*కలియుగంలో నిషేదాలు*
*పూర్వయుగాలలో పితృకార్యాలలో విప్రులకు పితరుల ప్రీత్యర్థంగా మాంస భోజనం పెట్టడం ధర్మశాస్త్ర విధి. దీనితోపాటు మరికొన్ని విషయాలు ఈ కలియుగంలో నిషేధించబడినాయి.*
"ఆశ్వాలంభం గవాలంభం సన్న్యాసం పలపైతృకం దేవరాచ్చ సుతోతృత్తిః కలౌ పంచ వివర్జయేత్॥'” అని స్మృతివాక్యం.
అనగా అశ్వమేధమూ, గోమేధమూ, సన్యాసం, ఇత్యాది హింసతో కూడిన యజ్ఞాలు, పితృకార్యాలలో మాంస భోజనమూ, దేవరన్యాయం వల్ల పుత్రోత్పత్తి - ఈ విషయాలన్నీ కలియుగంలో పనికిరావని ధర్మశాస్త్రం నిషేధించింది.
యజ్ఞ యాగాదులలో పశు వధను మాని పిష్ట పశువు(పిండితో చేసిన పశువు)తో యజ్ఞం చేయాలని చెప్పబడింది. అంతకు పూర్వం యజ్ఞయాగాలోనూ, పితృకార్యాలలోనూ -ఇత్యాది ప్రత్యేక సందర్భాలలో విధించబడిన మాంస భోజనం నిషేధించబడింది. విప్రులకు మాంసభోజనం పూర్తిగా నిషేదించబడింది. దేవరన్యాయం వల్ల పుత్రోత్పత్తి కూడా నిషేధించబడింది.
పై కలి వర్జ్యాలన్నీ అంతకు పూర్వ యుగాలలో ఉన్నవైనా-కలిలో అవి దుర్వినియోగం చేయబడతాయనే అభిప్రాయంతో ధర్మశాస్త్ర కర్తలు వానిని కలిలో నిషేధించారు. *ఆధ్యాత్మిక కుటుంబం*
No comments:
Post a Comment