Wednesday, July 15, 2026

 *ద్వాదశ జ్యోతిర్లింగాల మహిమలు...🛕🔱🙏*
*శివో భక్తానాం పతిః –  అంటే శివుడు భక్తుల పాలకుడు!*

*శివుని జ్యోతిర్లింగరూపాలు ఈభూమిపై తేజోవంతంగా వెలసిన12పవిత్రక్షేత్రాలలో ఉన్నాయి.*
*ఇవి ప్రతిఒక్కటీ ఓప్రత్యేక శక్తికేంద్రంగా భావించబడతాయి.*

*వాటి స్థలాలు మరియు మహిమలు..!🔱🙏*

1.సోమనాథ జ్యోతిర్లింగం –గుజరాత్!🛕🚩
మహిమ: చంద్రుడిని శాపంనుండి విముక్తిచేసిన దివ్యక్షేత్రం.శివుడు ఇక్కడ “చంద్రచూడుడు”గా వెలసి, భక్తులను ఆరోగ్యంతో ఆశీర్వదిస్తాడు.
స్థలం: ప్రవాస్ పట్టణం,గుజరాత్!

2.మల్లికార్జున జ్యోతిర్లింగం –ఆంధ్రప్రదేశ్!🛕🚩
మహిమ: శివుడు పార్వతీదేవితో కలిసి ఒకే ఆలయంలో ప్రత్యక్షమయ్యే ఏకైకజ్యోతిర్లింగం. 
ఇది“దక్షిణకాశీ”గా ప్రసిద్ధి.
పాండవులు ఇక్కడ పూజించారు.
స్థలం: శ్రీశైలం,కర్నూల్ జిల్లా!

3.మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం –మధ్యప్రదేశ్!🛕🚩
మహిమ: కాలమహిమకు అధిపతిఅయిన శివుడు ఇక్కడ“మహాకాళుడు”గా వెలిశారు. 
ప్రతిఉదయం భస్మారతి ఇక్కడ జరిగే విశిష్టమైన ఘట్టం.
స్థలం: ఉజ్జయినీ నగరం!

4.ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం –మధ్యప్రదేశ్!🛕🚩
మహిమ: ఓంకార ధ్వనికి ప్రతీక.ఇక్కడ శివుడు పరమాత్మతత్త్వాన్ని సాక్షాత్కరింపజేస్తాడు. 
నర్మదానది మధ్యలోఉన్న ద్వీపంపై ఆలయం.
స్థలం:నర్మదా నదితీరంలో,ఖండ్వా జిల్లా!

5.కేదారనాథ్ జ్యోతిర్లింగం –ఉత్తరాఖండ్!🛕🚩
మహిమ: పాండవులు శివుని క్షమాపణకోరిన స్థలం. హిమాలయాల్లో అత్యంత పవిత్రమైన తపోభూమి. ఇక్కడ పూజించడంద్వారా పాపవిమోచనం జరుగుతుంది.
స్థలం: రుద్రప్రయాగ్ జిల్లా!

6.భీమశంకర జ్యోతిర్లింగం –మహారాష్ట్ర!🛕🚩
మహిమ: భీమ అనే రాక్షసునిని సంహరించిన శక్తిమంతమైన శివుడు ఇక్కడ వెలసాడు.
ఇక్కడ పూజిస్తే శత్రునాశనం,విజయం లభిస్తాయి.
స్థలం: పుణె సమీపంలో!

7.కాశీవిశ్వేశ్వరజ్యోతిర్లింగం –ఉత్తరప్రదేశ్!🛕🚩
మహిమ: మోక్షం ప్రసాదించేక్షేత్రం.
కాశీలో మరణించినవారిని శివుడు తానే ‘తరించత’ అని మాట ఇచ్చాడు.
ప్రాణాంతక భయాలు తొలగించేవాడు.
స్థలం: వారణాసి!

8.త్ర్యంబకేశ్వర్ జ్యోతిర్లింగం –మహారాష్ట్ర!🛕🚩
మహిమ: త్రిమూర్తులతత్త్వం కలిగిన శివలింగం. ఇక్కడ గోదావరినది జన్మించింది.
జన్మ రహితమైన జీవితంకోసం ఇక్కడ పూజిస్తారు.
స్థలం: నాశిక్ సమీపంలో!

9.వైధ్యనాథ జ్యోతిర్లింగం –జార్ఖండ్!🛕🚩
మహిమ: శివుడు వైద్యునిగా ప్రసిద్ధి. ఇక్కడ పూజిస్తే శరీర,మానసికవ్యాధులనుండి విముక్తి లభిస్తుంది. రావణాసురుడు శివుని ఇక్కడ ఆరాధించాడు.
స్థలం: దేవఘర్, జార్ఖండ్!

10.నాగేశ్వర్ జ్యోతిర్లింగం –గుజరాత్!🛕🚩
మహిమ: నాగాసురుని సంహరించిన శివుడు. శక్తివంతమైన రక్షణ కలిగించే జ్యోతిర్లింగం. 
భయం,దుర్భాగ్యం నివారించేవాడు.
స్థలం: ద్వారక సమీపంలో!

11.రామేశ్వర జ్యోతిర్లింగం –తమిళనాడు!🛕🚩
మహిమ: రాముడు లంకయుద్ధానికిముందు శివుని పూజించిన స్థలం.ఇక్కడ పూజించడంవలన కర్మ బంధాలు తొలగిపోతాయి.
సముద్రపూజకు ప్రధాన ప్రదేశం.
స్థలం: రామేశ్వరం ద్వీపం!

12.ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం –మహారాష్ట్ర!🛕🚩
మహిమ: భార్య భక్తితో భర్తకు జ్ఞానంఇచ్చిన స్థలం. అతిచిన్నదైన జ్యోతిర్లింగం అయినా మహాశక్తి గల గొప్పది.కుటుంబకలహాల నివారణకు ప్రసిద్ధి.
స్థలం: ఎల్లోరా గుహల సమీపం!

శివుని అనుగ్రహమే మోక్ష మార్గం!
జ్యోతిర్లింగాల దర్శనం శరీరానికి ఆరోగ్యాన్నీ, 
మనస్సుకు ప్రశాంతతనీ, 
ఆత్మకు పునీతతనీ ప్రసాదిస్తుంది.

🌹 లోకాస్సమస్తాః సుఖినోభవంత🌹
🙏🏼 సమస్త సన్మంగళాని భవంతు 🙏🏼
 *ఆధ్యాత్మిక కుటుంబం*                        

No comments:

Post a Comment