Wednesday, July 15, 2026

 #ఓం శ్రీ కుక్కే సుబ్రహ్మణ్య స్వామినే నమః 🙏
సర్పదోష నివారకుడు, భక్తుల కోరికలను తీర్చే దివ్య స్వామి కృప మనందరిపై ఉండాలి.
శుభోదయం! ✨
#కుక్కే సుబ్రహ్మణ్య – నాగదేవత నివసించే ప్రదేశం  🙏

#నాగదోష పరిహారం చేయించుకోవాలను కుంటున్నారా?!. మీ అనుకూలాన్ని బట్టి ఈ ఆలయాన్ని సందర్శించండి. మహిమాన్విత మైన శ్రీ కుక్కీ సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహాన్నీ పొందండిక.🙏

#కుక్కే శ్రీ సుబ్రమణ్యేస్వామి వారి గుడి KUKKE SREE SUBRAMANYA Temple నాగదోష పరిహారములకు చాలా ప్రసిద్ధమైనది. ఇక్కడ ప్రధానముగ సర్పహత్యదోషం, ఆశ్లేష బలి పూజ మరియు నాగ ప్రతిష్ట పూజలు చాలా నిష్టగ నిర్వహిస్తారు. ఇక్కడ గుడిలో నాగదోష పరిహారములు చేసుకుంటే వారికి జీవితంలో ఎటువంటి భాదలు లేకుండా మంచి సంతానం కలిగి సుఖసంతోశాలతో జీవిస్తారు అని పురాణ గాధలలో ఉంది.🙏

 #కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం

సుప్రసిద్ద శ్రీ కుక్కే సుబ్రమణ్యస్వామి దేవస్థానం కర్నాటక రాష్ట్రం, దక్షిణ కన్నడ జిల్లా, సుల్ల్య తాలూకా లోని సుబ్రమణ్య అను గ్రామములో ఉంది ...#సుబ్రహ్మణ్య స్వామిని ఇక్కడ నాగ దేవతగా ఆరాధించడం విశేషం. #ఇది ఒక ప్రసిద్ధ యాత్రా స్థల౦ – ఇక్కడి క్షేత్ర గాధ కూడా యాత్రికుల్ని ఇక్కడికి ఆకర్షిస్తుంది.🙏

#ఆలయ స్థలపురాణం🙏

#ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన మన దేశంలో ఎన్నో దేవాలయాలు వెలిశాయి. #వాటిల్లో కొన్ని ఆలయాలను భక్తులు, రాజులు, వంశస్థులవారు దేవుడిపై భక్తిని చాటిచెప్పేందుకు నిర్మించగా.. మరికొన్ని దేవాలయాల్లో దేవతలు స్వయంభువులుగా వెలిశారు. #అలా వెలిసిన దేవాలయాల్లో కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఒకటి. #కుమారస్వామి (సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, కార్తికేయుడు) కి నిలయమైన ఈ క్షేత్రం ‘పరశురామ’ క్షేత్రాలలో ఒకటి.🙏

#ఈ ఆలయం ప్రాకృతిక సౌందర్యారాలు వెలువరించే కర్ణాటక రాష్ట్రం, దక్షిణ కన్నడ జిల్లాలో మంగళూరుకు 100 కి.మీ.ల దూరంలో కుమార పర్వతశ్రేణుల మధ్య ధారా నది ఒడ్డున ఉన్న గ్రామం ’సుబ్రహ్మణ్యం’లో వుంది. #పూర్వం ఈ గ్రామాన్ని ‘కుక్కే పట్నం’ అనే పిలిచేవారు. క్రమంగా ఇది ‘కుక్కె సుబ్రహ్మణ్య’గా ప్రాచుర్యంలోకి వచ్చింది. #సుబ్రహ్మణ్య ఆలయం గురించి ‘స్కాందపురాణం’లో సనత్‌కుమార సంహితలోని సహ్యాద్రికాండలోని తీర్ధక్షేత్రమహామణి పురాణంలో తెలుపబడింది.🙏

#సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల కలిగే ఫలితాలు
సుబ్రహ్మణ్య స్వామి యుద్ధ దేవతగా, జ్ఞాన స్వరూపంగా మరియు అడ్డంకులను తొలగించే దేవతగా పూజించబడతారు. 

#ఆయన ఆరాధన వల్ల కలిగే ప్రయోజనాలు:

#శత్రు భయ నివారణ: సుబ్రహ్మణ్య స్వామి శక్తిశాలి అయిన యుద్ధ దేవత కాబట్టి, ఆయన ఆరాధన శత్రువుల నుండి రక్షణను అందిస్తుంది. శారీరక, మానసిక శత్రుత్వాలను అధిగమించడంలో సహాయపడుతుంది.

#కుజ దోష నివారణ: కుజ గ్రహం (మంగళ గ్రహం) వల్ల జాతకంలో ఏర్పడిన దోషాలను సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన తగ్గిస్తుందని నమ్ముతారు.

#జ్ఞానం మరియు విజయం: సుబ్రహ్మణ్యుడు జ్ఞాన స్వరూపి. ఆయన ఆరాధన విద్య, జ్ఞానం, విజయం మరియు సమస్యల పరిష్కారంలో సహాయపడుతుంది.
 
#సుబ్రహ్మణ్య అష్టకం లేదా ఇతర స్తోత్రాలు: సుబ్రహ్మణ్య అష్టకం, సుబ్రహ్మణ్య సహస్రనామం, సుబ్రహ్మణ్య కవచం వంటి స్తోత్రాలను పఠించడం లేదా శ్రవణం చేయడం వల్ల మనస్సు శాంతిస్తుంది మరియు ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది.

#సుబ్రహ్మణ్య అష్టకం వల్ల కలిగే ఫలితాలు
సుబ్రహ్మణ్య అష్టకం అనేది సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఎనిమిది శ్లోకాల స్తోత్రం, దీనిని భక్తితో పఠించడం వల్ల క్రింది ఫలితాలు లభిస్తాయి:

#మానసిక శాంతి: అష్టకం పఠనం మనస్సును శాంతపరుస్తుంది మరియు ఒత్తిడి, ఆందోళన నుండి ఉపశమనం కలిగిస్తుంది.

#ఆధ్యాత్మిక ఉన్నతి: సుబ్రహ్మణ్య అష్టకం భక్తి మరియు ఏకాగ్రతను పెంచుతుంది, ఆధ్యాత్మిక జీవనంలో పురోగతికి దోహదపడుతుంది.

#విఘ్న నివారణ: ఈ స్తోత్రం జీవితంలోని అడ్డంకులను తొలగించడానికి మరియు సాఫల్యాన్ని సాధించడానికి సహాయపడుతుందని భక్తులు నమ్ముతారు.

#కుజ దోష శాంతి: కుజ గ్రహ దోషం ఉన్నవారికి ఈ అష్టకం పఠనం దోష నివారణకు సహాయపడుతుంది.

#సుబ్రహ్మణ్య స్వామి కృప: అష్టకం భక్తి భావంతో పఠించడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం లభిస్తుందని, జీవితంలో సకల సౌభాగ్యాలు కలుగుతాయని నమ్మకం.

#సుబ్రహ్మణ్య అష్టకం కరావలంబ స్తోత్రం...

హే స్వామినాథ కరుణాకర దీనబంధో,
శ్రీపార్వతీశముఖపంకజ పద్మబంధో ।
శ్రీశాదిదేవగణపూజితపాదపద్మ,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 1 ॥

దేవాదిదేవనుత దేవగణాధినాథ,
దేవేంద్రవంద్య మృదుపంకజమంజుపాద ।
దేవర్షినారదమునీంద్రసుగీతకీర్తే,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 2 ॥

నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్,
తస్మాత్ప్రదాన పరిపూరితభక్తకామ ।
శృత్యాగమప్రణవవాచ్యనిజస్వరూప,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 3 ॥

క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తిశూల,
పాశాదిశస్త్రపరిమండితదివ్యపాణే ।
శ్రీకుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 4 ॥

దేవాదిదేవ రథమండల మధ్య వేద్య,
దేవేంద్ర పీఠనగరం దృఢచాపహస్తమ్ ।
శూరం నిహత్య సురకోటిభిరీడ్యమాన,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 5 ॥

హారాదిరత్నమణియుక్తకిరీటహార,
కేయూరకుండలలసత్కవచాభిరామ ।
హే వీర తారక జయాఽమరబృందవంద్య,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 6 ॥

పంచాక్షరాదిమనుమంత్రిత గాంగతోయైః,
పంచామృతైః ప్రముదితేంద్రముఖైర్మునీంద్రైః ।
పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 7 ॥

శ్రీకార్తికేయ కరుణామృతపూర్ణదృష్ట్యా,
కామాదిరోగకలుషీకృతదుష్టచిత్తమ్ ।
భక్త్వా తు మామవకళాధర కాంతికాంత్యా,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 8 ॥

సుబ్రహ్మణ్య అష్టకం పుణ్యం యే పఠంతి ద్విజోత్తమాః ।
తే సర్వే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః ।
సుబ్రహ్మణ్య అష్టకం ప్రాతరుత్థాయ యః పఠేత్ ।
కోటిజన్మకృతం పాపం తత్క్షణాదేవ నశ్యతి ॥

        #సర్వేజనా సుఖినోభవంతు

.

No comments:

Post a Comment