Wednesday, July 15, 2026

 *"ఏడేడు జన్మలు" అనే పదబంధం గురించి ఆలోఛిద్దాం !* 
*నిజానికి ఏడు జన్మలు. ఏడు జన్మల బంధం" అని వాడుకలో అంటుంటాం.*

*జీవరాశుల వర్గీకరణ*

*శాస్త్రాల ప్రకారం ప్రాణులు 84 లక్షల జీవరాశులుగా పుడతాయి.*
*వీటిని ప్రధానంగా 7 రకాల వర్గాలుగా విడదీశారు*:

*దేవతలు*
*మనుషులు*
*పశువులు (జంతువులు)*
*పక్షులు*
*సరీసృపాలు (పాకేవి)*
*జలచరాలు (నీటిలో ఉండేవి)*
*స్థావరాలు (చెట్లు, గిరిజాల వంటివి)*

*వీటినే వాడుకలో ఏడు జన్మలు అంటారు.* 

*"ఏడేడు" అంటే 14 అని అర్థం (7 + 7)*

*దాశరథి గారు "ఏడేడు" అని వాడటం ద్వారా ఆ బంధం యొక్క గాఢతను, అనంత కాలం పాటు ఉండే అనురాగాన్ని నొక్కి చెప్పారు*.

*విశ్వంలో 14 లోకాలు (అతలం, వితలం వంటివి 7, భూమి పైన స్వర్గాది లోకాలు 7) ఉన్నాయని పురాణాలు చెబుతాయి.* 

*ఏ లోకంలో, ఏ జన్మ ఎత్తినా మన బంధం ఇలాగే ఉండాలని కవి భావం.*
*ఆధ్యాత్మిక కుటుంబం*                        

No comments:

Post a Comment