*శ్రీ ఆదిశంకరుల విరచిత/కౌపీన పంచకము*
🕉🌞❤️
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
*“కౌపీనపంచకము”*
🕉️🌹🕉️🌹🕉️
వేదాంతవాక్యేషు సదా రమన్తః
భిక్షాన్నమాత్రేణ చ తుష్టిమన్తః !
అశోకమన్తఃకరణే రమన్తః
కౌపీనవన్తః ఖలు భాగ్యవన్తః !!
వేదాంత వాక్యములందు ఎల్లప్పుడు ఆనందిస్తున్నవాడు, భిక్షాన్నము నందు నిశ్చయం చేత తృప్తి చెందినవాడు, శోకము లేనివాడు, ఆత్మభావన లేని, కేవలమైన శరీరమునందు చరించువాడు అయిన కౌపీన దారియే కదా భాగ్యవంతుడు.
భిక్ష అంటే అడుగుట
జీవుడు తన విషయములను జీవపరంగా పాకం చేసికొని,. వండుకొని .. తయారుచేసుకొని .. కల్పించుకుని తింటాడు. నిజ ప్రాణమును పోగొట్టుకుంటాడు.
బ్రహ్మజ్ఞాని తనకు లక్ష్యమైన వేదాంత వాక్యములను కోరి .. అడిగి .. కొసరికొసరి పాకంచేసికొని .. పక్వంచేసికొని .. సమన్వయం చేసికొని గ్రహించి బ్రహ్మప్రాణమును .. నిజ ప్రాణమును పోసికొని ఉనికిలో నివసిస్తాడు.
''వేదాంతవాక్యములందు ప్రీతి ఉన్నందున భిక్షాన్నము సౌభాగ్యము''
పీలికగుడ్డను గుహ్యస్థానమునకు చుట్టుట భౌతికముగా కౌపీనధారణ అనబడుతుంది.
జీవభావంలో .. దేహభావంలో ప్రవేశించి జయించి బయటపడుట జీవునికి గుహ్యం ... రహస్యమైన విద్య ..''ఈ బ్రహ్మరహస్యమును రక్షించుట అన్న తత్త్వానికి కౌపీనధారణ ఉపమానం.
ఇంద్రియనిగ్రహం కలవారు యతులు. ఇంద్రియనిగ్రహం యతి లక్షణం, జ్ఞానలక్షణం. అందుకే ఈ పంచకాన్ని యతిపంచకం అని కుడా అంటారు.
''కౌపీన దారియే కదా నిజమైన భాగ్యవంతుడు.
బ్రహ్మచర్యము అంటే ఏమిటో చాలా మందికి తెలియదు. ప్రస్తుతము ప్రచారములో ఉన్న, శారీరక సుఖము లేకుండా జీవితము గడపడము అనే అర్థము వక్ర భాష్యము.
బ్రహ్మచర్యము అంటే బ్రహ్మమునందు చరించుట. బ్రహ్మచారి, సంసారి, సన్యాసి అందరూ బ్రహ్మచర్యమును పాటించాలి.
"కౌపీన పంచకము" లొ, శంకరాచార్యులు "వేదాంత వాక్యేషు సదా రమన్తొ " అని బ్రహ్మజ్ఞానపరుల లక్షణము చెప్పారు.
సతతము వేదాన్తవాక్యముల అర్థమును భావిస్తూ, ఆ భావన, అనుభవము కలిగించే ఆనందములో రమించేవారు అని ఆ శ్లోక పాదము యొక్క తాత్పర్యము.
"మానస! సంచరరే బ్రహ్మణి" అని సదాశివబ్రహ్మెంద్రులు కీర్తించినా ఈ అర్థములోనే. బ్రహ్మమునందు సంచరించమని మనసుకి సలహా ఇస్తున్నారు.
మనసు పుట్టుక చోటు బ్రహ్మమే. మనసు బ్రహ్మ పదార్థమైన చిత్ శక్తితో నిర్మించబడింది. ఈ చిత్ శక్తి మేధలో ప్రతిఫలనముచే చిదాభాసా లేక మాయగా రూపొందుతుంది. మాయ అంటే మానసిక శక్తి అని అర్థము.
"యయా అసన్తమ్ పశ్యన్తి సా మాయా" అని మాయకు నిర్వచనము. దేని ద్వారా మనము ఈ సకల చరాచర ప్రపంచాన్ని గ్రహించగలుగుతున్నమో, దానిని మాయ అంటారు. మళ్ళీ మానసిక దృష్టి లోకి తెచ్చుకోగలుగుతున్నమో, ఏది మన వాసనలను-అనుభవములను, జ్ఞాపకాలను, మన వ్యక్తిత్వాన్ని, అహంకార, మమకారములను ఏర్పరచి, మరల దృష్టి లోకి తెస్తుందో దానిని మాయ అంటారు. దీనినే ప్రణవము అని కూడా అంటారు. మన అంతః కరణములు, వాటి మానసిక కార్యకలాపములు మాయా విభూతులే.
"మాయామయమ్ ఇదం ఇదమ్ జగత్" - అంటే ఈ అర్థమే. ఈ జగత్తు అంటా మాయచే నిర్మింపబడింది అని దీని అర్థము.
"యా మా సా మాయా". ఏది లేదో అది మాయ అని దీని అర్థము.
అందుకే మాయ లేనిదానిని ఉన్నట్టు చూపిస్తుంది అంటారు. మన వ్యక్తిత్వము బ్రహ్మము అనే తెరపై కనిపించే బొమ్మ. ఇతర చరాచర జగత్తు ఇంతే. బ్రహ్మము అనే తెరపైకి వచ్చి పోయే బొమ్మలు/దృశ్యములు, ధ్వనులు,వాసనలు (smells) రుచులు, స్పర్శలు, భావములు, అనుభవములు; అస్తమాను (జాగ్రత్-స్వప్న- సుషుప్తి, జాగ్రత్ సుషుప్తిలయందు) - ఉండేది బ్రహ్మము మాత్రమే. (యా విద్యతే సా విద్యా - అన్నా ఇదే ).
జగత్, ప్రపంచము, విశ్వము - వీటన్నిటిని ఇదం అంటారు - ఇవి సకల మానసిక కార్యకలాపములు, జీవుడిని అనే దృష్టి - ఆత్మ దృష్టి పై ఆనింపులు - బ్రహ్మము అనే తెరపై ఆడబడే నాటకములు.
ఈ విషయాన్ని తెలిసి సుఖ దు:ఖములకు లొంగక, మానావమానములకు పొంగక - క్రుంగక, అహంకార మమకారములను అధిగమించి, సదా భగవన్నామ స్మరణ చేస్తూ, విధివిహిత కార్యములను పరమేశ్వరార్పణముగా నిర్వహిస్తూ, సకల స్థావర జంగమముల మీదా కరుణ కలిగి, అహింసను మాటలద్వారా, చేతలద్వారా పాటిస్తూ, ఉన్నదానితో సంతృప్తి పడి, ధర్మ మార్గములో కోరికలు తీర్చుకుంటూ, న్యాయబద్ధముగా ఉన్నతిని కోరుకుంటూ సంయమనముతో జీవించటమే బ్రహ్మచర్యమును పాటిన్చడము.
ఇది సనాతన ధర్మము యొక్క పెద్దల మాట. పెద్దల మాట చద్దికూటి మూట.
మరేది బ్రహ్మచర్యము కాదు.
సన్యాసము సనాతన సాంప్రదాయ ఆశ్రమము కాదు.
❤️❤️❤️
Yati Panchakam (Kaupeena Panchakam) – యతి పంచకం
🚩🚩🚩🚩🚩
వేదాంతవాక్యేషు సదా రమన్తః
భిక్షాన్నమాత్రేణ చ తుష్టిమన్తః |
విశోకమన్తఃకరణే రమన్తః
కౌపీనవన్తః ఖలు భాగ్యవన్తః
|| 1 ||
🕉🚩
మూలం తరోః కేవలమాశ్రయన్తః
పాణిద్వయం భోక్తుమమన్త్రయన్తః |
శ్రియం చ కంథామివ కుత్సయన్తః
కౌపీనవన్తః ఖలు భాగ్యవన్తః
|| 2 ||
🕉🚩
దేహాదిభావం పరిమార్జయన్తః
ఆత్మానమాత్మన్యవలోకయన్తః |
నాన్తం న మధ్యం న బహిః స్మరన్తః
కౌపీనవన్తః ఖలు భాగ్యవన్తః
|| ౩ ||
🕉🚩
స్వానన్దభావే
పరితుష్టిమన్తః
సంశాంతసర్వేంద్రియదృష్టిమన్తః |
అహర్నిశం బ్రహ్మణి యే రమన్తః
కౌపీనవన్తః ఖలు భాగ్యవన్తః
|| 4 ||
🕉🚩
పంచాక్షరం పావనముచ్చరన్తః
పతిం పశూనాం హృది భావయన్తః |
భిక్షాశనా దిక్షు పరిభ్రమన్తః
కౌపీనవన్తః ఖలు భాగ్యవన్తః
|| 5 ||
🕉🚩
కౌపీనపంచరత్నస్య మననం యాతి యో నరః |
విరక్తిం ధర్మవిజ్ఞానం లభతే నాత్ర సంశయః ||
ఇతి శ్రీ శంకరభగవత్పాద విరచితం యతిపంచకం ||
❤️🕉️❤️
*కౌపీన పంచకం పద్యాలు*
॥ సీస మాలిక ॥
వేదాంత విషయాల విశ్లేషణమునందు
రమియించు నెప్పుడున్ రాగరహితు,
పంచభక్షములతో పరమాన్న మైననూ,
భిక్షాన్న మునకైనఁ బ్రీతి నుండు,
శోకమొందడెపుడు చీకు చింతయులేదు,
కాఠిన్యమెరుగడు కరుణ తప్ప,
తిండి, గూడు, పొరుగు తిప్పలే లేనట్టి,
గోచిలో సన్న్యాసి గొప్ప వాడు. ॥ 1 ॥
మేడ మిద్దెలఁ జూచి మిథ్యగా భావించి
వృక్ష మూలమునందు తృప్తి నొందు,
వెండి పాత్రల యందు మెండు భోజన కోర్కె
లేదు, దోసిలి చాలు లేదు యావ
చింకి సంచికి మల్లె సిరుల నైశ్వర్యమున్
సమభావమునఁ జూచి సరగు వాడు
గూడు, తిండి గొడవ కూసంతనూ లేదు,
గోచిలో సన్న్యాసి గొప్ప వాడు. ॥ 2 ॥
స్వాంతస్సుఖాయంచు స్వానందమున తూలు,
బాహ్య ప్రపంచమ్ము భ్రాంతి లేదు,
ఇంద్రియాల వికారమెంతైన నంటదు,
ఆరు శత్రు వర్గము లంతమొంది
వాటి తాపము నుండి బట్ట కట్టి బ్రతికి,
యున్న సమయమంత యుక్తితోను
పరమాత్మ తలపులో పరమ సుఖమునొందు,
గోచిలో సన్న్యాసి గొప్ప వాడు. ॥ 3 ॥
దేహ, మనసు, బుద్ధి దీనిలో నిత్యమౌ
ఆత్మ తత్త్వ మెరిగి హ్లాదమొందు,
తానన్న ఆత్మను తనలోని ఆత్మలో
అంతర్ముఖుండయ్యి అగుపడంగ,
ఆది మధ్యాంతము లవిలేని వానిని,
బయట లోపలనెల్ల వ్యాప్తినొంది
యున్న తత్త్వమ్మును నుచ్చరించుచు యున్న,
గోచిలో సన్న్యాసి గొప్ప వాడు. ॥ 4 ॥
పావనమ్మైనట్టి బ్రహ్మాక్షరము నిత్య
స్మరణమ్ము సల్పుచున్ మసలుచుండు,
నేను బ్రహ్మను భావమును సదా తలచుచున్,
బ్రహ్మైక్య జీవాత్మఁ బరగు వాడు,
భవబంధములు లేవు భ్రమియించు దిశలెల్ల,
దేశదేశాలెల్ల తిరుగుచుండు,
భిక్ష కూడు తినెడి దీక్షఁ బూనెడివాడు,
గోచిలో సన్న్యాసి గొప్ప వాడు. ॥ 5 ॥
॥ తే.గీ. ॥
రమణ, రామకృష్ణ, వివేక, రామతీర్థ
యతులు, సాధు సన్న్యాస మహా పురుషుల
గూర్చి కౌపీనమున్ గట్టు గురు గుణముల
నాది శంకరుల్ తెల్పిన వైదు నుతులు.
*ఆధ్యాత్మిక కుటుంబం*
No comments:
Post a Comment