ఉషా!
ఆ గొంతు లో ఓ
కరుకు దనం. నిద్ర మత్తు దిగి పరిశీలనగా
చూసింది ..ఆ ఆకారాన్ని.
నల్లగా, పోతపోసిన ఇనప విగ్రహంలా ..
ఎఱ్ఱ టి కనుజీరలు
వంకర నవ్వు..
ఉష గుండె ఝల్లు మంది. ఇతను ఇలా..ఇన్నేళ్ళకు మా ఇంటి ముందు..నా చిరునామా ఎలా తెలిసింది?
"లోపలికి రమ్మనవా? తనను పూర్తిగా తోసుకుంటూ ఇంట్లోకి ప్రవేశించాడు ఆ ఆగంతకుడు.
తన భర్త అనిరుథ్ ఆఫీస్ పనిమీద ఊరువెళ్ళి రెండురోజూలయింది.
మీ ఆయన ఊళ్లో లేడని వాకబు చేసుకునే వచ్చాను. " కూచో! సరదాగా మాట్లాడుకుందాము."అన్నాడు
అయినాఅర్థ రాత్రి
మా ఇంటికి రావాలని పించిందా! అన్నది ఉష ధైర్యంగా ఎట్టకేలకు
గొంతు పెగుల్చుకొని.
హహహ! ఏంటి! నేనేమైనా చేస్తానని భయమా! జోక్ చేసినట్టు పెద్దగా నవ్వాడు.
అవును! నీ బుధ్ధి అలాంటిది. అనుమానించడంలో తప్పులేదు! అంది ఉష.
ఈ రాత్రికి ఇక్కడే పడుకుంటాను. రేపు సాయంత్రం వెళ్ళి పోతాలే. మీ ఆయన వచ్చే వరకు ఏం ఉండనులే! వంకరగా మాటలతో ఇంకా బాధ పెట్టాడు అతను.
ఏ హోటల్ లో నన్నా దిగాలి. అంతే గాని మా ఇంటికి రావడమే?
ఉష నిలదీసింది.
క్రూరంగా గుడ్లురుముతూ మీదమీదకు అతను పులిలా నడుచు కుంటూ వస్తున్నాడు. తృటిలో తప్పించుకొని
హాల్ లోంచి బెడ్రూమ్ లోకి ఓ గెంతుతో దూరి
తలుపేసుకుంది.
ఆమె గుండె..
పట్టాల మీద వేగంగా పరిగెడుతున్న
మెయిల్ లా దడదడ లాడుతోంది.
అతను తలుపు తియ్యమని బాదుతున్నాడు.
ఆ ఆగంతకుడు పురుషోత్తం కుటుంబం
ఒకప్పుడు ఉష వాళ్ళుంటున్న వీధి చివరలో ఉండేవారు.
తనూ అతని కూతురు లావణ్య క్లాస్ మేట్స్. మంచి స్నేహితులు. ఆడుకోడానికి తను వారింటికి తరచుగా వెళ్ళేది. అప్పుడప్పుడు పురుషోత్తం నవ్వుతూ పలకరించేవాడు. మిల్క్ చాక్లెట్లు తెచ్చి
రేపర్ తీసి వద్దంటున్నా
బలవంతంగా నోట్లో పెట్టే వాడు. ఏదో అసౌకర్యం గా ఉండేది అతని ప్రవర్తన చూపులు.
లావణ్య తో "మీ నాన్న గారు మాట్లాడుతుంటే
భయమేస్తుందే లావణ్యా " అంది ఉష.
ఎందుకే! మానాన్న కు ఆడపిల్లలంటే ఇష్టం. అందుకే సరదాగా పలకరిస్తారు. అంతే!"
ఏ మనుకోకు" అంది లావణ్య.
ఓ రోజు లావణ్య
ఇంటికి తన నోట్స్ తెచ్చుకోవాడానికి
వెళ్ళింది.
లావణ్యా! అంటూ పిలిచింది. అలికిడి లేదు. మళ్ళీ పిలుస్తూ హాలు దాటి ముందు గదిలోకి వచ్చింది.
సమాధానం రాకపోయే టప్పటికి ఎవరూ లేరా! తలుపు తీసి ఉంది. ఆంటీ" అంటూ లావణ్య తల్లి ని సంభోదిస్తూ పిలిచింది.
సమాధానం రాలేదు
అంతా నిశ్శబ్దం గా ఉంది.
ఆమెలో కొద్దిగా భయం కలిగింది. వెంటనే వెళ్ళి
పోదామని చటుక్కున వెనక్కితిరిగి హాలులోకి వచ్చింది. హాలులో ఎదురుగా లావణ్య వాళ్ళ నాన్న పురుషోత్తం అప్పుడే
స్నానం చేసి
వచ్చినట్టున్నా డు. టర్కిష్ టవల్ మొలకు చుట్టుకొని ఉన్నాడు. వేరే టవల్తో ఒళ్ళు తుడుచుకుంటూ " ఉషా! ఎప్పుడొచ్చావ్?
కూచో " అన్నాడు. లేదండీ! నేను మళ్లీ వస్తాను. లావణ్య దగ్గర నిన్నటి నా నోట్స్ ఉండిపోయిందీ తీసికెళదామని వచ్చాను. " తను లేనట్టుంది. ఆంటీ కూడా లేనట్టున్నారు." అంటూ చురుగ్గా గుమ్మం వైపు అడుగులేసింది ఉష.
ఆగు ఉషా! ఆ నోట్స్
తన రూమ్ లో టేబిల్ పైన పెట్టింది. నీవు వస్తే
తీసుకో మని చెప్పింది. వాళ్ళు ఎప్పటికో రాత్రికి వస్తారు. మరి!" అతను నవ్వుతూ చెప్పాడు.
ఆ నోట్స్ తనకి చాలా అవసరం. రేపటి స్లిప్ టెస్ట్ కి ప్రిపేర్ అవ్వాలి.
టేబిల్ మీద పెట్టే ఉంటుంది. తీసుకొని వెళ్ళి పోతే సరి. అనుకుంటూ లావణ్య స్టడీ రూములో
నోట్స్ తీసుకొని గబగబ
బయటకు వచ్చిన ఉషకు ఎదురుగుండా అదోలా చూస్తూ పురుషోత్తం నిలబడ్డాడు.
దొరికిందా పుస్తకం.
ఏది!ఇదేనా అంటూ తన చేతిలోంచి లాక్కొని పేజీలు తిరగేస్తూ"
బాగుంది ఉషా! నీ నోట్స్
అందమైన చేతివ్రాత..నీలాగే..తన వైపు అదోలా చూస్తున్న
అతనిని చూసి భయంతో గుటకలు మింగుతూ " నేను వెళ్ళాలి" అంటూ పుస్తకం కోసం చేయి చాపింది. " అలాగే ! ఇదిగో తీసికో,! అంటూ పుస్తకం ఇచ్చే మిషతో చేయి పట్టుకున్నాడు.
ఆరోజూ ఇంట్లో ఎవరూ లేరని తెలియక అమాయకంగా వెళ్ళిన
ఉషను పురుషోత్తం పాశవికంగా పాడుచేసాడు. ఆమె ఆర్తనాదం వాడికి రాక్షసానందం కలిగించింది. ఆ సమయానికి వచ్చిన పనిమనిషి ద్వారా ఆ వార్త దావానలంలా చుట్టుపక్కలంతా వ్యాపించింది. ఎవరో 100 కి ఫోన్ చేస్తే హుటాహుటిన అంబులెన్స్ రావడం,
పోలీసుల కి
కబురు వెళ్లడం వారొచ్చి కేసు రాసుకొని ప్రమాదకర పరిస్థితి లో ఉన్న ఉషను
హాస్పిటల్ చేర్పించారు.
ఉష అమ్మ నాన్న లకు పోలీసులే కబురు పెట్టారు. వారు గుండెలు బాదుకుంటూ
అంబులెన్స్ లో పిల్లతో వెళ్ళారు.
ఈ హడావిడిలో పారిపోయిన పురుషోత్తం ను పోలీసులు వెతికి పట్టుకొని అరెస్టు చేసారు.
ఉషకి ఓ పది రోజులు హాస్పిటల్ ట్రీట్మెంట్, తరువాత సైకీయాట్రిస్ట్
కౌన్సెలింగ్ తర్వాత మామూలు మనిషి కాగలిగిందీ. చదువు కొన సాగించింది.
మంచి మనుసుతో అన్నీ తెలుసుకొని అర్థం చేసుకొని తనను వివాహం చేసుకున్నాడు
అనిరుథ్. ముచ్చటగా ఇద్దరు పిల్లలు ఐ.ఐ.టిలో ఇంజనీరింగ్ చేస్తున్నారు.
ఈ సమయంలో ఈ దుర్మార్గుడు ఇలా ఎవరూ లేని టైములో రావడం తను జైలుకి వెళ్ళ డానికీ తానే కారణమని కక్ష కట్టాడని తెలిసి వణికీ పోయింది.
అలాగే బెడ్రూమ్ తలుపుకు నిస్సత్తువుగా కూల బడిపోయింది .
****
ఉషా! అంటూ తలుపు తడుతూ"వీడెవడమ్మా!
ఇలా అంటున్నాడు. నీవు అతనూ చిరకాల పరిచయ ఉన్నట్టు. అనేక మారులు కలిసి
తిరిగినట్లు..చెపుతు
న్నాడు...," ఒక్క సారిగా బెడ్రూమ్ కిటికీ వైపునుంచి నాన్న మాటలు వినబడ్డాయి.
లేదు నాన్న! అంతా అబద్ధం. వాడు అప్పుడు నన్ను అత్యాచారం చేసి
అరెస్ట్ అయి శిక్ష పడి జైలుపాలయ్యాడు. కదా!
ఎప్పుడు విడుదలయ్యాడో తెలియదు.
ఇప్పుడు కక్ష గట్టి ఇలా వచ్చాడు.
అవును నాన్నా! మీ రేంటి ఇక్కడ! కిటికీ లోంచి చీ కట్లోకి కళ్ళు చికిలించి చూస్తూ వెతుకుతోంది. ఆ! సరైన సమయానికే వచ్చాలే! ఉండు వీడి సంగతి చెపుతా!
ఒరేయ్! వెధవా! నా పిల్లని బాధ పెట్టాలని చూస్తావా! గొంతు కొరికి చంపేస్తారా! పెద్దపెద్దగా నాన్న బెదిరింపులు..
పురుషోత్తం గావుకేక..నాన్న గట్టిగా నవ్వడం..
***
టేబిల్ మీద సెల్ ఒకటే మోగుతోంది. కళ్ళు తెరిచింది ఉష.
బరువెక్కిన కళ్ళ తో
పీక్కు పోయిన మొహం నీరసంగా అనిపించింది ఆమెకి.
ఫోన్ మళ్ళీ రింగయింది.
అవతల అనిరుథ్ " కంగారుగా! ఏమిటి పది నిమిషాలనుంచి కాల్ చేస్తున్నాను. ఫోన్ ఎత్తవేమిటి?
గబగబ చింపిరి గా ఉన్న జుట్టును సవరించుకొని, చీర కుచ్చిళ్లు సరిచేసుకుంటూ..బెరుకు బెరుకుగా తలుపు తీసి హాలులోకి వచ్చి గుమ్మం తలుపు తెరిచింది.
ఎదురుగా అనిరుథ్ ఆశ్చర్యంగా చిరాకుగా
చూస్తున్నాడు.
ఏమిటీ! దయ్యం పట్టిన దానిలా నీ వాలకం..
దయ్యం అనే మాట వినగానే ఉష కి పై ప్రాణాలు పైకే పోయాయి. దిగ చమటలు పట్టి కూలబడిపోయింది.
ఉషా! ఉషా!అంటూ అనిరుథ్ ఆమెని ఎత్తుకొని సోఫాలో పడుకో బెట్టి మొహం మీద నీళ్ళు చిలకరించాడు. కళ్ళు తెరిచిన ఉషకు నీళ్లు
తాగించాడు .
ఇప్పుడు చెప్పు ఏమయిందో? అని నెమ్మది గా అడిగిన భర్తకు రాత్రి తనకు జరిగిన సంగతిని చెప్పింది. "నీవింకా నిద్రలో నే ఉన్నావా ?
కలని నిజం అనుకొని భయపడ్డావు.అంతే! ఆ పురుషోత్తం జైల్లో నే ఉరి వేసుకొని చచ్చాడు. వాడు మనింటికి రావడ మేమిటీ? మీ నాన్న సంవత్సరికాలు ఎల్లుండి. మనం విజయవాడకు వెళ్ళాలి కదా!
ఆ! నోరెళ్ళ బెట్టి భయంగా గట్టిగా మొగుణ్ని వాటేసుకుంది ఉష.
పకపక నవ్వుతూ
ధైర్యంగా ఉండమన్నట్టు
ఆమె వీపుని నిమిరాడు. మరింత గట్టిగా తనను దగ్గరికి తీసుకుంటూ..
చిన్నతనంలో జరిగిన దుర్ఘటన తాలుకు చెడు ప్రభావం మర్చి పోవడం సాధ్యం కాదు. అని అనుకున్నాడు. పాపం! ఒంటరితనం తో మనసుపొరలలో దాగిన
పాత ఙ్ఞాపకాలు కలగా వచ్చి భయపెట్టినట్టుంది. తెలియని వయసులో జరిగిన అత్యాచారం వల్ల కలిగిన
భయం మనసులోంచి ఇంకా పోలేదు. పాపం! ఉష!అనుకున్నాడు ఆమె భర్త అనిరుథ్.
****
No comments:
Post a Comment