Wednesday, July 15, 2026

 *మానవుడు చెయ్యకూడని ధర్మాలు*

పరిగెత్తే వారికీ, ఆవులించే వారికీ, తలస్నానం చేస్తున్న వారికి నమస్కరించకూడదు. 

భార్య గర్భవతిగా ఉన్నప్పుడు నదీస్నానమూ, సముద్ర స్నానమూ చెయ్యరాదు. అలాగే క్షౌరమూ, పర్వతారోహణమూ చేయరాదు. 

స్త్రీలను కాటుక పెట్టుకునేటప్పుడూ, స్నానం చేసేటప్పుడూ గాంచరాదు.  

ఉదయించే, అస్తమించే సూర్యుడ్ని నీళ్ళలోనూ, అద్దంలోనూ చూడరాదు. 

తన నీడను తానే నీటిలో చూసుకొనుట, రాత్రిపూట చెట్ల ఆకులను కోయుట, రాత్రి పూట బావిలో నీళ్ళు తోడుట చేయరాదు. 

తలకూ, శరీరానికీ నూను రాసుకొని మల మూత్రాలు విడవరాదు. 

భోజనం చేస్తున్న భార్యనూ, ఆవలిస్తున్న భార్యనూ, తుమ్ముతున్న భార్యనూ చూడరాదు. అలా చూడాల్సి వస్తే వెంటనే పక్కకు తిరగాలి.

చతుర్దశినాడు క్షీరమూ, అమావాస్య నాడు సంసారసుఖాన్ని గూర్చి మర్చిపోవాలి.  

అలాగే మొలత్రాడు లేకుండా మగవాడు ఎట్టి స్థితిలోనూ ఉండరాదు.  

గుమ్మడి కాయను స్త్రీ ఎలా పగల కొట్టకూడదోఈ, దీపాన్ని పురుషుడు ఆర్పకూడదు. 

నీళ్ళు త్రాగే జంతువులనీ, పాలు త్రాగుతున్న దూడను అదిలించరాదు.          *ఆధ్యాత్మిక కుటుంబం*                        

No comments:

Post a Comment