"రా శబ్దాశ్చారణాదేవ ముఖాన్ని ర్యాంతి పాతకాః పునః ప్రవేశ భీత్యాచ మకారస్తూ కవాటవత్ "
నోరు తెరిచి "రా" అని చెప్పునప్పుడే పాపములన్నియు నోటి నుండి బయటికి వెళ్లిపోవుచున్నవి. మరల లోపలకు ప్రవేశించకుండా "మ" కారం తో నోటిని మూసి బంధించుచున్నది.
"రా" అక్షరం ఉచ్చరించుట వలన నోరు తెరవబడి పాపములు పోయి ముఖం మధురముగా ఉండును. "మ" అక్షరం ఉచ్చరించుట వలన నోరు మూతపడి సంతోషం కలుగును. రామ అని పిలిస్తే సర్వ పాపాలు బయటకు వెళ్లి శరీరం అంతః శుద్ధి కలిగి పవిత్రుడు అవుతాడు.
"శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే | సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే "
నేను సదా రామనామమును ధ్యానించెదను, అది విష్ణు సహస్రనామములకు సమానమైనది. నీవును ఆ నామమును జపించుమని శివుడు పార్వతీదేవికి ఉపదేశించెను.
జీవుడు ముక్తి పొందవలెనని తలచి కాశీలోని మరణకాలమున ఈశ్వరుడే తారకమంత్రంను జీవుల చెవియందు ఉపదేశించును. సహస్రనామములతో సమానమని శివుని వచనమును విని, పార్వతీ రామనామమును పఠించి శివుని సాంగత్యం నొందెను.
రామ తారకమంత్రము పాతకములు నశించును. పార్వతీదేవికి పరమేశ్వరుడు, వాల్మికికీ నారదుడు, భరద్వాజునకు వాల్మికి, వ్యాసులకు పరాశరులు, శుకులకు వ్యాసుడు ఉపదేశించినది తారక మంత్రమే.
No comments:
Post a Comment