నీవెవరు? ఎక్కడి నుంచి వచ్చావో చెప్పు ప్రవాహంలో ఎక్కడి నుంచో కల్సుకున్న కట్టెలు లాగా భూమిపై జీవులు కల్సుకుంటారు, కొద్ది సమయం కాగానే విడిపోతారు. పక్షులు సంధ్యాకాలంలో గూటికి చేరినట్లు జీవులు ఎక్కడ్నుంచి వచ్చినవి అక్కడకు వెళ్ళవలసినదే. నీటిలో నుంచి వచ్చే బుడగవలే ఈ శరీరాలు వచ్చి నశించవలసినదే. పుట్టేవాడు, చనిపోయేవాడు ఎక్కడ ఉన్నాడు? అతడెవరు? “నావి, నావాళ్ళు” అనుకోవటం ఒక భ్రాంతి మాత్రమే. జీవులు కర్మ వలన శరీరం ధరిస్తారు. కర్మ త్రిగుణాల వల్ల ఏర్పడిన శరీరం సుఖదుఃఖాలును కల్గిస్తుంది. సుదీర్ధమైన ఆయువు కల్గిన దేవతలు కూడా కల్పాంతరంలో నశించవలసినదే. కాలం వలన పుట్టి, దాని కధీనం అయిన ఈ శరీరం స్థిరంగా ఉందటం సాధ్యమా! గర్భములో పడినది మొదలు ముసలి వాడయ్యే వరకూ వెనుక చేసుకున్న కర్మలనుసరించి ఎప్పుడో ఒకప్పుడు మరణించక తప్పదు. ఎక్కడ ఏ సమయంలో ఎలాంటి సుఖదుఃఖాలు అనుభోవించాలో అట్టిది అనుభవించాల్సిందే. ఎప్పుడైనా ప్రాయశ్చిత్త కర్మల ద్వారా దుష్మర్మను నశింప చేసుకోవచ్చు. గత జన్మలో నీ కెవరితో ఎట్టి సంబంధమున్నదో చెప్పగలవా? లేదా వచ్చే జన్మలో ఏం జరుగుతుందో చెప్పగలవా? ఇది ఆలోచించకుండా వ్యర్థంగా దుఃఖం పడవద్దు ఈ పాంచభౌతిక శరీరం ఎప్పటికైనా నశించాల్సిందే.
No comments:
Post a Comment