*14 లోకాలు - 14 చక్రాలు*
*🌏ఓంశ్రీమాత్రేనమః🌍*
ఈ 14 లోకాలు వివిధ పరిధుల్లో ఈ సృష్టిలో ఉన్నాయి. విశ్వంలో ఈ14 లోకాలు ఉండడమే కాదు, భూలోకంలో కూడా వివిధ దేశాలను వీటికి అన్వయించి చెప్పే విధానం ఉంది, అలాగే ఈ శరీరంలోనే ఈ14 లోకాలను పదునాలుగు భిన్న చైతన్య స్థితులకు సూచనగా చెప్పే సంప్రదాయం కూడా ఉంది. మన శరీరంలో మూలాధారం నుంచి పైకి, క్రమంగా స్వాధిష్టాన, మణిపూరక,
అనహత,
విశుద్ధి,
ఆజ్ఞ చక్రాలనే 6చక్రాలు ఉన్నాయి. వాటికి పైన ఉన్నది సహస్రారం/ సహస్రపద్మం. ఇవన్నీ కలిపి 7. అలగే మూలాధారానికి దిగువన కూడా 7చక్రాలున్నాయని కొన్ని ఆగమాల్లో కనిపిస్తుంది. ఈ మొత్తం అన్నీ కలిపి 14. వ్యక్తి యొక్క చైతన్యం ఉన్న స్థాయిని అనుసరించి, అతడి మానసిక స్థాయి ఏ లోకంలో ఉందో తెలుసుకోవచ్చు.
1. మూలాధారం - వెన్నుపూస అంత్యభాగంలో ఉంటుంది. ధారణశక్తి కి కేంద్రస్థానం. మహాగణపతి అధిదేవత. ఇదే మానవుడు ఆధ్యాత్మికంగా ఎదగడానికి తొలిమెట్టు.
2. స్వాధిష్టానం -
బొడ్డు క్రింద, జనేనెంద్రియాల వద్ద ఉంటుంది. వివేకము దీని లక్షణం.
3. మణిపూరం - నాభిలో ఉంటుంది. సంకల్పశక్తికి కేంద్రస్థానం.
4. అనాహతం - హృదయం దగ్గర ఉంటుంది. అపరోక్ష జ్ఞానానికి స్థానం.
5. విశుద్ధం -
కంఠంలో ఉంటుంది. దివ్యప్రేమ/ దైవం పట్ల ప్రేమకు స్థానం.
6. ఆజ్ఞ -
కనుబొమ్మల మధ్యన ఉంటుంది. దీన్నే మూడవ నేత్రం అంటారు. దివ్య దృష్టికి కేంద్రస్థానం.
7. సహస్రారం - తలమీద ఉంటుంది. ఆత్మజ్ఞానానికి, దైవానికి స్థానం.
⚜🚩⚜🚩⚜🚩
నరకాలు, పాతాళ లోకాల గురించి చూద్దాము.
1. అతలం -
అగాధ ప్రాంతానికి చెందిన చక్రమిది. తుంటి భాగంలో ఉంటుంది. భయం, కామము దీని లక్షణాలు.
2. వితలం - నిరసించడం లక్షణంగా కలిగిన చక్రమిది. ఇక్కడ సుఖం ఉండదు, విపరీతమైన కోపం ఉంటుంది. తొడల భాగంలో ఈ చక్రం ఉంటుంది.
3. సుతలం -
బాగా లోతైన అనే అర్దంలో చెప్పే చక్రం ఇది. అసూయ దీని లక్షణం.
4. తలాతలం - అంధకారం, తామసికం దీని లక్షణం. పిక్కల్లో ఉంటుంది. క్రింది స్థాయి చక్రం ఇది. గందరగోళం, అస్పష్టమైన ఆలోచనలకు, అమితమైన మొండితనానికి ఇది స్థానం.
5. రసాతలం - కాలిచీలమండల ప్రాంతంలో ఉండే చక్రం. స్వార్ధపరత్వం, ఆధిపత్య ధోరణి, కేవలం తన గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉండడం దీని లక్షణాలు.
6. మహాతలం - అవివేకము దీని లక్షణము. పాదాల్లో ఉంటుంది.
అవివేకం అంటే ఏది మంచి, ఏది చెడు, ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము అనేవి తెలుసుకోలేక అసత్యమైన వాటి వెంటపడే లక్షణం. నరక లోకం యొక్క తీవ్రత ఇక్కడి నుంచే మొదలవుతుంది.
7. పాతాళం -
కాకోలం అనే నల్లని విషం ఉండే ప్రాంతం. పతనమైన, లేదా పాపిష్టి పనులకు మూలం ఇది. దుర్బుద్ధి, దుష్టభావాలకు నిలయం. అరికాలులో ఉంటుంది. ఇక్కడుండే జీవులు వినాశనం కోసం వినాశనం చేస్తారు, హింసించటం కోసం హింసిస్తారు, చంపడం కోసం చంపుతారు.
కాబట్టి దీన్ని అర్దం చేసుకుని మనలో ఆ క్రింద చక్రాల్లో ఏ ఏ లక్షణాలు ఉన్నాయో, అవన్నీ వదులుకుంటే, కాస్తంతైన ఆధ్యాత్మిక అభివృద్ధి ఉంటుంది.
*ఆధ్యాత్మిక కుటుంబం*


No comments:
Post a Comment