మనక్కావల్సింది డైలాగ్ లు కొట్టే హీరోలా? హీరో అవసరమే లేని బలమైన వ్యవస్థలా? || PRATIKULA VEDAM
Author Name:PRATIKULA VEDAM
Youtube Channel Url:https://www.youtube.com/@pratikulavedam
Youtube Video URL:https://www.youtube.com/watch?v=8XMSfDdUifI
Transcript:
(00:00) ఒక సభలో లక్షలాది మంది చూస్తుండగా ఒక పవర్ఫుల్ నాయకుడు ఒక మాట అన్నారు. అదేంటో ఒక్కసారి మీరే వినండి. నా అభిప్రాయాలు కూడా సీఎం గారికి నేను చెప్పను. డైరెక్ట్ గా నా అభిప్రాయాలు నేను ప్రజలతోనే చెప్తాను. సిఎం గారికి కూడా చెప్పను. నాకు నా ప్రజలకు తప్ప ఇంక నేను ఎవరితో మాట్లాడను. సార్ సార్ మీరు ప్రతిపక్షంలో లేరు సార్ అధికారంలో ఉన్న గౌరవనీయులైన ఉపముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు సార్.
(00:22) ఏంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు? నా అభిప్రాయాలు నేను సీఎం గారికి చెప్పను. మా నాయకులు ఎంత చెప్తారో నాకు తెలియదు. నా కమ్యూనికేషన్ డైరెక్ట్ గా ప్రజలతోనే ఇలాంటి స్టేట్మెంట్స్ వినగానే సాధారణంగా ఏ మనిషికైనా రోమాలు నిక్కపడుచుకుంటాయి. అప్రయత్నంగా విజిల్ చేస్తారు. అబ్బా ఏం మాట్లాడాడురా ఎంత నిజాయితి ఎంత దమ్ము ఉంటే తప్ప సొంత ప్రభుత్వంలో జరుగుతున్న అపార్థాల మీద ఇలా పబ్లిక్ గా ఓపెన్ గా మాట్లాడతాడు వీడురా అసలైన లీడర్ అంటే అని అనిపిస్తుంది కదా మన లోపల ఉన్న ఎమోషన్స్ ని ట్రిగర్ చేయడానికి ఇంతకంటే పవర్ఫుల్ డైలాగ్ ఇంకొకటి ఉండదు. కానీ ఒక్క నిమిషం
(00:55) మీ చప్పట్లు ఆపండి. ఎమోషన్ ని పక్కన పెట్టి ఈ స్టేట్మెంట్ లో ఉన్న అసలైన పచ్చి నిజాన్ని దీని వెనక దాగి ఉన్న సైకాలజీని ఒక్కసారి లాజికల్ గా పాయింట్ టు పాయింట్ డీకోడ్ చేద్దాం. అయితే ముందే చెప్తున్నా ఇది ఆ నాయకుడి మీద బురద జల్లడానికి కాదు ఆయన ఉద్దేశాన్ని తప్పు పట్టడానికి కాదు. కానీ ఒక సొసైటీగా మనం దేన్ని చూసి మురిసిపోతున్నామో దేన్ని చూసి భయపడుతున్నామో అర్థం చేసుకోవడానికి ఇదొక థాట్ ప్రాసెస్ మాత్రమే.
(01:23) విషయం చాలా సింపుల్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వినండి మీరొక విమానంలో ప్రయాణిస్తున్నారు. సడన్ గా ఆ విమానంలో ఉన్న ఇద్దరి పైలట్స్ లో కో పైలట్ బయటకవచ్చి పాసంజర్స్ అందరి ముందు మైక్ పట్టుకొని ఇలా అన్నాడనుకోండి ప్రయాణికులారా లోపల కూర్చున్న చీఫ్ పైలట్ కి నేను నా అభిప్రాయాలు చెప్పను. అలాగే ఈ విమానంలో ఉన్న క్యాబిన్ క్రూ మీకు ఏ సమాచారం ఇస్తారో వాళ్ళు నా మాట ఎంతవరకు వింటారో నాకు తెలీదు.
(01:46) అందుకే ఇక నుండి నాకు వాళ్ళు ఎవరితో సంబంధం లేదు. నా కమ్యూనికేషన్ డైరెక్ట్ గా మీతోనే అని అన్నాడనుకోండి ఇప్పుడు చెప్పండి ఈ మాట వినగానే ఆ విమానంలో ఉన్న పాసంజర్లకి ధైర్యం వస్తదా లేక ఆ విమానంలో ఉన్నందుకు ఏంట్రా ఇది అని భయంతో ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని కూర్చుంటారా ఇక్కడ కూడా మనకు అర్థం అవ్వాల్సిన లాజిక్ ఇదే సార్ మీరు ప్రతిపక్షంలో ఉంటే ఆ మాట అనడం 100% కరెక్ట్ కానీ ఇప్పుడు మీరు అధికారంలో ఉన్న గవర్నమెంట్ లో ఒక భాగం మీరు స్టీరింగ్ పట్టుకున్న ఒక కీలకమైన డ్రైవర్ ఆ సిస్టం కి మీరు ఒక మూల మూల స్తంభం అలాంటి స్థానంలో ఉండి మీ అధినేతకు అంటే
(02:22) ముఖ్యమంత్రి గారికి మీరు కమ్యూనికేట్ చేయను అనడం మీ కింద పని చేసే నాయకులు సరైన ఇన్ఫర్మేషన్ ఇస్తారో లేదో అని మీకే నమ్మకం లేకపోవడం దేనికి సంకేతం కొంపతీసి మీరు పరోక్షంగా ఒక విషయాన్ని అంగీకరిస్తున్నారా మా ప్రభుత్వంలో మా మధ్య మాకే ఇంటర్నల్ కమ్యూనికేషన్ లేదు మా నాయకుల మధ్య కోఆర్డినేషన్ లేదు మా వ్యవస్థ పనితీరు మీద నాకే నమ్మకం లేదు అని గాని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు సార్ సార్ ఒక సామాన్య పౌరుడిగా నా ప్రశ్న ఏంటంటే ఇంత ఇంత పవరు ఇంత ఫాలోయింగ్ ఉన్న మీరే మీ సీఎం తో మీ అభిప్రాయాలు షేర్ చేసుకోలేనప్పుడు మీ నాయకుల సమాచారం మీద మీకే నమ్మకం లేనప్పుడు
(02:55) అసలు ఎలాంటి పవరు లేని ఒక సగటు మనిషి తన సమస్యని ఒక ఎంఆర్ఓ కో ఒక ఎస్ఐ కో చెప్తే వాళ్ళు వింటారని ఆ మనిషి ఎలా నమ్మాలి వ్యవస్థలో పై స్థాయిలోనే కమ్యూనికేషన్ బ్రేక్ అయినప్పుడు కింది స్థాయిలో ఒక సామాన్యుడికి న్యాయం ఎలా జరుగుతుంది సార్ ఇది ధైర్యమా లేక మీ సిస్టం లో జరుగుతున్న ఫెయిల్యూర్ ని ఒప్పుకోవడమా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గ్రీకు తత్వవేత్త సోక్రటీస్ ఒక మాట అంటాడు ఎప్పుడైతే తే నాయకులు వ్యవస్థలని కాదని డైరెక్ట్ గా ప్రజల ఎమోషన్స్ తో కనెక్ట్ అవ్వాలని చూస్తారో అక్కడ ప్రజాస్వామ్యం చచ్చిపోయి పాపులిజం మొదలవుతుంది అని నాయకుడు అనేవాడు
(03:26) ప్రజలతో డైరెక్ట్ గా మాట్లాడాలి. అందులో తప్పేమ లేదు కానీ అది దేనికోసం తన ఉద్దేశాలని చెప్పడానికి ప్రజల కష్టాల్ని వినడానికి కానీ ఒక ప్రభుత్వ విధానాన్ని లా అండ్ ఆర్డర్ ని అమలు చేసేటప్పుడు నేను ఎవరికీ చెప్పను డైరెక్ట్ గా ప్రజలతోనే తేల్చుకుంటా అని అనడం సైకలాజికల్ గా ఇది చాలా డేంజరస్ ట్రెండ్ ఎందుకంటే ఒక సమాజం సక్రమంగా నడవాలంటే వ్యక్తులు కాదు వ్యవస్థలు బలంగా ఉండాలి.
(03:51) మీరు సీఎం గారితో మాట్లాడను అని ఎందుకు అంటున్నారు సార్ ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి లా అండ్ ఆర్డర్ అతని చేతిలోనే ఉంది. మీరు ఒక సమస్య చూసినప్పుడు ఒక అభిప్రాయం ఉన్నప్పుడు ఒక ప్రభుత్వ భాగస్వామిగా ఆ అభిప్రాయాన్ని ఆ కుర్చీకి చెప్పాలి. ఆ కుర్చీతో చర్చించాలి. ఎందుకంటే రేపు పొద్దున మీరున్నా లేకపోయినా ఆ కుర్చీ మాత్రం ఉంటుంది.
(04:11) అండ్ ఆ కుర్చీకి జవాబుదారితనం ఉండాలి. అంటే అకౌంటబిలిటీ. మీరు ఆ చట్టాన్ని పక్కన పెట్టేసి డైరెక్ట్ కమ్యూనికేషన్ అనడం వల్ల మీరు తాత్కాలికంగా ఒక హీరో అవుతారేమో గానీ దీర్ఘకాలంలో ఆ సిస్టం ని బలహీన పరుస్తున్నారు అండ్ ఒక బలహీనమైన సిస్టం ఉన్న దేశంలో ఎంతమంది హీరోలు ఉన్నా లాభం లేదు. అసలు ఇలాంటి హీరోయిక్ మాటలకి జనం ఎందుకు అంతలా కనెక్ట్ అవుతున్నారు? దీని వెనక ఒక డీప్ సైకాలజీ ఉంది.
(04:39) మానవ పరిణామ క్రమంలో మనిషి ఎప్పుడు తనను ఏదో ఒక అద్భుతమైన శక్తి వచ్చి రక్షించేస్తది అని నమ్ముతుంటాడు. దాన్ని సైకాలజీలో సేవియర్ కాంప్లెక్స్ అంటారు. మనకు మన సమస్యలను సాల్వ్ చేసుకునే ఓపిక లేదు మన చుట్టూ ఉన్న సిస్టం ని క్వశ్చన్ చేసే ధైర్యం లేదు. అందుకే ఒక సినిమాలో హీరో విలన్లందరినీ కొట్టి న్యాయం చేసినట్టు రాజకీయాల్లో కూడా ఎవరో ఒకరు వచ్చి రాత్రికి రాత్రే అన్ని మార్చేయాలి అని కోరుకుంటాం.
(05:02) అండ్ ఆ నాయకుడి మాటలు ఆ సేవియర్ కాంప్లెక్స్ ని డైరెక్ట్ గా ఫీడ్ చేస్తున్నాయి. మీకు నేను ఉన్నాను నేనే చూసుకుంటాను నా కమ్యూనికేషన్ మీతోనే అని ఎప్పుడైతే అన్నారో మనిషి తన బాధ్యతల్ని మర్చిపోయి ఆ నాయకుడికి బానిసలా మారిపోతాడు. కానీ వాస్తవం ఏంటంటే ఒక నాయకుడు అనేవాడు ప్రతి వీధిలోనూ ప్రతి ఇంట్లోనూ జరగబోయే అన్యాయాన్ని స్వయంగా ఆపలేడు. అది అసాధ్యం.
(05:25) మరి ఆపాల్సింది ఎవరు పోలీసులు న్యాయస్థానాలు ప్రభుత్వ యంత్రాంగం. సో ఆ యంత్రంగాన్ని ఆటోమేట్ [గొంతు సవరించుకోవడం] చేసి తప్పు చేస్తే ఏ నాయకుడి ఫోన్ కాల్ కోసం వెయిట్ చేయకుండా వెంటనే యాక్షన్ తీసుకునేలా తీర్చిదిద్దడమే నిజమైన లీడర్షిప్ అంతేగాని నన్ను నమ్ముకోండి నేనే మీతో మాట్లాడతా అని అనడం జనాల్ని ఎప్పటికీ సైకలాజికల్లీ డిపెండెంట్స్ గా ఉంచడమే అంటే మానసిక వికలాంగులుగా ఉంచడమే ఇప్పుడు నా డైరెక్ట్ క్వశ్చన్ గౌరవనీయులైన ఉపముఖ్యమంత్రి గారికి సార్ మీ ఉద్దేశం మంచిదే కావచ్చు మీకు ఈ సమాజం మీద ఉన్న కోపం తపన అన్ని అర్థంవుతున్నాయి. మీ నిజాయితిని ఎవ్వరు
(06:01) శంకించడం లేదు కానీ మీ అప్రోచ్ కాస్త మార్చుకోవాలేమో అనిపిస్తుంది. మీరే ఒక వ్యవస్థలో ఉండి ఆ వ్యవస్థ పనితీరుని అంటే సీఎం గారిని మీతో పని చేసే నాయకుల్ని నమ్మకపోతే రేపు పొద్దున ఒక ఇన్వెస్టర్ మన రాష్ట్రానికి వచ్చి ఫ్యాక్టరీ ఎందుకు పెడతాడు మీ ప్రభుత్వంలో మీకే కోఆర్డినేషన్ లేనప్పుడు రేపు పొద్దున పాలసీ పరంగా సపోర్ట్ దొరుకుతుందని వాడు ఎలా నమ్ముతాడు సార్ మీరు ప్రజలతో కనెక్ట్ అవ్వండి వాళ్ళ కష్టాలు వినండి కానీ పరిష్కారం మాత్రం సిస్టం ద్వారానే ఇప్పించండి.
(06:29) మీరు సీఎం గారితో గొడవ పడతారో వాదిస్తారో మీ నాయకుల్ని నిలదేస్తారో సిస్టం ని కడిగి పారేస్తారో కానీ ఆ పని మొత్తం మోసి ఉన్న తలుపులు వెనకాల జరగాలి. బయటికి మాత్రం మీరొక స్ట్రాంగ్ యునైటెడ్ గవర్నమెంట్ గా కనిపించాలి. అప్పుడు మాత్రమే నేరం చేయాలనుకునే వాడికి నిజమైన వణుకు పుడుతుంది. ఒక ప్రభుత్వంలో ఒకరికొకరు చెప్పుకోరు, ఒకరి మాట ఒకరు వినరు అనే వాతావరణం ఉంటే అది నేరస్తులకేగా ఎక్కువ అడ్వాంటేజ్ ఇచ్చేది.
(06:55) మనం ఆవేశపడి చప్పట్లు కొట్టే ప్రతి డైలాగ్ వెనుక ఒక లాజికల్ ట్రాప్ ఉంటది. ఆ నాయకుడికి ఆ పద్ధతి కరెక్ట్ అనిపించి ఉండొచ్చు. అది ఆయన యుగ అవ్వచ్చు లేదా ఆయన అతి మంచితనం కావచ్చు కానీ సొసైటీకి కావలసింది ఎమోషనల్ హీరోలు కాదు ప్రొఫెషనల్ గా ఏ పక్షపాతం లేకుండా పని చేసే బలమైన వ్యవస్థలు. నేను ఎవరికీ చెప్పను డైరెక్ట్ గా మీతోనే డీల్ చేస్తాను అని ఒక రోడ్డు మీద ఉన్న కుర్రాడు అంటే అది హీరోయిజం.
(07:22) కానీ అదే మాట అధికారంలో ఉన్న ఒక నాయకుడు అంటున్నారంటే ఎక్కడో తెలియకుండా ఒక సిస్టమిక్ ఫెయిల్యూర్ జరుగుతుందనేగా అర్థం ఈ డిఫరెన్స్ ని అర్థం చేసుకున్న రోజే మన సొసైటీ మానసికంగా ఎదిగినట్టు లెక్క లాజిక్ ఆలోచించండి సమాధానం మీకే దొరుకుతుంది
No comments:
Post a Comment