207f9;
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀```
బ్రహ్మశ్రీ చాగంటివారి ప్రవచనం నుండి.. ```
*సుందరకాండ మహిమ*
➖➖➖✍️
🌺ఎక్కడెక్కడ రామకథ చెప్పబడుతుందో అక్కడక్కడ స్వామి హనుమ అందరి కన్నా ముందు వచ్చి కుర్చుంటారు.
🌺ఎక్కడెక్కడ రామ కథ చెప్పడం పూర్తవుతుందో అక్కడ అందరి కన్నా చిట్ట చివర్న బాధపడుతూ, వెనక్కి తిరిగి చూస్తూ వెళ్తారు.
🌺అందుకే, ప్రత్యేకించి సుందరకాండ ఎక్కడ చెప్పబడుతుందో అక్కడకి హనుమ వస్తారు అని అంటారు.
🌺కారణం ఏమంటే..
శ్రీ రామాయణం లో - మిగిలిన
ఏ కాండలోనూ లేని అద్భుతం
ఒక్క సుందరకాండ లోనే వుంది.
🌺సుందర కాండలో రామ కథ ఒకటికి పదిమార్లు చెప్పబడుతుంది. హనుమ చెప్పేటప్పుడు ఎక్కడ ఎప్పుడు ఎంత రామకథ చెప్పాలో అంతనే చెబుతారు.
🌺రామకథ కున్న బలమేమిటో, రామ నామానికి వున్న బలమేమిటో నిరూపించిన కాండ.. సుందరాకాండ!
అందుకే సుందరాకాండ బహుభంగిమల సుందరకాండ.
ఎన్ని కోణాలలో అయినా చూడండీ, అదంతా సుందరమే!
🌺ఒక పాత్ర నిండా పాయసం తీసుకొచ్చి అక్కడ పెడితే,
‘అడుగున వున్నది పాయసమా, మధ్యన వున్నది పాయసమా, పైనున్నది పాయసమా’
అని అడిగితే ఏం చెప్పవలసి వుంటుంది? - అంతా పాయసమే.
🌺అలాగే, సుందరాకాండ ని
ఎటు వైపునించి చూడండి..
అంతా సౌందర్యమే!
🌺రామాయణం లో ఒక్క సుందరకాండ కొచ్చేసరికి,
మహర్షి ఒక గొప్ప ప్రయోగం చేసారు. ఇందులో చాలా శ్లోకములు శ్లోకములు కావు. చాలా శ్లోకములు మంత్రములే.
అందుచేతనే, అప్పటికీ ఇప్పటికీ సుందరకాండ శక్తి ఏమిటంటే…
🌺పిల్ల పెళ్ళవలేదు! - ✅సుందరకాండ చదువుకోండి.
🌺పిల్లాడికి ఉద్యోగం రాలేదు - ✅సుందరకాండ చదువుకోండి.
🌺ఆరోగ్యం బాలేదు - ✅సుందరకాండ చదువుకోండి.
🌺ఏమిటో భయంగా వుంటోంది - ✅సుందరకాండ చదువుకోండి.
🌺భీతి కలిగింది -
✅సుందరకాండ చదువుకోండి.
🌺ఏ కష్టం కలగనీండి - ✅సుందరకాండ చదువుకోండి ఫలితం వుంటుందని నమ్ముతారు భక్తులు.
🌺ఎందుకనంటే - లోకం లో ఇంత శక్తిమంతమైనవి రెండే రెండు సాహిత్యం లో వున్నాయని చెబుతారు పెద్దలు.
🌺ఈ రెండూ కాకుండా మూడో అంకె వేసి చెప్పడానికి ఇంక లేదు.
ఆ రెండూ ఏమిటంటే..
*ఒకటి సుందరకాండ,
*రెండు - సౌందర్య లహరి.
మూడు ఇక లేదు!
🌺రెండూ సౌందర్యము, సుందరము ఆ పర్యాయ పదాలతోటే వుంటాయి. రామానుగ్రహాన్ని ప్రసాదించే శక్తి సుందర కాండలో వుంది.✍️
(బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనం నుంచి సేకరించినది.)
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺
No comments:
Post a Comment