Wednesday, July 15, 2026

 హీరోలకి చప్పట్లు కొట్టడం ఆపి, ఒక్క నిమిషం ఆలోచించండి.. వ్యవస్థలు దాటుకుని వచ్చే హీరోయిజం ఎవరికి లాభం?
మొన్న ఒక సభలో గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు విన్నారా? "నా అభిప్రాయాలు నేను CM గారికి చెప్పను.. నా Communication డైరెక్ట్ గా ప్రజలతోనే." వినడానికి ఇది గూస్ బంప్స్ తెప్పించే డైలాగ్. "అబ్బా, ఏం మాట్లాడాడురా" అనిపించే ఎమోషన్. కానీ, ఎమోషన్ పక్కనపెట్టి లాజిక్ తో ఆలోచిస్తే.. దీని వెనుక ఉన్న అసలైన ప్రమాదం ఏంటో తెలుసా? ఒక పౌరుడిగా, ఈ Society ని observe చేసే వ్యక్తిగా, నా బుర్రను తొలిచేస్తున్న 3 లాజికల్ ప్రశ్నలు ఇవి. ఆయన ఉద్దేశాన్ని తప్పు పట్టడం నా ఉద్దేశం కాదు, కానీ ఒక Constructive Approach తో నేను అడుగుతున్న సూటి ప్రశ్నలు: 🟠Question 1: Sir, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిస్టమ్ ని ప్రశ్నిస్తూ ప్రజలతో డైరెక్ట్ గా మాట్లాడితే అది పోరాటం. కానీ ఇప్పుడు మీరే ప్రభుత్వం. వ్యవస్థను నడపాల్సిన మీరే, "నాకు CM తో కమ్యూనికేషన్ లేదు" అంటే.. దానర్థం మీ ప్రభుత్వంలో ఒక Parallel System నడుస్తోందని పరోక్షంగా ఒప్పుకోవడమే కదా? లోపల కూర్చుని సిస్టమ్ లో ఉన్న తప్పులను సరిదిద్దాల్సిన మీరే, ఆ సిస్టమ్ ని పక్కనపెట్టి బయటకొచ్చేస్తే, రేపు పొద్దున ఒక సామాన్యుడు మీ పోలీస్ స్టేషన్ల మీద, మీ ప్రభుత్వ ఆఫీసుల మీద ఎలా నమ్మకం పెట్టుకుంటాడు సర్? ⚪Question 2: Sir, రేపు ఉదయం ఒక సామాన్య కానిస్టేబుల్ తన SP తో, లేదా ఒక MRO తన కలెక్టర్ తో "నేను మీకు రిపోర్ట్ చేయను, నా కమ్యూనికేషన్ డైరెక్ట్ గా ప్రజలతోనే" అని అంటే మీ ప్రభుత్వం ఒప్పుకుంటుందా? సిస్టమ్ లో కింది స్థాయి వాళ్లకు ఒక రూల్, పై స్థాయి వాళ్లకు ఒక రూల్ ఉంటుందా? డిప్యూటీ సీఎం గా మీరే ముఖ్యమంత్రితో అభిప్రాయాలు పంచుకోనప్పుడు, మీ కింద పనిచేసే అధికారులు రేపు మీకు జవాబుదారీగా ఎందుకు ఉంటారు? ఇది Governance అంటారా, లేక Administrative Anarchy కి పునాది వేయడం అంటారా? 🟢Question 3: Sir, మీకు ప్రజల మీద ఉన్న ప్రేమను ఎవరూ శంకించడం లేదు. కానీ సమస్యలు వచ్చిన ప్రతిసారీ మీరే స్వయంగా వచ్చి పరిష్కరించాలి అనుకోవడం సైకలాజికల్ గా ఒక "Savior Complex". ఒక మనిషిగా మీరు రాష్ట్రంలో ఉన్న కోట్ల మంది ప్రజల సమస్యలను ప్రతి వీధికి వచ్చి తీర్చలేరు కదా.. ప్రజలకు కావాల్సింది వాళ్ల కష్టాలు విని కన్నీళ్లు తుడిచే హీరోలు కాదు.. ఏ నాయకుడి ఫోన్ కాల్ తో పనిలేకుండా, వాటంతట అవే న్యాయం చేసే 'బలమైన వ్యవస్థలు'. "నేనే చూసుకుంటాను" అని చెప్పడం ద్వారా, ప్రజల్ని ఎప్పటికీ మీ మీద ఆధారపడేలా చేసుకుంటున్నారా? లేక మీ అవసరమే లేని ఒక పటిష్టమైన వ్యవస్థను నిర్మిస్తున్నారా? హీరోలు సినిమాల్లో బాగుంటారు. But రియాలిటీలో మనకు కావాల్సింది ఎమోషనల్ డైలాగులు కాదు.. Accountability, జవాబుదారీతనం ఉన్న పారదర్శకమైన పాలన. ఒక లీడర్ ఎంత గొప్పవాడైనా, వ్యవస్థల కంటే గొప్పవాడు కాలేడు, కాకూడదు కూడా. ఈ విశ్లేషణ మీకు కరెక్ట్ అనిపిస్తే, ఆలోచించండి. గుడ్డిగా ఆరాధించడం ఆపి, లాజికల్ గా ప్రశ్నించడం మొదలుపెట్టిన రోజే, ఈ సొసైటీ మారుతుంది. అవునా కాదా?


http://youtube.com/post/Ugkx-Yvoho_nY83Pn3kd5_RtiigT5afgC4Wq?si=Y7dKGqh3LS-Z54Vp

No comments:

Post a Comment